పోషకాలు కోల్పోకుండా...
ఫ్రిజ్‌లో లేదా షెల్ఫ్‌లలో పదార్థాలను ఒకే పాకెట్‌లో 3-4 రకాలవి వేసి ఉంచకూడదు. ఇలా చేయడం వల్ల ఆయా పదార్థాలకున్న ప్రత్యేక వాసన, పోషకాలు కోల్పోతాయి.
⇔ పదార్థాలను కట్‌చేసేటప్పుడు, వేరు చేసేటప్పుడు గోరువెచ్చని నీటితో తప్పనిసరిగా చేతులను శుభ్రం చేసుకోవాలి.
⇔ కూరగాయలు, ఆకుకూరలు, పప్పు ధాన్యాలు, మాంసాహారాన్ని శుభ్రపరిచేటప్పుడు గోరువెచ్చని ఉప్పు నీటిని ఉపయోగించాలి.
⇔ కటింగ్ బోర్డులు, గిన్నెలు ఉపయోగించడానికి ముందు, తర్వాత తప్పనిసరిగా సబ్బు నీటితో శుభ్రపరచాలి. నీచు వాసన రాకుండా ఉండటానికి ఘాటువాసనలు లేని బ్లీచ్‌ని ఉపయోగించవచ్చు.
⇔ వంటగదిలో వంటపాత్రలు, స్టౌ, ఉపయోగించే ఇతర పరికరాలు సురక్షితమైనవే ఎంచుకోవాలి.
⇔ రిఫ్రిజిరేటర్ నుంచి తీసిన మాంసపదార్థాలు గానీ, కూరగాయలు గానీ 30 నిమిషాల లోపు వండేయాలి.
⇔ మిగిలిపోయిన పదార్థాలను రెండు గంటలకన్నా మించి బయట ఉంచకూడదు. ఫ్రిజ్‌లో అయితే ఒక రోజులోనే వాటిని పూర్తి చేయాలి.