
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: విమానయాన సంస్థ ఎయిర్ ఇండియా అదనంగా 24 సర్వీసులను దేశీయంగా జోడిస్తోంది. ముంబై నుంచి హైదరాబాద్, చెన్నై, అలాగే ఢిల్లీ నుంచి ముంబై, బెంగళూరు, అహ్మదాబాద్ మార్గాల్లో ఇవి జతకూడనున్నాయని కంపెనీ గురువారం ప్రకటించింది.
ఆగస్ట్ 20 నుంచి కొత్త సర్వీసులు తోడవనున్నాయి. విమానాల కోసం భాగస్వాములతో ఆరు నెలలుగా చర్చిస్తున్నామని ఎయిర్ ఇండియా ఎండీ, సీఈవో క్యాంబో విల్సన్ తెలిపారు. ఇవి ప్రస్తుతం ఫలిస్తున్నాయని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment