
ముంబై: కోవిడ్ విస్తరిస్తున్న వేళ వైద్య సిబ్బంది తమ ప్రాణాలను పణంగా పెట్టి.. కుటుంబాలకు దూరంగా ఉంటూ విధులు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో విమానాయన సంస్థ విస్తారా వైద్య సిబ్బందికి బంపరాఫర్ ప్రకటించింది. వైద్యులు, నర్సులు తమ విమానాల్లో దేశంలో ఎక్కడి నుంచి ఎక్కడికైనా ఉచితంగా ప్రయాణించవచ్చని తెలిపింది. విస్తారా ఎయిర్‌లైన్స్ ఆదివారం ఈ ఆఫర్‌ను ప్రకటించింది. పౌర విమానయాన శాఖకు ఈ విషయాన్ని తెలియజేసింది. దేశవ్యాప్తంగా ఈ ఆఫర్ అందుబాటులో ఉంటుందని తెలిపింది. ప్రభుత్వ సంస్థలకు చెందిన డాక్టర్లు, నర్సులు ఉచితంగా తమ విమానంలో ప్రయాణించొచ్చు అని విస్తారా ప్రకటించింది.
ఈ మేరకు విస్తారా ఎయిర్‌లైన్స్ పౌర విమానయాన శాఖ సంయుక్త కార్యదర్శి ఉషా పఢీకి లేఖ రాసింది. ప్రభుత్వ సంస్థలు, హాస్పిటల్స్‌కు తక్షణ సాయం అందించేందుకు రెడీగా ఉన్నామని విస్తారా తెలిపింది. ఎయిర్ లాజిస్టిక్స్ సర్వీసులు కూడా పొందొచ్చని పేర్కొంది. ఇక ఉచిత ప్రయాణం ఆఫర్‌లో విస్తారా ఒక కండీషన్ పెట్టింది. సీట్ల లభ్యత ప్రాతిపదికన ముందుగా వచ్చే మెడికల్ ప్రొఫెషనల్స్‌కు ముందు సీట్ల కేటాయింపు ఉంటుందని ఎయిర్‌లైన్స్ పేర్కొంది. ఇక ఈ ఆఫర్ పొందాలనుకునే వైద్య సిబ్బంది తప్పనిసరిగా తమ గుర్తింపు కార్డులను చూపించాలని తెలిపింది.
Comments
Please login to add a commentAdd a comment