శీతాకాలంలో పొగమంచు కారణంగా రైళ్లు ఆలస్యంగా నడుస్తుండటం సర్వసాధారణం. అలాగే ఈ సీజన్‌లో రైళ్లలో సాంకేతిక సమస్యలు తతెత్తుతుంటాయి. దీనికి భిన్నమైన ఘటన రాజస్థాన్‌లో చోటుచేసుకుంది. దీనిగురించి తెలుసుకున్నవారంతా అవాక్కవుతున్నారు.
రాజస్థాన్‌లోని జైపూర్ రైల్వే జంక్షన్(Jaipur Railway Junction)లో విచిత్రమైన ఉదంతం చోటుచేసుకుంది. జైపూర్- జైసల్మేర్ మధ్య నడుస్తున్న లీలన్ ఎక్స్‌ప్రెస్ (12468)లో వెళ్లేందుకు వచ్చిన 64 మంది ప్రయాణికులు ఆ సమయంలో గందరగోళానికి గురయ్యారు. వారంతా ఏసీ కోచ్‌లో సీటుకోసం రిజర్వేషన్ చేయించుకున్నారు. అయితే రైలులో తమ కోచ్ కనిపించకపోవడంతా వారంతా అవాక్కయ్యారు.
వారు ఎదురు చూసిన రైలులో బీఈ-1 (థర్డ్ ఏసీ) కోచ్‌ను ఏర్పాటు చేయలేదు. దీంతో ప్రయాణికులు అయోమయంలో పడ్డారు. ఇంతలో ఒక ప్రయాణికుడి దృష్టి నాన్ ఏసీ కోచ్‌పై పడింది. దానిపై బీఈ-1/ఎస్‌ఎల్ అని రాసి ఉంది. లోపలికి వెళ్లి చూసేసరికి అది స్లీపర్ కోచ్, ఏసీ కోచ్ కాదు. దీంతో ఆ 36 మంది ప్రయాణికులు ఆందోళనకు దిగారు. అంతకంతకూ పెరుగుతున్న ఆందోళనను చూసిన రైల్వే అధికారులు(Railway officials) ఆ కోచ్ దగ్గరకు చేరుకున్నారు. వారు ఆగ్రహంతో రగిలిపోతున్న ప్రయాణికులను శాంతింపజేసే ప్రయత్నం చేశారు. ఈ రైలులో థర్డ్ ఏసీ కోచ్ సౌకర్యం ఉండదని, స్లీపర్ కోచ్‌లోనే ప్రయాణించాలని వారు తెలియజేశారు. అలాంటప్పుడు థర్డ్ ఏసీ టికెట్లు ఎందుకు జారీ చేశారని పలువురు ప్రయాణికులు ప్రశ్నించారు. దీనికి అధికారులు సమాధానం చెప్పలేక నీళ్లు నమిలారు.
వాస్తవానికి నెల్లాళ్ల క్రితమే ఈ రైలునుంచి ఏసీ కోచ్‌ను తొలగించారు. అయితే దీనిని టిక్కెట్లు జారే చేసే కంప్యూటర్ సిస్టమ్ నుంచి తొలగించలేదు. దీంతో టిక్కెట్లు జారీ అయ్యాయి. గత డిసెంబర్‌లో రైళ్లలో రద్దీని దృష్టిలో ఉంచుకుని, థర్డ్ ఏసీ క్లాస్‌తో కూడిన తాత్కాలిక కోచ్‌ను ఈ రైలుకు ఏర్పాటు చేశారు. అయితే దీనిని జనవరి ఒకటి తర్వాత తొలగించారు. సిస్టమ్‌ను అప్‌డేట్ చేయకపోవడంతో, ఈ కోచ్‌లో 64 మంది ప్రయాణికుల బుకింగ్ జరిగింది. తరువాత ఈ పొరపాటును అధికారులు గుర్తించారు. అయితే ఈ విషయాన్ని ప్రయాణికులకు తెలియజేయడంలో అధికారు నిర్లక్ష్యం వహించారనే ఆరోపణలున్నాయి. అయితే ఏసీబోగీలో ప్రయాణానికి టిక్కెట్లు కొనుగోలు చేసిన ప్రయాణికులకు వారు అదనంగా చెల్లించిన సొమ్మును వాపసు చేస్తామని రైల్వే అధికారులు తెలిపారు.
ఇది కూడా చదవండి: Success Story: రూ. 5 కోట్ల టర్నోవర్‌కు మార్గం చూపిన ‘గుడిమల్కాపూర్’
Comments
Please login to add a commentAdd a comment