వందేభారత్‌ స్లీపర్‌ కోచ్‌ వచ్చేసింది..విశేషాలివే.. | Vandebharath Sleeper Coach Unveiled By Minister Ashwini Vaishnav | Sakshi
Sakshi News home page

వందేభారత్‌ స్లీపర్‌ కోచ్‌ వచ్చేసింది..విశేషాలివే..

Published Sun, Sep 1 2024 7:10 PM | Last Updated on Sun, Sep 1 2024 7:38 PM

Vandebharath Sleeper Coach Unveiled By Minister Ashwini Vaishnav

బెంగళూరు: ప్రతిష్టాత్మక వందే భారత్‌ స్లీపర్‌ కోచ్‌ నమూనాను కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ ఆవిష్కరించారు. బెంగళూరులోని భారత్ ఎర్త్ మూవర్స్ లిమిటెడ్(బీఈఎమ్‌ఎల్‌) తయారీ కర్మాగారంలో వీటిని ప్రారంభించారు. బీఈఎమ్‌ఎల్‌లో ఏర్పాటు చేసిన వందే భారత్ తయారీ కేంద్రానికి మంత్రి  ఆదివారం(సెప్టెంబరు1) శంకుస్థాపన చేశారు. 

ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వైష్ణవ్‌ మాట్లాడుతూ  ఈ రోజు ముఖ్యమైన ప్రయాణాన్ని ప్రారంభిస్తున్నామన్నారు. వందే భారత్‌ చైర్‌ కార్‌ విజయవంతమైన తర్వాత, వందే భారత్‌ స్లీపర్‌ కోసం చాలా శ్రమించామని చెప్పారు.

వందేభారత్‌ స్లీపర్‌ కోచ్‌ల తయారీ ఇప్పుడే పూర్తయిందన్నారు. పది రోజుల పాటు వీటికి కఠినమైన ట్రయల్స్‌, టెస్ట్‌లు నిర్వహించనున్నామని తెలిపారు. మూడు నెలల్లో ప్రయాణికులకు ఈ కోచ్‌ల సేవలు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందన్నారు.

 వందేభారత్‌ స్లీపర్‌ కోచ్‌లలో ఉండే సౌకర్యాలు ఇవే...

  • కోచ్‌లలో రీడింగ్‌ ల్యాంప్స్‌, ఛార్జింగ్‌ అవుట్‌లెట్‌లు, స్నాక్‌ టేబుల్, మొబైల్‌, మ్యాగజైన్‌ హోల్టర్స్‌ ఉంటాయి.
  • రైల్వే ప్రమాదాలకు అడ్డుకట్ట వేసే ‘కవచ్‌’ వ్యవస్థ ఉంటుంది.
  • అన్ని కోచ్‌లు స్టెయిన్‌లెస్‌ స్టీల్‌ బాడీతో నిర్మించారు. లోపల జీఎఫ్‌ఆర్‌పీ ఇంటీరియర్ ప్యానెల్స్ ఉంటాయి.
  • కోచ్‌లన్నీ అగ్నిమాపక భద్రతా ప్రమాణాలకు అనుగుణంగా ఉంటాయి.
  • ఆటోమేటిక్‌ డోర్లు, మెరుగైన సదుపాయాలతో మరుగు దొడ్లు, కొత్త టెక్నాలజీతో రూపొందించిన సీటు కుషన్‌లు ఇందులో అమర్చారు.
  • 16 కోచ్‌లు, 823 బెర్త్‌లతో స్లీపర్‌ ట్రైన్‌ రానుంది. వీటిలో పదకొండు 3టైర్‌ ఏసీ కోచ్‌లు (600 బెర్త్‌లు), నాలుగు 2 టైర్‌ ఏసీ కోచ్‌లు (188 బెర్త్‌లు), ఒక ఫస్ట్‌ టైర్‌ ఏసీ కోచ్‌(24 బెర్త్‌లు) ఉంటాయి. 

 

 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement