27 నుంచి జిల్లాస్థాయి స్కూల్‌ గేమ్స్‌ సెలెక్షన్స్‌ | district level school games on 27th | Sakshi
Sakshi News home page

27 నుంచి జిల్లాస్థాయి స్కూల్‌ గేమ్స్‌ సెలెక్షన్స్‌

Published Wed, Aug 24 2016 10:56 PM | Last Updated on Mon, Sep 4 2017 10:43 AM

district level school games on 27th

అనంతపురం సప్తగిరి సర్కిల్‌ : ఈ నెల 27 నుంచి స్కూల్‌ గేమ్స్‌ ఫెడరేషన్‌ జిల్లాస్థాయి సెలెక్షన్స్‌ నిర్వహిస్తున్నట్లు జిల్లా అధ్యక్షుడు అంజయ్య, కార్యదర్శి నారాయణ తెలిపారు. సెలెక్షన్‌ షెడ్యూల్‌ క్యాలెండర్‌ను జిల్లా విద్యాశాఖ అధికారి అంజయ్య విడుదల చేశారు. 2002 జనవరి 1 తరువాత జన్మించిన వారు (6–8 తరగతులు చదువుతున్న వారు) అండర్‌–14కు, 1999 జనవరి 1లోపు పుట్టిన వారు (9–10 తరగతులు చదువుతున్న వారు) అండర్‌–17కు అర్హులన్నారు. వీరు ఆయా పాఠశాలల నుంచి జనన ధ్రువీకరణ పత్రాలను తీసుకుని సెలెక్షన్‌ షెడ్యూల్‌కు అనుగుణంగా హాజరు కావాలన్నారు.


సెలెక్షన్స్‌ షెడ్యూల్‌ ఇదే..
సెలెక్షన్‌ ఈ నెల 27 నుంచి సెప్టెంబర్‌ 23 వర కు కొనసాగుతాయన్నారు. 27న కబడ్డీ, 30న లాన్‌ టెన్నిస్, ఫెన్సింగ్, 31న బ్యాడ్మింటన్, సెప్టెంబర్‌ 1న బాస్కెట్‌బాల్, రెజ్లింగ్, ఆర్చరీ, బాక్సింగ్, రైఫిల్‌ షూటింగ్, 2న హ్యాండ్‌బాల్, చెస్, 3న జూడో, 6, 7, 8 తేదీల్లో క్రికెట్, జిమ్నాస్టిక్, వెయిట్‌ లిఫ్టింగ్, 19న కబడ్డీ, సైక్లింగ్, 20న ఖోఖో, 21న తైక్వాండో, 22న ఫుట్‌బాల్, 23న వాలీబాల్‌ నిర్వహిస్తున్నట్లు వారు తెలిపారు. మరిన్ని వివరాలకు 94411 64789 నంబరుకు సంప్రదించాలన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement