విశాఖపట్నం: అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్‌లో (అమెజాన్ జీఐఎఫ్ 2022) విశాఖ వాసులు అదరగొట్టారు. హైఎండ్ గేమింగ్, బిజినెస్ ల్యాప్‌టాప్‌లు, వేరబుల్స్, కెమెరాలు, వైర్‌లెస్ ఇయర్ ఫోన్లు, వైర్, వైర్‌లెస్ స్పీకర్లు, బ్లూటూత్ స్పీకర్లు, సౌండ్‌బార్లను అధికంగా కొనుగోలు చేస్తున్నారు.
రూ.10–20వేల శ్రేణిలోని స్మార్ట్‌ఫోన్ల కొనుగోలుకు ఆసక్తి చూపిస్తున్నారు. డిమాండ్ పరంగా మంచి పనితీరు చూపించిన పట్టణాల్లో విశాఖపట్నం కూడా ఉన్నట్టు అమెజాన్ ఇండియా ప్రకటించింది. సెప్టెంబర్ 23 నుంచి జీఐఎఫ్‌ను అమెజాన్ నిర్వహిస్తోంది. స్మార్ట్‌ఫోన్లు, టీవీలు, కంప్యూటర్లు, కన్జూమర్ ఎలక్ట్రానిక్ ఉత్పత్తులు, గృహోపకరణాలపై ఆకర్షణీయమైన డీల్స్, ఆఫర్లను అందిస్తోంది.
అమెజాన్ ఇండియా కన్జూమర్ ఎలక్ట్రానిక్స్, పర్సనల్ కంప్యూటింగ్ డైరెక్టర్ అక్షయ్ అహుజా మాట్లాడుతూ.. ‘‘ఆంధ్రప్రదేశ్‌లోని కస్టమర్ల నుంచి మంచి స్పందన అందుకుంటున్నాం. ఈ అద్భుత స్పందనకు గాను వారికి మా ధన్యవాదాలు. ఆంధ్రప్రదేశ్ రీజియన్ నుంచి కస్టమర్లు టెక్నాలజీ ఉత్పత్తులు అయిన ల్యాప్‌టాప్‌లు, కెమెరాలు, ఆడియో ఎక్విప్‌మెంట్‌లు కొనుగోలు చేస్తున్నారు. నెలరోజుల పాటు జరిగే గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్‌లో ఇదే డిమాండ్ కొనుసాగుతుందని భావిస్తున్నాం’’అని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment