WiFi connection
-
ఎలుకలు చేసిన పని.. ఇబ్బందుల్లో 2000 మంది..
లండన్: ఎలుకల సంగతి అందరికీ తెలిసిందే.. తాము తినేవే కాదు అడ్డం వచ్చిన ఏ వస్తువులను కూడా వదలిపెట్టవు. తమ ఇంట్లో ఎలుకలు ఉన్నవారికి వీటి శాడిజం గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. తాజాగా ఆ తరహాలోనే ఎలుకల కారణంగా ఏకంగా రెండు వేల మంది ఇంటర్నెట్ కష్టాలు ఎదుర్కొంటున్నారు. ఈ ఘటన ఇంగ్లాండ్‌లోని టోరిడ్జ్, డేవాన్ ప్రాంతాలలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. టోరిడ్జ్, డేవాన్ ప్రాంతాలలో ఎలుకల బెడద కాస్త ఎక్కువే. (చదవండి: తల్లిదండ్రులకు షాకిచ్చిన చైనా.. ఇకపై పిల్లలు తప్పు చేశారో అంతే సంగతి..) ఇటీవల ఆ ఎలుకల గుంపు ఇంటర్నెట్ కేబుళ్లను సైతం వదలక, ఇష్టం వచ్చినట్లు కొరికిపడేశాయి. దీంతో టోరిడ్జ్ ప్రాంతంలో 1800 మంది, డేవాన్ ప్రాంతంలో 200 మంది వరకు వైఫై సేవలను వినియోగించుకోలేని పరిస్థితి ఏర్పడింది. బీటీ, వొడాఫోన్, ప్లస్‌నెట్,స్కై, ఇతర కంపెనీల సేవలు కూడా అర్థాంతరంగా నిలిచిపోయాయి. అంతేగాక అక్టోబర్ 14న వీటి చర్యలకు దాదాపు ఏడు గంటల పాటు కాల్స్ సేవలు నిలిచిపోయాయి. గత రెండు నెలల నుంచి ఆ ప్రాంత స్థానికుల ఇంటర్నెట్ సౌకర్యంగా సరిగా లేక తీవ్ర ఇబ్బందులను ఎదుర్కుంటున్నారు. దీనిపై స్థానిక ప్రభుత్వ అధికారి మాట్లాడుతూ.. బిడ్ఫర్డ్, క్లోవెల్లీ, హార్ట్‌ల్యాండ్ ప్రాంతాల్లో టెలిఫోన్, బ్రాడ్‌బ్యాండ్ సేవలు నిలిచిపోయాయి. దీని వల్ల ఈ ప్రాంతాల్లో దాదాపు 1800 మంది ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఫిర్యాదు వచ్చినప్పటి నుంచి మా ఇంజనీర్లు ఈ సమస్యను పరిష్కరించటానికి తీవ్రంగా కృషి చేస్తున్నారు. అయితే మునుపటి పరిస్థితి తీసుకొచ్చేందుకు వారికి ఎంత సమయం పడుతుందో కచ్చితంగా చెప్పలేమని ఆయన అన్నారు. చదవండి: Afghanistan: ఆగని తాలిబన్ల అకృత్యాలు.. మహిళా క్రీడాకారిణి తల నరికి.. -
ఇంట్లో ఇంటర్నెట్ స్పీడ్ పెరగాలంటే?
న్యూఢిల్లీ: మోటరోలా కంపెనీ వేగవంతమైన ఇంటర్నెట్ కోసం అత్యాధునిక మెష్ సిస్టమ్ ‘ఎంహెచ్7020’ను భారత మార్కెట్లోకి విడుదల చేసింది. దీన్ని హోల్ హోమ్ వైఫై సిస్టమ్‌గా కంపెనీ పేర్కొంది. వైఫై రూటర్, వైఫై శాటిలైట్, పవర్ అడాప్టర్లతో ఈ ప్యాక్‌లు లభిస్తాయి. 6,000 చదరపు అడుగుల విస్తీర్ణంలోని ఇంటిలో అన్ని ప్రాంతాలకు వైఫై కవరేజీ వేగవంతంగా, నాణ్యంగా ఉంటుందని కంపెనీ తెలిపింది. దీనికితోడు అధిక భద్రత కూడా లభిస్తుందని పేర్కొంది. ఒక మెష్రెడీ రూటర్, ఒక అడాప్టర్, ఎథర్నెట్ కేబుల్, క్విక్స్టార్ట్ ఫ్లయర్, మోటోమ్యానేజ్ యాప్ ప్యాక్ ధర రూ.7,999గా నిర్ణయించింది. ఒక హోల్హోమ్ వైఫై రూటర్, ఒక వైఫై శాటిలైట్, రెండు పవర్ అడాప్టర్లు, రెండు ఎథర్నెట్ కేబుళ్లతో కూడిన ప్యాక్ రూ.13,999గాను, ఒక హోల్హోమ్ వైఫై రూటర్, 2 శాటిలైట్లు, మూడు పవర్ అడాప్టర్లు, మూడు ఎథర్నెట్ కేబుళ్ల ప్యాక్ ధర రూ.19,999గా నిర్ణయించింది. చదవండి: రికార్డు సృష్టించిన స్టార్‌లింక్ ఇంటర్నెట్..! స్పీడ్ ఎంతంటే.. -
ఐఫోన్లో కొత్త బగ్..! ఇలా పరిష్కరించండి...
ఆపిల్ కంపెనీకి చెందిన ఐఫోన్‌కు క్రేజ్ మామూలుగా ఉండదు.సెక్యూరిటీ విషయంలో ఇతర మొబైల్ ఫోన్లతో పోలిస్తే ఆపిల్ ఐఫోన్‌కు పోటి అసలు ఉండదు. ఐఫోన్‌ను చాలా మంది వినియోగించడానికి ప్రధాన కారణం భద్రత. ఆపిల్ తన వినియోగదారుల ప్రైవసీ,భద్రత విషయంలో అసలు రాజీ పడదు. అప్పుడప్పుడు ఐఫోన్లు బగ్‌లకు గురైతే వెంటనే వాటికి ఆపిల్ పరిష్కారం చూపుతుంది. తాజాగా ఆపిల్ ఐఫోన్లో మరొక బగ్‌ను గుర్తించారు. ఈ బగ్ ఆపిల్ ఫోన్లలో వైఫై సపోర్ట్‌ను పూర్తిగా నిలివివేస్తోంది. ‘%secretclub%power’ అనే పేరుతో ఉన్న వైఫై నెట్వర్క్ కు ఐఫోన్‌ను కనెక్ట్ చేసినప్పుడు వైఫై ఆటోమెటిగ్గా డిసేబుల్ అవుతుందని కార్ల్ షౌ అనే బ్లాగర్ ట్విటర్ వేదికగా పేర్కొన్నాడు. అతను % సింబల్ ఉన్న వైఫై నెట్‌వర్క్‌కు కనెక్ట్ కావడంతో అతని ఐఫోన్లో వైఫై పూర్తిగా డిసేబుల్ అయ్యిందని తెలిపాడు. నెట్వర్క్ సెట్టింగ్‌లను రిసెట్, ఫోన్‌ను రీస్టాట్ చేసిన తిరిగి వైఫై సౌకర్యాన్ని పొందలేకపోయాడు. ఇలా చేస్తే..బెటర్.. ఆపిల్ ఐఫోన్లలో ఎదురవుతున్న ఈ సమస్యను పరిష్కరించడానికి కొంతమంది టెక్ నిపుణులు రెండు మార్గాలను సూచించారు. వైఫై సెట్టింగ్స్‌ను రీసెట్ చేసుకోవడం ద్వారా పరిష్కరించవచ్చునని పేర్కొన్నారు. ఐక్లౌడ్ నుంచి వైఫై నెట్వర్క్ పేరును తొలగించడం ద్వారా తిరిగి వైఫై సౌకర్యాన్ని పొందవచ్చునని పేర్కొన్నారు. ఈ బగ్‌పై ఆపిల్ అధికారికంగా స్పందించ లేదు. -
ఎయిర్టెల్ వైఫై కాలింగ్ లాంఛ్..
హైదరాబాద్ : తెలుగు రాష్ట్రాల్లో వైఫై కాలింగ్‌ను ఎయిర్టెల్ లాంఛ్ చేసింది. ఎయిర్టెల్ స్మార్ట్‌ఫోన్ కస్టమర్లకు మెరుగైన వాయిస్ కాలింగ్ అనుభూతిని వైఫై కాలింగ్ అందుబాటులోకి తీసుకువస్తుందని సంస్థ వెల్లడించింది. ఏ నెట్‌వర్క్‌లోని కస్టమర్లకైనా ఎయిర్టెల్ వైఫై కాలింగ్‌ను రిసీవ్ చేసుకోవచ్చని, ఎయిర్టెల్ వైఫై కాలింగ్‌పై చేసే కాల్స్‌కు ఎలాంటి అదనపు చార్జీలు ఉండవని స్పస్టం చేసింది. వైఫై సేవలపై కస్టమర్లు ఆసక్తి కనబరుస్తుండటంతో తొలుత తెలుగు రాష్ట్రాల్లోని కస్టమర్లకు తొలుత దీన్ని అందుబాటులోకి తీసుకువచ్చేందుకు కృషిచేశామని భారతి ఎయిర్టెల్ ఏపీ, తెలంగాణా సీఈవో అన్వీస్ సింగ్ పూరి వెల్లడించారు. ఎయిర్టెల్ వైఫై కాలింగ్‌కు ఎలాంటి యాప్‌ను డౌన్లోడ్ చేసుకోవాల్సిన అవసరం లేదని చెప్పారు. వైఫై కాలింగ్‌కు అనుగుణంగా తాజా వెర్షన్‌కు ఫోన్ ఆపరేటింగ్ సాఫ్ట్‌వేర్‌ను కస్టమర్లు అప్‌గ్రేడ్ చేసుకోవాల్సి ఉంటుంది. మొబైల్ ఫోన్ సెట్టింగ్స్‌లోకి వెళ్లి వైఫీ కాలింగ్ స్విచ్ ఆన్ చేసుకోవాలి. ప్రస్తుతం ఎయిర్‌టైల్ వైఫై కాలింగ్‌ను 6ఎస్తో పాటు ఆపైన వెలువడిన అన్ని యాపిల్ ఐఫోన్లు, షియామీ రెడ్మీ కే20, రెడ్మీ కే20 ప్రొ, శాంసంగ్ జే 6, ఏ 10, ఒన్ 6, ఎస్ 10, ఎస్ 10ప్లస్, ఎస్ 10ఈ, ఎం20 ఒన్‌ప్లస్ 7, 6 సిరీస్ ఫోన్లన్లీ సపోర్ట్ చేస్తాయి. -
వైఫై సంకేతాలతోనే స్మార్ట్‌ఫోన్ ఛార్జింగ్
మీ స్మార్ట్‌ఫోన్‌ను ఇంట్లో ఉండే వైఫై రౌటర్‌తోనే చార్జ్ చేసుకోగలిగితే ఎలా ఉంటుంది? ఈ అద్భుతాన్ని సాకారం చేస్తామంటున్నారు మసాచుసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ శాస్త్రవేత్తలు. వినేందుకు ఆశ్చర్యంగా అనిపిస్తోంది కదూ! కానీ రెక్టెన్నా అనే ప్రత్యేకమైన పరికరం సాయంతో ఇది చాలా సులువైన పనే అని అంటున్నారు టోమ్స్ పలాసియోస్ అనే శాస్త్రవేత్త. ఏసీ విద్యుత్తు ద్వారా పుట్టే విద్యుదయస్కాంత తరంగాలను డీసీ తరంగాలుగా మార్చే పరికరమే రెక్టెన్నా. ఎంఐటీ శాస్త్రవేత్తలు తయారు చేసిన కొత్తరకం రెక్టెన్నా మాత్రం రేడియో తరంగాలను స్వీకరించి ఏసీ విద్యుత్తరంగాలుగా మారుస్తుందన్నమాట. అయితే ఇప్పటివరకూ రెక్టెన్నాతో ఉత్పత్తి చేయగలిగిన విద్యుత్తు చాలా తక్కువగా ఉండటంతో ఈ రెక్టెన్నాను విçస్త్రత స్థాయిలో వాడటం సాధ్యం కాలేదని తమ గాడ్జెట్‌తో ఈ పరిస్థితి మారిపోతుందని టోమ్స్ తెలిపారు. నేచర్ మ్యాగజైన్లో ప్రచురితమైన వివరాల ప్రకారం.. ఈ కొత్తతరం రెక్టెన్నాను చాలా చౌకగా, సులువుగా తయారు చేయవచ్చు. హైవేల వెంబడి కొత్త రెక్టెన్నాలను భారీ సైజులో ఏర్పాటు చేయవచ్చునని తద్వారా బ్యాటరీల అవసరం లేకుండా ఎలక్ట్రానిక్ గాడ్జెట్లు అన్నింటినీ చార్జ్ చేయవచ్చునని తెలిపారు. ప్రయోగాత్మకంగా తాము తయారుచేసిన రెక్టెన్నాలతో 40 మైక్రోవాట్ల విద్యుత్తును ఉత్పత్తి చేయగలిగామని.. ఎల్ఈడీ స్క్రీన్లు మొదలుకొని అనేక వేరబుల్ గాడ్జెట్స్‌కు ఈ మాత్రం విద్యుత్తు సరిపోతుందని వివరించారు. -
శృంగారం కన్నా వైఫైనే ఎక్కువ అవసరం!
లండన్: ప్రస్తుత కాలంలో వైఫై అతి ముఖ్యమైన నిత్యావసరమైంది. అమెరికా, ఐరోపాల్లోని 1,700 మంది ఉద్యోగులను సర్వే చేసిన ‘ఐపాస్’ అనే వైఫై కనెక్షన్ సరఫరాదారులు ఈ విషయం చెబుతున్నారు. శృంగారం, చాకొలేట్, మద్యం కన్నా తమకు వైఫైయే ముఖ్యమైన నిత్యావసరం అని సర్వేలో పాల్గొన్న 40 శాతం మంది చెప్పారు. 37 శాతం మంది తమకు శృంగారం అన్నింటికన్నా ముఖ్యం అని తీర్పునివ్వగా చాకొలేట్కు మూడో(14 శాతం), మద్యానికి నాల్గవ(9 శాతం) స్థానం దక్కారుు. వైఫై తమ జీవన ప్రమాణాలను మెరుగుపరిచిందని 75 శాతం మంది అభిప్రాయపడ్డారు. -
ఫ్రిజ్‌లో కాఫీ కాచుకోండి!
ఒకప్పుడు ఎవరింట్లోనైనా ఫ్రిజ్ ఉందంటే... వారిని అందరూ గొప్పగా చూసేవాళ్లు. తర్వాతి కాలంలో అందరింట్లోకి ఫ్రిజ్‌లు వచ్చేశాయి. దాంతో కొందరు డబుల్ డోర్లున్న ఫ్రిజ్‌లను కొనడం ప్రారంభించారు. ఆ తర్వాత కొత్త కొత్త ఫీచర్లున్న ఫ్రిజ్‌లు ప్రస్తుతం మార్కెట్లోకి బోలెడన్ని వచ్చేస్తున్నాయి. జనం కూడా వాటిలో వైవిధ్యం కోరుకుంటున్నారు. కింది ఫొటోను ఓసారి చూడండి. కాఫీ మిషన్లా కనిపిస్తుందా? అయితే మీరు తప్పులో కాలేసినట్టే. అది కాఫీ మిషన్ కాదండీ.. అసలైన రిఫ్రిజిరేటరే. ఇందులోని ఫీచర్స్ వింటే, మీరు ఆశ్చర్యపోక తప్పదు. ఎందుకంటే.. ఇది డ్రింక్స్‌ను కూల్ చేయడమే కాదు, వేడి వేడి కాఫీ, టీలనూ అందిస్తుంది. అంతేనా... ఇందులో వాటర్‌ను ప్యూరిఫై చేయగల ఫిల్టర్లూ ఉన్నాయి. అలాగే వైఫై కనెక్షన్‌తోనూ ఇది పనిచేస్తుంది. వీటి డోరుకు బయటివైపు ఓ ఎల్ఈడీ టచ్‌స్క్రీన్ కూడా ఉంటుంది. ఈ ఫ్రిజ్‌కు ఎలక్ట్రానిక్ టెంపరేచర్ కంట్రోల్డ్ డ్రాలు ఉంటాయి. నిజంగా ఇది స్మార్ట్ ఫ్రిజ్. -
‘స్మార్ట్’ ఫ్రిజ్
ఫ్రిజ్‌లో కూరగాయలున్నాయా? అయిపోయాయా? అన్న సంగతి మనకు ఫ్రిజ్ డోర్ ఓపెన్ చేస్తే కానీ తెలియదు. అంతేకాదు.. అనుకోకుండా మార్కెట్‌కు వెళితే మన ఇంట్లో ఏ ఏ కూరగాయలున్నాయో గుర్తులేకుంటే అదో తలనొప్పే.. మరెలా దీనికి పరిష్కారం? బెంగ పడాల్సిన అవసరం లేదు.. మన బాధలను తీర్చేందుకు, మన పనుల్ని మరింత సులభతరం చేసేందుకు వచ్చిందే ఈ ‘స్మార్ట్ ఫ్రిజ్’. దీనికి ఉన్న ఫీచర్స్ తెలుసుకుంటే, ఎవరైనా ముక్కున వేలేసుకోక తప్పదు. ఎందుకంటే అంత అద్భుతంగా పనిచేస్తుంది ఈ ఫ్రిజ్. దీనికి వైఫై కనెక్షన్‌తో పాటు ఓ టచ్‌స్క్రీన్ డిస్ప్లే కూడా ఉంటుంది. దాంతో ఫ్రిజ్‌లో ఉన్న పదార్థాలన్నిటినీ మనం డోర్ తెరవకుండానే, బయట ఉన్న ఆ డిస్ప్లేలో చూడొచ్చు. దీనికి కారణం ఫ్రిజ్‌కు అమర్చబడిన కెమెరానే. ఇది మీరు డోర్ వేయగానే లోపలున్న వాటిని వెంటనే ఫొటో తీసేస్తుంది. ఆ ఫొటోలను మీరు ఆ డిస్ప్లేలో కానీ లేదా మీ మొబైల్ ఫోన్లో కానీ చూడొచ్చు. అప్పుడు మీరు షాపింగ్‌కు వెళ్లినప్పుడు ఆ ఫొటోలను చూసి, అందులో లేని వాటిని కొనుక్కోవచ్చు.