ఉత్కంఠగా బాస్కెట్ బాల్ పోటీలు
ఉత్కంఠగా బాస్కెట్ బాల్ పోటీలు
Published Sat, Oct 22 2016 9:15 PM | Last Updated on Mon, Sep 4 2017 6:00 PM
గుంటూరు స్పోర్ట్స్: జాగర్లమూడి నరేంద్రనాథ్ మెమోరియల్ జిల్లా స్థాయి బాస్కెట్ బాల్ టోర్నమెంట్ శనివారం జేకేసీ కళాశాలలో ప్రారంభమైంది. బృందావన్ గార్డెన్స్‌లోని ఎన్టీఆర్ స్టేడియంలో బాలికల, పురుషుల విభాగంలో పోటీలు నిర్వహించారు. టోర్నమెంట్‌లో 12 బాలబాలికల స్కూల్ జట్లు, 15 పురుషుల కాలేజి జట్లు పాల్గొన్నాయి. జేకేసీ కళాశాల కార్యదర్శి జాగర్లమూడి మురళిమోహన్ ముఖ్యఅతిథిగా హాజరై బాస్కెట్ బాల్ పోటీలను ప్రారంభించారు. కార్యక్రమంలో శాప్ ఓఎస్‌డీ పి.రామకృష్ణ, ఎన్టీఆర్ స్టేడియం కార్యదర్శి దామచర్ల శ్రీనివాసరావు, జేకేసీ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ నాగేశ్వరరావు, లయోలా స్కూల్ ప్రిన్సిపాల్ అంతోనీ, ఏ.పీ బాస్కెట్ బాల్ అసోసియేషన్ మాజీ కార్యదర్శి పి.రాఘవయ్య, పాల్గొన్నారు.
ఎన్టీఆర్ స్టేడియంలో జరిగిన మ్యాచ్ ఫలితాలు...
కళాశాల పురుషుల విభాగంలో జరిగిన మ్యాచ్‌లో ఏసీ కళాశాల జట్టు 40–20 స్కోర్‌తో ఏఎన్‌యూ ఇంజినీరింగ్ కళాశాల జట్టుపై విజయం సాధించింది. కిట్స్ ఇంజినీరింగ్ కళాశాల జట్టు 36–17 స్కోర్‌తో నర్సరావుపేట ఎన్‌ఈసీ ఇంజినీరింగ్ జట్టుపై, వీవీఐటీ జట్టు 46–23 స్కోర్‌తో ఆర్‌విఆర్ కళాశాల జట్లపై విజయం సాధించాయి. టోర్నమెంట్ ముగింపు కార్యక్రమం ఆదివారం సాయంత్రం ఎన్టీఆర్ స్టేడియంలో జరుగుతుందని టోర్నమెంట్ నిర్వాహకుడు హరగోపాల్ వెల్లడించారు.
Advertisement
Advertisement