Two-Day
-
విస్తారా 'ఫ్రీడమ్ టు ఫ్లై': భారీ డిస్కౌంట్స్
ముంబై: ప్రముఖ ఎయిర్‌లెన్స్ విస్తారా విమాన టికెట్లలో భారీ డిస్కౌంట్ ధరలను ప్రకటించింది. 'ఫ్రీడం సేల్' పేరుతో రెండు రోజుల అమ్మకాలను సోమవారం వెల్లడించింది. ఎంపిక చేసిన మార్గాలలో వన్ వేలో ఈ విమాన టికెట్లను అందుబాటులోకి తెస్తున్నట్టు తెలిపింది. అతి తక్కువ ధరను రూ. 799లుగా నిర్ణయించింది. వీటిల్లో అదనపు చార్జీలు, హిడ్డెన్ ఫీజులు వుండవని స్పష్టం చేసింది. ఈ ఫ్రీడమ్ టు ఫ్లై (వన్-వే, అన్నీ కలిపి) ఆఫర్ కేవలం 48 గంటలు మాత్రమే కొనసాగనుంది. ఆగష్టు 8-9 తేదీల్లో ఈ బుకింగ్ సదుపాయం అందుబాటులో ఉంటుంది. అలాగే ఆగస్టు 23, 2017నుంచి ఏప్రిల్ 19, 2018 మధ్యకాలంలో ప్రయాణించేందుకు ఈ ఆఫర్ వర్తిస్తుంది. ఎకానమీ క్లాస్ టికెట్‌ను కేవలం రూ. 799లకు, ప్రీమియం ఎకానమీ టికెట్లను రూ. 2,099 ధరల్లో అందిస్తోంది. 'ఫ్రీడమ్ టు ఫ్లై' సేల్ ద్వారా గోవా, పోర్ట్ బ్లెయిర్, లెహ్ (లడఖ్), జమ్మూ, శ్రీనగర్, కొచ్చి, గువహతి, అమృత్సర్, భువనేశ్వర్, అలాగే ఢిల్లీ, కోల్‌కతా, ముంబై, హైదరాబాద్, బెంగళూరు వంటి తమ ఫ్యావరేట్ డిస్టినేషన్స్కు చేరుకోవచ్చని విస్తారా ఒక ప్రకటనలో తెలిపింది. పరిమిత సీట్లు అందుబాటులోఉంటాయని, ఫస్ట్ కమ్ ఫస్ట్ సెర్వ్ కింద టికెట్లను కేటాయిస్తామని స్పష్టం చేసింది. ముఖ్యంగా శ్రీనగర్-జమ్మూ మార్గంలో ఈ విక్రయానికి తక్కువ ఛార్జీలు అందుబాటులో ఉన్నాయి. ఇతర ఛార్జీలు కూడా రాయితీ ఛార్జీల వద్ద అందుబాటులో ఉన్నాయి. ఢిల్లీ-అమృత్సర్ మధ్య టికెట్ రూ. 1,199, ఢిల్లీ-చండీఘడ్‌కు ధర రూ. 1,299 గాఉండనుంది. ఢిల్లీ-శ్రీనగర్, ఢిల్లీ-అహ్మదాబాద్ రూ. 1,499; ఢిల్లీ-ముంబై, ఢిల్లీ-పూణేలకు రూ. 2,099; ఢిల్లీ-కోల్‌కతా రూ. 2,199; ఢిల్లీ-గోవా రూ. 2,799 ఢిల్లీ- హైదరాబాద్ మధ్య ఎకనాకమీ రూ. 2,399, ప్రీమియం ఎకానమీ టికెట్ రూ.4,199లకే అందిస్తోంది. -
స్నాప్‌డీల్ న్యూ ఇయర్ బంపర్ ఆఫర్లు
న్యూఢిల్లీ: దేశీయ కామర్స్ దిగ్గజం స్నాప్ డీల్ బంపర్ ఆఫర్స్ అనౌన్స్ చేసింది. నూతన సంవత్సరంలో వినియోగాదారులకు భారీ డిస్కౌంట్ ను ఆఫర్ చేస్తోంది. 'వెల్ కం2017' పేరుతో రెండు రోజుల అమ్మకాలకు తెర లేపింది. జనవరి 8 ,9 తేదీల్లో నిర్వహించే టు-డే సేల్ లో దుస్తులు, స్మార్ట్ ఫోన్లు, గృహోపకరణాలు ఇతర ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల పై 70శాతం వరకు రాయితీ అందిస్తోంది. స్మార్ట్ ఫోన్లపై డిస్కౌంట్ ధరలు రెడ్ మి నోట్ రూ.11,999 శామ్సంగ్ జె2 ప్రో (16జీబీ). రూ.9,490 ఐఫోన్ 5ఎస్ (16జీబీ రూ. 17,499 ఐఫోన్ 7 (32Gజీబీ ) రూ. రూ 52,999 ఐఫోన్ 6ఎస్ (32జీబీ). రూ. 43, 999 ధరల్లో అందుబాటులో ఉండనున్నాయి. అలాగే ఎస్ బీఐ క్రెడిట్ కార్డు ద్వారా చెల్లింపులు చేసిన వినియోగదారులకు అదనపు డిస్కౌంట్ కూడా అందిస్తోంది. సుమారు 15శాతం రాయితీ కల్పిస్తోంది. దీనితోపాటు ప్రధాన క్రెడిట్ కార్డులతో కొనుగోలుపై ఫీజులేని ఈఎంఐ ఆప్షన్ ను ఆఫర్ చేస్తోంది. -
పాజిటివ్ నోట్ తో ముగిసిన మార్కెట్లు
ముంబై: దేశీయ స్టాక్ మార్కెట్లు నష్టాలనుంచి కోలుకుని స్వల్ప లాభాలతో ముగిసాయి. దాదాపు 170 పాయింట్లకు పైగా క్షీణించిన మార్కెట్లు చివరలో కోలుకుని పాజిటివ్ నోట్ తో ముగిసాయి. సెన్సెక్స్ 79 పాయింట్లు బలపడి 27,916 వద్ద నిఫ్టీ ఫ్లాట్ గా 8615 వద్ద ముగిసింది. అక్టోబర్ డెరివేటివ్స్ ముగింపు, ఎఫ్ఐఐల భారీ అమ్మకాల నేపథ్యంలో దేశీ స్టాక్ మార్కెట్లు ఆద్యంతం ఒడిదుడుకుల మధ్య ట్రేడ్ అయినా, మారుతి, ఓ ఎన్జీసీ సెప్టెంబర్ ఫలితాలతో మిడ్ సెషన్లో తరవాత నష్టాలను తగ్గించుకుని లాభాల్లోకి మారింది. ముఖ్యంగా ఫార్మా, ఎఫ్ఎంసీజీ సెక్టార్ లాభాలు మార్కెట్లకు మద్దతునిచ్చాయి కాగా ఆటో, పీఎస్‌యూ బ్యాంక్, ఐటీ, మెటల్స్, రియల్టీ రంగాలు నష్టపోయాయి. టాటా కంపెనీల షేర్ల నష్టాలు మూడో రోజు కూడా కొనసాగాయి. ఇన్ఫ్రాటెల్, ఏషియన్ పెయింట్స్, హీరో మోటో, యస్‌బ్యాంక్, జీ, విప్రో, అంబుజా, గ్రాసిమ్, బజాజ్ ఆటో నష్టపోగా, హెచ్డీఎఫ్సీ, ఐటీసీ, డాక్టర్ రెడ్డీస్, ఐసీఐసీఐ, భారతీ టాప్ లూజర్ గా నిలువగా, సిప్లా, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, సన్ ఫార్మా లాభపడ్డాయి. మరోవైపు మిడ్ క్యాప్ సూచీ స్మాల్ క్యాప్ సూచీలలో బలహీనత కొనసాగింది. అటు రూపాయ 0.03 పైసల బలహీనంతో 66.86 వద్ద, పసిడి పది గ్రా.రూ.97 లాభంతో రూ.29,931 వద్ద ఉంది.