విస్తారా ఫెస్టివ్‌ ‘24 గంటల’ సేల్‌ | Vistara offers flight tickets from Rs 999 in new sale | Sakshi
Sakshi News home page

విస్తారా ఫెస్టివ్‌ ‘24 గంటల’ సేల్‌

Published Wed, Dec 12 2018 6:16 PM | Last Updated on Wed, Dec 12 2018 8:04 PM

Vistara offers flight tickets from Rs 999 in new sale - Sakshi

సాక్షి,ముంబై:  ప్రముఖ విమానయాన సంస్థ విస్తారా  మరోసారి  డిస్కౌంట్‌ సేల్‌ ప్రకటించింది. 24గంటల విక్రయాలు పేరుతో ఈ ఫెస్టివ్‌ సేల్‌ను అందుబాటులోకి తెచ్చింది.  అయితే ఈ ఆఫర్‌ను 13వ తేదీ గురువారం అర్థరాత్రిదాకా పొడిగించినట్టు ట్విటర్‌లో  షేర్‌ చేసింది. ఈ ఆఫర్‌లో విమాన టికెట్లు రూ.999లకే (అన్ని చార్జీలు కలిపి) ప్రారంభం కానున్నాయని తెలిపింది.  తద్వారా 80శాతం  డిస్కౌంట్‌ పొందవచ్చని వెల్లడించింది.

మొత్తం అన్ని క్లాసెస్‌ (ఎకానమీ, ప్రీమియం ఎకానమీ, బిజినెస్‌) టికెట్లపై  తమ తాజా ఆఫర్‌ వర్తిస్తుందని వెల్లడించింది.   పరిమితమైన టికెట్ లుమాత్రమే అందుబాటులో ఉన్నాయని ఫస్ట్‌ కం ఫస్ట్‌ సెర్వ్‌  ప్రకారం టికెట్లు కేటాయించబడతాయని  పేర్కొంది.

నేడు (డిసెంబరు 12 బుధవారం) మధ్యాహ్నం 12:01 గంటలకు ప్రారంభమై రేపు ముగియనుంది. ఇలా బుక్‌ చేసుకున్న టికెట్ల ద్వారా డిసెంబరు 27, ఏప్రిల్‌ 10 మధ్య కాలంలో ప్రయాణించాల్సి ఉంటుంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement