సాక్షి, రంగారెడ్డి: జిల్లా దసరా సందర్భంగా మద్యం అమ్మకాలు రికార్డు స్థాయిలో జరిగాయి. మందుబాబులు యమ కిక్కు పొందారు. ఒకవైపు పండుగ.. మరోవైపు ఎన్నికల వాతావరణంతో మద్యాన్ని మంచినీళ్లలా తాగేశారు. సాధారణ రోజులతో పోల్చుకుంటే పండుగ ఒక్క రోజు వంద శాతం అదనంగా విక్రయాలు జరిగినట్టు ఎౖక్సైజ్ శాఖ అధికారులు వెల్లడించారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 412 వైన్సులు, 405 బార్లు మద్యం ప్రియులతో కిటకిటలాడాయి.
వీటి ద్వారా సాధారణ రోజుల్లో నిత్యం రూ.13 కోట్ల విలువైన మద్యం అమ్ముడవుతుంది. పండుగ సందర్భంగా ఏకంగా రూ.26 కోట్ల విలువైన విక్రయాలు జరిగినట్టు అంచనా. అంటే రూ.13 కోట్ల విలువైన మద్యాన్ని అదనంగా తాగేశారన్నమాట. నిత్యం 53వేల పైచిలుకు ఐఎంఎల్, బీర్ల కాటన్లు అమ్ముడవుతున్నాయి. దసరాను పురస్కరించుకుని లక్షా రెండు వేల కాటన్లు విక్రయించినట్టు ఆబ్కారీ శాఖ వర్గాలు తెలిపాయి.
Comments
Please login to add a commentAdd a comment