విస్తార... హోలీ ప్రత్యేక ఆఫర్ | Vistara announces air fares starting at Rs 999 | Sakshi
Sakshi News home page

విస్తార... హోలీ ప్రత్యేక ఆఫర్

Published Wed, Mar 23 2016 8:35 AM | Last Updated on Tue, Aug 14 2018 4:01 PM

విస్తార... హోలీ ప్రత్యేక ఆఫర్ - Sakshi

విస్తార... హోలీ ప్రత్యేక ఆఫర్

న్యూఢిల్లీ: దేశీయంగా విమాన సర్వీసులు నిర్వహించే విస్తార విమానయాన సంస్థ హోలీ సందర్భంగా ప్రత్యేక డిస్కౌంట్ చార్జీలను అందిస్తోంది. ఈ హోలీ ప్రత్యేక చార్జీలు రూ.999 నుంచి ప్రారంభమవుతాయని పేర్కొంది. అయితే, దీనికి పన్నులు, ఇతర చార్జీలు అదనమని సంస్థ వెల్లడించింది.

ఈ ఆఫర్‌లో భాగంగా ఒక వైపు విమాన చార్జీలు ఎకానమీ క్లాస్‌కు రూ.999 నుంచి, ప్రీమియమ్ ఎకానమీ క్లాస్‌కు రూ.2,299 నుంచి మొదలవుతాయని వివరించింది. ఈ ప్రత్యేక చార్జీలకు బుకింగ్స్ మంగళవారం నుంచే ప్రారంభమయ్యాయని, ఈ నెల 28 అర్థరాత్రి వరకూ ఉంటుందని, సీట్లు పరిమితమని తెలిపింది. తామందించే అన్ని దేశీయ రూట్లకు ఈ చార్జీలు వర్తిస్తాయని, కొత్త రూట్లు-జమ్ము, శ్రీనగర్, కోచిలకు కూడా ఈ చార్జీలు వర్తిస్తాయని విస్తార పేర్కొంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement