ఎయిర్ ఇండియాలో విలీనమైనప్పటికీ విస్తారా ఎయిర్‌వేస్‌కు చెందిన ఏ320 విమానాల సేవలు కొనసాగనున్నాయి. వీటిని దేశంలోని ఐదు కీలకమైన మెట్రో-టు-మెట్రో రూట్లలో నడపనున్నట్లు ఎయిర్ ఇండియా తెలిపింది. హైదరాబాద్ నుంచి ఢిల్లీకి, ముంబైకి ఈ విమానాలు నడుస్తాయి.
ఢిల్లీ-ముంబై, ఢిల్లీ-బెంగళూరు, ఢిల్లీ-హైదరాబాద్, ముంబై-బెంగళూరు, ముంబై-హైదరాబాద్ మార్గాల్లో ఏ320 విమానాల సేవలు ఉంటాయని, బిజినెస్, ప్రీమియం ఎకానమీ, ఎకానమీ క్లాస్‌లలో ప్రయాణం చేయొచ్చని ఎయిర్ ఇండియా ఒక ప్రకటనలో వివరించింది. ఈ విమాన సర్వీసులు ఏ12 కోడ్‌తో ప్రారంభమవుతాయని, టికెట్ల బుకింగ్ సమయంలో గమనించాలని సూచించింది.
టాటా గ్రూప్ యాజమాన్యంలోని ఎయిర్ ఇండియాలో విస్తారా విలీన ప్రక్రియ ఈనెల ప్రారంభంలోనే పూర్తయింది. ప్రస్తుతం ఎయిర్ ఇండియాలో 208 విమానాలు ఉన్నాయి. వీటిలో దాదాపు 67 వైడ్ బాడీ విమానాలు ఉన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment