దేశంలోనే తొలి వందేభారత్ స్లీపర్ రైలును ఆరు నెలల్లో అందుబాటులోకి తెస్తామని కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు.
బెంగుళూరులో బీఈఎంఎల్ తయారు చేసిన వందే భారత్ స్లీపర్ ప్రోటోటైప్ రైలు కార్ బాడీ స్ట్రక్చర్‌ను ఆవిష్కరించిన అనంతరం ఆయన మాట్లాడుతూ.. వందే భారత్ చైర్ కార్, నమో-భారత్ (రాపిడ్ రైల్ ట్రాన్సిట్ సిస్టమ్), అమృత్ భారత్ రైలు (పుష్-పై రైళ్లు) విజయవంతమయ్యాక తదుపరి వందే భారత్ స్లీపర్, వందే మెట్రో రైళ్లను పరిచయం చేయడమేనని అన్నారు.
Furnishing of Vande Sleeper started! pic.twitter.com/itYaSQyNG2
— Ashwini Vaishnaw (मोदी का परिवार) (@AshwiniVaishnaw) March 9, 2024
వందే భారత్ స్లీపర్ వెర్షన్‌లో పురోగతి ఆశాజనకంగా ఉందని, పూర్తి నిర్మాణం, పైకప్పుతో సహా కొత్త డిజైన్ పూర్తయిందని వైష్ణవ్ చెప్పారు. ఫర్నిషింగ్ త్వరలో ప్రారంభమవుతుంది. రాబోయే ఆరు నెలల్లో పూర్తి చేయాలని మేము భావిస్తున్నామని వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment