ఫ్లిప్కార్ట్ ఎలక్ట్రానిక్స్ సేల్ : భారీ డిస్కౌంట్లివే! | Flipkart Electronics Sale Best Deals: Discounts, Exchange Offers on iPhone 7, Google Pixel, and More | Sakshi
Sakshi News home page

ఫ్లిప్కార్ట్ ఎలక్ట్రానిక్స్ సేల్ : భారీ డిస్కౌంట్లివే!

Published Thu, Mar 23 2017 9:01 AM | Last Updated on Tue, Aug 14 2018 4:01 PM

ఫ్లిప్కార్ట్ ఎలక్ట్రానిక్స్ సేల్ : భారీ డిస్కౌంట్లివే! - Sakshi

ఫ్లిప్కార్ట్ ఎలక్ట్రానిక్స్ సేల్ : భారీ డిస్కౌంట్లివే!

ఎలక్ట్రానిక్ వస్తువులపై భారీ ఆఫర్లు, డిస్కౌంట్లు ప్రకటిస్తూ ఫ్లిప్ కార్ట్ ఎలక్ట్రానిక్ సేల్(ఎఫ్ఈఎస్)ను ప్రారంభించింది. నిన్నటి నుంచి మార్చి 24 వరకు మూడు రోజుల పాటు ఈ ఎక్స్క్లూజివ్ 3-డే ఈవెంట్ ను నిర్వహించనుంది. ఈ ఈవెంట్లో భాగంగా మొబైల్స్, టెలివిజన్స్, ల్యాప్టాప్స్, ఎయిర్కండీషనర్స్, ఎలక్ట్రానిక్ డివైజస్, ఎలక్ట్రానిక్ యాక్ససరీస్, స్మార్ట్ గ్యాడ్జెట్లపై ఆఫర్లను ఫ్లిప్ కార్ట్ ప్రకటించింది. రూ.5,999 కనీసమొత్తంలో  ఫ్లిప్ కార్ట్ పై కొనుగోలు చేసిన  ఎస్బీఐ క్రెడిట్ కార్డు హోల్డర్స్ కు తక్షణమే 10శాతం డిస్కౌంట్ను ఫ్లిప్ కార్ట్ కల్పిస్తోంది. ఈ తక్షణ డిస్కౌంట్ ఆఫర్ ఈవెంట్ ముగిసేవరకు ఉంటుంది. 
 
ఐఫోన్లపై డిస్కౌంట్లు, ఎక్స్చేంజ్ ఆఫర్లు...
ప్రస్తుతం నడుస్తున్న ఫ్లిప్కార్ట్ ఎలక్ట్రానిక్స్ సేల్ లో , ఐఫోన్ 7 అన్ని వేరియంట్ల కొనుగోలుపై 20 శాతం డిస్కౌంట్, ఎక్స్చేంజ్ ఆఫర్ కింద రూ.13,500 ధర తగ్గింపును ఈ ఈ-కామర్స్ దిగ్గజం ఆఫర్ చేస్తోంది. ఐఫోన్ 6ఎస్ 32జీబీ వేరియంట్ ధరపై కూడా రూ.7000 వరకు తగ్గింపును ఆఫర్ చేస్తున్న ఫ్లిప్ కార్ట్,  ఎక్స్చేంజ్ ఆఫర్ కూడా ఇదే మొత్తంలో ఉంటుందని తెలిపింది. ఐఫోన్ 6 16జీబీ వేరియంట్ ధరను రూ.10,500 తగ్గించేసింది. ఎక్స్చేంజ్ ఆఫర్ ద్వారా అదనపు డిస్కౌంట్ అందిస్తోంది.
 
గూగుల్ పిక్సెల్, మోటో జెడ్, శాంసంగ్ స్మార్ట్ఫోన్లపై ఫ్లిప్ కార్ట్ డీల్స్....
ఫ్లిప్కార్ట్ ఎలక్ట్రానిక్స్ సేల్ కింద ఎక్స్చేంజ్ ఆఫర్లో గూగుల్ పిక్సెల్ స్మార్ట్ ఫోన్ పై రూ.20వేల వరకు, గూగుల్ పిక్సెల్ ఎక్స్ఎల్ పై రూ.13,500 వరకు ధర తగ్గిపోయింది.
 
మోటో జెడ్, మోటో జెడ్ ప్లే లపై ఎక్స్చేంజ్ ఆఫర్ కింద రూ.13,500 డిస్కౌంట్ కల్పిస్తోంది. ఇలా శాంసంగ్ సీ9 ప్రొ, హానర్ 8, హ్యువాయ్ పీ9, సోని ఎక్స్పీరియా ఎక్స్ఏ ఆల్ట్రా వంటి స్మార్ట్ ఫోన్లపై ఫ్లిప్ కార్ట్ రేట్లను తగ్గించేసి, డిస్కౌంట్ ఆఫర్లను కల్పిస్తోంది.
 
ఇతర ఎలక్ట్రానిక్ వస్తువులు ఆపిల్ ఐప్యాడ్, లెనోవో యోగా3, లెనోవో ఫ్యాబ్ 2 ప్రొ పాబ్లెట్,  ఆపిల్ వాచ్, ఆసుస్ జెన్వాచ్3 వంటి వాటిపై కూడా డిస్కౌంట్లను అందుబాటులో ఉంచింది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement