వారణాసి: స్విచ్‌లు, స్విచ్ బోర్డుల తయారీలో ఉన్న ప్యానాసోనిక్ ఎలక్ట్రిక్ వర్క్స్ ఇండియా సామర్థ్యం పెంపునకు ఆంధ్రప్రదేశ్‌లో మరో రూ.300 కోట్ల పెట్టుబడి పెట్టనుంది. ‘శ్రీ సిటీ ప్లాంటులో తొలి దశలో ఇప్పటికే రూ.300 కోట్లు వెచ్చించాం. 2026 నాటికి మరో రూ.300 కోట్లు ఖర్చు చేస్తాం. ఎగుమతుల కోసం ఈ కేంద్రాన్ని వినియోగించుకుంటాం.
తొలుత మధ్య ప్రాచ్య, ఆఫ్రికా దేశాలకు ఉత్పత్తులను సరఫరా చేస్తాం’ అని ప్యానాసోనిక్ ఎలక్ట్రిక్ వర్క్స్ ఇండియా పవర్ బిజినెస్ యూనిట్ డైరెక్టర్ రాజేశ్ నంద్వానీ వెల్లడించారు. శ్రీ సిటీ, డామన్, హరిద్వార్ ప్లాంట్ల వార్షిక ఉత్పత్తి సామర్థ్యం ప్రస్తుతం 62 కోట్ల యూనిట్లు ఉంది. 2025 నాటికి 70 కోట్లు, 2030 కల్లా 100 కోట్ల యూనిట్లకు చేరుతుందని ఆయన పేర్కొన్నారు. జపాన్‌కు చెందిన ఈ సంస్థకు భారత్‌లో 8,900 పైచిలుకు సిబ్బంది ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment