జిల్లాస్థాయి కుస్తీ పోటీలకు ఎంపిక
జిల్లాస్థాయి కుస్తీ పోటీలకు ఎంపిక
Published Wed, Sep 21 2016 8:30 PM | Last Updated on Mon, Sep 4 2017 2:24 PM
కారంపూడి: స్థానిక గురుకుల పాఠశాల కళాశాలలో బుధవారం 19 సంవత్సరాల లోపు బాలబాలికల రెజ్లింగ్ (కుస్తీ) జిల్లా స్థాయి జట్ల ఎంపికలు జరిగాయి. బాలికల ఫ్రీ సై్టల్ విభాగంలో విజయపురి సౌత్ విద్యార్థులు వై.కవిత, ఎం.జీవిత, బి.సంధ్య, పి.శిరీష, ఎం. రూత్‌రాణి, జి.శ్రావణి, బాలుర ప్రీ సై్టల్ విభాగంలో స్థానిక గురుకుల విద్యార్థులు సీహెచ్ కోటేశ్వరరావు, జి.అరవింద్, ఒ.వెంకటేశ్వర్లు, కె.సుమన్, ఇ.తరుణ్ అచ్చెంపేట గురుకుల విద్యార్థులు ఎం.శివనాగేంద్రప్రసాద్, ఎన్.సత్యానాయక్, కేఆర్ కాలేజ్ నరసరావుపేటకు చెందిన డి.నవీన్, స్థానిక సాయికృష్ణ జూనియర్ కాలేజ్ విద్యార్థి ఎస్‌డీ ఖలీల్ ఎంపికయ్యారు. బాలుర గ్రీకో రోమన్ స్టెల్ విభాగంలో స్థానిక గురుకుల పాఠశాలకు చెందిన జి.మరియరాజు, ఎస్.శామ్యూలు, ఎ.వెంకటేష్, బి.నరేంద్ర, జి.కిరణ్‌కుమార్, కె.అజయ్, ఎం.విజయ్, డి.బాలకృష్ణ, తెనాలి ఎన్‌ఆర్‌ఐ కాలేజీకి చెందిన జి.అరుణ్ ఎంపికయ్యారని జిల్లా అండర్ 19, స్కూల్ గేమ్స్ కార్యదర్శి టీటీకే ప్రసాద్ తెలిపారు. కార్యక్రమంలో స్థానిక కళాశాల రెజ్లింగ్ అసోషియేషన్ కార్యదర్శి జి.భూషణం, వీపీ సౌత్ గురుకుల పాఠశాల పీడీ కోటేశ్వరి, అచ్చంపేట గురుకుల పీడీ డి.విజయశేఖర్ పాల్గొన్నారు. పోటీలను ప్రిన్సిపాల్ సుధాకర్ ప్రారంభించారు.
23న సీనియర్స్ ఎంపికలు..
ఈ నెల 23న స్థానిక గురుకుల పాఠశాలలో సీనియర్ మెన్, ఉమెన్ రెజ్లింగ్ జిల్లా జట్ల ఎంపికలు జరుగుతాయని జిల్లా అసోసియేషన్ కార్యదర్శి గుడిపూడి భూషణం తెలిపారు. ఎంపికకు హాజరు కానున్న క్రీడాకారులు ఆధార్ కార్డు జిరాక్స్, టెన్త్ మార్కుల జాబితా జిరాక్స్‌లతో హాజరు కావాలని ఆయన కోరారు. వివరాలకు 94419 36823 నంబరును సంప్రదించాలని కోరారు.
Advertisement