ఆగస్టు 5న డైట్‌లో జిల్లాస్థాయి పోటీలు | district level competitions at DIET | Sakshi
Sakshi News home page

ఆగస్టు 5న డైట్‌లో జిల్లాస్థాయి పోటీలు

Published Wed, Jul 27 2016 7:15 PM | Last Updated on Mon, Sep 4 2017 6:35 AM

district level competitions at DIET

మెదక్‌: మెదక్‌ మండలం హవేళి ఘణాపూర్‌లో గల డైట్‌లో ఆగస్టు 5న విద్యార్థులకు నాటకీకరణ, జానపద నృత్యాలపై జిల్లాస్థాయి పోటీలు నిర్వహిస్తున్నట్టు ప్రిన్సిపాల్‌ రమేష్‌బాబు బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. జిల్లాలోని అన్ని ప్రభుత్వ, జిల్లాపరిషత్, కేజీబీవీ, గురుకులం, ఎయిడెడ్‌ పాఠశాలల ప్రధానోపాధ్యాయులు తమ తమ పాఠశాలల విద్యార్థులను ఎంపికచేసి ఈ పోటీలకు పంపించాలన్నారు.

గెలుపొందిన వారికి నగదు పురస్కారాలు అందిస్తామన్నారు. వీరు రాష్ట్ర, జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొనే అవకాశం ఉంటుందన్నారు. ప్రధానోపాధ్యాయులు తమ పాఠశాలల పేర్లను ఇతర సమాచారాన్ని ఆగస్టు 3లోగా 88016 84241కు ఫోన్‌ ద్వారా నమోదు చేసుకోవాలని సూచించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement