sleeper coach
-
వందే భారత్ స్లీపర్ ఎక్స్‌ప్రెస్.. అట్రాక్ట్ చేస్తున్న ఫోటోలు
-
కొత్త రైళ్లను తగ్గించి.. కోచ్‌ల సంఖ్య పెంచేలా!
సాక్షి, అమరావతి: ప్రతిష్టాత్మకంగా చేపట్టిన వందేభారత్ స్లీపర్ రైళ్ల కాంట్రాక్టును రైల్వే శాఖ సవరించింది. రైళ్ల సంఖ్యను తగ్గిస్తూ.. కోచ్‌ల సంఖ్యను పెంచుతూ కాంట్రాక్టులో మార్పులు చేసింది. స్లీపర్ రైళ్లను ప్రవేశపెట్టే రూట్లను కూడా కుదించాలని నిర్ణయించింది. ప్రస్తుతం నిర్వహిస్తున్న చైర్ కార్ వందేభారత్ రైళ్లతోపాటు స్లీపర్ కోచ్‌లతో కూడిన వందేభారత్ రైళ్లను ప్రవేశపెట్టేందుకు రైల్వే శాఖ కాంట్రాక్టు ఖరారు చేసింది. 800 కి.మీ. నుంచి 1,200 కి.మీ. దూరప్రాంతాలకు స్లీపర్ కోచ్‌లతో కూడిన 200 వందేభారత్ రైళ్లు ప్రవేశపెట్టాలని ప్రణాళిక రూపొందించింది. ఇందుకోసం రూ.58వేల కోట్ల విలువైన టెండర్లు ఖరారు చేసింది. కానీ.. స్లీపర్ రైళ్లను ఏయే రూట్లలో ప్రవేశపెట్టాలనే అంశంపై రైల్వే శాఖ కచ్చితమైన నిర్ణయానికి రాలేకపోయింది.స్లీపర్ కోచ్‌ల నిర్వహణ వ్యయం, టికెట్ల ద్వారా వచ్చే రాబడి మధ్య సమతుల్యత లేకపోవడంతో సందిగ్ధంలో పడింది. అందుకే.. మొదటి స్లీపర్ వందేభారత్ రైలును ప్రారంభించే విషయంలో కాలయాపన చేస్తోంది. డిమాండ్ ఉన్న, అంతగా లేని మొత్తం 200 రూట్లలో స్లీపర్ రైళ్లను ప్రవేశపెట్టడం నిర్వహణ వ్యయం పరంగా సరైన నిర్ణయం కాదని తాజాగా రైల్వే శాఖ నిర్ణయించింది. ఎందుకంటే.. ఒక్కో కోచ్‌లో 80 సీట్లు ఉంటాయి. 16 కోచ్‌లతో కూడిన స్లీపర్ రైళ్లను అంతగా డిమాండ్‌లేని రూట్లలో కూడా నిర్వహించడం ఆర్థికంగా భారంగా మారుతుందని అంచనాకు వచ్చింది.దాంతో స్లీపర్ కోచ్‌లకు అధిక డిమాండ్ ఉంటుందని భావిస్తున్న రూట్లలోనే ఆ రైళ్లను పరిమితం చేయాలని నిర్ణయించింది. దాంతోపాటు రైళ్లలో కోచ్‌ల సంఖ్యను పెంచడం ద్వారా టికెట్ల ఆదాయాన్ని పెంచుకోవాలని భావించింది. ఈ మేరకు స్లీపర్ రైళ్ల సంఖ్యను 200 నుంచి 133కు తగ్గించింది. ఇక ఒక్కో రైలులో కోచ్‌ల సంఖ్యను 16 నుంచి 24కు పెంచింది. కాంట్రాక్టు మొత్తం వ్యయం మాత్రం రూ.58వేల కోట్లుగానే ఉంటుంది. ఈ మేరకు ఇప్పటికే టెండర్లు ఖరారు చేసిన కాంట్రాక్టు సంస్థలు రైల్ వికాస్ నిగమ్ లిమిటెడ్ (ఆర్వీఎన్ఎల్), భారతహెవీ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్ (బీహెచ్ఈఎల్)కు సవరించిన కాంట్రాక్టును ఖరారు చేసింది. -
ఆటోమెటిక్ తలుపులు..ఆధునిక టాయ్లెట్లు
సాక్షి, హైదరాబాద్: పరిమిత దూరంలో ఉన్న నగరాల మధ్య 160 కి.మీ. గరిష్ట వేగంతో దూసుకుపోతున్న వందేభారత్ రైళ్లు.. ఇక వెయ్యి కి.మీ.ని మించిన దూరప్రాంతాల మధ్య తిరిగేందుకు సిద్ధమయ్యాయి. ఇందుకుగాను తొలిసారి స్లీపర్ బెర్తులతో కూడిన వందేభారత్ రైలు పూర్తిస్థాయిలో సిద్ధమై త్వరలో తొలి పరుగుకు సిద్ధమైంది. ఇప్పటివరకు మన రైళ్లలో కనిపించని ఆధునిక రూపుతో ఇవి కళ్లు చెమర్చేలా ఉండటం ప్రత్యేక ఆకర్షణగా మారింది. రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ ఇటీవల ఈ రైలును పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. దీనికి ఆమోదముద్ర పడటంతో మరిన్ని రైళ్ల తయారీ కూడా ఊపందుకుంది. పూర్తిస్థాయిలో అగ్ని నిరోధక భద్రతా ప్రమాణాలతో రూపొందిన ఈ రైలు పూర్తిస్థాయి స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందడం విశేషం. ప్రత్యేకతలు ఇవే.. » స్లీపర్ వందేభారత్ రైలును ఆస్టెనిటిక్ స్టెయిన్లెస్ స్టీలుతో రూపొందించారు. వందేభారత్ తరహాలో దీని వెలుపలి రూపు ఏరోడైనమిక్ డిజైన్‌తో కనువిందు చేస్తోంది. » ఇంటీరియర్‌ను జీఎప్ఆర్పీ ప్యానెల్‌తో రూపొందించారు. ఇందులో మాడ్యులర్ పాంట్రీ ఉంటుంది. » అగ్ని నిరోధక వ్యవస్థలో ఈఎన్–45545 ప్రమాణ స్థాయితో రూపొందింది. » దివ్యాంగులు కూడా సులభంగా వినియోగించగలిగే పద్ధతిలో ప్రత్యేక బెర్తులు, టాయిలెట్లను ఇందులో పొందుపరిచారు. » ఆటోమేటిక్ పద్ధతిలో తెరుచుకొని మూసుకునే పద్ధతిగల తలుపులను ఏర్పాటు చేశారు. ఇది సెన్సార్ ఆధారిత ఇంటర్ కమ్యూనికేషన్‌తో పనిచేస్తాయి. » దుర్వాసనను నియంత్రించే ప్రత్యేక వ్యవస్థతో కూడిన పూర్తి సౌకర్యవంతమైన టాయ్లెట్లను అందుబాటులోకి తీసుకొచ్చారు. » లోకోపైలట్ల కోసం ప్రత్యేక టాయిలెట్లను ఏర్పాటు చేశారు. » మొదటి శ్రేణి ఏసీ కోచ్‌లో వేడి నీటితో కూడిన షవర్ వ్యవస్థ అందుబాటులో ఉంటుంది. » కోచ్‌లలోని బెర్తుల వద్ద రీడింగ్ లైట్లు, యూఎస్బీ చార్జింగ్ వసతి ఉంటుంది. » అనౌన్స్మెంట్ల కోసం ఆడియో, వీడియో వ్యవస్థ ఉంటుంది. » ప్రయాణికుల లగేజీ భద్రపరిచేందుకు విశాలమైన కోచ్ ఉంటుంది. » సెక్యూరిటీ, రైల్వే సిబ్బందికి ప్రత్యేక గదిని ఏర్పాటు చేశారు. లోకోపైలట్‌తో నేరుగా మాట్లాడేందుకు ప్రత్యేక ఆడియో వ్యవస్థ అక్కడ అందుబాటులో ఉంటుంది. మొత్తం 16 కోచ్‌లు.... ఈ ఆధునిక స్లీపర్ వందేభారత్ రైలులో 16 కోచ్‌లు ఉంటాయి. అందులో ఏసీ 3–టైర్ కోచ్‌లు 11 ఉంటాయి. వాటిల్లో 611 బెర్తులు అందుబాటులో ఉంటాయి. ఏసీ 2 టైర్ కోచ్‌లు 4 ఉంటాయి. వీటిల్లో 188 బెర్తులు ఉంటాయి. ఫస్ట్ క్లాస్ ఏసీ కోచ్ ఒకటి ఉంటుంది. అందులో 24 బెర్తులుంటాయి. అప్పర్ బెర్తులోకి చేరుకునేందుకు ప్రత్యేక నిచ్చెన తరహా ఏర్పాటు ఉంటుంది. మిడిల్ బెర్తు నారింజ రంగులో, లోయర్, అప్పర్ బెర్తులు గ్రే కలర్లో ఉంటాయి. అప్పర్ బెర్డులను నిలిపి ఉంచేందుకు గతంలో గొలుసు తరహా ఏర్పాటు ఉంటే, ఇందులో ప్రత్యేక స్టీల్ స్ట్రిప్ ఏర్పాటు చేశారు. బెర్తుల వద్ద మేగజైన్ బ్యాగు, మొబైల్ ఫోన్ పెట్టుకునే బాక్సు ఏర్పాటు చేశారు. æ బెర్తులు ఆరడుగుల పొడవుతో ఏర్పాటు చేశారు. -
వందేభారత్ స్లీపర్ కోచ్ వచ్చేసింది..విశేషాలివే..
బెంగళూరు: ప్రతిష్టాత్మక వందే భారత్ స్లీపర్ కోచ్ నమూనాను కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ ఆవిష్కరించారు. బెంగళూరులోని భారత్ ఎర్త్ మూవర్స్ లిమిటెడ్(బీఈఎమ్ఎల్) తయారీ కర్మాగారంలో వీటిని ప్రారంభించారు. బీఈఎమ్‌ఎల్‌లో ఏర్పాటు చేసిన వందే భారత్ తయారీ కేంద్రానికి మంత్రి ఆదివారం(సెప్టెంబరు1) శంకుస్థాపన చేశారు. First visual of the #VandeBharatSleeper is here!Union Minister @AshwiniVaishnaw unveiled the prototype version of #VandeBharat sleeper coach today.#VandeBharatTrain Credit: @DDNewslive@RailMinIndia @Murugan_MoS @PIB_India pic.twitter.com/TbTew5TJLN— Ministry of Information and Broadcasting (@MIB_India) September 1, 2024ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వైష్ణవ్ మాట్లాడుతూ ఈ రోజు ముఖ్యమైన ప్రయాణాన్ని ప్రారంభిస్తున్నామన్నారు. వందే భారత్ చైర్ కార్ విజయవంతమైన తర్వాత, వందే భారత్ స్లీపర్ కోసం చాలా శ్రమించామని చెప్పారు.వందేభారత్ స్లీపర్ కోచ్‌ల తయారీ ఇప్పుడే పూర్తయిందన్నారు. పది రోజుల పాటు వీటికి కఠినమైన ట్రయల్స్, టెస్ట్‌లు నిర్వహించనున్నామని తెలిపారు. మూడు నెలల్లో ప్రయాణికులకు ఈ కోచ్‌ల సేవలు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందన్నారు.The Vande Bharat sleeper train will have 24 coaches and will reach Chennai from Bangalore on September 20 for final testing. 🚄🏁#VandeBharat #vandebharatsleeper pic.twitter.com/5zgFAsQNqE— MAYA ✍🏻 (@Maya_Lokam_) August 24, 2024 వందేభారత్ స్లీపర్ కోచ్‌లలో ఉండే సౌకర్యాలు ఇవే...కోచ్‌లలో రీడింగ్ ల్యాంప్స్, ఛార్జింగ్ అవుట్లెట్లు, స్నాక్ టేబుల్, మొబైల్, మ్యాగజైన్ హోల్టర్స్ ఉంటాయి.India's first Vande Bharat prototype sleeper train unveiled in Bengaluru. Excited to Travel in Vande Bharat Sleeper 😍#IndianRailways #VandeBharatExpress #VandeBharatSleeper pic.twitter.com/8n6dcmFXyE— Shiwangi Thakur (@ShiwangiThakurX) September 1, 2024రైల్వే ప్రమాదాలకు అడ్డుకట్ట వేసే ‘కవచ్’ వ్యవస్థ ఉంటుంది.అన్ని కోచ్‌లు స్టెయిన్లెస్ స్టీల్ బాడీతో నిర్మించారు. లోపల జీఎఫ్ఆర్పీ ఇంటీరియర్ ప్యానెల్స్ ఉంటాయి.కోచ్‌లన్నీ అగ్నిమాపక భద్రతా ప్రమాణాలకు అనుగుణంగా ఉంటాయి.ఆటోమేటిక్ డోర్లు, మెరుగైన సదుపాయాలతో మరుగు దొడ్లు, కొత్త టెక్నాలజీతో రూపొందించిన సీటు కుషన్లు ఇందులో అమర్చారు.16 కోచ్‌లు, 823 బెర్త్‌లతో స్లీపర్ ట్రైన్ రానుంది. వీటిలో పదకొండు 3టైర్ ఏసీ కోచ్‌లు (600 బెర్త్‌లు), నాలుగు 2 టైర్ ఏసీ కోచ్‌లు (188 బెర్త్‌లు), ఒక ఫస్ట్ టైర్ ఏసీ కోచ్(24 బెర్త్‌లు) ఉంటాయి. #WATCH : First Look of Vande Bharat Trains Sleeper Version.#VandeBharat #VandeBharatExpress #VandeBharatSleeper #India #latest #LatestUpdate pic.twitter.com/1Vt7Zmjo1g— upuknews (@upuknews1) October 2, 2023 -
త్వరలో అందుబాటులోకి వందే భారత్ స్లీపర్ రైలు
దేశంలోనే తొలి వందేభారత్ స్లీపర్ రైలును ఆరు నెలల్లో అందుబాటులోకి తెస్తామని కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. బెంగుళూరులో బీఈఎంఎల్ తయారు చేసిన వందే భారత్ స్లీపర్ ప్రోటోటైప్ రైలు కార్ బాడీ స్ట్రక్చర్‌ను ఆవిష్కరించిన అనంతరం ఆయన మాట్లాడుతూ.. వందే భారత్ చైర్ కార్, నమో-భారత్ (రాపిడ్ రైల్ ట్రాన్సిట్ సిస్టమ్), అమృత్ భారత్ రైలు (పుష్-పై రైళ్లు) విజయవంతమయ్యాక తదుపరి వందే భారత్ స్లీపర్, వందే మెట్రో రైళ్లను పరిచయం చేయడమేనని అన్నారు. Furnishing of Vande Sleeper started! pic.twitter.com/itYaSQyNG2 — Ashwini Vaishnaw (मोदी का परिवार) (@AshwiniVaishnaw) March 9, 2024 వందే భారత్ స్లీపర్ వెర్షన్లో పురోగతి ఆశాజనకంగా ఉందని, పూర్తి నిర్మాణం, పైకప్పుతో సహా కొత్త డిజైన్ పూర్తయిందని వైష్ణవ్ చెప్పారు. ఫర్నిషింగ్ త్వరలో ప్రారంభమవుతుంది. రాబోయే ఆరు నెలల్లో పూర్తి చేయాలని మేము భావిస్తున్నామని వెల్లడించారు. -
వందేభారత్ స్లీపర్ కోచ్‌లు వస్తున్నాయోచ్..!
ఢిల్లీ: స్వదేశీ సెమీ హైస్పీడ్ వందేభారత్ రైళ్లను ప్రవేశపెట్టి దేశరవాణాలో అరుదైన మైలురాయిని చేరిన విషయం తెలిసిందే. తాజాగా మరో ముందడుగు వేస్తోంది భారత రైల్వేశాఖ. వందేభారత్ రైళ్లలో స్లీపర్ కోచ్‌లను ప్రవేశపెట్టనుంది. 2024 నుంచి ఆ రైళ్లు పట్టాలెక్కనున్నాయి. ఈ విషయాన్ని రైల్వే మంత్రి అశ్విణీ వైష్ణవ్ సోషల్ మీడియా వేదికగా తెలిపారు. స్లీపర్ కోచ్‌ల ఫొటోలు షేర్ చేశారు. Concept train - Vande Bharat (sleeper version) Coming soon… early 2024 pic.twitter.com/OPuGzB4pAk — Ashwini Vaishnaw (@AshwiniVaishnaw) October 3, 2023 వందేభారత్ స్లీపర్ కోచ్‌లు ప్రస్తుతం ఉన్న సౌకర్యాల కంటే ఎన్నో అధునాతన ఫీచర్లను కలిగి ఉన్నాయి. నిద్రించడానికి సౌకర్యవంతమైన పడకలు, ఆకర్షణీయమైన ఇంటీరియర్ డిజైన్, విశాలమైన టాయిలెట్స్, ప్రపంచ స్థాయి అడ్వాన్స్డ్ సేఫ్టీ ఫీచర్లు ఈ కోచ్‌లలో ఉన్నాయి. ఈ స్లీపర్ కోచ్ వందేభారత్ మరింత శక్తివంతమైన, పర్యావరణ అనుకూలంగా ఉండనుంది. 'మేక్ అన్ ఇండియా' ప్రోగ్రామ్‌లో భాగంగా చెన్నై ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీలో ఈ వందేభారత్ రైళ్లను తయారు చేస్తున్నారు. మొదటి రైలును 2019 ఫిబ్రవరి 15న ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా ఢిల్లీ-వారణాసి రైలు ప్రారంభం అయింది. దేశంలో ఎంత దూరంలో ఉన్న ప్రాంతాన్నైనా వందేభారత్ రైళ్ల రాకతో గంటల వ్యవధిలోనే సౌకర్యవంతంగా ప్రయాణికులు చేరుతున్నారు. ఇదీ చదవండి: చైనా నుంచి నిధులు.. న్యూస్‌క్లిక్ ఫౌండర్‌కు రిమాండ్ -
ఇక వందేభారత్ స్లీపర్ కోచ్ రైళ్లు.. ఒక్కో రైలుకు రూ.120 కోట్ల ఖర్చు
సాక్షి, అమరావతి: వందేభారత్ స్లీపర్ కోచ్ రైళ్లు త్వరలో పట్టాలెక్కనున్నాయి. రాజధాని ఎక్స్‌ప్రెస్ రైళ్లకు ప్రత్యామ్నాయంగా రైల్వేశాఖ వందేభారత్ స్లీపర్ కోచ్ రైళ్లను ప్రవేశపెడుతోంది. మొదటిదశలో 200 రైళ్ల తయారీకి కాంట్రాక్టును ఖరారు చేసింది. రైల్వేశాఖ ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన వందేభారత్ రైళ్లలో ప్రస్తుతం చెయిర్‌కార్ కోచ్‌లే అందుబాటులో ఉన్నాయి. దేశంలో రెండో అతివేగంగా ప్రయాణించే వందేభారత్ రైళ్లలో ప్రస్తుతం ఏసీ చెయిర్‌కార్ కోచ్‌లే ఉన్నాయి. ఈ రైళ్లకు ప్రయాణికుల నుంచి ఆదరణ లభిస్తోంది. కానీ స్లీపర్ కోచ్‌లు లేకపోవడంపై ప్రతికూల స్పందన కూడా వ్యక్తమవుతోంది. స్లీపర్ కోచ్‌లు లేకపోవడంతో దూరప్రాంత ప్రయాణాలకు ప్రయాణికులు విముఖత చూపుతున్నారు. ఈ సమస్యకు పరిష్కారంగానే రైల్వేశాఖ వందేభారత్ స్లీపర్ కోచ్ రైళ్లు ప్రవేశపెడుతోంది. స్లీపర్ కోచ్‌లతో కూడిన వందేభారత్ రైళ్ల తయారీకి టెండర్ల ప్రక్రియను పూర్తిచేసింది. మొత్తం 400 రైళ్లు ప్రవేశపెట్టాలన్నది రైల్వేశాఖ ఉద్దేశం. మొదటిదశలో ప్రవేశపెట్టే 200 రైళ్ల కోసం టెండర్లను ఇటీవల ఖరారు చేసింది. ఏడుసంస్థలు బిడ్లు దాఖలు చేయగా.. రైల్‌వికాస్ నిగమ్ లిమిటెడ్, రష్యాకు చెందిన టీఎంహెచ్ గ్రూప్‌తో కూడిన కన్సార్షియం 120 రైళ్ల తయారీ కాంట్రాక్టును దక్కించుకుంది. ఒక్కో రైలును రూ.120 కోట్లతో తయారు చేసేందుకు ఈ కన్సార్షియం ముందుకొచ్చింది. టిట్లాఘర్ వేగన్, బీహెచ్ఈఎల్తోకూడిన కన్సార్షియం మరో 80 రైళ్లను తయారు చేయనుంది. గంటకు 160 కిలోమీటర్ల వేగం.. గంటకు 160 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించే వందేభారత్ స్లీపర్ కోచ్ రైళ్లలో మొత్తం 16 బోగీలుంటాయి. థర్డ్ ఏసీ కోచ్‌లు 11, సెకండ్ ఏసీ కోచ్‌లు 4, ఫస్ట్ ఏసీ ఒక కోచ్ ఉండేలా డిజైన్ చేశారు. ప్రయాణికుల స్పందనను బట్టి.. తరువాత దశల్లో కోచ్‌ల సంఖ్యను 20 లేదా 24కు కూడా పెంచాలని రైల్వేశాఖ భావిస్తోంది. ఈ రైలు బయలుదేరిన నిమిషం వ్యవధిలోనే గంటకు 160 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది. రాజధాని ఎక్స్‌ప్రెస్‌లు ‘ఫ్రంట్ డ్రివెన్’ విధానంలో ప్రయాణిస్తున్నాయి. వందేభారత్ స్లీపర్ కోచ్‌లు ‘డిస్ట్రిబ్యూటెడ్’ విధానంలో ప్రయాణిస్తాయి. దీంతో రైలు ప్రయాణంలో కుదుపులు, శబ్దం కనిష్టస్థాయిలోనే ఉంటాయి. రాజధాని ఎక్స్‌ప్రెస్‌ల కంటే వందేభారత్ స్లీపర్ కోచ్ రైళ్లు పట్టాలపై తక్కువ ఒత్తిడి కలిగిస్తూ అధికవేగంతో ప్రయాణిస్తాయి. దీనివల్ల పట్టాల నిర్వహణ వ్యయం కూడా తగ్గుతుందని రైల్వే ఇంజినీరింగ్ నిపుణులు చెబుతున్నారు. ఈ ఏడాది చివరినాటికి తొలి వందేభారత్ స్లీపర్ కోచ్‌ల రైలును పట్టాలెక్కించాలని రైల్వేశాఖ భావిస్తోంది. నేటినుంచి సామర్లకోటలో వందేభారత్‌కు హాల్ట్ సాక్షి ప్రతినిధి, కాకినాడ: కాకినాడ జిల్లా సామర్లకోటలో గురువారం నుంచి వందేభారత్ రైలు ఆగనుంది. ఈ రైలు సామర్లకోట జంక్షన్లో ఒక్క నిమిషం ఆగేందుకు రైల్వేశాఖ అనుమతి ఇచ్చింది. ఈ రైలు హాల్ట్‌కు అనుమతి ఇవ్వాలన్న ప్రజల విజ్ఞప్తుల్ని కాకినాడ ఎంపీ వంగా గీతావిశ్వనాథ్ కేంద్ర రైల్వేశాఖ మంత్రి అశ్విన్‌వైష్ణవ్ దృష్టికి తీసుకెళ్లారు. ఈ నేపథ్యంలో 48 గంటల వ్యవధిలోనే వందేభారత్ రైలు హాల్ట్‌కు ఆమోదం లభించింది. దీంతో ప్రయాణికులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. -
వందే భారత్ స్లీపర్ రైళ్ల తయారీ కాంట్రాక్ట్ దక్కించుకున్నదెవరో తెలుసా?
న్యూఢిల్లీ: దేశీ రైల్వేలు కొత్తగా ప్రవేశపెట్టదలచిన వందే భారత్ స్లీపర్ రైళ్ల తయారీ కాంట్రాక్టును టిటాగఢ్ రైల్ సిస్టమ్స్, భారత్ హెవీ ఎలక్ట్రికల్స్(భెల్) కన్సార్షియం దక్కించుకుంది. తద్వారా మొత్తం 80 స్లీపర్ ట్రైయిన్ల తయారీకి ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి. వీటిని 2029కల్లా అందించవలసి ఉన్నట్లు సంయుక్త ప్రకటనలో టిటాగఢ్, భెల్ తెలియజేశాయి. మొత్తం కాంట్రాక్టు విలువను ర. 24,000 కోట్లుగా వెల్లడించాయి. దేశీ సంస్థల కన్సార్షియంకు ఈ స్థాయి విలువలో రైల్వే శాఖ కాంట్రాక్టునివ్వడం ఇదే తొలిసారికాగా.. వందే భారత్ స్లీపర్ రైళ్ల డిజైన్, తయారీతోపాటు.. 35 ఏళ్లపాటు నిర్వహణను చేపట్టనున్నాయి. టెండర్ విధానంలో ఏకైక ఆత్మనిర్భర్ కన్సార్షియంగా టిటాగఢ్ రైల్ సిస్టమ్స్, బీహెచ్ఈఎల్ కన్సార్షియం నిలిచింది. (ఇదీ చదవండి: చిన్నప్పుడు స్కూల్లో నన్ను ఇలా ఎగతాళి చేసేవారు - అనంత్ అంబానీ) రెండేళ్లలో..: వందే భారత్ స్లీపర్ రైళ్ల తయారీ కాంట్రాక్టును ఆరేళ్లలో పూర్తి చేయవలసి ఉన్నట్లు టిటాగఢ్ రైల్ వైస్‌చైర్మన్, ఎండీ ఉమేష్ చౌధరీ తెలియజేశారు. తొలి ప్రొటోటైప్ రైలును రెండేళ్లలోగా డెలివరీ చేయనున్నట్లు పేర్కొన్నారు. తదుపరి మిగిలిన రైళ్లను అందించనున్నట్లు వివరించారు. (ఇదీ చదవండి: కన్నీళ్లు తెప్పిస్తున్న స్విగ్గీ డెలివరీ బాయ్ కష్టాలు.. కస్టమర్ సాయంతో జాబ్ కొట్టాడిలా..!) ప్రతీ రైలుకు 16 కోచ్‌లను ఏర్పాటు చేయనున్నట్లు తెలియజేశారు. తద్వారా సువరు 887 మంది ప్రయాణించవచ్చని పేర్కొన్నారు. గంటకు 160 కిలోమీటర్ల వేగాన్ని అందుకునేలా డిజైన్ చేయనున్నట్లు వివరించారు. కేంద్ర ప్రభుత్వం తీసుకువచి్చన మేకిన్ ఇండియా కార్యక్రమంలో భాగమవుతున్నందుకు గర్వపడుతున్నట్లు వ్యాఖ్యానించారు. రైళ్ల తయారీలో చివరి దశ అసెంబ్లీ, పరిశీలన, నిర్వహణ వంటివి చెన్నైలోని దేశీ రైల్వే ప్లాంటులో చేపట్టనున్నట్లు వెల్లడించారు. -
ఇక వందే భారత్ స్లీపర్
సాక్షి, హైదరాబాద్: విదేశాల్లోని ఆధునిక రైళ్లతో పోటీపడే రీతిలో రూపుదిద్దుకుని సూపర్ సక్సెస్ అయిన వందేభారత్ రైళ్ల తదుపరి వర్షన్ తయారీకి రైల్వే సిద్ధమైంది. ప్రస్తుతం చైర్ కార్ కోచ్‌లతో నడుస్తున్న ఈ రైళ్లలో స్లీపర్ కోచ్‌లను ప్రవేశపెట్టాలని నిర్ణయించింది. దీనికి సంబంధించి డిజైన్లు రూపొందించేందుకు రైల్వే చర్యలు ప్రారంభించింది. వచ్చే ఏడాది మార్చికల్లా డిజైన్లు ఖరారు చేసి రైల్ కోచ్‌ల తయారీ ప్రారంభించాలని నిర్ణయించింది. ప్రస్తుత రైలుకు భిన్నంగా.. ప్రస్తుతం దేశవ్యాప్తంగా దాదాపు 800 కి.మీ.లోపు దూరం ఉన్న ప్రధాన నగరాల మధ్య వందేభారత్ రైళ్లను ప్రారంభిస్తున్న విషయం తెలిసిందే. దక్షిణ మధ్య రైల్వేకు సంబంధించి సంక్రాంతి రోజున సికింద్రాబాద్–విశాఖపట్నం మధ్య నడిచే తొలి వందేభారత్ రైలును, ఏప్రిల్‌లో రెండో వందేభారత్ సర్విసుగా సికింద్రాబాద్–తిరుపతి మధ్య నడిచే రైలును ప్రారంభించిన విషయం తెలిసిందే. పగటి వేళ నడిచే రైళ్లు అయినప్పటికీ ఈ రెండు సర్వీసులు విజయవంతమయ్యాయి. వాటిల్లో ఆక్యుపెన్సీ రేషియో 110 శాతం నుంచి 140 శాతంగా నమోదవుతోంది. ఇలా దేశవ్యాప్తంగా చాలా వందేభారత్ రైళ్లు విజయవంతంగా నడుస్తున్నాయి. అయితే, వీటిల్లో బెర్తులు లేకపోవటంతో ప్రయాణికులు కూర్చునే వెళ్లాల్సి వస్తోంది. దీంతో ఎనిమిది గంటల్లో గమ్యం చేరేలా సమయాలను సెట్ చేశారు. దూర ప్రాంత నగరాల మధ్య నడపాలంటే, సమయం ఎక్కువ పడుతుంది, అంతసేపు కూర్చోవటం సాధ్యం కానందున కేవలం దగ్గరి నగరాల మధ్యనే తిప్పుతున్నారు. అయితే వీటిల్లో బెర్తులు ప్రవేశపెట్టి దూర ప్రాంత నగరాల మధ్య రాత్రింబవళ్లు తిప్పాలని రైల్వే నిర్ణయించింది. మరింత వేగంగా.... గతంలో పగటి వేళ చైర్ కార్‌తో తిరిగేలా డబుల్ డెక్కర్ రైళ్లను ప్రవేశపెట్టారు. అన్ని వసతులు మెరుగ్గానే ఉన్నప్పటికీ వీటి వేగం సాధారణ రైళ్లలాగే ఉండేది. దీంతో గంటల తరబడి పగటి వేళ కూర్చుని ప్రయాణించేందుకు ప్రయాణికులు విముఖత చూపటంతో ఆ కేటగిరీ విజయం సాధించలేదు. వందేభారత్ రైళ్లు మాత్రం శతాబ్ది లాంటి ప్రీమియం రైళ్ల కంటే ఎక్కువ వేగంతో ప్రయాణించే వీలుండటంతో వీటి ప్రయాణ సమయం బాగా తక్కువగా ఉంది. ఈ కేటగిరీ సక్సెస్‌కు ఇదే ప్రధాన కారణం. దీంతో తదుపరి స్లీపర్ కేటగిరీ రైళ్లు మరింత వేంగంగా ప్రయాణించేలా ప్లాన్ చేస్తున్నారు. వాటి గరిష్ట వేగం దాదాపు 200 కి.మీ. మించి ఉంటుందని తాజాగా రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ వెల్లడించటం ఆసక్తిని రేపుతోంది. అంత వేగంతో దూసుకుపోయేలా దీని డిజైన్‌ను రూపొందించనున్నారని, ఇది ప్రస్తుత వందేభారత్ రైళ్లకు భిన్నంగా ఉంటుందని పేర్కొంటున్నారు. ఇప్పటికే దేశంలోని అన్ని కోచ్ ఫ్యాక్టరీల్లో వందేభారత్ రైళ్లను రూపొందిస్తున్న విషయం తెలిసిందే. వాటిల్లో కొత్త రైలు నమూనాలను రూపొందించే పని ప్రారంభించినట్టు సమాచారం. మార్చి నాటికి నమూనా రైలును కూడా సిద్ధం చేసి కొన్ని నెలల పాటు ప్రయోగాత్మకంగా తిప్పాలని భావిస్తున్నారు. వందేభారత్ రైలు 2018లో రూపొందినా.. దాదాపు ఏడాదిన్నర పాటు దాన్ని పరిశీలించి పలు మార్పులు చేస్తూ వచ్చారు. కొత్త రైలుకు కూడా అలా పరిశీలించి మార్పులు చేసి, లోపాలు లేకుండా ప్రారంభించాలని భావిస్తున్నారు. సాధారణ రైళ్లను రీప్లేస్ చేసేలా.. ప్రస్తుతం దేశవ్యాప్తంగా సంప్రదాయ నమూనా రైళ్లే నడుస్తున్నాయి. ప్రీమియం కేటగిరీ రైళ్లుగా పిలుచుకునే శతాబ్ది, తేజస్, రాజధాని, దురంతో లాంటివి కూడా సంప్రదాయ రూపులోనే ఉంటున్నాయి. ఇటీవల కోచ్‌లను మాత్రం ఐసీఎఫ్ బదులు ఎల్‌హెచ్‌బీవి జత చేస్తున్నారు. కొత్త వందేభారత్ రైలు పట్టాలెక్కటం ప్రారంభించాక ఇక ప్రీమియం కేటగిరీ రైళ్లను కొత్త వందేభారత్‌తో రీప్లేస్ చేయాలని భావిస్తున్నారు. ఆ తర్వాత సాధారణ రైళ్లను కూడా కొత్త రూపు రైళ్లతో మార్చే యోచనలో రైల్వే ఉంది. -
వందేభారత్‌లో త్వరలో స్లీపర్ బెర్తులు
సాక్షి, హైదరాబాద్: సెమీ బుల్లెట్ రైలుగా పరిగణిస్తున్న వందేభారత్ రైలు త్వరలో సరికొత్త మార్పులతో రాబోతోంది. ప్రస్తుతం చైర్ కార్కే పరిమితమైన ఈ రైల్లో.. స్లీపర్ బెర్తులు ఏర్పాటుచేయాలని రైల్వే శాఖ నిర్ణయించింది. దీంతో ఈ రైళ్లను తయారుచేస్తున్న చెన్నైలోని ఇంటిగ్రేటెడ్ కోచ్ ఫ్యాక్టరీ (ఐసీఎఫ్)కి ఆదేశాలివ్వడంతో ఈమేరకు రూపకల్పన పనులు మొదలయ్యాయి. ప్రస్తుతం వందేభారత్ 2.0 సిరీస్ నడుస్తోంది. మొదటిసిరీస్‌లో ఐదు రైళ్లు పట్టాలెక్కగా, రెండో విడతలో మూడు రైళ్లు అందుబాటులోకి వచ్చాయి. సికింద్రాబాద్–విశాఖపట్నం మధ్య సోమవారం నుంచి (ఆదివారం లాంఛనంగా ప్రారంభంకానుంది) ప్రయాణికులకు అందుబాటులోకి రానున్న రైలు కూడా రెండో సిరీస్‌లో భాగం. తదుపరి లేదా ఆ పై సిరీస్ అందుబాటులోకి వచ్చే నాటికి స్లీపర్ బెర్తులతో కూడిన వందేభారత్ రైలు పట్టాలెక్కే అవకాశం ఉంది. ఆక్యుపెన్సీ రేషియో 50 శాతమే వందేభారత్ రైలుకు విపరీతమైన డిమాండ్ ఉన్నా, కొన్నిచోట్ల ఆక్యుపెన్సీ రేషియో 50 శాతమే ఉంటోంది. వీటిలో స్లీపర్ బెర్తులు లేకపోవటంతో అవి రాత్రి వేళ తిరగవు. దీంతో గమ్యం చేరేవరకు కూర్చునే ప్రయాణించాల్సి ఉంటుంది. దీనికి ప్రయాణికులు మొగ్గు చూపడం లేదు. గతంలో వందేభారత్ తరహాలో వచ్చిన ఏసీ డబుల్ డెక్కర్ రైలుకు ఎంతో డిమాండ్ ఉండేది. ఐదేళ్ల క్రితం కాచిగూడ–తిరుపతి, సికింద్రాబాద్–విశాఖపట్నం మధ్య తిరిగేందుకు డబుల్ డెక్కర్ రైలు మంజూరైంది. బెర్తులు లేక పోవటంతో పూర్తిగా పగటివేళ తిరుగుతుండటంతో దీనిలో ఆక్యుపెన్సీ రేషియో 20 శాతం లోపే నమోదయ్యేది. క్రమంగా నష్టాలు పెరగటంతో దాన్ని ఉపసంహరించుకోవాల్సి వచ్చింది. ఇప్పుడు వందేభారత్ విషయంలోనూ ఈ ప్రమాదం పొంచి ఉండటంతో అందులో స్లీపర్ బెర్తులు ప్రవేశ పెట్టాలని నిర్ణయించారు. విశాఖకు కొంత మెరుగే.. హైదరాబాద్ నుంచి విశాఖకు వెళ్లే గోదావరి ఎక్స్‌ప్రెస్ సాయంత్రం ఐదు గంటలకు బయలుదేరుతుంది. అదే వందేభారత్ రైలు మధ్యాహ్నం మూడింటికి బయలుదేరి రాత్రి 11.30 గంటలకల్లా గమ్యం చేరుతుంది. కానీ విశాఖ నుంచి ఆ రైలు ఉదయం 5.45 గంటలకు బయలుదేరి మధ్యాహ్నం 2.15కు సికింద్రాబాద్ చేరుకుంటుంది. అంటే పూర్తిగా పగటి వేళలోనే తిరుగుతుంది. దీంతో ఈ మార్గంలో ఆక్యుపెన్సీ రేషియో తక్కువగా ఉంటుందని అధికారులు భావిస్తున్నారు. కాగా, శనివారం సికింద్రాబాద్ స్టేషన్లో ఏర్పాట్లను రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్‌తోపాటు కిషన్‌రెడ్డి పరిశీలించారు. అనంతరం వందేభారత్‌లోనూ పరిశీలించారు. ధర ప్రభావం చూపుతుందేమో.. సికింద్రాబాద్–విశాఖ వందేభారత్‌లో ఎగ్జిక్యూటివ్ చైర్‌కార్ టికెట్ ధర రూ.3,120గా ఉంది. ఇందులో రూ.369 కేటరింగ్ చార్జి కలిసి ఉంది. అది వద్దనుకుంటే దాన్ని మినహాయించి టికెట్ జారీ చేస్తారు. అదే విశాఖకు వెళ్లే గోదావరిలో ఏసీ ఫస్ట్‌క్లాస్ టికెట్ ధర రూ.2,540 మాత్రమే. దురంతోలో రూ.2,795, ఫలక్‌నుమాలో రూ.2,465గా ఉంది. ఇవన్నీ స్లీపర్ బెర్తులుండే రైళ్లు. వీటి కంటే చైర్‌కార్‌లో వెళ్లే వందేభారత్ రైలు టికెట్ ధర చాలా ఎక్కువగా ఉండటం కూడా కొంత ప్రభావం చూపుతుందంటున్నారు. వందేభారత్ ఎకానమీ క్లాస్ టికెట్ ధర రూ.1,665గా ఉంటే, గోదావరిలో థర్డ్ ఏసీ ధర రూ.1080, ఫలక్‌నుమాలో రూ.1,045 మాత్రమే. వాటిల్లో స్లీపర్ క్లాస్ ధర రూ.450 మాత్రమే కావటం గమనార్హం. అయితే మిగిలిన రైళ్లతో పోలిస్తే.. వందేభారత్ రైలు ప్రయాణ సమయం తక్కువగా ఉంటుంది. -
ఐసోలేషన్ వార్డులుగా మరిన్ని రైల్వే బోగీలు
సాక్షి, న్యూఢిల్లీ: కరోనా వైరస్ బారిన పడ్డ రోగులు ఆదుకునేందుకు భారతీయ రైల్వే వేగంగా కదులుతోంది. ఇప్పటికే వేల బోగీలను ఐసోలేషన్ వార్డులుగా మలిచిన సంస్థ తాజాగా మరిన్ని పడకలను సిద్ధం చేస్తోంది. మరో 50 స్లీపర్ కోచ్‌లను ఐసోలేషన్ వార్డులుగా రూపొదించనున్నామని తూర్పు రైల్వే వెల్లడించింది. ఏప్రిల్ 14 నాటికి అన్ని సౌకర్యాలతో ఇవి అందుబాటులోకి వస్తాయని తెలిపింది. కరోనావైరస్ మహమ్మారిని ఎదుర్కోవడంలో ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రయత్నాలకు మద్దతుగా ఈ ఐసోలేషన్ వార్డులను తయారు చేస్తున్నామని తెలిపింది. అలాగే వైద్య నిపుణుల సలహా ప్రకారం రోగులు, వైద్యులు, వారి సంరక్షకులకు అవసరమైన అన్ని సౌకర్యాలను కల్పిస్తున్నట్టు పేర్కొంది. తూర్పు రైల్వే పరిధిలో 400-500 కిలోమీటర్ల విస్తీర్ణంలో ఇవి అందుబాటులో ఉంటాయని ప్రకటించింది. అధునాతన ఐసోలేషన్ వార్డులుగా మార్చే క్రమంలో బోగీల్లో పలు కీలక మార్పులు చేసినట్టు తెలిపింది. కరోనా వైరస్ రోగులుకు ఎక్కువ స్థలాన్ని అందించడానికి మధ్య బెర్తులు తొలగించడంతోపాటు, మందులు, మెడికల్ రిపోర్టులు, ఇతర వస్తువులను ఉంచుకునేందుకు సైడ్ బెర్త్‌లను తీర్చిదిద్దినట్టు ఈస్ట్రన్ రైల్వే అధికారి సంజయ్ ఛటర్జీ వెల్లడించారు. ఆరోగ్య మంత్రిత్వశాఖ ఆదేశాల మేరకు కిటికీలకు దోమతెరలు, పారదర్శక ప్లాస్టిక్ కర్టెన్లు, కొత్త ఎలక్ట్రికల్ పాయింట్లు సహా అన్ని సౌకర్యాలను సమకూర్చనున్నట్టు చెప్పారు. కాగా దేశవ్యాప్తంగా లాక్ డౌన్ ప్రారంభమైనప్పటినుంచి ఇప్పటికే 2,500 రైల్వే బోగీలను ఐసోలేషన్ వార్డులుగా మార్చి లక్షల అధునాతన పడకలను రోగులకు అందుబాటులో ఉంచిన సంగతి తెలిసిందే. చదవండి: కరోనా : భారత సంతతి వైద్యురాలు కీలక నిర్ణయం -
ప్రైవేటువి 1,100.. ఆర్టీసీవి 0
రాత్రి వేళ హాయిగా విశ్రమించి ప్రయాణించాలని కోరుకునే వారే ఎక్కువ. అందుకే దూరప్రాంతాలకు వెళ్లే రైళ్లకు డిమాండు ఎక్కువ. కానీ, వాటి సంఖ్య పరిమితం. అన్ని ప్రాంతాలకు రైళ్లు అందుబాటులో లేవు. అందుకే స్లీపర్ బస్సులకు డిమాండ్ బాగా పెరుగుతోంది. బెంగళూరు, ముంబై, వైజాగ్, తిరుపతి లాంటి సుదూర ప్రాంతాలకు స్లీపర్ బస్సుల్లో ప్రయాణాలు ఎక్కువ. ప్రయాణికుల డిమాండును గుర్తించి ప్రైవేటు ట్రావెల్స్ యజమానులు ఎప్పటికప్పుడు స్లీపర్ బస్సు సర్వీసుల సంఖ్య పెంచుతున్నారు. ప్రస్తుతం హైదరాబాద్ నుంచి నిత్యం వివిధ ప్రాంతాలకు దాదాపు 1,100 స్లీపర్ సర్వీసులు ఉన్నాయి. నిబంధనలకు విరుద్ధంగా టూరిస్ట్ పర్మిట్ తీసుకుని స్టేజి క్యారియర్లుగా తిరుగుతున్న బస్సులతోపాటు, అరుణాచల్‌ప్రదేశ్ లాంటి పర్యాటకులు ఎక్కువగా ఉండే రాష్ట్రాల్లో రిజిస్ట్రేషన్ చేయించుకుని, అక్కడి నుంచే టూరిస్ట్ పర్మిట్ తీసుకుని హైదరాబాద్ కేంద్రంగా తిరుగుతున్న బస్సులు కూడా వీటిలో ఉన్నాయి. అయినా, ప్రయాణికులకు అందుబాటులో ఉంటూ దర్జాగా పరుగుపెడుతూ గల్లా పెట్టెను నింపుకుంటున్నాయి. ఇంత డిమాండ్ ఉండి కూడా స్లీపర్ సర్వీసులు నడపడంలో ఆర్టీసీ చేతులెత్తేసింది. ప్రస్తుతం ఆర్టీసీ వద్ద ఒక్క స్లీపర్ బస్సు కూడా లేదు. సమ్మె తర్వాత కూడా మారని తీరు.. ఆర్టీసీ తీవ్ర నష్టాలతో కొట్టుమిట్టాడుతూ దివాలా దశకు చేరుకున్న తరుణంలో వచ్చి పడిన సమ్మె దాన్ని పూర్తిగా కుదేలు చేసింది. ప్రభు త్వం మేల్కొని దిద్దుబాటు చర్యలకు ఉపక్రమించి, ఆదా యం పెంచుకునే క్రమంలో కి.మీ.కు 20 పైసలు చొప్పు న చార్జీలు పెంచుకునేందుకు అనుమతించింది. దీంతో రోజువారీ ఆదాయం రూ.2 కోట్ల మేర పెరిగింది. ఇలాం టి సమయంలో కూడా డిమాండ్‌కు తగ్గట్టుగా తనను తాను మార్చుకోవడంలో ఆర్టీసీ విఫలమవుతోంది. దూర ప్రాంతాలకు స్లీపర్ బస్సులు కావాలని ప్రయాణికులు కోరుతున్నా పట్టించుకోవడం లేదు. నిత్యం అలాంటి సర్వీసులు సీట్లు రిజర్వ్ చేసుకునేందుకు వందలాది మంది ఆర్టీసీని సంప్రదిస్తున్నారు. ‘మా వద్ద అలాంటి బస్సుల్లేవు’అని సింపుల్‌గా సమాధానమిచ్చి సిబ్బంది చేతులు దులుపుకొంటున్నారు. సురక్షిత ప్రయాణంలో ఆర్టీసీతోనే సాధ్యమన్న అభిప్రాయం సాధారణ ప్రయాణికుల్లో ఉంది. అందుకే చాలామంది ఆర్టీసీ బస్సుల్లోనే ప్రయాణించేందుకు మొగ్గుచూపుతారు. కానీ, స్లీపర్ బస్సుల్లేక తప్పని పరిస్థితిలో ప్రైవేటు బస్సుల్లో ప్రయాణిస్తున్నారు. సీఎం భేటీలో ప్రస్తావన వచ్చినా.. ఇటీవల సమ్మె ముగిసేవేళ ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్వహించిన సమావేశంలో స్లీపర్ బస్సుల అంశం ప్రస్తావనకు వచ్చింది. దీంతో ఇప్పటికిప్పుడు భారీ ఖర్చు చేసి కొత్త బస్సులు కొనడం కంటే, అందుబాటులో ఉన్న గరుడ బస్సుల్లో కొన్నింటిని స్లీపర్ సర్వీసులుగా మార్చాలని నిర్ణయించారు. సమ్మె అనంతరం రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ కూడా ఇదే విషయాన్ని వెల్లడించారు. తొలుత 25 బస్సులను స్లీపర్ సర్వీసులుగా మార్చాలని యోచిస్తున్నామని పేర్కొన్నారు. కానీ అధికారులు మాత్రం ఇప్పటివరకు అలాంటి కసరత్తే చేయలేదు. సరుకు రవాణా కోసం పాత ఆర్టీసీ బస్సులను బస్‌బాడీ వర్క్‌షాపులో కార్గో సర్వీసులుగా మారుస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే 50 వరకు బస్సులను కార్గో వాహనాలుగా మార్చేశారు. వెన్నెల సర్వీసులు.. తుక్కుగా మారి.. వెన్నెల పేరుతో ఆర్టీసీ స్లీపర్ బస్సులు నిర్వహించింది. ఇటీవలి వరకు రెండు బస్సులుండేవి. అవి పాతబడి మరమ్మతులు చేస్తే కాని నడిచే పరిస్థితి లేకపోవడంతో వాటిని తుక్కుగా మార్చేశారు. దీంతో ఇప్పుడు ఒక్క స్లీపర్ బస్సు కూడా లేకుండా పోయింది. వృద్ధులు, నడుము నొప్పి, వెన్ను పూస సమస్యలున్నవారు కూర్చుని దూర ప్రాంతాలకు ప్రయాణించలేకపోతున్నారు. వీరు స్లీపర్ బస్సులనే ఎంచుకుంటున్నారు. దీంతో ప్రైవేటు ట్రావెల్స్ నిర్వాహకులు అలాంటి వారిని ఆకర్షించేందుకు స్లీపర్ సర్వీసుల సంఖ్యను పెంచుకుంటున్నాయి. ఇప్పటివరకు హైదరాబాద్ నుంచి మాత్రమే ఆ సర్వీసులు అందుబాటులో ఉండగా.. తాజాగా వరంగల్, కరీంనగర్ లాంటి పట్టణాల నుంచి ప్రారంభిస్తున్నారు. ఇటీవల వరంగల్ నుంచి ఓ ప్రైవేటు సంస్థ బెంగళూరుకు సర్వీసు ప్రారంభించింది. ఇది నిబంధనలకు విరుద్ధం కావడంతో ఆర్టీసీ అధికారులు అడ్డుకున్నారు. కానీ చర్యలు తీసుకోవాల్సిన రవాణా శాఖ చేతులెత్తేయడంతో ఆ బస్సు నిండుగా ప్రయాణికులతో దర్జాగా పరుగులు తీస్తోంది. మరికొద్ది రోజుల్లో ప్రైవేటు సంస్థలు స్లీపర్ సర్వీసుల సంఖ్యను 1,500కు పెంచుకునేందుకు కసరత్తు చేస్తున్నాయి. -
రైలు ఆర్ఏసీ బెర్తుల పెంపు
న్యూఢిల్లీ: మరింత మంది ప్రయాణికులకు స్లీపర్ తరగతిలో చోటు కల్పించేలా రైల్వే శాఖ ఆర్ఏసీ బెర్తుల సంఖ్యను పెంచింది. ఈ నిర్ణయం జనవరి 16 నుంచి అమల్లోకి వస్తుంది. ప్రస్తుతం స్లీపర్ బోగీల్లో ఉన్న 5 ఆర్ఏసీ బెర్తులను 7కు పెంచారు. దీని వల్ల 10 మందికి బదులు 14 మందికి స్థానం దొరుకుతుంది. 3 ఏసీ కోచ్‌లలో ప్రస్తుతం ఉన్న 2 ఆర్ఏసీ బెర్తులను 8 మందికి చోటు కల్పించేలా 4కు పెంచారు. 2 ఏసీ కోచ్‌లలో ఈ బెర్తులను 2 నుంచి 3కు పెంచారు. దీంతో ఆరుగురికి స్థానం లభిస్తుంది. ఆర్ఏసీ టికెట్‌దారునికి సీటు ఖరారైనా రాత్రి పడుకునేందుకు అవసరమైన బెర్తు నిరీక్షణ జాబితాలో ఉంటుంది. రిజర్వేషన్ టికెట్ కొనుగోలుదారులు సమయానికి రైలెక్కకపోయినా, రద్దు చేసుకున్నా వారి బెర్తును ఆర్ఏసీ టికెట్ కొనుగోలుదారులకు కేటాయిస్తారు. ఇద్దరికి ఆర్ఏసీ టికెట్లుంటే బెర్తును రెండు సీట్లుగా విభజిస్తారు.