ఆత్మకూరు : క్రీడలు మానసికోల్లాసాన్ని కలుగచేస్తాయని ఆత్మకూరు ఎస్‌ఐ దిలీప్‌కుమార్ తెలిపారు. స్థానిక జెడ్పీ ఉన్నత పాఠశాలలో శనివారం జిల్లాస్థాయి ఫుట్‌బాల్ టోర్నమెంట్‌ను ప్రారంభించారు. అక్కమ్మగార్ల పరుష సందర్భంగా ఈ టోర్నీ నిర్వహిస్తున్నట్లు ఫుట్‌బాల్ అసోసియేషన్ సభ్యులు తెలిపారు. టోర్నీ 8వ తేదీ వరకు ఉంటుందని, విన్నర్స్‌కు రూ.10 వేలు కప్పు, రన్నర్స్‌కు రూ.5 వేలు, కప్పు అందజేస్తున్నట్లు తెలిపారు. అనంతరం ఏïడీïఏఫ్‌ఏ సభ్యులు క్రీడాకారులను పరిచయం చేసుకున్నారు. కార్యక్రమంలో ఏడీఎఫ్‌ఏ జిల్లా సెక్రటరీ నాగరాజు, వైస్ ప్రెసిడెంట్ వేణుగోపాల్, ట్రెజరీ భాస్కర్, పీఈటీలు జగదీష్, జగదీశ్వరరెడ్డి, ఫుట్‌బాల్ అసోసియేషన్ సెక్రటరీ బాషా, ఫుట్‌బాల్ అసోసియేషన్ ప్రెసిడెంట్ వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.