ఫ్రిజ్‌లో కాఫీ కాచుకోండి! | Fridge in Coffee and WiFi connection | Sakshi
Sakshi News home page

ఫ్రిజ్‌లో కాఫీ కాచుకోండి!

Published Sat, Jul 23 2016 11:25 PM | Last Updated on Mon, Sep 4 2017 5:54 AM

ఫ్రిజ్‌లో కాఫీ కాచుకోండి!

ఫ్రిజ్‌లో కాఫీ కాచుకోండి!

ఒకప్పుడు ఎవరింట్లోనైనా ఫ్రిజ్ ఉందంటే... వారిని అందరూ గొప్పగా చూసేవాళ్లు. తర్వాతి కాలంలో అందరింట్లోకి ఫ్రిజ్‌లు వచ్చేశాయి. దాంతో కొందరు డబుల్ డోర్లున్న ఫ్రిజ్‌లను కొనడం ప్రారంభించారు. ఆ తర్వాత కొత్త కొత్త ఫీచర్లున్న ఫ్రిజ్‌లు ప్రస్తుతం మార్కెట్‌లోకి బోలెడన్ని వచ్చేస్తున్నాయి. జనం కూడా వాటిలో వైవిధ్యం కోరుకుంటున్నారు. కింది ఫొటోను ఓసారి చూడండి. కాఫీ మిషన్‌లా కనిపిస్తుందా? అయితే మీరు తప్పులో కాలేసినట్టే. అది కాఫీ మిషన్ కాదండీ.. అసలైన రిఫ్రిజిరేటరే. ఇందులోని ఫీచర్స్ వింటే, మీరు ఆశ్చర్యపోక తప్పదు. ఎందుకంటే..

ఇది డ్రింక్స్‌ను కూల్ చేయడమే కాదు, వేడి వేడి కాఫీ, టీలనూ అందిస్తుంది. అంతేనా... ఇందులో వాటర్‌ను ప్యూరిఫై చేయగల ఫిల్టర్లూ ఉన్నాయి. అలాగే వైఫై కనెక్షన్‌తోనూ ఇది పనిచేస్తుంది. వీటి డోరుకు బయటివైపు ఓ ఎల్‌ఈడీ టచ్‌స్క్రీన్ కూడా ఉంటుంది. ఈ ఫ్రిజ్‌కు ఎలక్ట్రానిక్ టెంపరేచర్ కంట్రోల్డ్ డ్రాలు ఉంటాయి. నిజంగా ఇది స్మార్ట్ ఫ్రిజ్.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement