జిల్లా స్థాయి హ్యాండ్‌బాల్ పోటీలు
జిల్లా స్థాయి హ్యాండ్‌బాల్ పోటీలు
Published Fri, Aug 19 2016 11:46 PM | Last Updated on Mon, Sep 4 2017 9:58 AM
సింహాచలం : క్రీడలు శారీరక,మానసిక ఉల్లాసానికి ఎంతగానో దోహదపడతాయని సింహాచలం దేవస్థానం ఏఈవో మోర్తా వెంకట కష్ణమాచార్యులు తెలిపారు. సింహాచలంలోని మహాత్మాజ్యోతీబాఫూలే ఏపీ బీసీ బాలుర గురుకుల పాఠశాలలో స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో శుక్రవారం జిల్లాలోని పాఠశాలల విద్యార్థులకు అండర్–17, అండర్–14 హ్యాండ్‌బాల్ టోర్నీ నిర్వహించారు. రాష్ట్రస్థాయి టోర్నీలో పాల్గొనే విద్యార్థుల జట్లను ఎంపిక చేసేందుకు నిర్వహించిన ఈటోర్నీ ప్రారంభ కార్యక్రమంలో కష్ణమాచార్యులు మాట్లాడుతూ చదువుతోపాటు క్రీడల్లోను విద్యార్థులు ప్రావీణ్యం సంపాదించాలన్నారు. క్రీడల ద్వారా అత్యున్నత శిఖరాలను చేరుకోవచ్చన్నారు. ఈసందర్భంగా పాఠాశాల పీడీ కె.సుధారాణి టోర్నీలో పాల్గొనే విద్యార్థులను పరి^è యం చేశారు. టోర్నీలో జిల్లావ్యాప్తంగా 20 పాఠశాలల నుంచి మొత్తం 36 జట్లు పాల్గొన్నాయి. వీటిలో అండర్–17 సంబంధించి 10 బాలల జట్లు, 8 బాలికల జట్లు, అండర్–14కి సంబంధించి 10 బాలల జట్లు, 8 బాలికల జట్లు ఉన్నాయి. ఉదయం నుంచి సాయంత్రం వరకు పోటీలు నిర్వహించారు. కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్ కె.సత్యవతి, ఉపాధ్యాయులు కష్ణ, వెంకటరెడ్డి, ఆర్గనైజింగ్ సెక్రటరీ సతీష్, పీఈటీలు రఘు, శ్రీనివాస్, ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు.
బాలికల విభాగంలో విజేతలు వీరే.... అండర్–14 బాలికల విభాగంలో స్టీల్‌ప్లాంట్‌లోని శ్రీచైతన్య పబ్లిక్ స్కూల్ టీం ప్రథమస్థానంలోను, పోర్టు హైస్కూల్ టీం ద్వితీయ స్థానంలో నిలిచింది. అలాగే అడర్–17 విభాగంగా పోర్టు హైస్కూల్ టీం ప్రథమ స్థానంలోను, స్టీల్‌ప్లాంట్ శ్రీచైతన్య పబ్లిక్ స్కూల్ ద్వితీయస్థానంలోను నిలిచింది. బాలుర విబాగంలో ఫైనల్స్ ఇంకా జరగాల్సి ఉంది. అన్ని జట్ల నుంచి ఉత్తమ ప్రదర్శన కనబర్చిన విద్యార్థులను రాష్ట్రస్థాయి టోర్నీలకు పంపిస్తామని ఈసందర్భంగా పాఠశాల పిడి సుధారాణి తెలిపారు.
Advertisement
Advertisement