Discounts of Up to Rs 81,500 on Mahindra These Model Cars in February, 2022 - Sakshi
Sakshi News home page

మ‌హీంద్రా కార్ల‌పై బంప‌రాఫ‌ర్‌, ఏకంగా రూ.80వేల వ‌ర‌కు డిస్కౌంట్‌!

Published Mon, Feb 21 2022 6:53 PM | Last Updated on Mon, Feb 21 2022 8:49 PM

Discounts Of Up To Rs 81500 On Mahindra Cars In February 2022 - Sakshi

ప్ర‌ముఖ ఆటోమొబైల్ దిగ్గజం మ‌హీంద్రా అండ్ మహీంద్రా ఫిబ్ర‌వ‌రి నెల వ‌ర‌కు ప‌లు మోడ‌ళ్ల‌పై భారీ డిస్కౌంట్‌లు అందిస్తున్న‌ట్లు ప్ర‌క‌టించింది. ఎక్స్‌యూవీ300, స్కార్పియో, అల్ట్రాస్ జీ4, బొలెరో, మరాజో మోడ‌ళ్ల‌పై  డిస్కౌంట్‌ల‌లో సొంతం చేసుకోవ‌చ్చు.   

►బొలెరో నియోపై ఆఫర్‌లు లేనప్పటికీ, బొలెరో ఎస్‌యూవీపై రూ.3వేల‌ కార్పొరేట్ తగ్గింపు, రూ.15వేల‌ వరకు ఎక్ఛేంజ్‌ బోనస్, రూ.6వేల వ‌ర‌కు డిస్కౌంట్‌కే లభిస్తుంది. 

►మరాజో మూడు వేరియంట్‌లలో ఆఫ‌ర్‌లో కొనుగోలు చేయోచ్చు. ఇందులో ఎం2,ఎం4 ప్ల‌స్‌, ఎం6 ప్లస్ వేరియంట్ల‌పై  రూ.20,000 వరకు డిస్కౌంట్‌,రూ.15,000 వరకు ఎక్ఛేంజ్‌ బోనస్,రూ.5,200 కార్పొరేట్ ప్రయోజనాల్ని అందిస్తుంది.   

►మహీంద్రా ఎక్స్‌యూవీ 300 కాంపాక్ట్ ఎస్‌యూవీ ఈ నెలలో రూ.30,003వ‌ర‌కు డిస్కౌంట్‌, రూ.25,000 వరకు ఎక్ఛేంజ్‌ బోనస్, రూ.4,000 వరకు కార్పొరేట్ తగ్గింపుతో కొనుగోలు చేయోచ్చు. రూ.10వేల‌ వరకు ఇతర ఆఫర్‌ల‌కే అందిస్తుంది.  

►మ‌హీంద్రా ఆల్ట్రాస్ జీ4పై భారీ డిస్కౌంట్‌కే అందిస్తుంది. ఎక్ఛేంజ్ బోనస్ రూ.50,000, రూ.11,500 వరకు కార్పొరేట్ తగ్గింపు, రూ.20,000 వరకు ఇతర అదనపు ఆఫర్‌లు ఉన్నాయి.

►ఇది కాకుండా స్కార్పియో రూ.15,000 వరకు ఎక్ఛేంజ్‌ బోనస్, రూ.4,000 వరకు కార్పొరేట్ ప్రయోజనాలు, రూ.15,000 వరకు ఇతర తగ్గింపులతో అందిస్తుంది.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement