దేశీయ స్టాక్ మార్కెట్లు నష్టాలనుంచి కోలుకుని స్వల్ప లాభాలతో ముగిసాయి.
ముంబై: దేశీయ స్టాక్ మార్కెట్లు నష్టాలనుంచి కోలుకుని స్వల్ప లాభాలతో ముగిసాయి. దాదాపు 170 పాయింట్లకు పైగా క్షీణించిన మార్కెట్లు చివరలో కోలుకుని పాజిటివ్ నోట్ తో ముగిసాయి. సెన్సెక్స్ 79 పాయింట్లు బలపడి 27,916 వద్ద నిఫ్టీ ఫ్లాట్ గా 8615 వద్ద ముగిసింది. అక్టోబర్ డెరివేటివ్స్ ముగింపు, ఎఫ్‌ఐఐల భారీ అమ్మకాల నేపథ్యంలో దేశీ స్టాక్ మార్కెట్లు ఆద్యంతం ఒడిదుడుకుల మధ్య ట్రేడ్ అయినా, మారుతి, ఓ ఎన్జీసీ సెప్టెంబర్ ఫలితాలతో మిడ్ సెషన్‌లో తరవాత నష్టాలను తగ్గించుకుని లాభాల్లోకి మారింది. ముఖ్యంగా ఫార్మా, ఎఫ్‌ఎంసీజీ సెక్టార్ లాభాలు మార్కెట్లకు మద్దతునిచ్చాయి కాగా ఆటో, పీఎస్‌యూ బ్యాంక్, ఐటీ, మెటల్స్, రియల్టీ రంగాలు నష్టపోయాయి. టాటా కంపెనీల షేర్ల నష్టాలు మూడో రోజు కూడా కొనసాగాయి. ఇన్‌ఫ్రాటెల్, ఏషియన్ పెయింట్స్, హీరో మోటో, యస్‌బ్యాంక్, జీ, విప్రో, అంబుజా, గ్రాసిమ్, బజాజ్ ఆటో నష్టపోగా, హెచ్‌డీఎఫ్‌సీ, ఐటీసీ, డాక్టర్ రెడ్డీస్, ఐసీఐసీఐ, భారతీ టాప్ లూజర్ గా నిలువగా, సిప్లా, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, సన్ ఫార్మా లాభపడ్డాయి. మరోవైపు మిడ్ క్యాప్ సూచీ స్మాల్ క్యాప్ సూచీలలో బలహీనత కొనసాగింది.
అటు రూపాయ 0.03 పైసల బలహీనంతో 66.86 వద్ద, పసిడి పది గ్రా.రూ.97 లాభంతో రూ.29,931 వద్ద ఉంది.