అనంతపురం ఎడ్యుకేషన్ : కళా ఉత్సవ్–2016ను పురస్కరించుకుని విద్యాశాఖ ఆధ్వర్యంలో సెప్టెంబర్ 22న స్థానిక సైన్స్ సెంటర్‌లో వివిధ అంశాల్లో జిల్లాస్థాయి పోటీలు నిర్వహించనున్నట్లు జిల్లా విద్యాధికారి (డీఈఓ) అంజయ్య ఓ ప్రకటనలో తెలిపారు. అన్ని ప్రభుత్వ పాఠశాలలు, గుర్తింపు పొందిన ప్రైవేట్ పాఠశాలల్లో 9–12 తరగతులు చదువుతున్న విద్యార్థులు బృందాలుగా ఏర్పడి ఈ పోటీల్లో పాల్గొనాలని సూచించారు. వ్యక్తిగతంగా పోటీ పడే అవకాశం లేదని స్పష్టం చేశారు. బృందాల వివరాలను
ఈ నెల 30లోగా 94400 88488, 94925 83514, 83413 88693 నంబర్లకు ఫోన్‌చేసి తెలియజేయాలని సూచించారు. పాల్గొనే అంశం, విద్యార్థుల సంఖ్యను కచ్చితంగా తెలియజే యాలని పేర్కొన్నారు. సంగీతానికి సంబంధించి 6–10 తరగతుల విద్యార్థులు ఒక బృందంగా, నాట్యం 8–10 మంది విద్యార్థులు, రంగస్థలం 8–12 మంది, దృశ్య కళలు 4–6 మంది విద్యార్థులు ఒక బృందంగా ఉండాలని తెలియజేశారు.
వచ్చే నెల 22న జిల్లాస్థాయి కళా పోటీలు
Published Sun, Aug 21 2016 12:28 AM | Last Updated on Mon, Sep 4 2017 10:06 AM
Advertisement
Advertisement