ఐ ఫోన్ 7ప్లస్, 7లపై డిస్కౌంట్ ఆఫర్
న్యూఢిల్లీ: అప్‌గ్రేడ్ చేసిన ఆపిల్ ఐ ఫోన్లపై ఫ్లిప్‌కార్ట్ డిస్కౌంట్ ఆఫర్ చేస్తోంది. 5శాతం తగ్గింపుతోపాటు, రూ. 25వేల దాకా ఎక్సేంజ్ ఆఫర్ అందిస్తోంది. ఈ డిస్కౌంట్ ఆఫర్ లో ఆపిల్ ఐఫోన్ 7, 7 ప్లస్ స్టార్ట్‌ఫోన్లపై తగ్గింపు ధరలో కొనుగోలుకు అందుబాటులో ఉన్నాయి. అయితే పాత ఐఫోన్ హ్యాండ్సెట్లు ఎక్సేంజ్ ద్వారా మాత్రమే ఈ ఆఫర్ అందుబాటులో ఉండనుంది. ముఖ్యంగా ఐఫోన్ 4, 4, 5, -5, 5 సి, 6, 6 ప్లస్, 6ఎస్ ప్లస్ , ఎస్‌ఈ ఫోన్లకు ఎక్సేంజ్ చేసుకునే అవకాశం ఉంది.
ఇందులో భాగంగా ఐఫోన్ 7 32జీబీ 5శాతం డిస్కౌంట్ తో రూ 57,000కు అందుబాటులో ఉంది. దీని అసలు ధర. రూ 60,000. దీనికి అదనంగా ఇతర ఐఫోన్ మోడల్స్‌తో మార్పిడి చేసుకున్న వినియోగదారులు రూ.21.800 తగ్గింపు ఆఫర్ తో రూ. 35,200 ల వరకు ఈ హ్యాండ్ సెట్ ధర తగ్గనుంది.
అదే విధంగా, ఐఫోన్ 7 (128జీబీ) మరియు ఐఫోన్ 7 (256జీబీ ) వరుసగా రూ.43,200,రూ. 51,200 ఫ్లాట్ డిస్కౌంట్ . దీనికి ఎక్సేంజ్ ఆఫర్ అదనం. కాగా వీటి అసలు ధరలు వరుసగా రూ 70,000 , రూ .80,000లుగా ఉన్నాయి.
ఐఫోన్ 7 ప్లస్ , 32జీబీ వెర్షన్ 5 శాతం డిస్కౌంట్ తర్వాత రూ 44, 800కు కొనుగోలు చేయవచ్చు. ఈ స్మార్ట్ ఫోన్‌అసలు ధరరూ. 72,000. అదేవిధంగా, 128జీబీ వెర్షన్ రూ. 52,800 (అసలు ధర రూ 82,000) కొనుగోలు చేయవచ్చు.256జీబీ రూ.60,800గా ఉండనుంది. అసలు ధర రూ. 92,000గాఉంది. (ఈ ధరలు 5 శాతం డిస్కౌంట్ + ఎక్సేంజ్ ఆఫర్ రూ.26,600 కలిపి మొత్తం రూ.31,200 తగ్గింపు తర్వాత)
దీంతో పాటు యాక్సిస్ బ్యాంక్, హెచ్డిఎఫ్సి బ్యాంక్, ఎస్బిఐ, కోటక్ బ్యాంక్, సిటీ బ్యాంక్, స్టాండర్డ్ చార్టర్డ్ బ్యాంక్, ఐసిఐసిఐ బ్యాంకు లాంటి పలు బ్యాంకుల ఈఎంఐ ఆప‍్షన్ కూడా ఉంది. అలాగే, ఐఫోన్ 7 ప్లస్ 128జీబీ గోల్డ్ కలర్ వేరియంట్, 32జీబీ, ఐఫోన్ 7 128జీబీ ఈ అప్‌గ్రేడ్‌ప్రోగ్రాం నుంచి మినహాయించిన సంగతిని గమనించగలరు.
మరోవైపు తను కొనుగోలు చేసి ఐఫోన్ కు వెనుక చిన్న గీతలు పడడంతో ఎక్సేంజ్‌ను నిరాకరించారనీ, టైం వేస్ట్ అంటూ కోలకత్తాకు చెందిన మనోహర్ ఫ్లిప్‌కార్ట్‌పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సో.. కొనుగోలుదారులూ..బీ కేర్‌ఫుల్..