అత్యధిక బ్యాటరీ సామర్థ్యంతో పి 75 స్మార్ట్ ఫోన్ | Panasonic launches new P75 smartphone with massive battery | Sakshi
Sakshi News home page

అత్యధిక బ్యాటరీ సామర్థ్యంతో పి 75 స్మార్ట్ ఫోన్

Published Thu, Jun 16 2016 2:46 PM | Last Updated on Mon, Sep 4 2017 2:38 AM

అత్యధిక బ్యాటరీ సామర్థ్యంతో  పి 75 స్మార్ట్ ఫోన్

అత్యధిక బ్యాటరీ సామర్థ్యంతో పి 75 స్మార్ట్ ఫోన్

న్యూఢిల్లీ:  పానసోనిక్ తన కొత్త స్మార్ట్ ఫోన్ ను గురువారం భారత మార్కెట్ లో లాంచ్  చేసింది. అత్యధిక బ్యాటరీ పవర్ తో పాటు ఎఫర్డబుల్ ధరలో  అందుబాటులోకి  తీసుకొచ్చినట్టు కంపెనీ చెబుతోంది.  5000ఎంఏహెచ్ అత్యధిక  బ్యాటరీ సామర్థ్యంతో  రూ 5,990 ల సరసమైన ధరకే పి 75 ను లాంచ్  చేశామని బిజినెస్ హెడ్ పంకజ్ రాణా  వెల్లడించారు.  స్మార్ట్ ఫోన్ వినియోగం గణనీయంగా పెరుగుతున్న నేపథ్యంలో ఎక్కువ సామర్ధ్యం గల  మొబైల్ ను వినియోగదారుల సేవలకోసం అందుబాటులోకి తెచ్చామన్నారు.

పానసోనిక్  పి 75  ఫీచర్లు ఇలా ఉన్నాయి
5-అంగుళాల హెచ్ డీ డిస్ ప్లే  
 5.1 లాలిపాప్ ఆపరేటింగ్ సిస్టమ్

1.3 గిగా హెడ్జ్  క్వాడ్-కోర్ ప్రాసెసర్
1 జీబీ రాం, 1జీబీ రామ్
32జీబీ ఎక్స్ పాండబుల్ మొమరీ, 8 జీబి ఇంటర్నల్ మొమరీ
5మెగా పిక్సెల ఫ్రంట్ కెమెరా, విత్ నైన్ బ్యూటీ  మోడెస్
8 మెగా పిక్సెల్ రియర్ కెమెరా విత్ ఫ్లాష్

షాంపైన్ గోల్డ్, సాండ్ బ్లాక్  కలర్స్ లో ఈ స్మార్ట్ ఫోన్  అందుబాటులో ఉంది. మరోవైపు  రూ. 399 విలువగల స్క్రీన్ గార్డును ఉచితంగా అందిస్తోంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement