విస్తారా 'ఫ్రీడమ్ టు ఫ్లై': భారీ డిస్కౌంట్స్‌ | Vistara offers two-day discount sale 'Freedom to Fly' offer | Sakshi
Sakshi News home page

విస్తారా 'ఫ్రీడమ్ టు ఫ్లై': భారీ డిస్కౌంట్స్‌

Published Mon, Aug 7 2017 4:49 PM | Last Updated on Tue, Aug 14 2018 4:01 PM

విస్తారా  'ఫ్రీడమ్ టు ఫ్లై': భారీ డిస్కౌంట్స్‌ - Sakshi

విస్తారా 'ఫ్రీడమ్ టు ఫ్లై': భారీ డిస్కౌంట్స్‌

ముంబై:  ప్రముఖ ఎయిర్‌లెన్స్‌ విస్తారా విమాన టికెట్లలో  భారీ డిస్కౌంట్‌ ధరలను ప్రకటించింది.  'ఫ్రీడం సేల్‌'   పేరుతో   రెండు రోజుల అమ్మకాలను సోమవారం  వెల్లడించింది.   ఎంపిక చేసిన  మార్గాలలో  వన్‌ వేలో ఈ  విమాన టికెట్లను అందుబాటులోకి తెస్తున్నట్టు  తెలిపింది. అతి తక్కువ ధరను రూ. 799లుగా నిర్ణయించింది.   వీటిల్లో అదనపు చార్జీలు, హిడ్డెన్‌ ఫీజులు  వుండవని స్పష్టం చేసింది.
 
ఈ  ఫ్రీడమ్ టు ఫ్లై  (వన్-వే, అన్నీ కలిపి) ఆఫర్‌  కేవలం 48 గంటలు మాత్రమే   కొనసాగనుంది.  ఆగష్టు 8-9 తేదీల్లో ఈ బుకింగ్‌ సదుపాయం అందుబాటులో ఉంటుంది.   అలాగే ఆగస్టు 23, 2017నుంచి  ఏప్రిల్ 19, 2018 మధ్యకాలంలో ప్రయాణించేందుకు ఈ ఆఫర్ వర్తిస్తుంది.  ఎకానమీ క్లాస్‌ టికెట్‌ను  కేవలం రూ. 799లకు,  ప్రీమియం ఎకానమీ టికెట్లను రూ. 2,099 ధరల్లో అందిస్తోంది.   'ఫ్రీడమ్ టు ఫ్లై' సేల్‌ ద్వారా గోవా, పోర్ట్ బ్లెయిర్, లెహ్ (లడఖ్), జమ్మూ, శ్రీనగర్, కొచ్చి, గువహతి, అమృత్సర్, భువనేశ్వర్, అలాగే ఢిల్లీ, కోల్‌కతా, ముంబై, హైదరాబాద్, బెంగళూరు వంటి   తమ ఫ్యావరేట్‌ డిస్టినేషన్స్‌కు  చేరుకోవచ్చని  విస్తారా ఒక ప్రకటనలో తెలిపింది.  పరిమిత సీట్లు అందుబాటులోఉంటాయని, ఫస్ట్‌ కమ్‌ ఫస్ట్‌  సెర్వ్‌ కింద  టికెట్లను కేటాయిస్తామని స్పష్టం చేసింది.

 ముఖ్యంగా  శ్రీనగర్-జమ్మూ మార్గంలో ఈ విక్రయానికి తక్కువ ఛార్జీలు అందుబాటులో ఉన్నాయి. ఇతర ఛార్జీలు కూడా రాయితీ ఛార్జీల వద్ద అందుబాటులో ఉన్నాయి. ఢిల్లీ-అమృత్‌సర్‌ మధ్య టికెట్‌ రూ. 1,199, ఢిల్లీ-చండీఘడ్‌కు  ధర రూ. 1,299 గాఉండనుంది. ఢిల్లీ-శ్రీనగర్, ఢిల్లీ-అహ్మదాబాద్ రూ. 1,499; ఢిల్లీ-ముంబై, ఢిల్లీ-పూణేలకు రూ. 2,099; ఢిల్లీ-కోల్కతా రూ. 2,199; ఢిల్లీ-గోవా రూ. 2,799 ఢిల్లీ- హైదరాబాద్‌ మధ్య ఎకనాకమీ రూ. 2,399, ప్రీమియం ఎకానమీ టికెట్‌ రూ.4,199లకే  అందిస్తోంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement