
సాక్షి, హైదరాబాద్: ఎల్‌బీ స్టేడియంలో జరుగుతున్న కుస్తీ పోటీలో వివాదం చెలరేగింది. దీంతో కుస్తీ పోటీలు రణరంగంలా మారాయి. మోదీ కేసరి ఫైనల్ కాంపిటీషన్‌లో పహిల్వాన్ల గ్రూప్స్ మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. జఫర్, పైల్వాన్, సాలం పైల్వాన్ గ్రూప్‌లు కుర్చీలతో కొట్టుకున్నాయి. దీంతో ప్రేక్షకులు భయంతో పరుగులు తీశారు.
కుస్తీలో గెలిచింది మేమంటే.. మేమని వాగ్వాదానికి దిగారు. ఈ కొట్లాటలో పదిమంది గాయపడ్డారు. వారిని ఆసుపత్రిని తరలించారు. ఇరువర్గాలపై సైఫాబాద్ పోలీసులు కేసు నమోదు చేశారు.
చదవండి: అమెరికాలో ఎన్నారై కుటుంబం దారుణ హత్య?!
Comments
Please login to add a commentAdd a comment