
న్యూఢిల్లీ: 26/11 ముంబై దాడుల కీలక సూత్రధారి,లష్కరే తోయిబా ఉగ్రవాది తహవుర్ రాణా (Tahawwur Hussain Rana) భారత్‌కు చేరుకున్నాడు. అమెరికా నుంచి వచ్చిన తహవుర్ రాణాను తీసుకు వచ్చిన ప్రత్యేక విమానం ఢిల్లీ ఎయిర్‌పోర్టులో ల్యాండయ్యింది.
ఈ తరుణంలో రాణాకు జైల్లో వీఐపీ ట్రీట్మెంట్ అంటే ప్రత్యేక సెల్, బిర్యానీ వంటి వీఐపీ ట్రీట్మెంట్ ఇవ్వకూడదని, అతన్ని ఉరితీయాలని దేశ ప్రజలు సోషల్ మీడియా వేదికగా అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.
తహవూర్ రాణాను ఉరితీయాలి
వారిలో 2008లో ముంబై ఉగ్రవాద దాడుల నుండి అనేక మందిని ప్రాణాలు కాపాడిన స్థానిక టీసెల్లర్ ఛోటు చాయ్ వాలా అలియాస్ మహ్మద్ తౌఫిక్ సైతం ఉన్నారు. ఉగ్రవాదులను అంతం చేయాలంటే దేశంలో కఠినమైన చట్టాలు తీసుకురావాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆయన పీటీఐతో మాట్లాడారు. అజ్మల్ కసబ్‌కు ఇచ్చినట్లుగా తహవూర్ రాణాకు ప్రత్యేక సెల్ లేదా, బిర్యానీ, ఇతర సౌకర్యాలు అందించాల్సిన అవసరం లేదన్నారు
#WATCH | Mumbai: On 26/11 Mumbai attacks accused Tahawwur Rana's extradition to India, Mohammed Taufiq, a tea seller known as 'Chhotu Chai Wala' whose alertness helped a large number of people escape the attack, says, "...For India, there is no need to provide him with a cell.… pic.twitter.com/zLqHEt7sHs
— ANI (@ANI) April 9, 2025
‘రాణాను భారత్‌కు తీసుకుని రావడం శుభపరిణామం. కానీ అతనిని 15 రోజుల్లో లేదా రెండు మూడు నెలల్లో బహిరంగంగా ఉరితీయాలి. ఇలాంటి ఉగ్రవాదులకు ఎటువంటి ప్రత్యేక వసతులు ఇవ్వాల్సిన అవసరం లేదు. అజ్మల్ కసబ్‌కు జైల్లో అందించిన వీఐపీ ట్రీట్మెంట్ ఇవ్వకూడదు. ఇలాంటి వారిపై కోట్ల రూపాయలు ఖర్చు చేయడం వృధా. రాణాను ఉరితీసేవరకు తాను ఎదురు చూస్తాను. నాటి ఉగ్రదాడి బాధితులకు ప్రభుత్వం సహాయం అందించింది. కానీ డబ్బుతో ప్రాణాల్ని తిరిగి తెచ్చుకోలేం కదా?’ అనే అభిప్రాయం వ్యక్తం చేశారు. తహవూర్ రాణాను భారత్‌కు అప్పగించినందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు కృతజ్ఞతలు తెలిపారు.
ఉగ్రమూకల నుంచి ప్రజల్ని కాపాడి
2008 నవంబర్‌లో ఉగ్రవాదుల దాడి జరిగినప్పుడు దక్షిణ ముంబైలోని ఛత్రపతి శివాజీ మహారాజ్ టెర్మినల్ సమీపంలో మహ్మద్ తౌఫిక్ టీ స్టాల్ నడుపుతున్నారు.ఆ సమయంలో ఉగ్రవాదులు దాడిలో ప్రాణాలు కోల్పోతున్న ప్రజల్ని చూసిన తౌఫిక్ అప్రమత్తమయ్యారు.వెంటనే వారిని ఉగ్రవాదులు కాల్పులు జరుపుతున్నారని,జాగ్రత్తగా ఉండాలని సూచించారు. వారిని సురక్షితంగా ఉగ్రవాదుల నుంచి తప్పించారు. అప్పటికే ముష్కరుల చేతిలో గాయపడిన బాధితుల్ని ఆస్పత్రి తరలించారు.