‘స్మార్ట్’ ఫ్రిజ్ | Smart fridge with WiFi connection | Sakshi
Sakshi News home page

‘స్మార్ట్’ ఫ్రిజ్

Published Sun, May 15 2016 3:19 AM | Last Updated on Mon, Sep 4 2017 12:06 AM

‘స్మార్ట్’ ఫ్రిజ్

‘స్మార్ట్’ ఫ్రిజ్

ఫ్రిజ్‌లో కూరగాయలున్నాయా? అయిపోయాయా? అన్న సంగతి మనకు ఫ్రిజ్ డోర్ ఓపెన్ చేస్తే కానీ తెలియదు. అంతేకాదు.. అనుకోకుండా మార్కెట్‌కు వెళితే మన ఇంట్లో ఏ ఏ కూరగాయలున్నాయో గుర్తులేకుంటే అదో తలనొప్పే.. మరెలా దీనికి పరిష్కారం? బెంగ పడాల్సిన అవసరం లేదు.. మన బాధలను తీర్చేందుకు, మన పనుల్ని మరింత సులభతరం చేసేందుకు వచ్చిందే ఈ ‘స్మార్ట్ ఫ్రిజ్’. దీనికి ఉన్న ఫీచర్స్ తెలుసుకుంటే, ఎవరైనా ముక్కున వేలేసుకోక తప్పదు. ఎందుకంటే అంత అద్భుతంగా పనిచేస్తుంది ఈ ఫ్రిజ్.

దీనికి వైఫై కనెక్షన్‌తో పాటు ఓ టచ్‌స్క్రీన్ డిస్‌ప్లే కూడా ఉంటుంది. దాంతో ఫ్రిజ్‌లో ఉన్న పదార్థాలన్నిటినీ మనం డోర్ తెరవకుండానే, బయట ఉన్న ఆ డిస్‌ప్లేలో చూడొచ్చు. దీనికి కారణం ఫ్రిజ్‌కు అమర్చబడిన కెమెరానే. ఇది మీరు డోర్ వేయగానే లోపలున్న వాటిని వెంటనే ఫొటో తీసేస్తుంది. ఆ ఫొటోలను మీరు ఆ డిస్‌ప్లేలో కానీ లేదా మీ మొబైల్ ఫోన్‌లో కానీ చూడొచ్చు. అప్పుడు మీరు షాపింగ్‌కు వెళ్లినప్పుడు ఆ ఫొటోలను చూసి, అందులో లేని వాటిని కొనుక్కోవచ్చు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement