జాగ్రత్తగా దాచండి! | Hide careful | Sakshi
Sakshi News home page

జాగ్రత్తగా దాచండి!

Published Sun, Aug 17 2014 12:15 AM | Last Updated on Sat, Sep 2 2017 11:58 AM

జాగ్రత్తగా దాచండి!

జాగ్రత్తగా దాచండి!

వాయనం:  మార్కెట్‌కి వెళ్లి గంటల తరబడి పరీక్షించి మరీ కూరగాయలు, పండ్లు కొనుక్కొస్తాం. కానీ ఒక్కోసారి అవి రెండు రోజులకే కుళ్లిపోతుంటాయి. బోలెడు డబ్బు పోసి కొన్నవి కళ్లముందే పాడైపోతుంటే చూడలేక, పారేయడానికి చేతులు రాక బాధేస్తూ ఉంటుంది. అయితే నిజానికి మనం తెలుసుకోవాల్సిన విషయం ఒకటుంది. కూరగాయలు త్వరగా పాడైపోవడానికి మనం వాటిని దాచే విధానం సరిగ్గా లేకపోవడం కూడా కారణం కావచ్చు. కొద్దిపాటి జాగ్రత్తలు తీసుకుంటే వాటిని ఎక్కువ రోజులపాటు తాజాగానూ ఉంచుకోవచ్చు. అందుకోసం ఇలా చేసి చూడండి...
 
కూరగాయలను పళ్లతో కలిపి ఫ్రిజ్‌లో పెట్టకూడదు. వేరు వేరు కవర్లలో కానీ బాక్సుల్లో కానీ వేసి పెట్టాలి!ఆకుకూరల్ని ఫ్రిజ్‌లో పెట్టే ముందు కట్ట కట్టడానికి ఉపయోగించిన రబ్బర్‌బ్యాండ్/దారం తీసేయాలి. కాడలు కోసి పెట్టకూడదు. శుభ్రంగా కడిగి, తడి ఆరిన తర్వాత ఫ్రిజ్‌లో పెడితే వారం వరకూ తాజాగా ఉంటాయి!అంటే నిమ్మ, బత్తాయి, ద్రాక్ష లాంటి సి విటమిన్ ఉండే పండ్లను తప్పకుండా ఫ్రిజ్‌లో పెట్టాలి. ఫ్రిజ్ లేకపోతే తడి బట్టలో మూటకట్టి పెట్టాలి. ఆరినప్పుడల్లా బట్టను తడుపుతూ ఉంటే త్వరగా వాడిపోకుండా, కుళ్లిపోకుండా ఉంటాయి.
     
క్యారెట్లను రెండు మూడు రోజుల వరకూ బయటే ఉంచేయవచ్చు. ఫ్రిజ్‌లో పెడుతుంటే మాత్రం వాటి మొదళ్లలో ఉండే పచ్చటి భాగాన్ని కోసి పెట్టాలి. లేదంటే వాటిలోని పోషకాలు పోతాయి!కాలీఫ్లవర్‌కి ఎక్కువగా గాలి సోకితే పురుగులు వచ్చేస్తాయి. అలా అని ఏ బాక్సులోనో పెట్టి మూత బిగిస్తే రంగు మారిపోతుంది. కాబట్టి పాలిథీన్ బ్యాగ్‌లో వేసి ఫ్రిజ్‌లో పెట్టాలి!మొక్కజొన్నల్ని వారం పది రోజుల వరకూ ఫ్రిజ్‌లో పెట్టక్కర్లేదు. ఒలిచిన గింజలైతే మాత్రం వెంటనే పెట్టేయాలి!దోస జాతికి చెందిన దేనినీ ఫ్రిజ్‌లో పెట్టకూడదు. ఓసారి కట్ చేశాక అస్సలు పెట్టకూడదు. వాటిలో నీటి శాతం ఎక్కువగా ఉండటం వల్ల చల్లదనానికి త్వరగా మెత్తబడిపోతాయి. రుచిలో కూడా కాస్త మార్పు వస్తుంది!
  ఫ్రిజ్‌లోని చల్లదనం టొమాటోల్లోని యాంటీ ఆక్సిడెంట్లను, పోషకాలను హరిస్తుంది!

 వంకాయల్ని ఫ్రిజ్‌లో పెట్టవద్దనేది నిపుణుల సూచన. టెంపరేచర్ ఒక స్థాయి దాటితే వాటిలోని పోషకాలకు హాని జరుగుతుందట. పెట్టినా మూడు రోజులకు మించి ఉంచకూడదట! పుట్టగొడుగులకు చెమ్మ తగలకూడదు. కాబట్టి వండాలి అనుకునేంత వరకూ వాటి ని జాగ్రత్తగా ఉంచాలి. నిజానికి వీటిని ఫ్రిజ్‌లో పెట్టాల్సిన అవసరం లేదు.బంగాళదుంపలు, ఉల్లిపాయల్ని ఫ్రిజ్‌లో పెట్టకూడదు. బయటే గాలి తగిలేలా ఉంచాలి. కానీ ఈ రెంటినీ ఒకచోట ఉంచకూడదు. ఉంచామో... ఒకటి ఇంకోదాన్ని త్వరగా పాడు చేసేస్తుంది!
 
 ఒక్క దెబ్బకి వంద ముక్కలు!


వంట చేయడం కంటే వంటకు కూరగాయల్ని సిద్ధం చేయడం పెద్ద పని. ముఖ్యంగా ఆకుకూరల్ని కోయాలంటే బోలెడంత సమయం వెచ్చించాలి. కత్తిపీటలు వాడటం మానేశామేమో... చాకుతో ఆకుకూరల్ని తరగాలంటే చేతులు పడిపోతుంటాయి. పైగా ఒకటికి పదిసార్లు చాకుకి పని చెబితేనే తప్ప అన్ని ముక్కలూ ఒకే పరిమాణంలో రావు. ఇక కరివేపాకు, కొత్తిమీర! కొందరు రెబ్బలు వేసేస్తారు. కానీ కొంతమందికి బాగా తరిగి వేసుకోవడం ఇష్టం. వాటిని చిన్న చిన్న ముక్కలు చేయలేక ఇబ్బంది పడుతుంటారు. ఈ సమస్యలన్నిటికీ ఒక్కటే పరిష్కారం... హెర్బ్ సిజర్స్!
 
 అచ్చంగా కత్తెరలాగే కనిపిస్తుంది కానీ... సరిగ్గా పరిశీలిస్తే నాలుగైదు కత్తెరలు కలిపి చేసినట్టుగా ఉంటుంది హెర్బ్ సిజర్స్. హ్యాండిల్ ఒకటే ఉంటుంది కానీ ఐదు బ్లేడ్స్ ఉంటాయి. దానివల్ల మొత్తం కట్టని ఒకేసారి కత్తిరించేసుకోవచ్చు. కాడలు కోసేసి, మిగిలిన ఆకుకూరని చేత్తో పట్టుకుని కాగితాన్ని కత్తిరించినట్టుగా కత్తిరించుకోవడమే. ఉల్లికాడలు, బీన్స్ లాంటివి కూడా తేలికగా ముక్కలవుతాయి దీనితో. వెల కూడా అందుబాటులోనే ఉంది... 290 రూపాయలు. ఈబే వెబ్‌సైట్‌లో అయితే 240 రూపాయలకే లభిస్తోంది!
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement