Call drop problems
-
టెలికం సేవల నాణ్యత నిబంధనలు కఠినతరం
న్యూఢిల్లీ: కాల్ డ్రాప్ ఫిర్యాదులు గణనీయంగా వస్తున్న నేపథ్యంలో సేవల నాణ్యత నిబంధనలను సమీక్షించడంపై టెలికం రంగ నియంత్రణ సంస్థ ట్రాయ్ దృష్టి పెట్టింది. ప్రస్తుతం టెలికం సర్కిల్ స్థాయిలో చేస్తున్న నెట్వర్క్ పనితీరు సమీక్షను జిల్లా స్థాయిలోనూ నిర్వహించాలని భావిస్తోంది. ఈ క్రమంలో సరీ్వసుల నాణ్యత నిబంధనల్లో కాల్ డ్రాప్ పరామితులు, కాల్ సక్సెస్ రేటు మొదలైనవి కఠినతరం చేయాలని ట్రాయ్ ప్రతిపాదించింది. ఈ ప్రతిపాదనలపై సంబంధిత వర్గాలు తమ అభిప్రాయాలను సెపె్టంబర్ 20లోగా, ముసాయిదా నిబంధనలపై అక్టోబర్ 5న కౌంటర్ కామెంట్లు దాఖలు చేయాలని ట్రాయ్ సూచించింది. మొబైల్ టెలికమ్యూనికేషన్స్‌లో సాంకేతికత ఎంతగానో పురోగమించినా వినియోగదారులకు నాణ్యమైన సేవలు ఆశించిన స్థాయిలో అందడం లేదని ట్రాయ్ పేర్కొంది. దేశవ్యాప్తంగా 4జీ నెట్వర్క్ ఉన్నా, 5జీ సేవలు విస్తరిస్తున్నా కాల్ డ్రాప్స్, కాల్ వినబడకపోవడం, డేటా వేగం తగ్గిపోవడం వంటి అంశాలపై ఫిర్యాదులు వెల్లువెత్తుతూనే ఉన్నాయని తెలిపింది. ఇలాంటి అంశాల వల్ల నెట్వర్క్ సామర్థ్యాలపై సందేహాలు తలెత్తుతున్నాయని వివరించింది. -
ఇలానే కొనసాగితే ఫోనూ పాడవుతుంది.. అసలు కారణం ఇదే..!
సాక్షి, అమరావతి: శ్రీముఖి తన తల్లితో మాట్లాడాలని ఫోన్ చేసింది. తల్లి పార్వతమ్మ లిఫ్ట్ చేసింది. హలో.. హలో.. అన్నా అవతలి నుంచి సమాధానం లేదు. హలో వినిపిస్తుందా అని శ్రీముఖి అడుగుతోందే తప్ప అవతలి నుంచి శబ్దం రాదు. ఆ కాసేపటికే కాల్ కట్ అయింది. వెంకటేశ్వర్లు తన తమ్ముడితో అత్యవసరంగా మాట్లాడాలని తన మొబైల్ నుంచి ఫోన్ చేశాడు. ఒకసారి, రెండుసార్లు.. మూడు సార్లు.. ఇలా చాలా సార్లు కాల్ చేస్తే ఒక్క కాల్ కలిసింది. ఇవి ప్రస్తుతం దేశంలో ఫోన్ వినియోగదారులు ఎదుర్కొంటున్న సమస్యలు. ఫోన్ చేస్తే కాల్ కలవదు. ఒకవేళ కలిసినా వెంటనే కట్ అవుతుంది. కాల్లో ఉండగానే వాయిస్ బ్రేకింగ్.. ఒక్క కాల్ మాట్లాడటానికి మూడు, నాలుగుసార్లు డయల్ చేయాలి. సిగ్నల్స్ ఉన్నా ఒక్కోసారి ఫోన్‌ను ఫ్లైట్ మోడ్/స్విచ్ ఆఫ్ చేసి ఆన్ చేస్తేగాని కాల్ వెళ్లని పరిస్థితి. ప్రస్తుతం టెలికాం రంగంలో ‘కాల్ డ్రాప్’, ‘కాల్ కనెక్షన్’ పెద్ద సమస్యగా మారింది. మిగతా దేశాలతో పోలిస్తే దేశంలోనే కాల్ డ్రాప్ రేటు ఎక్కువగా ఉంది. సాంకేతికత 2జీ నుంచి 4జీకి వచ్చినప్పటికీ సిగ్నల్ లెవల్స్ పరిధి తగ్గుతోంది. గతంతో పోలిస్తే ఒక టవర్ సిగ్నల్ పరిధి 10వ వంతుకు తగ్గిపోవడం ఇందుకు కారణంగా తెలుస్తోంది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 5.50 లక్షల మొబైల్ నెట్వర్క్ టవర్లు ఉన్నాయి. అయినా సమస్య పరిష్కారమవలేదు. కొత్త సాంకేతికతతో పాటు మరో లక్ష టవర్లు అందుబాటులోకి వస్తే తప్ప నెట్వర్క్ నాణ్యత మెరుగుపడదని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఈ క్రమంలోనే వినియోగదారులు కాల్ డ్రాప్‌తో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇదిలాగే కొనసాగితే వినియోగదారులు ప్రస్తుతం ఉన్న టారిఫ్‌లకే పరిమితమవుతారని, ఎక్కువ వెచ్చించి 5జీ వంటి కొత్త టారిఫ్‌లకు వెళ్లేందుకు ఇష్టపడరని నిపుణులు చెబుతున్నారు. బ్యాటరీ త్వరగా అయిపోతుంది భారత టెలికాం మార్కెట్ ప్రపంచంలోనే రెండో అతిపెద్ద మార్కెట్. ప్రస్తుతం దేశంలో 1.1 బిలియన్ మొబైల్ కనెక్షన్లు ఉన్నాయి. టెలికాం కంపెనీలు ట్రాయ్ నిర్దేశించిన బెంచ్‌మార్క్‌ను అందుకోలేక΄ోవడంతోనే అధిక కాల్ డ్రాప్స్ తలెత్తుతున్నాయి. సిగ్నలింగ్ కవరేజీ క్షీణించడం వల్ల హ్యాండ్సెట్ అధిక శక్తితో పని చేయాల్సి ఉంటుంది. ఫలితంగా బ్యాటరీ వేగంగా అయిపోవడంతో పాటటు ఫోన్ కూడా త్వరగా పాడవుతుంది. ఈ నేపథ్యంలోనే కాల్ డ్రాప్ సమస్యపై వినియోగదారుల నుంచి కచ్చితమైన అభిప్రాయ సేకరణకు.. టెలికాం అథారిటీ ఆఫ్ ఇండియా ‘ట్రాయ్మై కాల్’ వాయిస్ కాల్ క్వాలిటీ మానిటరింగ్ యాప్‌ను అందుబాటులోకి తెచ్చింది. వినియోగదారులు కాల్ పూర్తి చేసిన తర్వాత తమ అభిప్రాయాన్ని అందించడానికి ఇది ఉపయోగపడుతుంది. ఈ సమాచారంతో టెలికాం సర్కిల్ నెట్వర్క్ సమస్యలను అర్థం చేసుకుని పరిష్కరించేందుకు వీలవుతుంది. పెరిగిన డేటా, వైఫై కాల్స్ ఆన్లైన్ ఫ్లాట్‌ఫాం లోకల్ సర్కిల్స్ దేశంలో 339 జిల్లాల్లో చేసిన సర్వే ప్రకారం 91 శాతం మంది కాల్ డ్రాప్ సమస్యను ఎదుర్కొంటున్నట్టు తేలింది. ఇందులో 56 శాతం మంది తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. దీనిని అధిగమించేందుకు వినియోగదారులు డేటా, వైఫై ఆధారిత కాల్స్‌కు వెళ్తున్నారు. ఈ తరహా కాల్స్ 2019లో 75 శాతం ఉంటే ఇప్పుడు 82 శాతానికి పెరిగాయి. దేశంలో 0 నుంచి 3 సెకన్లలోపు కాల్ డ్రాపింగ్ శాతం పెరిగింది. నిమిషంలోపు డ్రాపింగ్ శాతం తగ్గింది. 5జీపై అనాసక్తత సాంకేతికతలో ఎంత మార్పులు వచ్చినప్పటికీ కాల్ డ్రాప్ సమస్యలు తగ్గక΄ోవడంతో మొబైల్ నెట్వర్క్ యూజర్లు కొత్త సాంకేతికత వైపు వెళ్లడానికి అంతగా ఇష్టపడటంలేదు. 5జీ వంటి హై స్పీడ్ నెట్వర్క్ తేవడానికి ముందుగా నెట్వర్క్ సమస్యలను పరిష్కరించాలని కోరుతున్నారు. అందుకే ప్రస్తుత టారిఫ్‌లతోనే సరిపెట్టుకొంటామని, ఎక్కువ చార్జీలు పెట్టి కొత్త టారిఫ్‌లు తీసుకోబోమని చెబుతున్నారు. ఇటీవలి సర్వేలో 43 శాతం మంది ప్రస్తుత టారిఫ్కంటే ఎక్కువ చెల్లించడానికి సిద్ధంగా లేమని కరాఖండిగా చెప్పడమే దీనికి నిదర్శనం. మరో 43 శాతం మంది 10 శాతం ఎక్కువ చెల్లించగలమని చె΄్పారు. 10 శాతం మంది మాత్రం 10 నుంచి 25 శాతం వరకు ఎక్కువ చెల్లించేందుకు సుముఖత వ్యక్తం చేస్తున్నారు. చదవండి: తెలంగాణ నుంచి ఏపీకి వచ్చిన వారికి గుడ్‌న్యూస్ -
సడన్‌గా కాల్ డిస్కనెక్ట్ అవుతోందా..! ఇలా చేయండి..!
మీరు ఓ కాల్ మాట్లాడుతున్నప్పుడు సడన్‌గా కాల్ డిస్కనెక్ట్ ఐతే హాలో..హాలో అంటూ...గొంతు చించుకుంటాం. కొన్ని సార్లు ఐతే మరీను..ఏదైనా ముఖ్యమైన విషయంపై మాట్లాడుతుంటే సడన్‌గా కాల్ డిస్కనెక్ట్ ఐతే అబ్బా ఏం నెట్వర్క్ రా బాబు..! అంటూ మన టెలికాం ఆపరేటర్‌ను తిట్టుకుంటాం.కాల్డ్రాపింగ్ సమస్యలను మనలో చాలా మంది ఎదుర్కొన్నవాళ్లమే..! కాల్డ్రాపింగ్ అవ్వకుండా ఉండే ఉపాయాల గురించి తెలుసుకుందాం.... ఇతర అభివృద్ధి చెందిన దేశాలతో పోలిస్తే భారత్‌లో కాల్ డ్రాపింగ్ భారీగానే ఉంటుంది. రెడ్మ్యాగో అనాలిటిక్స్ ప్రకారం...గ్లోబల్ కాల్ డ్రాపింగ్ రేట్ 3 శాతం ఉండగా..భారత్‌లో అది 4.73గా ఉంది. నెట్వర్క్ సమస్యలు, ఎలక్ట్రోమ్యాగ్నెటిక్ ఫ్లాక్చూవేషన్స్ వల్ల ఎక్కువగా కాల్ డ్రాపింగ్స్ జరుగుతుంటాయి. నెట్వర్క్ లేని ప్రదేశాల్లో ఎలాంటి కాల్ డ్రాప్స్లేకుండా వైఫై కాలింగ్‌ను ఉపయోగించి కాల్స్‌ను చేసుకోవచ్చును. చదవండి: ఆనంద్ మహీంద్రా, రాకేశ్ జున్‌జున్‌వాలా..అతని తర్వాతే..! అసలు ఏంటి వైఫై కాలింగ్...! బలహీనమైన సిగ్నల్, నెట్వర్క్ లేని ప్రాంతాల్లో వైఫై కాలింగ్ సహాయంతో రెగ్యులర్ కాల్స్ చేయవచ్చును. మనం వాడే టెలికాం ఆపరేటర్ వైఫై కాలింగ్‌కు మద్దతు ఇస్తే , దాంతోపాటుగా బలమైన వైఫై కనెక్షన్ ఉన్నట్లయితే వైఫై కాలింగ్‌ను వాడవచ్చును. వైఫై కాలింగ్ ఎలా అంటే..వాట్సాప్, ఫేస్బుక్ మెసేంజర్ ఇతర యాప్స్‌నుపయోగించి చేసే వాయిస్ ఒవర్ ఇంటర్నెట్ ప్రోటోకాల్ మాదిరిగానే వైఫై కాలింగ్ చేయవచ్చును. వైఫై నుపయోగించుకొని పలు టెలికాం ఆపరేటర్లు కాలింగ్ సదుపాయాన్ని కల్పిస్తాయి. వైఫై కాలింగ్ సేవలను ఎయిర్టెల్, రిలయన్స్ జియో , వొడాఫోన్ ఐడియాతో సహా చాలా టెలికాం ఆపరేటర్లు వై-ఫై కాలింగ్ సపోర్ట్ అందిస్తున్నాయి. టెలికాం ఆపరేటర్లు వైఫై కాలింగ్‌పై ఎలాంటి అదనపు ఛార్జీలను విధించరు. వైఫై కాలింగ్‌లో కాల్ డ్రాపింగ్ అసలు ఉండదు. వైఫై కాలింగ్‌లో సేవ VoLTE (వాయిస్ ఓవర్ LTE) నెట్‌వర్క్‌కు బదులుగా VoIP (వాయిస్ ఓవర్ ఇంటర్నెట్ ప్రోటోకాల్) ద్వారా కాల్స్ చేస్తుంది. మీ ఆండ్రాయిడ్ఫోన్లలో వైఫై కాలింగ్‌ను ఇలా పొందండి. మీ స్మార్ట్‌ఫోన్‌లో ముందుగా సెట్టింగ్ ఆప్షన్స్‌ను సెలక్ట్ చేయండి సెట్టింగ్స్‌లో మొబైల్ నెట్‌వర్క్‌పై క్లిక్ చేయండి. మొబైల్ నెట్‌వర్క్స్‌లో మీ టెలికాం నెట్వర్క్స్కు సంబంధించిన ఆపరేటర్‌పై క్లిక్ చేయండి. టెలికాం ఆపరేటర్‌పై క్లిక్ చేయగానే కిందికి స్క్రోల్ చేయగానే ‘మేక్ కాల్స్ యూజింగ్ వైఫై’ క్లిక్ చేస్తే సరిపోతుంది. నెట్వర్క్ సరిగ్గా లేని ప్రాంతాల్లో, వైఫై అందుబాటులో ఉన్నప్పుడు కాల్ డ్రాపింగ్లేకుండా మీకు నచ్చిన వ్యక్తులకు కాల్స్చేసుకోవచ్చును. గమనిక: ఈ సెట్టింగ్ ఆయా స్మార్ట్ఫోన్ల ఆపరేటింగ్ సిస్టమ్‌ను బట్టి మారుతూ ఉంటుంది. చదవండి: చుక్కలు చూసొచ్చారట! మనం ఓ లుక్కేద్దాం -
టెలికాం దిగ్గజాలకు భారీ పెనాల్టీకి రంగం సిద్ధం
సాక్షి,న్యూఢిల్లీ: దేశంలోని టెలికాం ఆపరేటర్లకు షాకిచ్చేలా టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (ట్రాయ్) తుది కసరత్తు పూర్తి చేసింది. కాల్‌డ్రాప నిబంధనలు ఉల్లఘించిన కంపెనీలకు భారీ జరిమానా విధించేలా చర్యలు తుది దశకు చేరాయి. తాజా కాల్‌డ్రాప్ నిబంధనల ప్రకారం మార్చి త్రైమాసికంలో ఆపరేటర్లపై జరిమానా విధించేందుకు సిద్ధమవుతోంది. కొత్త నిబంధనల అమలులోకి వచ్చిన నాటినుంచి రెండు త్రైమాసిక అంచనాలు పూర్తయ్యాయని ట్రాయ్ వెల్లడించింది. జనవరి నుంచి మార్చి త్రైమాసికంలో పెనాల్టీ విధించే క్రమంలో చివరి దశలో ఉన్నామని ట్రాయ్ ఛైర్మన్ ఆర్ఎస్ శర్మ పిటిఐకి తెలిపారు. ఈ మేరకు ఆయా కంపెనీలకు షోకాజ్ నోటీసులు జారీ చేశామన్నారు. 21 రోజుల్లోగా ఆయా సంస్థలు సమాధానం ఇవ్వాల్సి ఉందన్నారు. అయితే ఆపరేటర్ల పేర్లను వెల్లడి చేయాలని తాము భావించడం లేదన్నారు. మరోవైపు ట్రాయ్ కొత్త నెట్వర్క్ క్వాలిస్ ఆఫ్ సర్వీస్ (QoS) నిబంధనలు ప్రపంచవ్యాప్తంగా అత్యంత కఠినమైనవని, పరిశ్రమలో టెలికాం ఆపరేటర్లు నిబంధనలకు అనుగుణంగా ఉండేలా పెట్టుబడులు పెట్టాలని పరిశ్రమల సంస్థ కాయ్ డైరెక్టర్ జనరల్ రాజన్ మాథ్యూస్ అన్నారు. డిసెంబర్ త్రైమాసికంలో, కొన్ని సర్కిళ్లలో అనేకమంది ఆపరేటర్లపై ఫిర్యాదులు స్వల్పంగా తగ్గాయన్నారు. ప్రధాన ఆపరేటర్లు కొత్త నిబంధనలకనుగుణంగా సేవలను అందిస్తున్నారని నమ్ముతున్నామని మాథ్యూస్ చెప్పారు. కాగా కాల్ డ్రాప్స్ నివారణ కోసం టెలికాం నెట్వర్క్ సంస్థలకు మార్గదర్శకాలను ట్రాయ్ విడుదల చేసింది. 2017 అక్టోబర్ 1 నుంచి టెలికాం ఆపరేటర్ల సేవా నాణ్యతపై ట్రాయ్ నిబంధనలను కఠినతరం చేసింది. వరుసగా 9నెలల పాటు ట్రాయ్ నిర్దేశించిన ప్రమాణాలు అందుకోలేని ఆపరేటర్లకు గరిష్టంగా రూ.10 లక్షల వరకు ఫైన్ విధిస్తారు. నెట్వర్క్ తీరుకు అనుగుణంగానే లక్ష రూపాయల నుంచి 5 లక్షల వరకు జరిమానా విధించనున్నామని ట్రాయ్ వెల్లడించింది. కాల్ కట్ అయినా, అది నమోదు కాకుండా చూసుకునేందుకు టెలికాం ఆపరేటర్లు వినియోగిస్తున్నారని ఆరోపణలున్న రేడియో లింక్అవుట్ టెక్నాలజీ (ఆర్ఎల్టీ)కి ప్రమాణాలు నిర్దేశించిన సంగతి తెలిసిందే. -
కాల్ డ్రాప్స్‌పై ప్రధాని సీరియస్
తక్షణమే పరిష్కరించాలని ఆదేశం న్యూఢిల్లీ: ఫోన్ రింగొస్తుంది. ఎత్తేసరికి అవతలి గొంతు వినిపించదు. మళ్లీ చేయాల్సిందే..! మరికొన్ని సందర్భాల్లో మాట్లాడుతుండగానే ఫోన్ కట్ అవుతుంది. మళ్లీ చేయాల్సిందే...! టెలికామ్ వినియోగదారులు ఎదుర్కొంటున్న ఇలాంటి కాల్‌డ్రాప్ సమస్యలపై ప్రధాని నరేంద్ర మోదీ ఆందోళన వ్యక్తంచేశారు. సామాన్యులపై ప్రభావం చూపే ఈ సమస్యను తక్షణమే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. కాల్ డ్రాప్ సమస్య డేటా కనెక్టివిటీకి కూడా విస్తరించే ప్రమాదం ఉందని, అలా జరగకుండా చూడాలని సూచించారు. డిజిటల్, గ్రామీణ మౌలిక సదుపాయాలు మొదలైన అంశాల పురోగతిని సమీక్షించిన మోదీ.. ఈ మేరకు ఆదేశాలిచ్చినట్లు మంగళవారం ప్రధాని కార్యాలయం తెలియజేసింది. ‘‘కాల్ డ్రాప్ సమస్య పరిష్కారానికి తీసుకుంటున్న చర్యలపై అధికారుల్ని మోదీ ప్రశ్నించారు. మారుమూల ప్రాంతాలకూ మొబైల్ కనెక్టివిటీ విస్తరించేలా రైల్వే, ఇతర కమ్యూనికేషన్ మౌలిక సదుపాయాలను సమర్ధంగా ఉపయోగించుకోవాలని సూచించారు. 1,000 రోజుల్లోగా దేశంలోని అన్ని గ్రామాలకూ విద్యుత్ సౌకర్యం కల్పించే ప్రతిపాదనను పక్కాగా అమలు చేయాలని ఆదేశించారు. డిజిటల్ ఇండియా కార్యక్రమానికి అనుగుణంగా డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏర్పాటు లక్ష్యాలుండాలని చెప్పారు’’ అని ఆ ప్రకనటనలో వివరించారు. ప్రభుత్వం తగినంత స్పెక్ట్రం ఇవ్వకపోవడం వల్ల కాల్ డ్రాప్స్‌ను అడ్డుకోలేకపోతున్నామని, సేవలు మెరుగుపర్చలేకపోతున్నామని టెల్కోలు ఆరోపిస్తున్నాయి. అయితే టెలికం కంపెనీలు తగినంత ఇన్వెస్ట్ చేయకపోవడం వల్లే ఈ సమస్య వస్తోందంటూ కేంద్రం చెబుతోంది. కాగా కాల్ డ్రాపింగ్ సమస్య పరిష్కరించేందుకు మొబైల్ ఆపరేటర్లు నెట్‌వర్క్‌ను మెరుగుపర్చుకోవాలని టెలికం మంత్రి రవి శంకర్ ప్రసాద్ సూచిం చారు. ఇందుకోసం టవర్ల ఏర్పాటు, రేడియేషన్ భయాల తొలగింపు తదితర అంశాలన్నింటికి సంబంధించి విధానాలపరంగా ప్రభుత్వం పూర్తి మద్దతిస్తుందని దక్షిణాసియా టెలికం రంగ నియంత్రణ మండలి కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా పేర్కొన్నారు.