ప్రముఖ విమానయాన సంస్థ విస్తారా (Vistara).. టాటా గ్రూప్ యాజమాన్యంలోని ఎయిర్ ఇండియాలోకి విలీనం కానుంది. 2024 నవంబర్ 11న విస్తారా తన చివరి విమానం నడపనుంది. అంతకంటే ముందు (సెప్టెంబర్ 3) సంస్థ టికెట్ రిజర్వేషన్లను కూడా ఎయిర్ ఇండియా వెబ్‌సైట్‌కు మళ్ళించనున్నట్లు సమాచారం. అయితే విమాన ప్రయాణాలు మాత్రం నవంబర్ 11వరకు కొనసాగుతాయి.
విస్తారా సంస్థ.. ఎయిర్ ఇండియాలో విలీనం కావడానికి సంబంధించి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు భారత ప్రభుత్వం ఆమోదం తెలిపిందని సింగపూర్ ఎయిర్‌లైన్స్ ఓ ప్రకటనలో వెల్లడించింది. అంటే ఎయిర్ ఇండియాలో విలీనం కానున్న విస్తారాలో.. సింగపూర్ ఎయిర్‌లైన్స్ 25.1 శాతం వాటాను కొనుగోలు చేయనుంది.
ఎయిర్ ఇండియా ఫ్లైట్ నెంబర్ & ఏఐ ప్రిఫిక్స్‌తో విస్తారా నెట్‌వర్క్.. విమానాలు కొనసాగుతాయి. విస్తారా సిబ్బంది.. విస్తారా విమానాలను 2025 ప్రారంభం వరకు ఎయిర్ ఇండియా కింద నిర్వహిస్తారు. అయితే సర్వీస్ లెవల్స్, భోజనం, ఇతరత్రా కార్యకలాపాలు ఎయిర్ ఇండియా పాలసీ ప్రకారం ఉంటాయి.
ఇప్పటికే విస్తారా ఫ్లైట్ టికెట్ నవంబర్ 11 తరువాతకు బుక్ చేసుకుని ఉంటే.. ఎయిర్ ఇండియాలో ప్రయాణించాల్సి ఉంటుంది. అయితే దీనికి సంబంధించిన విషయాలను క్షుణ్ణంగా తెలుసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే మీ ప్రయాణానికి ఏ లోటు లేదు. కానీ మీరు ఎయిర్ ఇండియా విమానాల్లో ప్రయాణించవచ్చు.
Comments
Please login to add a commentAdd a comment