
భారతదేశపు అతిపెద్ద ఆధ్యాత్మిక ఉత్సవం ఈ మహా కుంభమేళా. ఇందులో పాల్గొనేందుకు లక్షలాదిగా భక్తులు తరలివస్తారు. ఉత్తర్‌ప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో 144 ఏళ్లకు ఒక్కసారి జరిగే ఈ వేడుకలో ఎందరో ప్రముఖులు పాల్గొని పుణ్యస్నానాలు ఆచరించి తరించారు. తాజాగా ఇండిగో సీఈవో డచ్ ఎగ్జిక్యూటివ్ కూడా ఈ ఆధ్యాత్మిక వేడుకలో పాల్గొని పవిత్ర స్నానాలు ఆచరించారు. ఆయన ఈ ఉత్సవాన్ని తిలకించి తన అధ్యాత్మిక అనుభవాల తోపాటు అందుకు సంబధించిన ఫోటోలను షేర్ చేసుకున్నారు.
ఇండిగోIndiGo) సీఈవో పీటర్ ఎల్బర్స్(Pieter Elbers ) లింక్డ్‌ఇన్(LinkedIn)లో ఆ సందర్భం తాలుకా ఫోటోల తోపాటు తన అనుభవాన్ని కూడా షేర్ చేసుకున్నారు. ఈ డచ్ ఎగ్జిక్యూటివ్ తాను ఉదయం 5 గంటలకు త్రివేణి సంగమంలో స్నానం చేసి.. గందరగోళం నడుమ ఆధ్యాత్మిక శాంతిని పొందానన్నారు. ఈ ఏడాదిలో ఈ మహా కుంభమేళా అద్వితీయమైన ఘట్టంగా అభివర్ణించారు. ఈ వేడుకలో పాల్గొనేందుకు కేవలం 45 రోజుల్లోనే 450 మిలియన్ల మంది సందర్శకులను తరలివస్తారనేది అంచనా.
144 ఏళ్లకు ఒకసారి జరిగే ఈ వేడుకలో భూమిపై ఉండే యావత్తు మానవాళిలో అత్యధిక మంది ఈ అధ్యాత్మిక వేడుకలో చేరి గుమిగూడే సమయం ఇది. ఈ స్థాయిలో అసంఖ్యాక ప్రజలను చూడటం అనేది దాదాపు అసాధ్యం కూడా. ఇది యూరప్ జనాభాకు సమానం. పైగాయూఎస్ జనసాంద్రతకు మించి అని లింక్డ్ ఇన్ పోస్ట్‌లో రాసుకొచ్చారు ఎల్బర్స్.
తాను గత వారంలోని గణతంత్ర దినోత్సవం నాడు భారతదేశ సంస్కృతి, ఆధ్యాత్మికత వారసత్వ సంగమాన్ని జరుపుకునే మహాకుంభమేళాలో పాల్గొన్నాను అని తెలిపారు. అంతేగాదు ఈ ప్రదేశానికి ఉన్న శక్తిని ఏ వాక్యం, ఏ పదం లేదా చిత్రాలు వర్ణించేందుకు సరిపోవు అని అన్నారు. తాను ఈ త్రివేణి సంగమంలో ఉదయ ఐదు గంటల సమయంలో పుణ్య స్నానాలు ఆచరించానని చెప్పారు.
మంత్రాలు, ప్రార్థన, భక్తి, మానవత్వం ఐక్యతల నడుమ చుట్టుముట్టిన ఈ గందరగోళం మధ్య ఓ గొప్ప ఆధ్యాత్మిక శాంతిని అనుభవించే క్షణం దొరికిందని ఆనందంగా చెప్పారు. జీవితంలో ఒక్కసారి మాత్రమే లభించే ఈ దివ్యమైన గొప్ప అనుభవంలో తాను భాగమైనందుకు సంతోషంగా ఉందన్నారు ఇండిగో సీఈవో.
అంతేగాదు ఈ కార్యక్రమం కోసం అధికంగా వస్తున్న యాత్రికుల రద్దీని చక్కగా నిర్వహిస్తున్న తమ ఇండిగో బృందానికి కూడా కృతజ్ఞతలు తెలిపారు. కాగా, ఈ మహా కుంభమేళా జనవరి 13 నుంచి ఫిబ్రవరి 26 వరకు ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతుంది. ఈ మొదటి పదిరోజుల్లో పది కోట్లకు పైగా భక్తులు ఇప్పటికే సంగంలో స్నానాలు ఆచరించారు. అంటే ఈ 45 రోజుల పండుగ ముగిసే సమయానికి ఆ సంఖ్య కాస్తా 40 కోట్లకు చేరుతుందనేది అంచనా.
(చదవండి: 'ది బిలియనీర్స్ డాటర్' ఆ ఒక్క వీడియోతో ఓవర్ నైట్ స్టార్..!)
Comments
Please login to add a commentAdd a comment