Wrestling competitions
-
Lb Stadium: రణరంగంలా కుస్తీ పోటీలు.. కుర్చీలతో కొట్టుకున్న పహిల్వాన్లు
సాక్షి, హైదరాబాద్: ఎల్బీ స్టేడియంలో జరుగుతున్న కుస్తీ పోటీలో వివాదం చెలరేగింది. దీంతో కుస్తీ పోటీలు రణరంగంలా మారాయి. మోదీ కేసరి ఫైనల్ కాంపిటీషన్లో పహిల్వాన్ల గ్రూప్స్ మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. జఫర్, పైల్వాన్, సాలం పైల్వాన్ గ్రూప్‌లు కుర్చీలతో కొట్టుకున్నాయి. దీంతో ప్రేక్షకులు భయంతో పరుగులు తీశారు. కుస్తీలో గెలిచింది మేమంటే.. మేమని వాగ్వాదానికి దిగారు. ఈ కొట్లాటలో పదిమంది గాయపడ్డారు. వారిని ఆసుపత్రిని తరలించారు. ఇరువర్గాలపై సైఫాబాద్ పోలీసులు కేసు నమోదు చేశారు. చదవండి: అమెరికాలో ఎన్నారై కుటుంబం దారుణ హత్య?! -
హైదరాబాద్: దంగల్ మే దమ్ (ఫొటోలు)
-
రసవత్తరంగా కుస్తీ పోటీలు
నిజాంసాగర్ : సింగితం గ్రామంలో బుధవారం మల్లయోధులకు నిర్వహించిన కుస్తీ పోటీలు రసవత్తరంగా సాగాయి. శ్రీరామనవమి ఉత్సవాల్లో భాగంగా గ్రామ శివారులోని శ్రీ వెంకటేశ్వర స్వామి జాతర నిర్వహించారు. రెండు రోజులుగా ఆలయం వద్ద ఎడ్ల బండ్లు, బోనాల ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్బంగా ఆలయం ఆవరణలో మల్లయోధులకు కుస్తీపోటీలు జరిపారు. చుట్టు పక్క గ్రామాల నుంచి మల్ల యోధులు తరలిరావడంతో కుస్తీపోటీలు పోటా పోటీగా జరిగాయి. గెలుపొందిన వారికి సింగితం ఎంపీటీసీ సభ్యురాలు కలకొండ శైలజ, సర్పంచ్ ఆనందపల్లి వీరమణి, టీఆర్ఎస్ నాయకులు కలకొండ నారాయణ, సాయాగౌడ్ నగదును బహుమతులుగా అందజేశారు. కార్యక్రమంలో గున్కుల్æ సోసైటీ వైస్‌చైర్మన్ సంగారెడ్డి నాయకులు బచ్చిగారి వెంకటేశం, సాయిలు, సంగయ్య, విఠల్, శ్రీదర్‌రెడ్డి న్నారు. హన్మాజీపేట్‌లో.. బాన్సువాడటౌన్ : హన్మాజీపేట్ గ్రామంలో బుధవారం కుస్తీపోటీలు నిర్వహించారు. వివిధ గ్రామాల నుంచి వచ్చిన కుస్తీవీరులు తమ నైపుణ్యాన్ని ప్రదర్శించారు. పోటీల్లో గెలుపొందిన వారికి సర్పంచ్ సంగ్రామ్ నాయక్ నగదు బహుమతులు అందజేశారు. కుస్తీపోటీలు ఆద్యాంతం ఉత్కంఠ భరితంగా సాగాయి. ఈకార్యక్రమంలో ఉపసర్పంచ్ సాయిరాం, గ్రామపెద్దలు సుధాకర్‌రెడ్డి, బోనాల సాయిలు పాల్గొన్నారు. -
ధూల్‌పేట్‌లో కుస్తీ పోటీల ధమాకా !
-
జిల్లాస్థాయి కుస్తీ పోటీలకు ఎంపిక
కారంపూడి: స్థానిక గురుకుల పాఠశాల కళాశాలలో బుధవారం 19 సంవత్సరాల లోపు బాలబాలికల రెజ్లింగ్ (కుస్తీ) జిల్లా స్థాయి జట్ల ఎంపికలు జరిగాయి. బాలికల ఫ్రీ సై్టల్ విభాగంలో విజయపురి సౌత్ విద్యార్థులు వై.కవిత, ఎం.జీవిత, బి.సంధ్య, పి.శిరీష, ఎం. రూత్‌రాణి, జి.శ్రావణి, బాలుర ప్రీ సై్టల్ విభాగంలో స్థానిక గురుకుల విద్యార్థులు సీహెచ్ కోటేశ్వరరావు, జి.అరవింద్, ఒ.వెంకటేశ్వర్లు, కె.సుమన్, ఇ.తరుణ్ అచ్చెంపేట గురుకుల విద్యార్థులు ఎం.శివనాగేంద్రప్రసాద్, ఎన్.సత్యానాయక్, కేఆర్ కాలేజ్ నరసరావుపేటకు చెందిన డి.నవీన్, స్థానిక సాయికృష్ణ జూనియర్ కాలేజ్ విద్యార్థి ఎస్డీ ఖలీల్ ఎంపికయ్యారు. బాలుర గ్రీకో రోమన్ స్టెల్ విభాగంలో స్థానిక గురుకుల పాఠశాలకు చెందిన జి.మరియరాజు, ఎస్.శామ్యూలు, ఎ.వెంకటేష్, బి.నరేంద్ర, జి.కిరణ్‌కుమార్, కె.అజయ్, ఎం.విజయ్, డి.బాలకృష్ణ, తెనాలి ఎన్ఆర్ఐ కాలేజీకి చెందిన జి.అరుణ్ ఎంపికయ్యారని జిల్లా అండర్ 19, స్కూల్ గేమ్స్ కార్యదర్శి టీటీకే ప్రసాద్ తెలిపారు. కార్యక్రమంలో స్థానిక కళాశాల రెజ్లింగ్ అసోషియేషన్ కార్యదర్శి జి.భూషణం, వీపీ సౌత్ గురుకుల పాఠశాల పీడీ కోటేశ్వరి, అచ్చంపేట గురుకుల పీడీ డి.విజయశేఖర్ పాల్గొన్నారు. పోటీలను ప్రిన్సిపాల్ సుధాకర్ ప్రారంభించారు. 23న సీనియర్స్ ఎంపికలు.. ఈ నెల 23న స్థానిక గురుకుల పాఠశాలలో సీనియర్ మెన్, ఉమెన్ రెజ్లింగ్ జిల్లా జట్ల ఎంపికలు జరుగుతాయని జిల్లా అసోసియేషన్ కార్యదర్శి గుడిపూడి భూషణం తెలిపారు. ఎంపికకు హాజరు కానున్న క్రీడాకారులు ఆధార్ కార్డు జిరాక్స్, టెన్త్ మార్కుల జాబితా జిరాక్స్‌లతో హాజరు కావాలని ఆయన కోరారు. వివరాలకు 94419 36823 నంబరును సంప్రదించాలని కోరారు. -
పట్టు పడితే పతకమే..
రెజ్లింగ్‌లో ప్రతిభ చూపుతున్న వీవీఎస్ విద్యార్థులు జాతీయ స్థాయికి ఎంపిక బరిలోకి దూకి.. వారో పట్టు పట్టారంటే ప్రత్యర్థి మట్టి కరవాల్సిందే. పతకం వారి మెడలో చేరాల్సిందే.. యు.కొత్తపల్లి వీవీఎస్ పాఠశాల విద్యార్థులు రెజ్లింగ్(మల్లయుద్ధం)లో అసమాన ప్రతిభ చూపుతూ జాతీయ స్థాయి పోటీలకు ఎంపికయ్యారు. వెన్నుతట్టి ప్రోత్సహించేవారుండాలే కానీ.. పతకాల పంట పండించడం ఖాయమని వారు ధీమా వ్యక్తం చేస్తున్నారు. కొత్తపల్లి : మండల కేంద్రమైన కొత్తపల్లిలోని వీవీఎస్ పాఠశాలలో పదో తరగతి చదువుతున్న విద్యార్థులు రెజ్లింగ్‌లో సత్తా చాటుతున్నారు. ఇక్కడ పదిమంది విద్యార్థులు రెజ్లింగ్‌లో శిక్షణ పొందుతుండగా.. వీరిలో ఎనిమిది మంది రాష్ట్రస్థాయి పోటీల్లో ప్రతిభ చూపారు. వారిలో ముగ్గురు జాతీయ స్థాయి పోటీలకు ఎంపికయ్యారు. వచ్చే జనవరి నెలలో దేశ రాజధాని ఢిల్లీలో జరగనున్న జాతీయ స్థాయి పోటీల్లో వారు పాల్గోనున్నారు. – ఈ పాఠశాల విద్యార్థి పి.సాయితేజ 2014లో మచిలీపట్నంలో జరిగిన రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొని స్వర్ణ పతకం సాధించి జాతీయ స్థాయికి ఎంపికయ్యాడు. అలాగే 61వ రాష్ట్రస్థాయి స్కూల్ గేమ్ పోటీల్లో రజత పతకం సాధించాడు. ఇటీవల కాకినాడలో జరిగిన సబ్ జూనియర్ పోటీల్లో స్వర్ణ పతకం సాధించాడు. 42 కేజీల విభాగంలో జాతీయ స్థాయికి ఎంపికయ్యాడు. – మరో విద్యార్థి కె.సురేష్‌కుమార్ 2013లో రంగారెడ్డి, మెదక్ జిల్లాల్లో జరిగిన పోటీల్లోను, 2015లో మచిలీపట్నంలో జరిగిన రాష్ట్రస్థాయి పోటీల్లోను స్వర్ణపతకాలు సాధించాడు. 2016లో రాష్ట్రస్థాయి 3వ సబ్ జూనియర్ పోటీల్లో ఆంధ్రప్రదేశ్ జట్టు తరఫున పాల్గొనేందుకు అర్హత సాధించాడు. అలాగే అనంతపురం, మచిలీపట్నం, కాకినాడల్లో జరిగిన రాష్ట్రస్థాయి పోటీల్లో కూడా స్వర్ణపతకాలు సాధించి, జాతీయ పోటీలకు ఎంపికయ్యాడు. – ఇదే పాఠశాలలో చదువుతున్న కె.సాయిగోపాల్ 2014, 2015 సంవత్సరాల్లో జరిగిన జిల్లాస్థాయి పోటీల్లో స్వర్ణపతకాలు సాధించాడు. ఇటీవల కాకినాడలో జరిగిన రాష్ట్రస్థాయి సబ్ జూనియర్ పోటీల్లో ప్రతిభ చూపి జాతీయస్థాయికి ఎంపికయ్యాడు. భారత్‌కు స్వర్ణం తేవడమే లక్ష్యం భారత్ తరఫున ప్రపంచ రెజ్లింగ్ పోటీల్లో పాల్గొని స్వర్ణపతకం తేవడమే నా లక్ష్యం. నన్ను తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు ఎంతో ప్రోత్సాహిస్తున్నారు. – కె.సురేష్‌కుమార్, వీవీఎస్ విద్యార్థి జాతీయస్థాయికి ఎంపికవడం ఆనందంగా ఉంది జాతీయ రెజ్లింగ్ పోటీలకు ఎంపిక కావడం చాలా ఆనందంగా ఉంది. జాతీయ స్థాయి పోటీల్లో ప్రతిభను చూపి, ఉన్న ఊరికి, చదువు చెప్పిన పాఠశాలకు పేరు తేవడమే నా ఆశయం. – పి.సాయితేజ, వీవీఎస్ విద్యార్థి తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల ప్రోత్సాహం జాతీయస్థాయి రెజ్లింగ్ పోటీలకు ఎంపికవడం వెనుక నా తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల ప్రోత్సాహం ఎంతో ఉంది. ముఖ్యంగా మా కోచ్ ఎంతో కృషితో మాకు శిక్షణ ఇచ్చారు. – కేఎస్ గోపాల్, వీవీఎస్ విద్యార్థి భారత్‌కు పేరు తేవడమే లక్ష్యం నేను శిక్షణ ఇచ్చిన విద్యార్థులు జాతీయ స్థాయిక ఎంపిక కావడం సంతోషంగా ఉంది. భారత్ తరపున ఆడి ఇండియాకు పేరు తీసుకు రావాలన్నది నా లక్ష్యం. విద్యార్థులు ఎంతో పట్టుదలతో శిక్షణ పొందారు. – పి.లక్ష్మణరావు, కోచ్ -
పెద్దాపురంలో కుస్తీ పోటీలు
తూర్పుగోదావరి (పెద్దాపురం) : పెద్దాపురంలోని జవహర్లాల్ నెహ్రూ నవోదయ విద్యాలయంలో శుక్రవారం కుస్తీ పోటీలు ప్రారంభమయ్యాయి. ఈ పోటీలను మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి శేషారెడ్డి ప్రారంభించారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, కేరళ, పాండిచ్చేరికి చెందిన సుమారు 200 మంది క్రీడాకారులు ఈ పోటీల్లో పాల్గొననున్నారు. ఈ పోటీలు రెండు రోజుల పాటు జరుగుతాయి.