స్నాప్డీల్ న్యూ ఇయర్ బంపర్ ఆఫర్లు
న్యూఢిల్లీ: దేశీయ కామర్స్ దిగ్గజం స్నాప్ డీల్ బంపర్ ఆఫర్స్ అనౌన్స్ చేసింది. నూతన సంవత్సరంలో వినియోగాదారులకు భారీ డిస్కౌంట్ ను ఆఫర్ చేస్తోంది. 'వెల్ కం2017' పేరుతో రెండు రోజుల అమ్మకాలకు తెర లేపింది. జనవరి 8 ,9 తేదీల్లో నిర్వహించే టు-డే సేల్ లో దుస్తులు, స్మార్ట్ ఫోన్లు, గృహోపకరణాలు ఇతర ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల పై 70శాతం వరకు రాయితీ అందిస్తోంది.
స్మార్ట్ ఫోన్లపై డిస్కౌంట్ ధరలు
- రెడ్ మి నోట్ రూ.11,999
- శామ్సంగ్ జె2 ప్రో (16జీబీ). రూ.9,490
- ఐఫోన్ 5ఎస్ (16జీబీ రూ. 17,499
- ఐఫోన్ 7 (32Gజీబీ ) రూ. రూ 52,999
- ఐఫోన్ 6ఎస్ (32జీబీ). రూ. 43, 999 ధరల్లో అందుబాటులో ఉండనున్నాయి.
అలాగే ఎస్ బీఐ క్రెడిట్ కార్డు ద్వారా చెల్లింపులు చేసిన వినియోగదారులకు అదనపు డిస్కౌంట్ కూడా అందిస్తోంది. సుమారు 15శాతం రాయితీ కల్పిస్తోంది. దీనితోపాటు ప్రధాన క్రెడిట్ కార్డులతో కొనుగోలుపై ఫీజులేని ఈఎంఐ ఆప్షన్ ను ఆఫర్ చేస్తోంది.