దసరా ఫెస్టివల్ సీజన్ సందర్భంగా కొనుగోలు దారులకు ప్రముఖ ఈకామర్స్ దిగ్గజం అమెజాన్ బంపరాఫర్ ప్రకటించింది.సెప్టెంబర్ 23 నుంచి గ్రేట్ ఇండియా ఫెస్టివల్ సేల్ ను ప్రారంభిస్తున్నట్లు తెలిపింది. ఈ సందర్భంగా కొనుగోలు దారులు ఎస్‌బీఐ కార్డ్ ద్వారా కొనుగోలు చేస్తే 10 శాతం ఇన్‌స్టంట్ డిస్కౌంట్,10 శాతం క్యాష్ బ్యాక్ పొందవచ్చు.
శాంసంగ్ గెలాక్సీ ఎం, ఐక్యూ ఫోన్‌లపై ప్రత్యేక ఆఫర్‌లు పొందవచ్చని అమెజాన్ ప్రతినిధులు వెల్లడించారు. ప్రైమ్ మెంబర్లు ఒకరోజు ముందే అంటే సెప్టెంబర్ 22నే ఈ సేల్‌లో పాల్గొనవచ్చు.ఈ సేల్‌లో వన్ ప్లస్, శాంసంగ్, షావోమీ, ఐక్యూ ఫోన్‌ల కొనుగోలు దారులకు 40శాతం వరకు డిస్కౌంట్ పొందవచ్చు. కొత్తగా మార్కెట్‌లో విడుదలైన రెడ్‌మీ 11 ప్రైమ్ 5జీ, ఐక్యూ జెడ్ 6 లైట్ 5జీ,ఐఫోన్ 14 సిరీస్ తో పాటు ఇతర స్మార్ట్ ఫోన్‌లు అందుబాటులో ఉండనున్నాయి.
ఇక ఇదే సేల్‌లో ల్యాప్‌ట్యాప్స్,స్మార్ట్ వాచెస్,హెడ్ ఫోన్స్‌తో పాటు ఇతర గాడ్జెట్స్‌పై 75శాతం డిస్కౌంట్ సొంతం చేసుకోవచ్చు. అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ 2022 సందర్భంగా ప్రతి 6 గంటలకొకసారి విడుదలయ్యే కొత్త ఆఫర్‌లతో కస్టమర్‌లు కొత్త కొత్త డీల్స్ అందిస్తున్నట్లు అమెజాన్ వెల్లడించింది. వన్‌ప్లస్ 9 ప్రోపై రూ.15వేల వరకు డిస్కౌంట్, స్మార్ట్‌ఫోన్‌లు,ఆండ్రాయిడ్ టీవీలలో అందుబాటులో ఉన్న ఎక్స్‌ఛేంజ్ ఆఫర్‌లను అందిస్తున్నట్లు.. అదనంగా, క్రాస్‌బీట్స్ టార్, బోట్ ఎయిర్‌డోప్స్ 441 ప్రో వంటి టీడబ్ల్యూఎస్ ఇయర్ ఫోన్‌లు తగ్గింపు ధరలతో అందుబాటులోకి ఉండనున్నాయని అమెజాన్ పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment