జపాన్‌కు చెందిన పానాసోనిక్ కంపెనీ 4680 లిథియం అయాన్ బ్యాటరీ సెల్‌లను భారీగా ఉత్పత్తి చేయడానికి సన్నద్ధమైంది. ఎలక్ట్రిక్ వాహనాల పరిధిని (రేంజ్) పెంచడానికి ఈ కంపెనీ వీటిని తయారు చేయడానికి పూనుకుంది. ఈ బ్యాటరీల వినియోగంతో ఖర్చు కూడా తగ్గుతుందని తెలుస్తుంది.
సాధారణంగా ఇప్పటి వరకు చాలా ఎలక్ట్రిక్ వాహనాల్లో ఉపయోగించిన 2170 సెల్స్ 21 మిమీ వ్యాసం, 70 మిమీ పొడవు (0.83 x 2.8 ఇంచెస్) ఉంటుంది. అయితే 4680 సెల్స్ మాత్రం 46 x 80 మిమీ (1.8 x 3.1 ఇంచెస్) వద్ద చాలా లావుగా, కొంచెం పొడవుగా ఉంటాయి. అంతే వీటి పనితీరు కూడా చాలా ఎక్కువగానే ఉంటుందని తెలుస్తోంది.
4680 సెల్స్ పరిమాణంలో లావుగా ఉండటం వల్ల.. చిన్న సెల్స్ కంటే కూడా ఐదు రెట్లు ఎక్కువ పవర్ డెలివరీ చేస్తాయి. వీటిని ఎలక్ట్రిక్ వాహనాల్లో వినియోగించినప్పుడు రేంజ్ కూడా ఎక్కువ ఉంటుంది. కాబట్టి వినియోగదారుడు పీక్ పవర్ ఆశించవచ్చు. ఛార్జింగ్ కూడా చాలా వేగంగా ఉంటుంది. టెస్లా 2020 బ్యాటరీ డేలో ప్రకటించిన సెల్ కూడా ఇదే పరిమాణంలో ఉంది.
ఇదీ చదవండి: పసిడి పరుగు.. భారీగా పెరిగిన బంగారం ధరలు
పానాసోనిక్ కంపెనీ 4680 బ్యాటరీల ఉత్పత్తిని త్వరలోనే ప్రారంభించే అవకాశం ఉంది. వచ్చే ఏడాది మార్చి నాటికి 400 మంది సిబ్బంది దీనికోసం పనిచేయనున్నట్లు సమాచారం. సంస్థ ఈ సెల్స్ ఉత్పత్తి చేసి టెస్లా, లూసిడ్, టయోటా, ఫోర్డ్ వంటి కంపెనీలతో ఒప్పందాలు కుదుర్చుకునే అవకాశం ఉంది.
Comments
Please login to add a commentAdd a comment