Jail
-
పోక్సో కేసులో నిందితుడికి టీచర్ ఉద్యోగం, లైసెన్స్ ఇచ్చినట్టా..!?
జైలు నుంచే బీపీఎస్సీ (బీహార్ పబ్లిక్ సర్వీస్ కమిషన్) పరీక్షలో ఉత్తీర్ణత సాధించాడో వ్యక్తి. సంకెళ్లున్న చేతులతోనే ప్రభుత్వ ఉపాధ్యాయుడుగా అప్పాయింట్మెంట్ లెటర్‌ను అందుకున్నాడు. ఈ అసాధారణమైన, దిగ్భ్రాంతికరమైన ఉదంతంతో ఎక్కడ చోటుచేసుకుంది. అసలేంటీ స్టోరీ తెలుసుకుందాం.బిహార్‌లో గయలో సంఘటన జరిగింది. గత 18 నెలలుగా జైలులో ఉన్న విపిన్ కుమార్ ఉపాధ్యాయ పదవికి నియామక లేఖ అందుకున్నాడు. పట్నాలోని బూర్ జైలులో ఉండగానే, TRI-3 పరీక్ష రాసి ఉత్తీర్ణుడయ్యాడు. దీంతో ప్రభుత్వం అతన్ని ఉపాధ్యాయుడిగా నియమించింది. గయా జిల్లాలోని మోహన్పూర్ పోలీస్ స్టేషన్ ప్రాంతంలోని ఎర్కి గ్రామానికి చెందిన విపిన్ కుమార్ గతంలో పాట్నాలోని దనాపూర్లోని ఒక కోచింగ్ ఇన్స్టిట్యూట్లో టీచర్‌గా పనిచేసేవాడు. దాదాపు ఒకటిన్నర సంవత్సరాల క్రితం, అదే కోచింగ్ ఇన్స్టిట్యూట్లో చదువుతున్న ఒక మైనర్ బాలిక అతనిపై పోక్సో చట్టం కింద దానాపూర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. తనపై అనుచితంగా ప్రవర్తించాడని ఆరోపణలు నమోదు చేసింది. ఈ కేసు తీవ్రతను పరిగణనలోకి తీసుకున్న పోక్సో చట్టం కింద పోలీసులు వెంటనే విపిన్‌ను అరెస్టు చేశారు అప్పటి నుండి అతను జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నాడు.ఉన్న నిందితుడు విపిన్ కుమార్ బీపీఎస్సీ పరీక్ష రాసి విజయం సాధించాడు. ఒకటి నుండి ఐదు తరగతుల వరకు జనరల్ సబ్జెక్టులను బోధించేందుకు పాఠశాల ఉపాధ్యాయుడిగా ఎంపికయ్యాడు. దీంతో చేతులకు బేడీలతోనే పోలీసు కస్టడీలో బుద్ధ గయలోని మహాబోధి సాంస్కృతిక కేంద్రంలో జరిగిన నియామక పత్రాల పంపిణీ కార్యక్రమానికి హాజరయ్యాడు. తాత్కాలిక నియామక లేఖను అందుకున్నాడు.18 నెలల జైలు శిక్ష సమయంలో, అనేక సవాళ్లను మధ్య ఈ పరీక్షలో విజయవంతం కావడం విశేషంగా నిలిచింది. దీనిపై సంతోషం వ్యక్తం చేసిన విపిన్ తన భవితవ్యం ఆందోళన వ్యక్తం చేశాడు. తనపై వచ్చిన ఆరోపణలు పూర్తిగా నిరాధారమైనవన్నాడు. కోర్టు తనను దోషిగా గుర్తిస్తే, ఈ ఉద్యోగం రద్దవతుందని వాపోయాడు అయితే జైలులోని ఇతర ఖైదీలకు విద్యను అందించాల భావిస్తున్నానని, తద్వారా వారిలో విద్య వెలుగులను వ్యాప్తి చేయాలనేది తన లక్ష్యమని పేర్కొన్నాడు. ఇదీ చదవండి: సునీతా విలియమ్స్ మీద సింపతీలేదు : యూఎస్ ఖగోళ శాస్త్రవేత్తభిన్న వాదనలుపోక్సో నిందితుడు విపిన్ కుమార్ టీచర్ ఉద్యోగానికి అర్హత సాధించి జాయినింగ్ లెటర్ అందుకోవడంపై వ్యతిరేకత కూడా వ్యక్తమవుతోంది. తన ఇంటికి ట్యూషన్ కోసం వచ్చే మైనర్ బాలికను అత్యాచార చేశాడన్న ఆరోపణలపై జైలులో ఉన్నఅతనికి టీచర్ ఉద్యోగమా; అంటే వేధింపులకు లైసెన్స్ ఇచ్చినట్టా? అతన్ని ఎలా నమ్మాలి? అంటూ మరికొంత మంది ఆగ్రహం వ్యక్తం చేశారు. అతనికి శిక్షపడుతుందా? లేదంటే నిర్దోషిగా బైటపడి, తన ప్రభుత్వ ఉద్యోగాన్ని నిలబెట్టుకుంటాడా? అనేదే సోషల్ మీడియాలో పెద్ద చర్చనీయాంశంగా మారింది. -
పుట్టిన ఏడాదికే తల్లి వెంటే జైలుకు పసిబిడ్డ.. పాపం ఈ చిన్నారికి ఎంత కష్టమొచ్చిందో
బెంగళూరు : ప్రసవించిన 14రోజులకే అనివార్య కారణాలతో రూ.60వేలకు విక్రయమైన ఏడాది వయస్సున్న పసిబిడ్డ ప్రస్తుతం తల్లితో పాటు జైలు చేరిన విషాదం ఘటన కర్ణాటకలో చోటు చేసుకుంది. బళ్లారి గౌతం నగర్ నివాసి యల్లమ్మ గతేడాది ఫిబ్రవరిలో బీఎంసీఆర్‌సీలో పసిబిడ్డకు జన్మనించింది. ఈమె భర్త చనిపోయాడు. తనకు ఆ బిడ్డ వద్దని రూపనగుడి రోడ్డు నివాసి నవీన్ కుమార్‌కు రూ.60వేలకు విక్రయించింది.ఈ విషయాన్ని తెలుసుకున్న బాలలరక్షణ శాఖ సహాయ వాణికి గత ఆగస్ట్ 5న సమాచారం రావడంతో వారు బళ్లారి గ్రామీణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై దర్యాప్తు జరిపి పసిబిడ్డను ఆంధ్రప్రదేశ్‌లోని ఆలూరు నుంచి తీసుకొచ్చారు. బిడ్డను కొనుగోలు చేసిన నవీన్ కుమార్, విక్రయించిన బిడ్డ తల్లి యల్లమ్మను అరెస్ట్ చేశారు. ప్రస్తుతం ఆ బిడ్డను బళ్లారి జైల్లో ఉన్న సొంత తల్లి వద్దకే చేర్చారు.ఈ కేసులో విక్రయించిన,కొనుగోలు చేసిన వారికి 10ఏళ్ల శిక్ష ఉంటుంది. కోర్టులో నేరం రుజువైతే తల్లితో పాటు బిడ్డ కూడా శిక్ష అనుభవించాలా? లేక బాలల రక్షణ శాఖలోని అమ్మఒడి ఆశ్రమంలో ఉంటుందా? అనే సందేహం తలెత్తుతోంది. కాగా, తల్లి వద్దు అనుకున్న బిడ్డను సంతానం లేని దంపతులు గత ఏడాది నుంచి పెంచి పోషించి తల్లి ప్రేమకు నోచుకునేలా చేసిన ఆ తల్లిదండడ్రులకే దత్తత ఇస్తే బాగుంటుందని సమాజ శ్రేయోభిలాషులు అభిప్రాయపడ్డారు. -
గుంటూరు జైల్లో పోసానిని కలిసిన వైఎస్సార్సీపీ లీగల్ సెల్ నేతలు
సాక్షి, గుంటూరు: గుంటూరు జైల్లో పోసాని కృష్ణమురళిని వైఎస్సార్సీపీ లీగల్ సెల్ నేతలు శనివారం కలిశారు. రిమాండ్‌లో ఉన్న పోసానితో వైఎస్సార్సీపీ లీగల్ సెల్ అధ్యక్షుడు మనోహర్ రెడ్డి, లీగల్ సెల్ ప్రతినిధులు ములాఖాత్ అయ్యారు. అనంతరం మీడియాతో మనోహర్‌రెడ్డి మాట్లాడుతూ, పోసాని అనారోగ్యంతో ఉన్నారని.. కూటమి ప్రభుత్వం పోసానిపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతుందన్నారు.‘‘2016లో నంది అవార్డుల కమిటీలో ఏకపక్షంగా ఉందని మాట్లాడినందుకు రాష్ట్రవ్యాప్తంగా ఆయనపై 12 కేసులు పెట్టారు. మీడియాతో మాట్లాడితే కేసులు పెడతారా?. మరోసారి ప్రెస్ మీట్ పెడితే మరో 6 కేసులు పెట్టారు. ప్రభుత్వం అక్రమంగా కేసులు బనాయించి రాష్ట్రవ్యాప్తంగా పీటీ వారెంట్ల పేరుతో తిప్పి హింసిస్తోంది. పోలీసులు నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారు. పోసానిపై పెట్టిన నాలుగు కేసుల్లో 111 సెక్షన్లు పెట్టి బయటికి రానివ్వకుండా కుట్ర చేశారు.’’ అని మనోహర్‌రెడ్డి మండిపడ్డారు.‘‘కోర్టు పోలీసులకు చివాట్లు పెడుతున్న మారటం లేదు. రెడ్ బుక్కు టీడీపీకే కాదు. మాక్కూడా బుక్కులు ఉన్నాయి. మేము కూడా పేర్లు నమోదు చేసుకుంటున్నాం. ఇప్పటివరకు నిబంధనలు ఉల్లంఘించి అక్రమంగా కేసులు పెడుతున్న 62 మందిని గుర్తించాం. చంద్రబాబు జైలుకెళ్లినప్పుడు ఆయనకు ఆరోగ్యం బాగాలేదని పిటిషన్ల మీద పిటిషన్ల వేశారు. అమ్మో ఇంకేముంది అని హడావుడి చేశారు. అందరివి చంద్రబాబు లాంటి ప్రాణాలే. పోలీసులు ఆర్గనైజర్ క్రైమ్ చేస్తున్నారు. కేసులు పెట్టి పోలీసులు వాటి సమాచారాన్ని దాచేస్తున్నారు. ఒక కేసులో బెయిల్ రాగానే మరొక కేసుని బయటికి తీస్తున్నారు’’ అంటూ మనోహర్‌రెడ్డి ధ్వజమెత్తారు. -
గుంటూరు జైలులో పోసాని కృష్ణమురళికి అంబటి రాంబాబు పరామర్శ
-
47 ఏళ్ల క్రితం ఆఖరి ఉరి
ప్రణయ్ హత్య కేసులో తీర్పు వెలువడింది. ఏ2గా సుభాష్ శర్మను కోర్టు దోషిగా నిర్ధారిస్తూ మరణశిక్ష విధించింది. అయితే శిక్ష అమలు కావడానికి మూడు అంకాలు దాటాల్సి ఉంటుంది. ఇక్కడ తెరపైకి వచ్చే అంశం ఏమిటంటే.. ప్రస్తుతం రాష్ట్రంలోని ఏ జైలులోనూ గ్యాలోస్ (ఉరికంబం ఉండే ప్రాంతం సాంకేతిక నామం) లేదు. తలారులుగా పిలిచే హ్యాంగ్ మన్ పోస్టులు అసలే లేవు.రాష్ట్రపతి వరకు అప్పీల్‌కు చాన్స్..ప్రస్తుతం ట్రయల్ కోర్టు సుభాష్ శర్మకు మరణశిక్ష విధించింది. అతను ఈ తీర్పును హైకోర్టులో సవాల్ చేసే అస్కారం ఉంది. అంతేకాదు ట్రయల్ కోర్టు కూడా ఈ శిక్ష విషయాన్ని హైకోర్టు దృష్టికి తీసుకువెళ్తుంది. ఈ క్రమంలో ‘రిఫర్డ్ ట్రయల్’గా పిలిచే విధానంలో హైకోర్టు విచారణ చేయవచ్చు. మరణశిక్షను హైకోర్టు సమర్థిస్తే.. సుప్రీంకోర్టులో అప్పీల్ చేయవచ్చు. అక్కడా చుక్కెదురైతే క్షమాభిక్ష కోరుతూ రాష్ట్రపతికి విజ్ఞప్తి చేయవచ్చు. రాష్ట్రపతి తిరస్కరిస్తే.. దోషులకు విధించిన మరణశిక్ష పూర్తిగా ఖరారైనట్లే. దీంతో శిక్ష విధించినన్యాయస్థానానికి సంబంధించిన రాష్ట్రంలో.. మరణశిక్షను అమలు చేస్తారు. ఉమ్మడి రాష్ట్రంలో 47 ఏళ్ల క్రితం..ఉమ్మడి ఏపీ రాష్ట్రానికి సంబంధించి ఆఖరి ఉరిశిక్షను 47 ఏళ్ల క్రితం ముషీరాబాద్ సెంట్రల్ జైలులో అమలు చేశారు. 1978లో భారత వైమానిక దళంలో పనిచేసిన ఎయిర్‌మన్ రామవతార్ యాదవ్‌పై హత్య కేసు నిరూపితమై, మరణశిక్ష ఖరారు కావడంతో ఉరి తీశారు. అప్పట్లో ముషీరాబాద్ సెంట్రల్ జైల్ సూపరింటెండెంట్‌గా ఉన్న సుబ్బారెడ్డి పర్యవేక్షణలో శిక్షను అమలైంది. తర్వాతి కాలంలో ముషీరాబాద్ సెంట్రల్ జైలును చర్లపల్లి ప్రాంతానికి మార్చారు.ఇక్కడ జైలు నిర్మిస్తున్నప్పుడు గ్యాలోస్ (ఉరికంబం) కోసం ఓ ప్రాంతాన్ని ఎంపిక చేసినా ఏర్పాటు చేయలేదు. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో ఉరికంబం ఉన్న జైలు ఒక్క రాజమండ్రి సెంట్రల్ జైలు మాత్రమే. ఇక తెలంగాణ జైళ్ల శాఖలో హ్యాంగ్‌మన్‌గా పిలిచే తలారీ పోస్టులు లేవు. చాలా ఏళ్లుగా ఉరిశిక్ష అమలు లేకపోవడంతో కొందరు హెడ్–వార్డెర్లకే ఈ అంశంలో ప్రాథమిక శిక్షణ ఇస్తున్నారు.రాజమండ్రి జైల్లో 49 ఏళ్ల క్రితం...రాజమండ్రి సెంట్రల్ జైలులో చివరిసారిగా 1976 ఫిబ్రవరిలో ఉరిశిక్షను అమలు చేశారు. ఓ హత్య కేసులో దోషిగా తేలిన అనంతపురం జిల్లాకు చెందిన నంబి కిష్టప్పను ఉరి తీశారు. తర్వాత కొందరు ఖైదీలను ఉరిశిక్ష అమలు కోసం ఈ జైలుకు తరలించినా అమలు కాలేదు. 1875 నుంచీ గ్యాలోస్ ఉండి, ఇప్పటికీ కొనసాగుతున్న కేంద్ర కారాగారం రాజమండ్రి సెంట్రల్ జైల్ మాత్రమే.స్వాతంత్య్రం అనంతరం దేశవ్యాప్తంగా వివిధ కారాగారాల్లో దాదాపు 100 మందిని ఉరితీశారు. అందులో అత్యధికంగా 42 శిక్షలను రాజమండ్రి సెంట్రల్ జైల్లోనే అమలు చేశారు. ఉరి అమలుకు ముందు సదరు ఖైదీని ఆఖరి కోరిక ఏమిటని అడగటం ఆనవాయితీ. కిష్టప్ప తన ఆఖరి కోరికగా లడ్డూ తింటానని కోరగా.. జైలు అధికారులు అతడికి లడ్డూలు అందించారు. రాజమండ్రి జైలు తలారీ ధర్మరాజు ఆ ఉరి తీశారు.అదో ప్రత్యేకమైన గ్యాలోస్..రాజమండ్రి సెంట్రల్ జైల్లోని గ్యాలోస్ 1980 వరకు ప్రధాన ద్వారం పక్కనే బహిరంగ ప్రదేశంలో ఉండేది. ఉరిశిక్ష అమలు తర్వాత మృతదేహాన్ని ఉరికంబం కింద ఉండే ప్రత్యేక చాంబర్లో దింపుతారు. అక్కడి నుంచి నేరుగా ట్రే ద్వారా సంబంధీకులకు అప్పగించాలని, మృతదేహాన్ని జైలుగదుల మీదుగా బయటికి తీసుకురావద్దనే ఉద్దేశంతో అలా ఏర్పాటు చేశారు. 1980 తర్వాత గ్యాలోస్‌ను అడ్మినిస్ట్రేటివ్ భవనం పరిసరాల్లోకి మార్చారు.2013లో ఈ గ్యాలోస్ ఉన్న ప్రాంతంలోనే రూ.7.5 కోట్లతో కొత్తగా పరిపాలనా భవనాన్ని నిర్మించారు. అయితే గ్యాలోస్‌ను అక్కడి నుంచి మార్చడం ఇష్టం లేక భవనం కింద భూగర్భంలో ఏర్పాటు చేశారు. ఈ తరహా గ్యాలోస్ కలిగిన కారాగారం దేశంలో మరోటి లేదు. అంతేకాదు నిర్మాణాలు ఎన్ని మారినా ఇప్పటికీ బ్రిటిష్ కాలం నాటి ఇనుప ఉరికంబాన్నే వినియోగిస్తున్నారు. తరచూ దీనికి నూనె రాస్తూ దెబ్బతినకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. -
నన్ను అందరూ ఉన్న సెల్‌లోకి మార్చండి
విజయవాడ లీగల్ : మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మూడ్రోజుల పోలీసు కస్టడీ ముగిసింది. వైద్య పరీక్షల అనంతరం పోలీసులు వంశీని గురువారం రెండవ అదనవు జిల్లా మరియు సెషన్స్ కోర్టులో హాజరుపరిచారు. ఈ సందర్భంగా న్యాయమూర్తి వద్ద ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. జైలు బ్యారక్‌లో తనను ఒంటరిగా ఉంచారని, ఆస్తమా సమస్యతో బాధపడుతున్నట్లు తెలిపారు. భద్రతాపరంగా తనకు ఇబ్బంది లేనప్పటికీ అందరూ ఉన్న సెల్‌లోకి తనను మార్చాలని కోరారు. తాను ఇన్‌ఛార్జి న్యాయమూర్తిగా ఉన్నందున వేరేవారిని సెల్లో ఉంచేందుకు ఉత్తర్వులు ఇవ్వలేనని న్యాయమూర్తి తెలిపారు. సెల్ మార్చాలనే అంశంపై రెగ్యులర్ కోర్టులో మెమో దాఖలు చేసుకోవాలని సూచించారు. ఇక తనను కేసుతో సంబంధంలేని ప్రశ్నలు అడిగారని.. సత్యవర్థన్‌కు నార్కో అనాలసిస్ పరీక్షలు నిర్వహిస్తే అసలు నిజాలు బయటకొస్తాయని న్యాయమూర్తికి వంశీ చెప్పారు. కాగా.. వంశీ ఆరోగ్యం దృష్ట్యా ఒక వార్డెన్‌ను ఏర్పాటుచేయడానికి తమకు అభ్యంతరంలేదని.. ఆయన భద్రత దృష్ట్యా మాత్రమే ఆయన్ను సెల్లో ఒంటరిగా ఉంచినట్లు ప్రభుత్వ న్యాయవాదులు తెలిపారు. ఇప్పటివరకు ఎఫ్ఐఆర్ ఇవ్వలేదు: వంశీ సతీమణిఈ కేసుకు సంబంధించి వంశీని ఎందుకు అరెస్టుచేశారో ఇంతవరకు తమకు తెలీదని.. ఇప్పటివరకు తమకు ఎఫ్ఐఆర్ కూడా ఇవ్వలేదని, ఏ విషయంలో అరెస్టుచేశారో కూడా తెలీడంలేదని వల్లభనేని వంశీ సతీమణి పంకజశ్రీ మీడియాకు తెలిపారు. మూడ్రోజుల కస్టడీలో పోలీసులు తన భర్తను అర్థంపర్థంలేని ప్రశ్నలతో విసిగించారని ఆమె తెలిపారు. వంశీని ప్రభుత్వం టార్గెట్ చేసింది.. మాజీ ఎమ్మెల్యే మొండితోక జగన్మోహనరావు మాటా్లడుతూ.. ప్రభుత్వం కావాలనే వంశీని టార్గెట్ చేసిందని, అందులో భాగంగానే అక్రమ కేసులు బనాయిస్తోందని మండిపడ్డారు. రాష్ట్ర ప్రజలందరికీ ఈ విషయం అర్థమైందన్నారు. న్యాయవాది తానికొండ చిరంజీవి మాట్లాడుతూ.. కేసుకు సంబంధించిన సమాచారం లేకుండా కేవలం సెక్షన్లు మాత్రమే పెట్టారని.. ఏ విషయంలో పెట్టారో తమకు సమాచారం ఇవ్వకపోవడం కూడా అక్రమ నిర్బంధం కిందకు వస్తుందన్నారు. వంశీ కస్టడీకి మళ్లీ పిటిషన్ వేస్తాం : ఏసీపీ వంశీ, అతని అనుచరులు సత్యవర్థన్‌ను బెదిరించి, భయపెట్టి కేసును తారుమారు చేయాలని చూసినట్లు సీసీ కెమెరా ఫుటేజీ, సాంకేతిక ఆధారాలను సేకరించామని ఏసీపీ దామోదర్ మీడియాకు వివరించారు. విచారణలో కొన్ని ప్రశ్నలకు అవునని చెప్పిన వంశీ, మరికొన్నింటికి తెలీదని, గుర్తులేదని చెప్పారన్నారు. తమకు పూర్తి సమాచారం రావాల్సి ఉన్నందున కస్టడీ కోరుతూ మరోసారి పిటిషన్ వేస్తామని చెప్పారు. ఇదిలా ఉంటే.. సత్యవర్థన్ కేసులో మరో ఇద్దరు నిందితులు వంశీబాబు వీర్రాజులను 10 రోజుల కస్టడీకి కోరుతూ పోలీసులు గురువారం పిటిషన్ వేశారు. -
బందీల విడుదలకు మార్గం సుగమం
జెరూసలెం: ఇజ్రాయెల్, పాలస్తీనా మధ్య బందీల విడుదలకు మార్గం సుగ మం అయ్యింది. ఇరు వ ర్గాలు తాజాగా ఓ ఒప్పందానికి వచ్చాయి. నలుగురు ఇ జ్రాయెల్ బందీల మృతదదేహాలను అప్పగించేందుకు హ మాస్ అంగీకరించగా, 600 మంది పాలస్తీనా ఖైదీలను విడుదల చేసేందుకు ఇజ్రాయెల్ అంగీకరించిందని ఈజిప్టు తెలిపింది. తొలి దశ కాల్పుల విరమణ ఒ ప్పందంలో భాగంగా బం«దీల మా ర్పిడి సమయంలోనూ,మృతదేహాలను విడుదల చేసినప్పుడు హమాస్ అవమానకరంగా వ్యవహరించిందంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. తొలి దశలోని పాలస్తీనా ఖైదీల విడుదల విషయంలో ఇజ్రాయెల్ కాలయాపన చేసింది. ఈ జాప్యం కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించడమేనని హమా స్ పేర్కొంది. వారిని విడుదల చేసేవరకు రెండో దశ చర్చలు సాధ్యం కాదని పేర్కొంది. మొదటి దశ ఒప్పందం ఈ వారంతో ముగియనుండటంతో బం«దీల మార్పిడిపై ఈజిప్టు పర్యవేక్షణలో మంగళవారం రాత్రి చర్చలు జరిగాయి. ఖైదీలను విడుదల చేసేందుకు ఇజ్రాయెల్, మృతదేహాలను అప్పగించేందుకు హమా స్ అంగీకరించాయి. గురువారం నాటికి మారి్పడి జరిగే అవకాశం ఉంది. ఇజ్రాయెల్ బంధీల మృతదేహాలను ఎటువంటి బహిరంగ వేడుకలు లేకుండా ఈజిప్టు అధికారులకు అప్పగించనున్నారు. గాజా కాల్పుల విరమణ..జనవరి 19న కాల్పుల విరమణ అమల్లోకి వచి్చనప్పటి నుంచి హమాస్ 25 మంది ఇజ్రాయెల్ బందీలను బహిరంగ వేడుకల ద్వారా విడుదల చేసింది. హమాస్ చర్యలను ఇజ్రాయెల్‌తో పాటు రెడ్‌క్రాస్, ఐక్యరాజ్యసమితి అధికారులు ఖండించారు. ఈ నేపథ్యంలో ఖైదీలు, బందీల మారి్పడిని హుందాగా, వ్యక్తిగతంగా చేపట్టాలని అంతర్జాతీయ రెడ్ క్రాస్ కమిటీ ఇరు వర్గాలను కోరింది. మరోవైపు ఇజ్రాయెల్ కూడా 1,100 మంది పాలస్తీనా ఖైదీలను విడుదల చేసింది. మొదటి దశ ముగింపు తాజా ఒప్పందంతో దాదాపు 2000 మంది పాలస్తీనా ఖైదీలకు బదులుగా ఎనిమిది మృతదేహాలు సహా 33 మంది ఇజ్రాయెల్ బందీల విడుదల ఒప్పందం ముగిస్తుంది. రెండో దశ చర్చలు కొన్ని వారాల కిందటే జరగాల్సి ఉండగా.. ఇంకా ప్రారంభం కాలేదు. ఈ నేపథ్యంలో అమెరికా మిడిల్ ఈస్ట్‌రాయబారి స్టీవ్ విట్కాఫ్ ఈ ప్రాంతంలో పర్యటించున్నారు. హమాస్ చెరలో ఉన్న మిగిలిన బందీలందరినీ విడుదల చేయాలని, యుద్ధానికి ముగింపు పలకడానికి రెండో దశ చర్చలకు వెళ్లాలని ఇరు పక్షాలను కోరనున్నారు. -
Mahakumbh: 75 జైళ్లలో ఖైదీల పవిత్ర స్నానాలు
లక్నో: యూపీలోని ప్రయాగ్‌రాజ్(Prayagraj)లో మహాకుంభమేళా అత్యంత వైభవోపేతంగా జరుగుతోంది. కోట్లాదిమంది భక్తులు పవిత్ర సంగమస్థలిలో పుణ్యస్నానాలు చేస్తున్నారు. తాజాగా యూపీలోని 75 జైళ్లలో గల ఖైదీలు కూడా త్రివేణీ సంగమంలోని నీటితో పవిత్ర స్నానాలు చేశారు. యూపీ జైలు అధికారులు తెలిపిన వివరాల ప్రకారం ప్రయాగ్‌రాజ్ నుంచి పవిత్ర జలాలను రాష్ట్రంలోని 75 జైళ్లకు తీసుకువచ్చారు. జైళశాఖ మంత్రి దారా సింగ్ నేతృత్వంలో ఖైదీల పుణ్యస్నానాల కార్యక్రమం సాగింది. లక్నో(Lucknow)లో జరిగిన కార్యక్రమంలో మంత్రి మాట్లాడుతూ ‘ప్రపంచంలోని ప్రజలంతా కుంభమేళాలో స్నానాలు చేయాలని ఉత్సాహం చూపిస్తుంటే, ఇక్కడి ఖైదీలకు ఎందుకు ఆ అవకాశం కల్పించకూడదని అనిపించింది. అందుకే ఖైదీలకు కూడా పుణ్యస్నానాలు చేసే అవకాశం కల్పించాలని అనుకున్నాం’ అని అన్నారు. జైలు అధికారులు మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలోని 75 జైళ్లలో మొత్తం 90 వేల మంది ఖైదీలున్నారన్నారు. జైళ్ల డైరెక్టర్ జనరల్(డీజీ) పీవీ రామశాస్త్రి మాట్లాడుతూ పవిత్ర సంగమం నుంచి తీసుకువచ్చిన జలాలను అన్ని జైళ్లకు పంపించామని, ఆ నీటిని స్నానాలకు ఉపయోగించే నీటిలో కలిపి, తరువాత డ్రమ్ములలో నింపారన్నారు. ఆ తరువాత ఖైదీలంతా ప్రార్థనలు చేసి, పుణ్యస్నానాలు చేశారన్నారు. ప్రయాగ్‌రాజ్ నుంచి తెచ్చిన అమృత కలశంతో పూజలు చేసిన తర్వాత ఖైదీలు పుణ్యస్నానాలు ఆచరించారని బాగ్పట్ జిల్లా(Baghpat District) జైలు డిప్యూటీ సూపరింటెండెంట్ ప్రశాంత్ కుమార్ మీడియాకు తెలిపారు. ఖైదీలు గంగామాతను కొనియాడుతూ ఎంతో ఉత్సాహంగా స్నానాలు చేశారని, ఈ అవకాశం కల్పించిన జిల్లా జైలు యంత్రాంగానికి ఖైదీలు కృతజ్ఞతలు తెలిపారని ప్రశాంత్ కుమార్ పేర్కొన్నారు.ఇది కూడా చదవండి: Sambhal: లౌడ్ స్పీకర్ బ్యాన్ చేశారని.. -
చీటింగ్ కేసులోమంత్రికి రెండేళ్ల జైలు శిక్ష
నాసిక్: 30 ఏళ్ల నాటి చీటింగ్, ఫోర్జరీ కేసుకు సంబంధించి రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి మాణిక్‌రావు కొకాటేకు నాసిక్ జిల్లా కోర్టు రెండేళ్ల జైలు శిక్ష, యాభైవేల జరిమానా విధించింది. ఈ కేసులో మంత్రి సోదరుడు సునీల్ కోకాటేను కూడా దోషిగా పేర్కొంటూ కోర్టు గురువారం తీర్పు వెలువరించింది. కోకాటే సోదరులు 1995లో తాము తక్కువ ఆదాయ వర్గానికి (ఎల్ఐజీ) చెందినవారమని పేర్కొంటూ ముఖ్యమంత్రి విచక్షణ కోటా కింద ఇక్కడి యోలకర్ మాలలోని కాలేజీ రోడ్డులో రెండు ఫ్లాట్లను పొందారు. దీనిపై మాజీ మంత్రి, దివంగత టీఎస్ ఢిఘోల్ ఫిర్యాదు మేరకు అప్పట్లో సర్కార్వాడ పోలీస్ స్టేషన్లో కోకాటే సోదరులు, మరో ఇద్దరిపై చీటింగ్, ఫోర్జరీ కే సు నమోదైంది. దీనిపై సుదీర్ఘ విచారణ అనంతరం కొకాటే సోదరులకు శిక్ష, జరిమానా విధించిన కోర్టు మరో ఇద్దరిని నిర్దోషులుగా విడుదల చేసింది. కాగా ఈ కేసులో తనకు బెయిల్ లభించిందని, ఉత్తర్వులపై పైకోర్టులో అప్పీలు చేస్తానని మంత్రి కొకాటే తెలిపారు. -
జగన్ మాట్లాడుతుంటే సీఎం సీఎం అంటూ నినాదాలు
-
వంశీతో వైఎస్ జగన్ ములాఖత్..మీడియాపై ఆంక్షలు
-
Supreme Court: నిందితుల్ని జైల్లోనే ఉంచడానికి పీఎంఎల్ఏ కేసులా?
న్యూఢిల్లీ: నిందితులను జైలులో ఉంచడానికి మనీ లాండరింగ్ నిరోధక చట్టం(పీఎంఎల్ఏ)ను ఉపయోగిస్తున్న ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ)పై సుప్రీంకోర్టు అసహనం వ్యక్తం చేసింది. వరకట్న చట్టం మాదిరిగా పీఎంఎల్ఏ నిబంధనలను కూడా దుర్వినియోగం చేస్తున్నారంటూ మండిపడింది. ఛత్తీస్‌గఢ్‌కు చెందిన మాజీ ఎక్సైజ్ అధికారి అరుణ్ పతి త్రిపాఠీకి బుధవారం బెయిల్ మంజూరు చేస్తూ జస్టిస్ అభయ్ ఎస్ ఓకా, జస్టిస్ ఉజ్జల్ భూయాన్‌ల ధర్మాసనం పై వ్యాఖ్యలు చేసింది. త్రిపాఠీపై చేసిన ఆరోపణలను ఛత్తీస్‌గఢ్ హైకోర్టు కొట్టివేసిన తర్వాత కూడా జైలులోనే ఉంచడంపై విస్మయం వ్యక్తం చేసింది. ‘ఓ వ్యక్తిని జైలులో ఉంచేందుకు పీఎంఎల్ఏను వాడుకోరాదు. ఆరోపణలను కోర్టు కొట్టివేసిన తర్వాత కూడా ఆయన్ను విడుదల చేయకుండా జైలులో ఉంచడాన్ని ఏమనాలి?. సెక్షన్ 498ఏ కింద పెళ్లయిన మహిళలు భర్త, అతడి కుటుంబీకులపై కట్నం వేధింపుల కేసులు ఎడాపెడా పెట్టినట్లే పీఎంఎల్ఏను కూడా దుర్వినియోగం చేయాలనుకుంటున్నారా?’అంటూ తలంటింది. ఇందుకు కారణమైన అధికారులకు సమన్లు జారీ చేస్తామంది. అయితే, సాంకేతికపరమైన కారణాలతో నేరగాళ్లకు బెయిలివ్వడం సరికాదని అదనపు సొలిసిటర్ జనరల్ ఎస్వీ రాజు ఈడీ తరఫున వాదించారు. -
డేరాబాబాకు మళ్లీ పెరోల్.. జైలుకొచ్చి స్వాగతించిన హనీప్రీత్
రోహ్తక్: హర్యానాకు చెందిన డేరా సచ్చా సౌదా చీఫ్ రామ్ రహీమ్‌కు మరోమారు పెరోల్ లభించింది. దీంతో ఆయన ఈరోజు (మంగళవారం) ఉదయం జైలు నుంచి బయటకు వచ్చారు. ఆయనను స్వాగతించేందుకు ఆయన ప్రధాన శిష్యురాలు హనీప్రీత్ స్వయంగా కారులో జైలుకు వచ్చారు.మీడియాకు అందిన వివరాల ప్రకారం డేరా చీఫ్ రామ్ రహీమ్‌కు 30 రోజుల పెరోల్ లభించింది. ఈ నేపధ్యంలో రామ్ రహీమ్ నేరుగా సిర్సా డేరా సచ్చా సౌదాకు చేరుకుంటారని తెలుస్తోంది. ఆయనను స్వాగతించేందుకు ఆశ్రమంలో ఘనమైన ఏర్పాట్లు చేశారు. కాగా రామ్ రహీమ్ దీనికిముందు 2024 అక్టోబర్‌లో పెరోల్‌పై బయటకు వచ్చారు. అప్పుడు ఆయన 20 రోజుల పెరోల్‌పై విడుదలయ్యారు. అప్పుడు ఆయన యూపీలోని బర్నావా ఆశ్రమానికి వెళ్లారు.నాటి పెరోల్ సమయంలో రామ్ రహీమ్ ఎన్నికల సంబంధిత కార్యకలాపాల్లో పాల్గొనకుండా, హర్యానాలోకి ప్రవేశించకుండా నిషేధించారు. 2017లో ఇద్దరు శిష్యురాళ్లపై అత్యాచారం చేసిన కేసులో రామ్ రహీమ్‌కు కోర్టు 20 సంవత్సరాల జైలు శిక్ష విధించింది. ఇదేవిధంగా 16 సంవత్సరాల క్రితం ఒక జర్నలిస్టు హత్య కేసులో రామ్ రహీమ్‌తో పాటు మరో ముగ్గురు కూడా దోషులుగా తేలారు.ఇది కూడా చదవండి: ఒక్క రోజులో 1.5 కోట్ల మంది పుణ్యస్నానాలు -
Bangladesh: ఆ 700 మంది ఖైదీలు ఎక్కడ?
ఢాకా: బంగ్లాదేశ్‌లో రాజకీయ గందరగోళం కొనసాగుతోంది. గత ఏడాది(2024) జూలై-ఆగస్టులలో బంగ్లాదేశ్‌లో ఆందోళనలు చెలరేగిన సమయంలో జైళ్ల నుంచి తప్పించుకున్న దాదాపు 700 మంది ఖైదీలు ఇప్పటికీ పరారీలోనే ఉన్నారు. బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వం గతంలో వివిధ జైళ్ల నుంచి పరారైన ఖైదీలకు సంబంధించి ఒక ప్రకటన చేసింది. సుమారు 700 మంది ఖైదీలు జైళ్ల నుంచి పరారయ్యారని బంగ్లాదేశ్ హోం వ్యవహారాల సలహాదారు లెఫ్టినెంట్ జనరల్ (రిటైర్డ్) జహంగీర్ ఆలం చౌదరి ఢాకాలో విలేకరులకు తెలిపారు. వారిని వెదికి పట్టుకునేందుకు ముమ్మర ప్రయత్నాలు జరుగుతున్నాయని పేర్కొన్నారు.దేశంలోని వివిధ జైళ్ల నుంచి తప్పించుకున్న వారి వివరాలను పూర్తిగా వెల్లడించకుండానే.. ఈ తరహా ఖైదీలలో కొందరిని అరెస్ట్ చేశామని, మరికొందరి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని ఆయన చెప్పారు. గత ఏడాది ఆగస్టు ఐదు తర్వాత సాధారణ క్షమాభిక్ష కింద ఏ దోషి కూడా జైలు నుండి విడుదల కాలేదని అన్నారు. అయితే బెయిల్‌పై విడుదలైన వారు ఏదైనా నేర కార్యకలాపాలకు పాల్పడినట్లు తేలితే, వారిని అరెస్టు చేసి చర్యలు తీసుకుంటామన్నారు. కాగా దాదాపు 700 మంది ఖైదీలు, దోషులుగా తేలిన ఇస్లామిక్ ఉగ్రవాదులు, మరణశిక్ష పడిన ఖైదీలు పరారీలో ఉన్నారని గతంలో బంగ్లాదేశ్ జైలు అధికారులు ప్రకటించారు. ఇది కూడా చదవండి: Mahakumbh-2025: 10 ప్రత్యేక ఆకర్షణలు.. సోషల్ మీడియాలో చక్కర్లు -
పాక్ జైలులో భారత యువకుడు విలవిల.. ప్రేమే కారణం
‘నాన్నా.. ఆ అమ్మాయి నాకోసం ఎంతగానో పరితపిస్తోంది... అందుకే నేను పాకిస్తాన్ వచ్చాను. ఇప్పుడు నేను ఇక్కడ ఇస్లాంను స్వీకరించాను. నేను ఇంటికి తిరిగి వస్తానో లేదో నాకే తెలియదు. దయచేసి నా కోసం చింతించకండి’.. ఇవి యూపీలోని అలీఘర్కు చెందిన బాదల్ బాబు అనే యువకుడు వీడియో కాల్లో తన తండ్రితో పలికిన మాటలు.సోషల్ మీడియా వేదికగా ఓ అమ్మాయిని ప్రేమించి, సరిహద్దులు దాటి, శత్రు దేశానికి చేరుకున్న ఓ యువకుడు వీడియో కాల్లో తన తల్లిని చూసి కన్నీళ్లు పెట్టుకున్నాడు. ప్రస్తుతం పాక్ పోలీసులు అతనిని కోర్టులో హాజరుపరిచారు. అక్కడ అతనికి బెయిల్ లభించలేదు. పాక్ యువతి ప్రేమలో పడిన భారతీయ యువకుడు ఇప్పుడు ఆ దేశంలో పడరానిపాట్లు పడుతున్నాడు.అలీఘర్కు చెందిన బాదల్ బాబు 2024 అక్టోబర్‌లో అక్రమంగా సరిహద్దులు దాటి పాక్ చేరుకున్నాడు. తరువాత జరిగిన పరిణామాలతో డిసెంబర్ నుంచి జైలులోనే ఉన్నాడు. జనవరి 24న బాదల్ బాబును పోలీసులు కోర్టులో హాజరుపరిచారు. చార్జిషీట్ అందకపోవడంతో అతని బెయిల్ పిటిషన్ విచారణకు రాలేదు. దీంతో తిరిగి అతడిని జైలుకు తరలించారు. ఈ కేసు తరుపరి విచారణ ఫిబ్రవరిలో ఉండనుంది.బాదల్ తండ్రి కృపాల్ సింగ్ మీడియాతో మాట్లాడుతూ తాను వీడియో కాల్లో న్యాయవాది ఫయాజ్‌తో మాట్లాడినట్లు భావోద్వేగానికి గురవుతూ తెలిపారు. పాకిస్తాన్ నివాసి సనా రాణి, ఆమె తల్లి ఆహ్వానించడంతోనే తన కుమారుడు పాకిస్తాన్ వెళ్లి , అక్కడ చిక్కుకుపోయాడని కృపాల్ ఆవేదన వ్యక్తం చేశారు. సనాను కలుసుకునేందుకు బాదల్ పాకిస్తాన్‌లోని పంజాబ్ ప్రావిన్స్‌లోని మండి బహావుద్దీన్ జిల్లాలోని మాంగ్ గ్రామానికి చేరుకున్నాడు.అయితే సనా అతనిని వివాహం చేసుకునేందుకు నిరాకరించింది. కాగా బాదల్ బాబు వీసా, పాస్‌పోర్ట్ లేకుండా అక్రమంగా పాకిస్తాన్‌కు చేరుకున్నాడు. దీంతో పాక్ పోలీసులు అతనిని అరెస్టు చేసి, కోర్టులో హాజరుపరిచి జైలుకు పంపారు. మీడియా దగ్గరున్న వివరాల ప్రకారం బాదల్ బాబు యూపీలోని అలీఘర్‌లోని నాగ్లా ఖట్కారి గ్రామ నివాసి. అతనికి ఫేస్బుక్లో పాకిస్తాన్‌కు చెందిన ఒక యువతితో స్నేహం ఏర్పడింది. వారిద్దరూ రోజూ చాటింగ్ ద్వారా మాట్లాడుకునేవారు. ఈ స్నేహం క్రమంగా ప్రేమగా మారింది.బాదల్ బాబు 2024 అక్టోబర్‌లో పాకిస్తాన్ చేరుకున్నాడు. తన గుర్తింపును మార్చుకుని అక్కడే ఉన్నాడు. అయితే గత డిసెంబర్లో స్థానికులకు అనుమానం వచ్చి బాదల్ బాబు గురించి పోలీసులకు సమాచారం అందించారు. దీంతో పోలీసులు అతనిని బహావుద్దీన్ నగరంలో అరెస్టు చేసి, తరువాత కోర్టులో హాజరుపరిచి, జైలుకు పంపారు. విచారణలో బాదల్ బాబు తన నేరాన్ని అంగీకరించాడు. తాను గతంలో రెండుసార్లు సరిహద్దులు దాటడానికి ప్రయత్నించానని, మూడోసారి విజయం సాధించానని బాదల్ బాబు తెలిపాడు.ఇది కూడా చదవండి: Mahakumbh: మౌని అమావాస్యకు ఎందుకంత ప్రత్యేకత? -
బాబా ఆశారాంకు మధ్యంతర బెయిల్
న్యూఢిల్లీ:అత్యాచార కేసులో జీవితఖైదు శిక్ష అనుభవిస్తున్న బాబా ఆశారాం(Asaram Bapu)నకు మధ్యంతర బెయిల్ లభించింది. సుప్రీంకోర్టు(Supreme court) ఆయనకు మార్చి 31 దాకా మధ్యంతర బెయిల్(Interim Bail) ఇచ్చింది. గుండె సంబంధిత వ్యాధికి చికిత్స తీసుకునేందుకు బెయిల్ మంజూరు చేసింది. అయితే మరో అత్యాచార కేసులోనూ మధ్యంతర బెయిల్ వచ్చేదాకా ఆయన జైలులోనే ఉండనున్నారు. బెయిల్‌పై విడుదలైన తర్వాత ఆయన తన అనుచరులను కలవడానికి వీళ్లేదని కోర్టు ఆదేశించింది. ఆశారాం ఆస్పత్రికి వెళ్లేటప్పుడు ఎస్కార్ట్ ఇవ్వాలే తప్ప ఆయన ఎక్కడికి వెళ్లాలో నిర్ణయించ వద్దని పోలీసులను కోర్టు ఆదేశించింది. గుజరాత్ మోతేరాలోని ఆశ్రమంలో పనిచేస్తున్న సమయంలో తనపై ఆయన పలుమార్లు లైంగికదాడికి పాల్పడినట్లు సూరత్‌కు చెందిన ఓ మహిళ పోలీసులకు ఫిర్యాదు చేశారు. 2001 నుంచి 2006 మధ్య తనపై పలుమార్లు లైంగికదాడికి పాల్పడ్డారని ఆమె ఆరోపించింది. దీనిపై దర్యాప్తు చేపట్టిన పోలీసులు ఆశారాంతో పాటు మరో ఏడుగురిపై కేసు నమోదు చేశారు.ఈ కేసులో గాంధీనగర్ సెషన్స్ కోర్టు ఆయనను దోషిగా తేల్చింది. ఈ కేసులో మిగిలిన నిందితులకు సంబంధించి ఎలాంటి సాక్ష్యాధారాలు లేకపోవడంతో వారిని విడుదల చేశారు. అనంతరం ఆశారాంకు జీవితఖైదు విధిస్తూ తీర్పునిచ్చింది. జోధ్‌పూర్‌లోని మరో ఆశ్రమంలో 16 ఏళ్ల బాలికపై అత్యాచారం కేసులోనూ ఆయన దోషిగా తేలారు.ఈ కేసులోనూ ఆయనకు జీవితఖైదు పడింది. రెండు కేసుల్లో ఆశారం ఒకేసారి శిక్ష అనుభవిస్తున్నారు.ఇదీ చదవండి: 16 ఏళ్లకే ఇంటిని వదిలి..తాళాల బాబా సాధన ఇదే -
మదురై అసిస్టెంట్ జైలర్ వేధింపులు..
అన్నానగర్: అసిస్టెంట్ జైలర్ వేధింపులు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. మదురై అరసరడిలోని సెంట్రల్ జైలులో బాలగురుసామి అనే వ్యక్తి అసిస్టెంట్ జైలర్‌గా పనిచేసేవాడు. కొన్నాళ్ల కిందట సెంట్రల్ జైలులో ఉన్న ఓ ఖైదీని కలవడానికి అతని భార్య పిటిషన్ దాఖలు చేసింది. ఆమెను పరిచయం చేసుకున్న అసిస్టెంట్ జైలర్ ఆమెతో పాటు వచ్చిన యువతిని లైంగికంగా వేధించాడు. ఆ మహిళ మదురై మహిళా పోలీస్ స్టేషన్లో ఈ విషయమై ఫిర్యాదు చేసింది.విచారణ నిమిత్తం తల్లి, కూతుళ్లు అసిస్టెంట్ జైలర్‌పై దాడికి పాల్పడిన విషయం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యింది. దీనిపై శాఖాపరమైన విచారణలు జరిపారు. బాలిక కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు అసిస్టెంట్ జైలర్ బాలగురుస్వామిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. దీంతో బాలగురుసామిని సస్పెండ్ చేస్తూ మదురై జైళ్ల శాఖ డీఐజీ పళని ఆదేశాలు జారీ చేశారు. బాలగురుసామిని విచారించగా పలు రకాల సమాచారం బయటకు వచ్చింది. దీంతో అతడిని మదురై సెంట్రల్ జైలుకు తరలించారు. అమ్మాయిలను టార్గెట్ చేసి సాన్నిహిత్యం ప్రదర్శించి పలువురు మహిళలను అఘాయిత్యానికి పాల్పడినట్లు తెలిసింది. அவரு ஆபீசரா இருக்கலாம்.. அதுக்காக மகளை கேட்பாரா..? மத்திய சிறை உதவி ஜெயிலர் பாலகுருசாமி மீது வழக்குப்பதிவு pic.twitter.com/YMRXLMv97a— Mahalingam Ponnusamy (@mahajournalist) December 22, 2024 -
Bangladesh: జనవరి 2 వరకూ జైల్లోనే చిన్మయ్ దాస్
ఢాకా: బంగ్లాదేశ్‌లోని హిందూ సన్యాసి చిన్మయ్ కృష్ణ దాస్ బెయిల్ పిటిషన్‌పై విచారణ వాయిదా పడింది. ఈ కేసులో ఆయన తరపున వాదించేందుకు చిట్టగాంగ్ కోర్టులో న్యాయవాది ఎవరూ లేరు. ఈ నేపధ్యంలోనే విచారణ జనవరి 2కు వాయిదా పడింది. బంగ్లాదేశ్‌లోని హిందూ సన్యాసి చిన్మయ్ కృష్ణ దాస్ ప్రభు తరపు న్యాయవాది రమణ్ రాయ్‌పై దాడి జరిగిందని ఇస్కాన్ కోల్‌కతా ప్రతినిధి రాధారమణ్ దాస్ తెలిపారు. ఆయన ఆస్పత్రిలో ప్రాణాలతో పోరాడుతున్నారని, చిన్మయ్ ప్రభు తరపున వాదించడమే ఆయన చేసిన తప్పులా ఉందని దాస్ పేర్కొన్నారు.ఐసీయూలో ఉన్న రాయ్ ఫోటోను ఇస్కాన్ కోల్‌కతా ప్రతినిధి దాస్ ట్విట్టర్లో పోస్ట్ చేశారు. న్యాయవాది రమణ్ రాయ్ కోసం ప్రార్థించాలని ఆయన హిందువులను కోరారు. ఇస్లామిక్ ఛాందసవాదులు అతని ఇంటిని ధ్వంసం చేసి, అతనిపై దాడి చేశారని దాస్ పేర్కొన్నారు. బంగ్లాదేశ్ సమిత సనాతనీ జాగరణ్ జోట్ ప్రతినిధి చిన్మయ్ కృష్ణ దాస్ ప్రభును ఢాకాలోని హజ్రత్ షాజాలాల్ అంతర్జాతీయ విమానాశ్రయంలో అరెస్టు చేశారు. బంగ్లాదేశ్ కోర్టు అతనికి బెయిల్ మంజూరును నిరాకరించి, జైలుకు తరలించింది.ఇది కూడా చదవండి: సీఎం పదవిపై వీడని ఉత్కంఠ.. వేర్వేరు నగరాల్లో ముగ్గురు నేతలు -
సవతి కుమార్తెపై అత్యాచారం.. 141 ఏళ్ల జైలు శిక్ష
మలప్పురం: మైనర్ అయిన సవతి కుమార్తెపై పలుమార్లు అత్యాచారానికి పాల్పడిన ఓ వ్యక్తికి కేరళ కోర్టు 141 ఏళ్ల జైలు శిక్ష విధించింది. పోక్సో చట్టం, ఐపీసీ, జువెనైల్ జస్టిస్ చట్టం కింద వివిధ నేరాలకు గాను దోషి ఏక కాలంలో ఈ శిక్ష అనుభవించాలంటూ మంజేరి ఫాస్ట్ ట్రాక్ స్పెషల్ కోర్టు జడ్జి అష్రాఫ్ ఏఎం నవంబర్ 29వ తేదీన తీర్పు వెలువరించారు. అయితే, దోషి 40 ఏళ్ల జైలు శిక్ష అనుభవించాల్సి ఉంటుందని ఆయన తెలిపారు. అతడికి విధించిన శిక్షల్లో ఇదే అత్యధికమని ఆయన ఆ తీర్పులో పేర్కొన్నారు. అదేవిధంగా, బాధితురాలికి పరిహారంగా రూ.7.85 లక్షలు చెల్లించాలని కూడా దోషిని ఆదేశించారు. బాలికపై ఆమె తల్లి ఇంట్లో లేని సమయాల్లో 2017 నుంచి సవతి తండ్రి పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడని పోలీసు అధికారి ఒకరు తెలిపార -
జైలులో బీడీలు, గుట్కా ఇవ్వాలని ఖైదీల డిమాండు
దొడ్డబళ్లాపురం: బీడీలు, గుట్కా ఇవ్వాలని డిమాండు చేస్తూ కలబుర్గి జైలులో ఖైదీలు ధర్నా చేశారు. ఇటీవల జైలులో అన్నీ నిలిపివేసారని ముస్తఫా అనే ఖైదీ ఆధ్వర్యంలో సుమారు 70 మంది ధర్నా చేసినట్లు తెలిసింది. కొత్తగా వచ్చిన జైలు అధికారి అనిత లంచం అడిగారని ముస్తఫా ఒక మహిళ ద్వారా ప్రభుత్వానికి ఫిర్యాదు ఇప్పించాడు. డబ్బులు ఇస్తేనే పొగాకు, గుట్కాలను అనుమతిస్తానని ఆమె స్పష్టం చేసిందన్నారు. అతడు, మిగతా ఖైదీలు తనను బ్లాక్మెయిల్ చేస్తున్నారని జైలర్ అనిత సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశారు. అతడు సోదరితో మాట్లాడిన ఆడియోలో తనకు బెదిరింపులు ఉన్నాయని అనిత చెబుతున్నారు. గుట్కా తదితరాలను అడ్డుకోవడంతో తనపై కక్ష గట్టారని ఆమె చెప్పారు. -
ప్రభుత్వాలు మేల్కొనాలి!
స్వేచ్ఛ నిజమైన విలువేమిటో గుర్తించాలంటే కారాగారం గురించి కాస్తయినా తెలిసి వుండాలంటారు. జైలంటే కేవలం అయినవాళ్లకు దూరం కావటమే కాదు... సమాజం నుంచి పూర్తిగా వేరుపడి పోవడం, పొద్దస్తమానం తనలాంటి అభాగ్యుల మధ్యే గడపాల్సిరావటం. అటువంటివారిలో విచా రణ ఖైదీలుగా ఉన్నవారికి కేంద్ర హోంమంత్రి అమిత్ షా చేసిన తాజా ప్రకటన ఊరటనిస్తుంది. కేసు విచారణ పూర్తయి పడే గరిష్ట శిక్షలో కనీసం మూడోవంతు కాలం జైల్లో గడిపి ఇంకా న్యాయం కోసం ఎదురుచూస్తూనేవున్న ఖైదీలను ఈనెల 26న జరగబోయే రాజ్యాంగ దినోత్సవానికి ముందు విడుదల చేస్తామని అమిత్ షా తెలియజేశారు. విచారణ కోసం దీర్ఘకాలం ఎదురుచూస్తూ గడిపే ఖైదీ ఒక్కరు కూడా ఉండరాదన్నది తమ ఉద్దేశమని చెప్పారు. ఇది మంచి నిర్ణయం. ప్రజాస్వామిక వాదులు ఎప్పటినుంచో ఈ విషయంలో ప్రభుత్వాలకు విజ్ఞప్తులు చేస్తూనేవున్నారు. కఠిన శిక్షలుపడి దీర్ఘకాలం జైల్లో వున్నవారిలో సత్ప్రవర్తన ఉన్నపక్షంలో జాతీయ దినోత్సవాల రోజునో, మహాత్ముడి జయంతి రోజునో విడుదల చేయటం ఆనవాయితీగా వస్తోంది. అయితే విచారణలోవున్న ఖైదీల విషయంలో ప్రభుత్వాలు క్రియాశీలంగా ఎప్పుడూ దృష్టి పెట్టలేదు. తగిన విధానం రూపొందించ లేదు. ఇందువల్ల జైళ్లు కిక్కిరిసి ఉంటున్నాయి. వాటి సామర్థ్యానికి మించి ఖైదీల సంఖ్య ఉండటంతో జైళ్ల నిర్వహణ అసాధ్యమవుతున్నది. అసహజ మరణాలు చోటుచేసుకుంటున్నాయి. ఖైదీల మధ్య కొట్లాటలు జరుగుతున్నాయి. ఖైదీల్లో అత్యధికులు అట్టడుగు కులాలవారూ, మైనారిటీ జాతుల వారూ ఉంటారు. వీరంతా నిరుపేదలు. కేవలం ఆ ఒక్క కారణం వల్లే వీరి కోసం చొరవ తీసుకుని బెయిల్ దరఖాస్తు చేసేవారు ఉండరు. కనీసం పలకరించటానికి రావాలన్నా అయినవాళ్లకు గగన మవుతుంది. రానూ పోనూ చార్జీలు చూసుకుని, కూలి డబ్బులు కోల్పోవటానికి సిద్ధపడి జైలుకు రావాలి. అలా వచ్చినా ఒక్కరోజులో పనవుతుందని చెప్పడానికి లేదు. రాత్రి ఏ చెట్టుకిందో అర్ధాకలితో గడిపి మర్నాడైనా కలవడం సాధ్యమవుతుందా లేదా అన్న సందేహంతో ఇబ్బందులుపడే వారెందరో! బెయిల్ వచ్చినా ఆర్థిక స్తోమత లేక కారాగారాల్లోనే ఉండిపోతున్న ఖైదీల కోసం కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ 2023 బడ్జెట్లో ఒక పథకాన్ని ప్రతిపాదించారు. జిల్లా కలెక్టర్ల ఆధ్వర్యంలోని కమిటీల సిఫార్సుతో ఈ పథకం వర్తిస్తుంది. విచారణలోవున్న ఖైదీకి రూ. 40,000, శిక్షపడిన ఖైదీకి రూ. 25,000 మంజూరుచేసి బెయిల్‌కు మార్గం సుగమం చేయటం దాని ఉద్దేశం. బెయిల్ వచ్చినా జామీను మొత్తం సమకూరకపోవటంతో 24,879 మంది ఖైదీలు బందీలుగా ఉండి పోయారని మొన్న అక్టోబర్‌లో సుప్రీంకోర్టు పరిశోధన విభాగం సెంటర్ ఫర్ రీసెర్చ్ అండ్ ప్లానింగ్ (సీఆర్పీ) వెల్లడించింది. అయితే దీనివల్ల లబ్ధి పొందినవారు ఎందరని తరచి చూస్తే ఎంతో నిరాశ కలుగుతుంది. ప్రముఖ డేటా సంస్థ ‘ఇండియా స్పెండ్’ ఢిల్లీతోపాటు ఎనిమిది రాష్ట్రాల్లో ఈ పథకం అమలు తీరు ఎలావున్నదో ఆరా తీస్తూ సమాచార హక్కు చట్టంకింద దరఖాస్తులు చేస్తే ఇంతవరకూ కేవలం ఆరు రాష్ట్రాలు జవాబిచ్చాయి. అందులో మహారాష్ట్ర 11 మందిని, ఒడిశా ఏడుగురిని విడు దల చేశామని తెలపగా 103 మంది అర్హులైన ఖైదీలను గుర్తించామని ఢిల్లీ తెలిపింది. మూడు బిహార్ జైళ్లు జిల్లా లీగల్ సర్వీసెస్ అథారిటీ ద్వారా విడుదలైనవారి వివరాలిచ్చాయి తప్ప పథకం లబ్ధిదారు లెందరో చెప్పలేదు. పథకం ప్రారంభం కాలేదని బెంగాల్ చెప్పగా, బీజేపీ రాష్ట్రాలైన యూపీ, మధ్య ప్రదేశ్, ఛత్తీస్‌గఢ్‌లు డేటా విడుదల చేయలేదు. కేరళ స్పందన అంతంతమాత్రం. ఫలానా పథకం అమలు చేస్తే ఇంత మొత్తం గ్రాంటుగా విడుదల చేస్తామని కేంద్రం ప్రకటిస్తే అంగలార్చుకుంటూ తొందరపడే రాష్ట్రాలకు దిక్కూ మొక్కూలేని జనానికి తోడ్పడే పథకమంటే అలుసన్న మాట!ఒక డేటా ప్రకారం దేశవ్యాప్తంగా ఖైదీల సంఖ్య 5,73,220 కాగా, అందులో 75.8 శాతంమంది... అంటే ప్రతి నలుగురిలో ముగ్గురు విచారణలో ఉన్న ఖైదీలే. మొత్తం 4,34,302 మంది విచారణ ఖైదీలని ఈ డేటా వివరిస్తోంది. విచారణ ఖైదీల్లో 65.2 శాతంమందిలో 26.2 శాతంమంది నిరక్షరాస్యులు. పదోతరగతి వరకూ చదివినవారు 39.2 శాతంమంది. రద్దయిన సీఆర్పీసీలోని సెక్షన్ 436ఏ నిబంధనైనా, ప్రస్తుతం వున్న బీఎన్ఎస్ఎస్లోని సెక్షన్ 479 అయినా నేరానికి పడే గరిష్ట శిక్షలో సగభాగం విచారణ ప్రారంభంకాని కారణంగా జైల్లోనే గడిచిపోతే బెయిల్‌కు అర్హత ఉన్నట్టే అంటున్నాయి. అయితే మరణశిక్ష లేదా యావజ్జీవ శిక్ష పడే నేరాలు చేసినవారికి ఇది వర్తించదు. బీఎన్ఎస్ఎస్ అదనంగా మరో వెసులుబాటునిచ్చింది. తొలి నేరం చేసినవారు విచారణ జరిగితే పడే గరిష్ట శిక్షలో మూడోవంతు జైలులోనే ఉండిపోవాల్సి వస్తే అలాంటి వారికి బెయిల్ ఇవ్వొచ్చని సూచించింది. బహుళ కేసుల్లో నిందితులైన వారికిది వర్తించదు.నిబంధనలున్నాయి... న్యాయస్థానాలు కూడా అర్హులైన వారిని విడుదల చేయడానికి సిద్ధంగా ఉన్నాయి. నిరుడు కేంద్రమే ఖైదీల కోసం పథకం తీసుకొచ్చింది. పైగా బీఎన్ఎస్ఎస్ 479 నిబంధనను ఎందరు వర్తింపజేస్తున్నారో చెప్పాలని సుప్రీంకోర్టు 36 రాష్ట్రాలూ, కేంద్రపాలిత ప్రాంతా లకూ మొన్న ఆగస్టులో ఆదేశాలిస్తే ఇంతవరకూ 19 మాత్రమే స్పందించాయి. ఇది న్యాయమేనా? పాలకులు ఆలోచించాలి. ఈ అలసత్వం వల్ల నిరుపేదలు నిరవధికంగా జైళ్లలో మగ్గుతున్నారు.కేంద్రం తాజా నిర్ణయంతోనైనా ప్రభుత్వాలు మేల్కొనాలి. విచారణలోవున్న ఖైదీల్లో ఎంతమంది అర్హుల్లో నిర్ధారించి, కేంద్ర పథకం కింద లబ్ధిదారుల జాబితాను రూపొందించాలి. వారి విడుదలకు చర్యలు తీసుకోవాలి. -
చిన్నారిపై లైంగికదాడి కేసులో నిందితుడికి 20 ఏళ్ల జైలు శిక్ష
నెల్లూరు (లీగల్): నాలుగేళ్ల బాలికపై లైంగిక దాడికి పాల్పడిన నిందితుడికి న్యాయస్థానం 20 ఏళ్ల జైలు శిక్ష విధించింది. ప్రాసిక్యూషన్ కథనం మేరకు.. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా మిక్కిలింపేట గ్రామానికి చెందిన బాలిక 2020 ఫిబ్రవరి 16వ తేదీ మధ్యాహ్నం 2.30 గంటల సమయంలో ఇంటిముందు ఆడుకుంటుండగా సమీపంలోని ఇంట్లో నివసించే ఉప్పు రవికుమార్ అనే యువకుడు బాలికను ఇంటికి తీసుకుపోయి లైంగిక దాడికి పాల్పడ్డాడు.బాలిక తల్లి అదేరోజు కొడవలూరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసిన పోలీసులు రవికుమార్‌ను అరెస్టు చేశారు. అనంతరం కోర్టులో చార్జిషీటు దాఖలు చేశారు. విచారణలో నిందితుడిపై నేరం రుజువు కావడంతో నెల్లూరు పోక్సో ప్రత్యేక కోర్టు జడ్జి సిరిపిరెడ్డి సుమ నిందితుడికి 20 సంవత్సరాల జైలు శిక్ష, రూ. 20 వేలు జరిమానా విధిస్తూ మంగళవారం తీర్పు చెప్పారు. -
గంజాయి సరఫరా చేస్తున్న ఫార్మసిస్ట్ అరెస్టు
ఆరిలోవ: విశాఖ కేంద్రకారాగారంలో ఖైదీలకు గంజాయి సరఫరా చేసే యత్నంలో ఓ ఉద్యోగి అధికారులకు చిక్కాడు. జైలు సిబ్బంది తనిఖీల్లో ఈ వ్యవహారం బయటపడింది. జైలు సూపరింటెండెంట్ ఎస్.కిశోర్‌కుమార్ వివరాలు ప్రకారం.. జిల్లా వైద్య, ఆరోగ్య శాఖలో కడియం శ్రీనివాస్ ఫార్మసిస్ట్‌గా ఏడాది నుంచి డిప్యుటేషన్‌పై విశాఖ కేంద్ర కారాగారం ఆస్పత్రిలో పనిచేస్తున్నారు. ఈ జైలుకు సంబంధించి ప్రత్యేకంగా నియమించిన వైద్యులు, ఫార్మసిస్టులు లేకపోవడంతో డిప్యూటేషన్‌పై వచ్చినవారే పనిచేయాల్సి ఉంటుంది.శ్రీనివాస్ మంగళవారం డ్యూటీకి వచ్చేటప్పుడు భోజనం క్యారేజీ తీసుకొచ్చారు. అందులో గంజాయి ఉన్నట్లు జైలు ప్రధాన ద్వారంవద్ద సిబ్బంది తనిఖీల్లో బయటపడింది. ప్రధాన ద్వారం సెక్యూరిటీ సిబ్బంది జైలులో పనిచేస్తున్న ఉద్యోగుల రాకపోకల సమయంలో తనిఖీలు చేస్తుంటారు. దీన్లోభాగంగా చేపట్టిన తనిఖీల్లోనే శ్రీని వాస్ క్యారేజీలో 90 గ్రాముల గంజాయి పట్టుబడింది. దీంతో శ్రీనివాస్‌పై ఆరిలోవ పోలీసులకు సూపరింటెండెంట్ ఫిర్యాదు చేశారు. గంజాయి స్వాధీనం చేసుకుని, కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఆరిలోవ సీఐ మల్లేశ్వరరావు తెలిపారు. రిమాండ్‌పై సెంట్రల్ జైలుకు తరలించినట్లు పేర్కొన్నారు. -
పాపం నాగమ్మ!
రాయచూరు రూరల్: క్షణికావేశంలో ఏదో తెలిసీ, తెలియక చేసిన తప్పిదానికి 34 ఏళ్లకు పైగా శిక్ష అనుభవిస్తున్నట్లు సమాచారం అందుకున్న ఉప లోకాయుక్త చొరవతో కలబుర్గి చెరసాల నుంచి 93 ఏళ్లున్న వృద్ధురాలి విడుదలకు ప్రతిపాదనలు సిద్ధమైన ఘటన చోటు చేసుకుంది. కలబుర్గి జిల్లా కేంద్ర కారాగారాన్ని రాష్ట్ర ఉప లోకాయుక్త న్యాయమూర్తి బి.వీరప్ప సందర్శించారు. వయస్సు మీరిన వారిని చెరసాలలో ఉంచరాదనే విషయం తెలుసుకున్న వీరప్ప కలబుర్గి జిల్లా ప్రధాన న్యాయమూర్తి, న్యాయ సేవా ప్రాధికార సభ్యుడు శ్రీనివాస నవలిని సుప్రీం కోర్టుకు అప్పీలు చేసి విడుదలకు అనుమతి కోరాలన్నారు. కలబుర్గి జిల్లా జేవర్గి తాలూకాకు చెందిన నాగమ్మపై 1995లో వరకట్నం కేసులో నిందితురాలిగా కేసు పెట్టారు. నాటి నుంచి నేటి వరకు శిక్షను అనుభవిస్తున్న విషయాన్ని తెలుసుకున్న ఉప లోకాయుక్త బి.వీరప్ప చలించి పోయారు. సుప్రీం కోర్టు రిజిస్ట్రార్ జనరల్ శశిధర్ శెట్టిని ఫోన్లో సంప్రదించి మాట్లాడారు. పండు వృద్ధురాలు నాగమ్మకు నడవడం కూడా చేత కాదని, ఆరోగ్య సమస్యలను జైల్ అధికారులు, సిబ్బంది అంతగా పట్టించుకోవడం లేదు కనుక ఆమెను చెరసాల నుంచి విడుదల చేసి విముక్తి కల్పించాలని కోరారు. -
లారెన్స్ బిష్ణోయ్ ఇంటర్వ్యూ: పోలీసు అధికారులపై సస్పెన్షన్
చండీగఢ్: పంజాబ్‌లో జైలు శిక్ష అనుభవిస్తున్న సమయంలో గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్ కస్టడీలో ఉండి ఓ టీవీ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూపై రాష్ట్ర హోంశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ ఇంటర్వ్యూపై విచారణ జరిపిన పంజాబ్ హోంశాఖ.. ఇంటర్వ్యుకు సహకరించిన పోలీసులు అధికారులపై చర్యలు తీసుకుంది. అందులో భాగంగా ఇద్దరు డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (డీఎస్పీలు)సహా ఏడుగురు పోలీసు అధికారులను సస్పెండ్ చేసింది. అయితే ఈ ఇంటర్వ్యూ 2023లో పంజాబ్ జైలులో ఖైదీగా ఉన్న సమయంలో జరగటం గమనార్హం. ఈ ఇంటర్వ్యులో పంజాబీ గాయకుడు సిద్ధూ మూసేవాలా హత్యలో లారెన్స్ బిష్ణోయ్ పాత్రపై ప్రశ్నించారు. ఇంటర్వ్యూ ప్రసారమైన అనంతరం సెప్టెంబరు, 2023లో పంజాబ్ , హర్యానా హైకోర్టు ఈ అంశాన్ని సుమోటోగా స్వీకరించింది. పోలీసు కస్టడీలో ఉన్న ఖైదీకి ఇంటర్వ్యూ ఎలా ఏర్పాటు చేశారని మండిపడింది. ఇక..ఈ సంఘటన పంజాబ్ జైలు వ్యవస్థలో భద్రతా ప్రోటోకాల్‌లకు సంబంధించి తీవ్రమైన ఆందోళనలను లేవనెత్తింది. జైలు నుంచి రికార్డ్ చేసిన ఇంటర్వ్యూను అనుమతించిన వైఫల్యాలపై పోలీసు శాఖ అంతర్గత దర్యాప్తును ప్రారంభించింది.చదవండి: దావూద్ బాటలో.. బిష్ణోయ్ నేరసామ్రాజ్యం -
జైలు నుంచి విడుదలైన జానీ మాస్టర్!
లైంగిక వేధింపుల కేసులో జైలులో ఉన్న జానీ మాస్టర్ ఇవాళ విడుదలయ్యారు. గురువారం ఆయనకు బెయిల్ మంజూరైన సంగతి తెలిసిందే. న్యాయస్థానం బెయిల్ ఇవ్వడంతో చంచల్ గూడ జైలు నుంచి బయటకొచ్చారు. దాదాపు 36 రోజులుగా జానీమాస్టర్ జైలులోనే ఉన్నారు.కాగా.. లేడీ కొరియోగ్రాఫర్‌పై లైంగిక వేధింపుల కేసులో ఆయిన అరెస్టైన విషయం తెలిసిందే. జానీ మాస్టర్ తనను బెదిరించి పలుమార్లు అత్యాచారం చేశారని మధ్యప్రదేశ్‌కు చెందిన యువతి సెప్టెంబర్ 15న నార్సింగ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. పైగా మతం మార్చుకుని పెళ్లి చేసుకోవాలంటూ ఒత్తిడి కూడా చేశారని ఫిర్యాదు చేసింది. ఈ ఫిర్యాదుల మేరకు జానీ మీద పోక్సో చట్టం కింద నార్సింగి పోలీసులు కేసు నమోదు చేసి.. గత నెల గోవాలో అరెస్టు చేశారు. -
4 గంటల భేటీకి రూ. 5 లక్షలు.. జైలులో కలుసుకోనున్న ఆశారాం-నారాయణ్
సూరత్: మైనర్ విద్యార్థినిపై అత్యాచారం కేసులో 11 ఏళ్లుగా జైల్లోనే ఉంటున్న ప్రవచనకర్త ఆశారాం ఆరోగ్యం క్షీణిస్తూ వస్తోంది. ఇటీవలే ఆయనకు కోర్టు ఆదేశాలతో మహారాష్ట్రలో చికిత్స అందించారు. కాగా గుజరాత్ హైకోర్టు అనుమతితో ఆయన తన కుమారుడు నారాయణ్ సాయిని జోధ్‌పూర్ జైలులో కలుసుకోనున్నారు. అయితే ఇందుకోసం ఆశారాం కుమారుడు రూ.5 లక్షలు డిపాజిట్ చేయాల్సి ఉంటుంది.ఆశారాం కుమారుడు నారాయణ్ సాయి గుజరాత్‌లోని సూరత్ సెంట్రల్ జైలులో జీవిత ఖైదు శిక్షను అనుభవిస్తున్నాడు. కొన్ని షరతులతో తన తండ్రి ఆశారాంను 4 గంటల పాటు కలిసేందుకు గుజరాత్ హైకోర్టు నారాయణ్ సాయికి అనుమతినిచ్చింది. ఈ భేటీలో ఆశారాం, నారాయణ్ మినహా కుటుంబ సభ్యులెవరూ ఉండరు. శుక్రవారం గుజరాత్ హైకోర్టులో నారాయణ్ సాయి పిటిషన్‌పై విచారణ జరిగింది. నారాయణ్ సాయి అత్యాచారం, లైంగిక వేధింపుల కేసులో సూరత్‌లోని లాజ్‌పూర్ సెంట్రల్ జైలులో ఖైదీగా ఉన్నాడు. తన తండ్రికి ఆరోగ్యం బాగాలేదని, ఆయనను కలవాలని అనుకుంటున్నానని నారాయణ్‌సాయి తన పిటిషన్లో పేర్కొన్నాడు.మైనర్‌పై అత్యాచారం, లైంగిక వేధింపులకు పాల్పడిన ఆశారాం దాదాపు 11 ఏళ్లుగా జోధ్‌పూర్ సెంట్రల్ జైలులో ఉంటున్నాడు. ఈ కాలంలో తండ్రీ కొడుకులు ఎప్పుడూ కలుసుకోలేదు. పెరోల్ కోసం ఆశారాం పలుమార్లు కోరినప్పటికీ మంజూరు కాలేదు. కాగా గుజరాత్ హైకోర్టు తన ఆదేశాలలో నారాయణ్ సాయిను అసిస్టెంట్ పోలీస్ కమిషనర్, ఒక పోలీస్ ఇన్స్పెక్టర్, ఇద్దరు హెడ్ కానిస్టేబుళ్లు, ఇద్దరు కానిస్టేబుళ్ల పర్యవేక్షణలో విమానంలో జోధ్‌పూర్ జైలుకు పంపాలని పేర్కొంది. నాలుగు గంటల పాటు జైలులో ఉన్న తన తండ్రిని నారాయణ్ సాయి కలుసుకోనున్నాడు. ఇందుకోసం ఆయన సూరత్‌లోని పోలీస్ స్టేషన్‌లోని ప్రభుత్వ ఖజానాకు రూ.5 లక్షలు డిపాజిట్ చేయాల్సి ఉంటుంది.ఇది కూడా చదవండి: కేసుల పరిష్కారానికి గడువు పెట్టలేం -
నందిగం సురేష్‌కు వైద్య పరీక్షలు
సాక్షి, గుంటూరు : వైఎస్సార్సీపీ మాజీ ఎంపీ నందిగం సురేష్‌కు అనారోగ్య సమస్యలు తలెత్తాయి. జిల్లా జైలులో ఉన్న ఆయనకు అనారోగ్య సమస్యలు తలెత్తడంతో జైలు అధికారులు గురువారం గుంటూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పరీక్షలు నిర్వహించిన వైద్యులు నందిగం సురేష్..లో-బీపీతో పాటు భుజం నొప్పితో బాధపడుతున్నట్లు గుర్తించారు. -
జైలులో రామలీల.. ఖైదీల ఆనంద తాండవం
హరిద్వార్: నవరాత్రి రోజుల్లో ఉత్తరాదిన ‘రామలీల’ వేడుకలు నిర్వహిస్తుంటారు. ఈ నేపధ్యంలోనే ఉత్తరాఖండ్‌లోని హరిద్వార్ జిల్లా కారాగారంలోనూ ‘రామలీల’ వేడుకలు జరుగుతున్నాయి. ఈ నాటకంలోని పాత్రలన్నింటినీ ఖైదీలే పోషిస్తున్నారు. రామ్‌లీల సందర్భంగా నిర్వహించిన ఊరేగింపులో ఖైదీలు ఉత్సాహంగా పాల్గొన్నారు. డప్పుల దరువులకు అనుగుణంగా నృత్యం చేశారు. ఈ సందర్భంగా జైలు సీనియర్ సూపరింటెండెంట్ మనోజ్ కుమార్ ఆర్య మాట్లాడుతూ ‘రామలీల’ కోసం జైలులోని ఖైదీలు నెల రోజులపాటు ప్రాక్టీస్ చేశారన్నారు. ఈ నేపథ్యంలో రామబరాత్ను నిర్వహించామని, దీనిలో పాల్గొన్న ఖైదీలంతా ఆనందంలో మునిగితేలారని అన్నారు. జైల్లో ఇలాంటి కార్యక్రమాలు ఖైదీలలో పాజిటివ్ ఎనర్జీని పెంపొందిస్తాయని అన్నారు. రామబరాత్ అనంతరం రామ పట్టాభిషేకం కూడా నిర్వహించామన్నారు.ఇది కూడా చదవండి: బస్సులోకి ఎక్కేందుకు చిరుత ప్రయత్నం -
జైళ్లలో కుల వివక్ష వద్దు
న్యూఢిల్లీ: కులం ఆధారంగా మనుషులపై వివక్ష చూపడం అనే సామాజిక నేరం దేశంలో శతాబ్దాలుగా కొనసాగుతోంది. ఆధునిక యుగంలోనూ సమాజంలో కుల వివక్ష కనిపిస్తోంది. ఆఖరికి ఖైదీలను సంస్కరించడానికి ఉద్దేశించిన జైళ్లలోనూ కుల వివక్ష తప్పడం లేదు. కింది కులాల ఖైదీలకు కష్టమైన పనులు అప్పగించడం, వేరే వార్డులు కేటాయించడం, వారిపై దాడులు, హింస సర్వసాధారణంగా మారిపోయింది. ఈ పరిణామంపై దేశ అత్యున్నత న్యాయస్థానం తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేసింది. కుల ఆధారంగా ఖైదీలపై వివక్ష చూపడడం తగదని తేల్చిచెప్పింది. కారాగారాల్లో ఖైదీలందరినీ సమానంగా చూడాలని ఆదేశించింది. వివిధ రాష్ట్రాల్లోని కారాగారాల్లో దారుణమైన పరిస్థితులు ఉన్నాయని, కులం ఆధారంగా ఖైదీలపై వివక్ష చూపుతున్నారని పేర్కొంటూ మహారాష్ట్రలోని కల్యాణ్ ప్రాంతానికి చెందిన జర్నలిస్టు సుకన్య శాంత సుప్రీంకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం(పిట్) దాఖలు చేశారు. స్టేట్ ప్రిజన్ మాన్యువల్ నిబంధనలను పిటిషనర్ సవాలు చేశారు. ఈ వ్యాజ్యంపై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్, న్యాయమూర్తులు జస్టిస్ జేపీ పార్దివాలా, జస్టిస్ మనోజ్ మిశ్రాతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం గురువారం విచారణ చేపట్టింది. ఖైదీలను కులం ఆధారంగా విభజిస్తున్న మాన్యువల్‌లోని నిబంధనలు రాజ్యాంగ విరుద్ధమని తేల్చిచెప్పింది. మూడు నెలల్లోగా నిబంధనల్లో సవరణలు చేయాలని ఆదేశిస్తూ తీర్పు వెలువరించింది. ఖైదీలపై వివక్షను అంతం చేసేలా అన్ని రాష్ట్రాలూ జైలు మాన్యువల్ నిబంధనలు మార్చాల్సిందేనని తేల్చిచెప్పింది. జైళ్లలో చోటుచేసుకున్న కుల వివక్ష ఘటనలను సుప్రీంకోర్టు సుమోటోగా విచారణకు స్వీకరించింది. మూడు నెలల తర్వాత వీటిని ‘విచారించాల్సిన కేసుల జాబితా’లో చేర్చాలని సుప్రీంకోర్టు రిజిస్ట్రీని ఆదేశించింది. తమ తీర్పుపై ఎలాంటి చర్యలు తీసుకున్నారో వివరిస్తూ నివేదిక సమర్పించాలని రాష్ట్రాలకు ఆదేశాలు జారీ చేసింది. నిర్బంధంలో ఉన్నవారికి సైతం గౌరవంగా జీవించే హక్కు ఉందని ధర్మాసనం ఉద్ఘాటించింది. మానవులంతా సమానంగా జన్మించారని ఆర్టికల్ 17 చెబుతున్నట్లు గుర్తుచేసింది. ప్రధానంగా ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్, మధ్యప్రదేశ్, ఆంధ్రప్రదేశ్, ఒడిశా, కేరళ, మహారాష్ట్ర, కర్ణాటక, హిమాచల్ ప్రదేశ్‌లో జైలు మాన్యువల్ నిబంధనలు మార్చాలని స్పష్టంచేసింది. పని విషయంలో సమాన హక్కు ఉండాలి ‘‘జైలు మాన్యువల్‌లో కులం కాలమ్ అవసరం లేదు. చిన్న కులాల ఖైదీలతో మరుగుదొడ్లు కడిగించడం, ట్యాంక్‌లు శుభ్రం చేయించడం వంటి పనులు, అగ్ర కులాల ఖైదీలకు సులభమైన వంట పనులు అప్పగించడం ముమ్మాటికీ వివక్షే అవుతుంది. ఇలాంటి చర్యలు అంటరానితనం పాటించడం కిందకే వస్తాయి. కులం ఆధారంగా ఖైదీలను వేరే గదుల్లో ఉంచడం సమంజసం కాదు. వారి ఆత్మగౌరవానికి భంగం కలిగించేలా వ్యవహరించడం వలసవాద వ్యవస్థకు గుర్తు. షెడ్యూల్డ్ కులాల ఖైదీలకే పారిశుధ్య పనులు అప్పగించడం తగదు. పని విషయంలో అందరికీ సమాన హక్కు ఉండాలి. కేవలం ఒక కులం వారినే స్వీపర్లుగా ఎంపిక చేయటం సమానత్వ హక్కుకు వ్యతిరేకం. కింది కులాల ఖైదీలకు మాత్రమే ఇలాంటి పనులు అప్పగించడం రాజ్యాంగంలోని ఆరి్టకల్ 15ను ఉల్లంఘించడమే అవుతుంది’’ అని సుప్రీంకోర్టు తీన తీర్పులో వెల్లడించింది. -
జైల్లో టార్చర్ చేశారు: కేజ్రీవాల్
చండీగఢ్:ఆమ్ఆద్మీపార్టీ(ఆప్)చీఫ్,ఢిల్లీమాజీసీఎం అరవింద్కేజ్రీవాల్ కేంద్ర ప్రభుత్వంపై సంచలన ఆరోపణలు చేశారు.ఆదివారం(సెప్టెంబర్29)హర్యానాలో జరిగిన బహిరంగసభలో కేజ్రీవాల్ పాల్గొన్నారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ‘జైలులో నన్ను మానసికంగా,శారీరకంగా చిత్రహింసలు పెట్టేందుకు ప్రయత్నించారు.నేను షుగర్ పేషేంట్‌ను.నాకు రోజుకు నాలుగు ఇన్సులిన్ ఇంజెలిక్షన్లు అవసరం. జైలులో నాకు ఇన్సులిన్ ఇంజెక్షన్లు అందకుండా చేశారు.అయితే వారికి తెలియని విషయం ఏంటంటే.వాళ్లు నన్ను ఏమీ చేయలేరు.ఎందుకంటే నేను హర్యానా బిడ్డను’అని కేజ్రీవాల్ అన్నారు.లిక్కర్ స్కామ్ కేసులో ఐదు నెలలు జైలులో గడిపిన తర్వాత కేజ్రీవాల్‌కు సుపప్రీంకోర్టు బెయిల్ ఇచ్చింది. దీంతో ఆయన సెప్టెంబర్ 13న తీహార్ జైలు నుంచి విడుదలయ్యారు. అనంతరం ఢిల్లీ సీఎం పదవికి రాజీనామా చేశారు.ఢిల్లీ ప్రజలు మళ్లీ ఆమ్ఆద్మీపార్టీకి అధికారం ఇస్తేనే తాను సీఎం పదవి తీసుకుంటానని తెలిపారు. ఇదీ చదవండి: సభా వేదికపై ఖర్గేకు అస్వస్థత -
హర్యానా ఎన్నికలకు పెరోల్‌పై డేరా బాబా రాక?
రోహ్తక్: ఇద్దరు మహిళా శిష్యురాళ్లపై అత్యాచారం కేసులో 20 ఏళ్ల జైలు శిక్ష అనుభవిస్తున్న డేరా సచ్చా సౌదా చీఫ్ గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్ మరోసారి 20 రోజుల తాత్కాలిక పెరోల్ కోసం అభ్యర్థించారు. అక్టోబర్ 5న జరగనున్న హర్యానా అసెంబ్లీ ఎన్నికలకు ముందుగా ఆయన పెరోల్‌కు అభ్యర్థించారు. దీంతో ఈ ఎన్నికలకు ముందే రామ్ రహీమ్ జైలు నుంచి బయటకు వచ్చే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.రామ్ రహీమ్ ఈ ఏడాది ఆగస్టు 13న 21 రోజుల పెరోల్‌పై రోహ్తక్ జిల్లాలోని సునారియా జైలు నుంచి బయటకు వచ్చారు. గుర్మీత్ రామ్ రహీమ్‌కు హర్యానాలో లక్షలాదిమంది అనుచరులున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో హర్యానా అసెంబ్లీ ఎన్నికలకు ముందు రామ్ రహీమ్ జైలు నుంచి బయటకు వస్తే, అది ఎన్నికలపై పెను ప్రభావం చూపుతుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. హర్యానాలో అక్టోబరు 5న ఒకే దశలో ఎన్నికలు జరగనున్నాయి. అక్టోబర్ 8న ఓట్ల లెక్కింపు జరగనుంది. ఇది కూడా చదవండి: పదేళ్ల ‘మన్ కీ బాత్’లో.. ప్రధాని మోదీ భావోద్వేగం -
చంపడానికి వచ్చారు.. ధర్మవరంలో రెచ్చిపోయిన కూటమి నేతలు.. కేతిరెడ్డి ఫైర్
-
బెయిల్ కాదు.. జైలు
సాక్షి, హైదరాబాద్: ‘జైలు కాదు.. బెయిల్’అన్న సుప్రీంకోర్టు న్యాయసూత్రం ఆచరణలో మాత్రం సాధ్యం కావడం లేదు. దేశంలోని జైళ్లలో మగ్గుతున్న వారిలో రెండింట మూడో వంతు విచారణ ఖైదీలే. బెయిల్ లాంటి అంశాల్లో సత్వర విచారణ జరపాలని న్యాయ కోవిదులు చెబుతున్నా అమలు మాత్రం ఆమడ దూరం అన్నట్టుగానే ఉంది. బెయిల్ వచ్చినా ఆర్థిక స్తోమత లేక, పూచీకత్తు ఇచ్చేవారు లేక విడుదలకు నోచుకోని వారు కూడా ఉండటం మరింత దారుణం.విచారణ జరిగి శిక్షపడే నాటికి.. వారికి పడే శిక్షాకాలం కూడా పూర్తవుతున్న వారు కొందరు ఉండగా, ఆ తర్వాత నిర్దోషులుగా విడుదలవుతున్న వారు మరికొందరు. అంటే నేరం చేయకున్నా కొందరు జైళ్లలో మగ్గుతున్నారన్న మాట. ఏళ్లుగా జైళ్లలో ఉండి ఆ తర్వాత నిర్దోషులుగా విడుదలైనా.. వారి జీవితం, కుటుంబాలు ఆగమైనట్టే కదా అనేది బాధితుల వాదన. మరి ఈ విచారణ ఖైదీల సమస్యకు పరిష్కారం ఎప్పుడు.. ఎలా.. అన్నది ప్రశ్నార్థకం. అయితే గత నెల జైలు అధికారులకు సుప్రీంకోర్టు జారీ చేసిన ఆదేశాలు కొంత ఉపశమనం కలిగించనున్నాయి. యువతే అధికం... విచారణ ఖైదీల్లో అత్యధికం యువతే. 2022 గణాంకాలను పరిశీలిస్తే.. 18–30 ఏళ్ల మధ్య ఖైదీలు 2,15,471 మంది ఉండగా, 30–50 ఏళ్ల మధ్య 1,73,876 మంది ఉన్నారు. మొత్తం 4,34,302 విచారణ ఖైదీల్లో రెండింట మూడోవంతు(66శాతం) యువతే ఉండటం గమనార్హం.విచారణా ఖైదీల హక్కులు.. ⇒సత్వర విచారణ పొందేందుకు అర్హులు ⇒హింస, అమానవీయ ప్రవర్తనకు గురికాకుండా హక్కు ఉంటుంది ళీ సరైన కారణాలను అందించకపోతే జైలు నుంచి కోర్టుకు తరలించేటప్పుడు సంకెళ్లు వేయడానికి వీలులేదు. ⇒కేసు విషయంలో కోర్టుకు దరఖాస్తు చేసుకొని ఉచిత న్యాయ సేవలు పొందవచ్చు. ⇒అరెస్టు చేసే సమయంలో వారి కుటుంబ సభ్యుడు లేదా స్నేహితుడికి తెలియజేయాలి. ⇒నిర్దిష్ట భద్రతా ప్రమాణాలకు లోబడి కుటుంబ సభ్యులకు ఖైదీని సందర్శించే అవకాశం.సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు.. 2023లో, అంతకుముందు.. ‘జైలు కాదు.. బెయిల్’అనే సూత్రం ప్రమాణంగా విచారణ సాగాలి. విచారణ ఖైదీలతో జైళ్లు కిక్కిరిసిపోవడం న్యాయ సూత్రాలకు విరుద్ధం. ఒక వ్యక్తిని కోర్టులో నిలబెట్టి, దోషిగా నిరూపించాలని పోలీసులు ఎక్కువగా భావిస్తున్నారు. ఇలాంటి ఏకపక్ష నిర్ణయం ప్రమాదకరం. ఇది పేద, బలహీన వర్గాల ప్రజలపై తీవ్ర ప్రభావం చూపుతుంది. బెయిల్ పొందినా ఆర్థిక స్తోమత, పూచీకత్తు ఇచ్చేవారు లేక చాలా మంది జైళ్లలోనే మగ్గుతున్నారు. ఈ కారణాలతో జైళ్లలో సంఖ్య పెరిగిపోతోంది. 2024, ఆగస్టులో... దేశవ్యాప్తంగా ఏళ్ల తరబడి జైళ్లలో మగ్గిపోతున్న అండర్ ట్రయల్ ఖైదీలను త్వరితగతిన విడుదల చేసేందుకు చర్యలు తీసుకోవాలని అన్ని జైళ్ల సూపరింటెండెంట్లకు ఆదేశాలు జారీ చేస్తున్నాం. కొత్త క్రిమినల్ న్యాయచట్టం భారతీయ నాగరిక్ సురక్ష సంహితలోని సెక్షన్ 479 ప్రకారం సాధ్యమైనంత త్వరగా విడుదల చేసేందుకు చర్యలు తీసుకోవాలి. మూడు నెలల్లోగా అండర్ ట్రయల్ ఖైదీల దరఖాస్తులను ప్రాసెస్ చేయాలి. అయితే, ఈ నిబంధన మరణశిక్ష లేదా జీవిత ఖైదు వంటి ఘోరమైన నేరాలకు పాల్పడిన అండర్ ట్రయల్‌లకు వర్తించదు. – సుప్రీంకోర్టుఅండర్ ట్రయల్ ఖైదీలకు లీగల్ డిఫెన్స్ కౌన్సిల్స్ ద్వారా న్యాయ సాయం అందిస్తాం. దీని కోసం జైళ్లకు కూడా వెళతాం. న్యాయ సాయం కావాల్సిన వారికి న్యాయవాదులను ఏర్పాటు చేస్తాం. బెయిల్ వచి్చన తర్వాత ఒకవేళ పెద్ద మొత్తంలో షూరిటీలు చెల్లించలేని వారు ఉంటే.. కోర్టును సంప్రదించి ఆ మొత్తాన్ని తగ్గించేలా తోడ్పాటునందిస్తాం. –తెలంగాణ లీగల్ సరీ్వసెస్ అథారిటీ -
జైల్లో ఉన్న నిందితుడు మరో కేసులో ముందస్తు బెయిల్ కోరొచ్చు
న్యూఢిల్లీ: జైల్లో ఉన్న నిందితుడు వేరొక కేసులో ముందస్తు బెయిల్ కోరవచ్చని సుప్రీంకోర్టు తేలి్చచెప్పింది. వేరొక కేసులో అతను అరెస్టు కానంతవరకు దాంట్లో ముందస్తు బెయిల్ కోరడానికి అర్హుడేనని వివరించింది. ఒక కేసులో నిందితుడు కస్టడీలో ఉన్నాడనేది.. రెండో కేసులో అతని ముందస్తు బెయిల్ పిటిషన్‌పై సెషన్స్ కోర్టు, హైకోర్టులు నిర్ణయం తీసుకోవడానికి అడ్డంకి కాదని స్పష్టం చేసింది. కస్టడీలో ఉన్నంతమాత్రాన మరో కేసులో ముందస్తు బెయిల్ ఇవ్వకూడదని చట్టంలో ఎక్కడా లేదని చీఫ్ జస్టిస్ డి.వై.చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం పేర్కొంది. ‘అరెస్టు చేస్తారనే భయమున్నపుడు ముందస్తు బెయిల్‌ను కోరే హక్కును సీఆర్పీసీ సెక్షన్ 438 కలి్పంచింది. ప్రజాస్వామ్యదేశంలో వ్యక్తి స్వేచ్ఛ, స్వాతంత్య్రం ప్రాధాన్యతను గుర్తించడానికే ఈ సెక్షన్ ఉంది. 438 సెక్షన్‌కు ఆంక్షలను పెట్టకూడదు. అలాచేస్తే అది ఈ సెక్షన్ సారాంశానికి, చట్టం ఉద్దేశానికి వ్యతిరేకమే అవుతుంది’ అని పేర్కొంది. వివిధ హైకోర్టులు ఈ అంశంలో భిన్న వైఖరులు తీసుకోవడంతో సర్వోన్నత న్యాయస్థానం సోమవారం స్పష్టతనిచి్చంది. జైళ్లో ఉన్న నిందితుడు మరోకేసులో ముందస్తు బెయిల్‌ను కోరలేడని రాజస్తాన్, ఢిల్లీ, అలహాబాద్ హైకోర్టులు తీర్పులిచ్చాయి. బాంబే, ఒడిశా హైకోర్టులు ముందస్తు బెయిల్ కోరవచ్చని అభిప్రాయపడ్డాయి. ‘నిందితుడికి ముందస్తు బెయిల్ కోరే చట్టబద్ధమైన హక్కుని నిరాకరించడం తగదు. మొదటి కేసులో కస్టడీ నుంచి విడుదలయ్యే దాకా మరో కేసులో ముందస్తు బెయిల్ కోరలేరనడంలో అర్థం లేదు’ అని ధర్మాసనం వ్యాఖ్యానించింది. -
జైల్లోంచి పనిచేయకుండా కేజ్రీవాల్‌పై నిషేధం ఉందా?
సాక్షి, న్యూఢిల్లీ: జైలులో నుంచి విధులు నిర్వర్తించకుండా ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌పై నిషేధమేమైనా ఉందా? అని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. ఖైదీల ముందస్తు విడుదలకు సంబంధించిన ఫైళ్లపై సంతకం చేయడంలో జైలులో ఉన్న కేజ్రీవాల్‌కు అవరోధాలేమిటని నిలదీసింది. ముందస్తు విడుదలకు సంబంధించి ఫైళ్లపై నిర్ణయాలు ఆలస్యం కావడం సరికాదని అభిప్రాయపడింది. ఓ ఖైదీ ముందస్తు విడుదలకు సంబంధించిన కేసును శుక్రవారం జస్టిస్ అభయ్ ఎస్ ఓకా, జస్టిస్ అగస్టీన్ జార్జిలతో కూడిన ధర్మాసనం విచారించింది. సాధారణంగా ఓ ఖైదీ ముందస్తు విడుదలకు సంబంధించిన ఫైలు లెఫ్టినెంట్ గవర్నర్‌ను చేరాలంటే తొలుత ముఖ్యమంత్రి సంతకం చేయాల్సి ఉంటుంది. అయితే, ఢిల్లీ మద్యం విధానం కుంభకోణం కేసులో జైలులో ఉన్న అరవింద్ కేజ్రీవాల్ సదరు ఫైలుపై సంతకం చేయడం ఆలస్యం కావడాన్ని కోర్టు గుర్తించింది. ఈ నేపథ్యంలో ‘‘జైలు నుంచి సీఎం కేజ్రీవాల్ ముందస్తు విడుదల ఫైళ్లపై సంతకం చేయకూడదని ఏమైనా నిబంధన ఉందా? స్వయంగా ఓ కేసులో విచారణ ఖైదీగా ఉన్న సీఎం సదరు ఫైలుపై సంతకం చేయకుండా నిషేధం ఏమైనా ఉందా?’’అని ఢిల్లీ ప్రభుత్వాన్ని ధర్మాసనం ప్రశ్నించింది. దీనికి సంబంధించి ప్రభుత్వం నుంచి సూచనలు తీసుకుంటామని అదనపు సొలిసిటర్ జనరల్ ఐశ్వర్యభాటి, సీనియర్ న్యాయవాది అర్చనా దవేలు కోర్టుకు తెలిపారు. ఇప్పటివరకూ ఇలాంటి ఘటన ఎదురు కాలేదని వివరించారు. ఒకవేళ అలాంటి నిబంధన ఏమైనా ఉంటే చెప్పాలని లేదంటే ఆరి్టకల్ 142 ఇచి్చన అధికారాలతో కోర్టు పరిశీలన చేస్తుందని ధర్మాసనం పేర్కొంది. ఇలాంటి కేసులు ఎక్కువ కాలం వేచి ఉండరాదని అభిప్రాయపడుతూ ధర్మాసనం విచారణ వాయిదా వేసింది. -
పరారీకి యత్నం.. 129 మంది ఖైదీలు మృతి
కిన్సాసా: డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగోలోని సెంట్రల్ మకాల జైలులో విషాద ఘటన జరిగింది. జైలులో నుంచి పారిపోయేందుకు ప్రయత్నించి 129 మంది ఖైదీలు మరణించినట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఈ విషయాన్ని కాంగో అంతర్గత వ్యవహారాల మంత్రి షబానిలుకో మంగళవారం(సెప్టెంబర్3) ఎక్స్(ట్విటర్)లో తెలిపారు.ఖైదీల్లో 24 మంది మంటల్లో చిక్కుకొని ప్రాణాలు కోల్పోయినట్లు మంత్రి తెలిపారు. మకాల జైలు నుంచి తప్పించుకొనేందుకు ఖైదీలు ప్రయత్నించారని, దీంతో గార్డులు అప్రమత్తమై రంగంలోకి దిగడంతో జైలులో తొక్కిసలాట జరిగిందని చెప్పారు. తొక్కిసలాటకు తోడు జైలు కిచెన్‌లో చెలరేగిన మంటల్లో మొత్తం 129 మంది మరణించారు. మరో 59 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టినట్లు తెలిపారు. ఖైదీలు ఎవరూ తప్పించుకోలేదని.. తప్పించుకొనేందుకు ప్రయత్నించినవారు మరణించారని జైలు అధికారులు చెప్పారు. జైలు నుంచి కాల్పుల శబ్దం వినిపించిందని ప్రత్యక్ష సాక్షులు కొందరు చెబుతున్నారు. -
రోజూ రోటీయేనా ?
కోల్‌కతా: దేశమంతటా కలకలం సృష్టించిన కోల్‌కతాలో జూనియర్ వైద్యురాలి హత్యోదంతంలో నిందితుడు సంజయ్ రాయ్ జైళ్లోనూ తన మొండితనం చూపిస్తున్నాడు. ప్రతి రోజూ చపాతి ఏం తింటామని జైలు అధికారులపైనే ఆగ్రహం వ్యక్తంచేశాడు. అయితే జైలు నిబంధనల ప్రకారం ఖైదీలతోపాటే విచారణ ఖైదీలకు ఒకేరకమైన భోజనం వడ్డిస్తారు. వైద్యురాలి హత్యకేసులో అరెస్ట్‌చేశాక పోలీసులు సంజయ్‌ను కోల్‌కతాలోని ప్రెసిడెన్సీ కారాగారంలో పడేశారు. అయితే కస్టడీలో ఉన్నప్పటి నుంచి ఒకే తరహా చపాతి, కూరనే రోజూ వడ్డిస్తున్నారని సంజయ్ ఆగ్రహంగా మాట్లాడారు. ‘‘ రోజూ రోటీయేనా?. నాకు కోడిగుడ్డు ఫ్రైడ్రైస్లాంటి ఎగ్ చావ్మీన్ పెట్టండి’ అని జైలు సిబ్బందిని బెదిరించినట్లు విశ్వస నీయ వర్గాల సమా చారం. అయితే విచారణ ఖైదీ తనకిష్టమొచ్చింది తింటానని తెగేసి చెప్పడంపై జైలు యాజమాన్యం సీరియస్ అయింది. అతి చేయొద్దని హెచ్చరించి అధికారులు సంజయ్ నోరు మూయించారు. దీంతో పెట్టింది తింటానని సంజయ్ వ్యాఖ్యానించినట్లు సమాచారం. అయితే జైలుకు వచ్చిన కొత్తలో తనకు నిద్ర పట్టట్లేదని, నిద్ర సరిపోవడం లేదని, నన్ను కాస్తంత పడుకోనివ్వండి అని సంజయ్ తెగ ఫిర్యాదులు చేసేవాడని ఇప్పుడు సాధారణ స్థాయికి వచ్చాడని తెలుస్తోంది. -
త్వరలో బళ్లారి జైలుకు దర్శన్ !
బొమ్మనహళ్లి : అభిమాని రేణుకాస్వామి హత్యకేసుకు సంబంధించి పరప్పన అగ్రహార జైలులో న్యాయ నిర్బంధంలో ఉన్న నటుడు దర్శన్‌కు అక్కడ రాచ మర్యాదలు లభించడం పెను సంచలనమైన విషయం తెలిసిందే. రాచమర్యాదులు అందుతున్న ఫొటోలు వెలుగులోకి రావడంతో జైళ్లశాఖ దిద్దుబాటు చర్యలు చేపట్టింది. దర్శన్‌ను పరప్పన ఆగ్రహార జైలు నుంచి బళ్లారి జైలుకు తరలించాలని జైళ్ల శాఖ నిర్ణయించింది. ఈమేరకు బెంగళూరు 24వ ఏసీఎంఎం కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. దర్శన్‌ను బళ్లారి జైలుకు తరలించేందుకు కోర్టు కూడా అనుమతి ఇచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. రెండు మూడు రోజుల్లో దర్శన్‌ను బళ్లారికి తరించనున్నట్లు సమాచారం. భవిష్యత్‌లో విచారణ నిమిత్తం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా బళ్లారి జైలు నుంచే కోర్టు ఎదుట హాజరు పరచనున్నట్లు సమాచారం. రాచమర్యాదల కేసుపై దర్యాప్తు దొడ్డబళ్లాపురం: దర్శన్‌కు రాచమర్యాదులు అందిన ఘటనలో పరప్పన అగ్రహార పోలీస్‌స్టేషన్‌లో మూడు కేసులు నమోదు కాగా రెండింటిలో దర్శన్ మొదటి నిందితుడిగా ఉన్నాడు. ఈ కేసుల దర్యాప్తునకు సౌత్ ఈస్ట్ జోన్ డీసీపీ సారా ఫాతిమా మూడు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేశారు. బేగూరు పోలీస్‌స్టేషన్ సీఐ క్రిష్ణకుమార్ దర్యాప్తు ప్రారంభించనున్నారు. జైలు లాన్లో కూర్చుని దర్శన్ రౌడీషిటర్ ఇతర ఖైదీలకు ఆ ఏర్పాటు ఎవరు చేశారు?, సిగరెట్లు జైల్లోకి ఎలా వచ్చాయి అనే కోణంలో దర్యాప్తు చేస్తారు. ఈ దృశ్యాలు ఫొటో, వీడియో ఎలా తీశారనే విషయంపై హుళిమావు సీఐ దర్యాప్తు చేస్తారు. జైలు అధికారులు, సిబ్బంది విధి నిర్వహణలో నిర్లక్ష్యం, అధికార దురి్వనియోగం తదితర అంశాలపై మూడవ కేసును ఎల్రక్టానిక్ సిటీ పోలీస్‌స్టేషన్ ఏసీపీ మంజునాథ్ దర్యాప్తు చేస్తారు.దర్శన్ ఉదంతంపై సీఎం సమీక్ష దర్శన్, మాజీ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణలకు జైలులో రాచ మర్యాదలు దక్కుతున్న అంశాలకు సంబంధించి ముఖ్యమంత్రి సిద్ధరామయ్య మంత్రులతో సమావేశమయ్యారు. మంగళవారం ఉదయం హోంమంత్రి పరమేశ్వర్ ముఖ్యమంత్రిని కలిసి జైల్లో జరుగుతున్న అక్రమాలు, లోపాల గురించి వివరించారు. ఇప్పటికే ఉన్నతాధికారులతో కలిపి మొత్తం 9 మందిని సస్పెండ్ చేసినట్టు తెలిపారు. ఐపీఎస్ అధికారుల ఆధ్వర్యంలో తనిఖీ జరుగుతోందని చెప్పారు. ఆలోపు కోర్టు అనుమతి తీసుకుని దర్శన్‌ను వేరే జైలుకి తరలించే ఏర్పాటు చేస్తామన్నారు. కోర్టు అనుమతిస్తే దర్శన్‌ను బళ్లారి లేదా హిండలగా జైలుకి తరలించే అవకాశాలు ఉన్నాయి.తనిఖీకి ఐపీఎస్ అధికారులతో కమిటీ దొడ్డబళ్లాపురం: పరప్పన అగ్రహార జైల్లో దర్శన్, ప్రజ్వల్ రేవణ్ణ, రౌడీ షీటర్లకు రాచ మర్యాదలు ఇస్తున్న విషయానికి సంబంధించి తనిఖీ చేయడానికి ఐపీఎస్ అధికారులతో కమిటీ ఏర్పాటు చేస్తామని హోంమంత్రి జీ పరమేశ్వర్ వెల్లడించారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు. జైల్లో దర్శన్, ఇతర ఖైదీలు ఒక బ్యారక్ నుంచి మరో బ్యారక్‌లోకి తిరగడానికి అవకాశం కలి్పంచినట్టు సీసీటీవీలో స్పష్టంగా ఉందన్నారు. రాష్ట్రంలో ఉన్న పలు జైళ్లలో ఇదే పరిస్థితి ఉందన్నారు. జైలును సందర్శించిన పోలీస్ కమిషనర్ బెంగళూరు పోలీస్ కమిషనర్ దయానంద్ పరప్పన అగ్రహార జైలును సందర్శించారు. జైలులో గంజాయి, మద్యం, సిగరెట్లు, మొబైళ్లు అన్నీ ఇస్తున్నారని ఇటీవల పరప్పన అగ్రహార జైలు నుంచి విడుదలై వచ్చిన ఒక ఖైదీ మీడియా ముందు వెల్లడించాడు. దీంతో కమిషనర్ దయానంద్ జైలుని సందర్శించారు. ఫొటోలు, వీడియోలపై జైలు అధికారులను ప్రశ్నించారు. -
కన్నడ నటుడు దర్శన్ కు జైల్లో వీఐపీ ట్రీట్ మెంట్
-
‘కోల్‌కతా’ నిందితునికి ముగిసిన లై డిటెక్టర్ పరీక్ష
న్యూఢిల్లీ: కోల్‌కతాలో ఆర్జీ కర్ వైద్య కళాశాలలో జూనియర్ వైద్యురాలి దారుణ హత్యోదంతంలో ప్రధాన నిందితుడు సంజయ్ రాయ్‌కు ఆదివారం లై డిటెక్షన్ పరీక్ష నిర్వహించినట్టు అధికారులు వెల్లడించారు. కోల్‌కతాలో ప్రెసిడెన్సీ కారాగారంలోనే పరీక్ష పూర్తిచేసినట్లు తెలిపారు. ఇందుకోసం ఢిల్లీలోని సెంట్రల్ ఫోరెన్సిక్ సైన్స్ లే»ొరేటరీ నుంచి పాలిగ్రఫీ నిపుణులు కోల్‌కతాకు వచ్చారు.మెడికల్ కాలేజీ మాజీ ప్రిన్సిపల్ సందీప్ ఘోష్‌తో పాటు హతురాలితో పాటు పనిచేసే నలుగురు వైద్యులకు శనివారమే లై డిటెక్షన్ టెస్ట్ చేశారు. ఆ పరీక్షలో వాళ్లు ఏమేం చెప్పారనే వివరాలను పోలీసులు బయట పెట్టలేదు. సత్యశోధన పరీక్షలో వీళ్లు చెప్పిన అంశాలను సాక్ష్యాధారాలుగా కోర్టులో ప్రవేశపెట్టేందుకు చట్టపరంగా అనుమతి లేనప్పటికీ కేసు దర్యాప్తులో ఆ వివరాలు ఎంతో ఉపయోగపడతాయి.ఘోష్ ఇళ్లు, కార్యాలయాల్లో సోదాలు కర్ వైద్య కళాశాలకు ప్రిన్సిపల్‌గా ఉండగా సందీప్ ఘోష్ అక్రమాలకు పాల్పడ్డారన్న ఆరోపణల నేపథ్యంలో ఆయన ఇళ్లు, కార్యాలయాల్లో సీబీఐ ఆదివారం ఆకస్మిక సోదాలు చేపట్టింది. ఉదయమే కేంద్ర బలగాలతో ఘోష్ ఇంటికి వెళ్లిన అధికారులు డోర్లు తెరవకపోవడంతో చాలాసేపు వేచి చూడాల్సి వచి్చంది. మాజీ మెడికల్ సూపరింటెండెంట్, వైస్ ప్రిన్సిపల్ సంజయ్ వశిష్్ట, మరో ప్రొఫెసర్, ఇంకో 12 మందికి చెందిన ఇళ్లు, కార్యాలయాల్లోనూ తనిఖీలు చేశారు. ఆస్పత్రికి ఔషధాలు, ఇతర ఉపకరణాలను సరఫరాచేసే వారి ఆఫీసుల్లో సోదాలు చేశారు. -
ఫర్లో తో డేరా బాబా బయటకు?
హర్యానాలోని సునారియా జైలు నుంచి డేరా సచ్చా సౌదా చీఫ్ గుర్మీత్ రామ్ రహీమ్(డేరా బాబా)కు 21 రోజుల పాటు ఫర్లో లభించింది. ఈ సమయంలో ఆయన ఉత్తరప్రదేశ్‌లోని బాగ్పత్ జిల్లాలో గల బర్నావా ఆశ్రమంలో ఉండనున్నారు. రామ్ రహీమ్ తన ఇద్దరు అనుచరులపై అత్యాచారం చేసిన కేసులో 20 ఏళ్ల పాటు జైలు శిక్ష అనుభవిస్తున్నారు. గత జనవరి 19న రామ్‌రహీమ్‌కు 50 రోజుల పెరోల్ లభించింది. ఈ దరిమిలా అతనికి పదేపదే పెరోల్ లేదా ఫర్లో లభించడంపై శిరోమణి గురుద్వారా ప్రబంధక్ కమిటీ (ఎస్జీపీసీ) దాఖలు చేసిన పిటిషన్‌ను పంజాబ్-హర్యానా హైకోర్టు కొట్టివేసింది. కాంపిటెంట్ అథారిటీ నిబంధనల ఆధారంగా గుర్మీత్ రామ్ రహీమ్‌కు పెరోల్ లేదా ఫర్లో మంజూరు చేయడంపై నిర్ణయం తీసుకోవాలని హర్యానా ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. ఈ కేసు విచారణలో హర్యానా ప్రభుత్వం కేవలం రామ్ రహీమ్ మాత్రమే కాకుండా హత్య, అత్యాచారం కేసుల్లో శిక్ష అనుభవిస్తున్న 80 మందికి పైగా ఖైదీలకు పెరోల్ లేదా ఫర్లో సౌకర్యం అందజేస్తున్నట్లు స్పష్టం చేసింది.ఫర్లో అంటే ఏమిటి?ఫర్లో అంటే ఎవరైనా ఖైదీ అతని కుటుంబ సభ్యుల అంత్యక్రియలకు హాజరు కావడం లేదా అనారోగ్యంతో ఉన్న కుటుంబ సభ్యుడిని పరామర్శించడం లాంటి నిర్దిష్ట ప్రయోజనం కోసం జైలు నుండి తాత్కాలికంగా విడుదల చేయడం. ఫర్లో సాధారణంగా స్వల్ప కాలానికి మాత్రమే ఇస్తారు. ఈ గడువు ముగిసిన తర్వాత, ఖైదీ తిరిగి జైలుకు వెళ్లవలసి ఉంటుంది. ఫర్లో షరతులను జైలు అధికారులు నిర్ణయిస్తారు. ఎవరైనా ఖైదీకి ఫర్లో మంజూరు చేసేటప్పుడు అధికారులు సదరు ఖైదీ చెప్పే కారణం, అతని ప్రవర్తన, అతను తప్పించుకునే అవకాశం లాంటి అంశాలను పరిగణలోకి తీసుకుంటారు.పెరోల్ అంటే ఏమిటి?పెరోల్ అంటే ఖైదీ తన జైలు శిక్షలో కొంత భాగాన్ని పూర్తి చేసిన చేసిన అనంతరం షరతులతో కూడిన విడుదలకు అనుమతి కల్పిస్తారు. ఇది ఖైదీ ప్రవర్తనను గుర్తించి ఇస్తారు. ఇది ఖైదీని సమాజంలో తిరిగి చేర్చేందుకు ఉపకరిస్తుంది. పెరోల్ సమయంలో ఖైదీ జైలు అధికారులు పర్యవేక్షణలో ఉంటాడు. అలాగే నిర్ధిష్ట ప్రాంతంలో ఉంటూ, నేర కార్యకలాపాలకు దూరంగా ఉండాలి. -
పాక్ సైన్యం క్షమాపణ చెప్పాలి: మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్
ప్రస్తుతం జైలులో శిక్ష అనుభవిస్తున్న పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ అక్కడి సైన్యంపై విమర్శల యుద్ధానికి దిగారు. కోర్టు నుంచి పలు కేసుల్లో ఉపశమనం లభించడంతో ఇమ్రాన్‌లో నైతిక స్థైర్యం పెరిగినట్లు కనిపిస్తోంది. గత ఏడాది మే 9న అరెస్టయిన మాజీ ప్రధాని ఇమ్రాన్ నాడు చెలరేగిన అల్లర్లకు బాధ్యత వహిస్తూ ప్రభుత్వానికి క్షమాపణలు చెప్పేందుకు నిరాకరించారు. అయితే హింసాకాండ జరిగిన రోజున పాక్ రేంజర్లు తనను కిడ్నాప్ చేసినందున ఆర్మీ తనకు క్షమాపణ చెప్పాలని ఖాన్ డిమాండ్ చేశారు.ఇమ్రాన్ అరెస్టు తర్వాత పాకిస్తాన్ తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్ (పీటీఐ) మద్దతుదారులు నిరసనలకు దిగారు. ఇది దేశవ్యాప్తంగా పౌర, సైనిక సంస్థలకు నష్టం కలిగించింది. నాడు ఆర్మీ అధికార ప్రతినిధి మేజర్ జనరల్ అహ్మద్ షరీఫ్ మాట్లాడుతూ పీటీఐ (ఇమ్రాన్ పార్టీ) అరాచక రాజకీయాలకు పాల్పడినందుకు క్షమాపణలు కోరితే చర్చలు జరపవచ్చని అన్నారు. ఈ ప్రకటన తరువాత బ్లాక్ డే హింసకు ఖాన్ పార్టీ క్షమాపణ చెప్పాలని వివిధ వర్గాల నుండి డిమాండ్లు వచ్చాయి.డాన్ వార్తాపత్రిక తెలిపిన వివరాల ప్రకారం రావల్పిండిలోని అడియాలా జైలులో ఇమ్రాన్ ఖాన్ మీడియాతో మాట్లాడుతూ ఒక ప్రశ్నకు సమాధానంగా మే 9న చెలరేగిన హింస విషయంలో క్షమాపణ చెప్పడానికి తన దగ్గర ఎటువంటి కారణం లేదని అన్నారు. నాడు ఇస్లామాబాద్ హైకోర్టు కాంప్లెక్స్ నుండి మేజర్ జనరల్ నేతృత్వంలోని రేంజర్లు తనను అరెస్టు చేశారని ఖాన్ ఆరోపించారు. హింస జరిగిన రోజున తనను పాక్ రేంజర్లు కిడ్నాప్ చేశారని, అందుకు ప్రతిగా ఆర్మీ తనకు క్షమాపణలు చెప్పాలని ఖాన్ డిమాండ్ చేశారు. -
ఇక ర్యాలీని మళ్లీ జైలు వైపు తిప్పండి
-
తీహార్ జైలులో ఖైదీల ఘర్షణ.. ఇద్దరికి గాయాలు
ఢిల్లీలోని తీహార్ జైలులో మరోమారు గందరగోళ వాతావరణం ఏర్పడింది. ఖైదీల మధ్య మరోసారి ఘర్షణ చెలరేగింది. ఈ ఘటనలో ఇద్దరు ఖైదీలు గాయపడ్డారు. జైలులోని ఫోన్ రూమ్‌లో ఈ గొడవ జరిగింది. లవ్లీ, లావిష్ అనే ఇద్దరు ఖైదీలు గాయపడ్డారు.వివరాల్లోకి వెళితే లోకేష్ అనే ఖైదీ ఈ దాడికి పాల్పడ్డాడని సమాచారం. లోకేష్ సోదరుని హత్య కేసులో లవ్లీ, లావిష్ జైలులో ఉన్నారు. జైలులోనే దాడికి ప్లాన్ చేసిన లోకేష్ తన సహచరులు హిమాన్ష్, అభిషేక్‌ల సాయం తీసుకున్నాడు. అవకాశం చూసుకున్న లోకేష్, అతని సహచరులు కలసి లవ్లీ, లావిష్‌లపై దాడి చేశారు. గాయపడిన ఖైదీలిద్దరినీ జైలు అధికారులు ఆస్పత్రికి తరలించారు. చికిత్స అనంతరం ఒక ఖైదీని ఆస్పత్రి నుంచి తిరిగి జైలుకు తీసుకువచ్చారు. మరొక ఖైదీ ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. తీహార్ జైలులో గతంలోనూ ఇటువంటి ఘటనలు చోటుచేసుకున్నాయి. -
US: అమ్మాయి అనుకుని చాటింగ్.. భారత విద్యార్థికి 12 ఏళ్ల జైలు
న్యూయార్క్: ఉన్నత చదువులు చదవడానికి అమెరికా వెళ్లి బుద్ధి వక్రీకరించి 12 ఏళ్ల జైలు శిక్షకు గురయ్యాడు ఓ భారత విద్యార్థి. స్టూడెంట్ వీసా మీద అమెరికా వెళ్లిన ఉపేంద్ర ఆడూరు(32) భారత విద్యార్థి సోషల్ మీడియాలో 13 ఏళ్ల బాలిక అనుకుని ఓ వ్యక్తితో చాటింగ్ మొదలుపెట్టాడు. తన లైంగిక వాంఛ తీర్చుకునేందుకు మభ్యపెట్టే విధంగా సందేశాలు పంపాడు. అంతటితో ఆగకుండా ఆ ఖాతాకు అశ్లీల చిత్రాల మెసేజ్‌లు కూడా పెట్టాడు. ఏకంగా ఓ రోజు టైమ్ ఫిక్స్ చేసుకుని ఆ బాలికను కలవడానికి వెళ్లాడు. ఇక్కడే అతడికి ఎదురైంది పెద్ద ట్విస్టు. ఉపేంద్ర అనుకున్నట్లు ఆ ఖాతా 13 ఏళ్ల బాలికది కాదు.మైనర్ల మీద లైంగికనేరాలకు పాల్పడే వారిని వలపన్ని పట్టుకునేందుకు ఓ ప్రైవేట్ డిటెక్టివ్ క్రియేట్ చేసిన నకిలీ ఖాతా. ఉపేంద్ర బాలికను కలిసేందుకు మీటింగ్ స్పాట్‌కు వెళ్లగానే పోలీసులు పట్టుకున్నారు. అతడి ఫోన్ లాక్కుని అందులోని అశ్లీల వీడియోలు స్వాధీనం చేసుకున్నారు. ఈ వ్యవహారమంతా 2022 సెప్టెంబర్ 20 నుంచి అక్టోబర్ 6 మధ్యలో జరిగింది. ఈ కేసులో ఉపేంద్రకు 12 ఏళ్ల జైలు శిక్షతో పాటు రిలీజ్ అయిన తర్వాత మరో 10 ఏళ్లు పోలీసుల పర్యవేక్షణలో ఉండాలని కోర్టు తీర్పిచ్చింది. -
జైలు నుంచి విడుదలైన కాసేపటికే మళ్లీ అరెస్టైన గ్యాంగ్‌స్టర్.. ఎందుకంటే!
ఓ గ్యాంగ్‌స్టర్ అత్యుత్సాహంతో లేనిపోని కష్టాలు కొనితెచ్చుకున్నాడు. ఇటీవల జైలు నుంచి విడుదలైన ఆనందంలో జైలు నుంచి అతని అనుచరులు భారీ ర్యాలీ చేపట్టారు. రోడ్డుపై కార్లలో ఊరేగించారు. దీంతో పోలీసులు మళ్లీ గ్యాంగ్‌స్టర్‌పై చర్యలు చేపట్టారు. అతడిపై కేసు నమోదు చేసి మళ్లీ జైలుకు తరలించారు. ఈ ఘటన మహారాష్ట్రలో చోటుచేసుకుంది.మహారాష్ట్ర నాసిక్‌కు చెందిన గ్యాంగ్‌స్టర్ హర్షద్ పాటంకర్ హత్యాయత్నం, దొంగతనాలు, డ్రగ్స్ వంటి కేసుల్లో గతంలో అరెస్టయ్యాడు. జులై 23న అతడు జైలు నుంచి విడుదలయ్యాడు. ఈ విషయం తెలుసుకున్న అతడి మద్దతుదారులు భారీ ర్యాలీ చేపట్టారు. బేతేల్ నగర్ నుంచి అంబేద్కర్ చౌక్ వరకూ ‘కమ్ బ్యాక్’ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో హర్షద్ సన్‌రూఫ్ కారులో వెళ్తుండగా.. పలు కార్లు, సుమారు 15 ద్విచక్ర వాహనాలు అతడిని అనుసరించాయి. ఈ సందర్భంగా కారు రూఫ్ నుంచి హర్షద్ తన మద్దతుదారులకు అభివాదం చేస్తూ ముందుకు సాగారు.ఇందుకు సంబంధించిన వీడియోని అతడి మద్దతుదారులు సోషల్ మీడియాలో పోస్టు చేశారు. అదికాస్తా వైరల్‌గామారి పోలీసుల దృష్టికి చేరింది. దీంతో పోలీసులు హర్షద్‌పై చర్యలు చేపట్టారు. అనధికారిక ర్యాలీని నిర్వహించి రోడ్డుపై గందరగోళం సృష్టించినందుకు గానూ హర్షద్‌తోపాటు ఆరుగురు మద్దతుదారులపై కేసు నమోదు చేశారు. ఈ మేరకు వారందరినీ అరెస్ట్ చేసి జైలుకు పంపారు. -
కేజ్రీవాల్‌ను జైల్లోనే చంపేందుకు బీజేపీ కుట్ర: ఆప్
న్యూఢిల్లీ: ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌ను జైలులోనే చంపేందుకు బీజేపీ కుట్ర పన్నుతోందని ఆమ్ ఆద్మీ పార్టీ ఆరోపించింది. జూన్ 3–జూలై 7వ తేదీల మధ్య కేజ్రీవాల్ షుగర్ స్థాయిలు 26 రెట్లు పడిపోయినట్లు ఆరోగ్య నివేదికలు స్పష్టం చేస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేసింది. ఆప్ రాజ్యసభ ఎంపీ సంజయ్ సింగ్ ఆదివారం మీడియాతో మాట్లాడారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం, ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనాలు కేజ్రీవాల్ జీవితంతో ఆడుకుంటున్నారని మండిపడ్డారు. కేజ్రీవాల్‌కు ఏ క్షణమైనా ప్రమాదం జరగొచ్చని అధికారిక నివేదికలే చెబుతున్నాయన్నారు. కేజ్రీవాల్ ఆరోగ్యంపై బీజేపీ, ఎల్జీ పదే పదే వెలువరిస్తున్న తప్పుడు నివేదికలు, చేస్తున్న తప్పుడు వ్యాఖ్యలు ఈ అనుమానాలను బలపరుస్తున్నాయన్నారు. ‘కేజ్రీవాల్ పూరీలు, స్వీట్లు తదితరాలను అతిగా తింటున్నారని, అవసరం లేకున్నా ఇన్సులిన్ అడుగుతున్నారని వీరే గతంలో ఆరోపించారు. కోర్టు జోక్యంతో ఎయిమ్స్ వైద్యులు పరీక్షలు జరిపి ఆయనకు ఇన్సులిన్ ఇచ్చారు. ఇప్పుడేమో కేజ్రీవాల్ వైద్యులు సూచించిన మోతాదు కంటే తక్కువగా తింటున్నారని, అందుకే షుగర్ లెవెల్స్ పడిపోయాయని అంటున్నారు’అని సంజయ్ సింగ్ వివరించారు. దీని వెనుక కేజ్రీవాల్ ప్రాణాలు తీసేలా భారీ కుట్ర ఉందని ఆయన అనుమానం వ్యక్తం చేశారు. -
నేరస్తుడా? నిరపరాధుల పాలిట దైవమా.. ! ఏకంగా 50 ఏళ్లు జైల్లోనే..
ఓ వ్యక్తి కరుడుగట్టిన నేరస్తుడి మాదిరిగా దారుణమైన జైలు శిక్ష అనుభవిస్తున్నాడు. అంటరానివాడిలా ఒక ప్రత్యేక భద్రతతో కూడిన సెల్లో ఉన్నారు. అతడికి ఆహారం సైతం ఓ రంధ్రం గుండా పంపిస్తారు జైలు అధికారులు. కానీ అతడి నేరాల చరిత్ర వింటే..నేరస్తుడా లేదా నిరపరాధిల పాలిట రక్షకుడా అన్న ఫీలింగ్ వస్తుంది. లేక వ్యవస్థ సరిగ్గా పనిచేయకపోవడంతో చట్టాన్ని చేతిల్లోకి తీసుకుని దుర్మార్గులని దునుమాడిన మహోన్నత వ్యక్తి ఏమో..! అనే భావన కలుగుతుంది. పైగా బ్రిటన్ చరిత్రలో అత్యధిక కాలం ఒంటిరిగా నిర్భంధంలో ఉన్న ఖైదీగా నిలిచిపోయాడు. అతడెవరంటే..బ్రిటన్‌లో అత్యంత ప్రమాదకరమైన సీరియల్ కిల్లర్‌గా పేరు తెచ్చుకున్నాడు రాబర్ట్ మాడ్స్లీ. ప్రస్తుతం అతడు వేక్ఫీల్డ్ జైలులో ఉన్నాడు.అతని జైలు గది 18 అడుగుల పొడవు, 15 అడుగుల వెడల్పు ఉండి, 17 ఉక్కు తలుపుల వెనుక ఉంటుంది.ఈ గది కాల్పులు తట్టుకునేంత దృఢంగా ఉంటుంది.“ఇన్సైడ్ వేక్ఫీల్డ్ ప్రిజన్” అనే పుస్తకంలో జోనాథన్ లెవి, ఎమ్మా ఫ్రెంచ్‌లు రాసినట్లుగా, మాడ్స్లీ జైలు గదిలోని టేబుల్, కుర్చీలు కార్డ్‌బోర్డ్‌తో తయారు చేశారు.టాయిలెట్, సింక్ నేలకు బిగించబడి ఉంటుంది. అతనికి అందించే భోజనం కూడా ఒక చిన్న రంధ్రం గుండా పంపిస్తారు. నిజానికి మాడ్సీ 21 ఏళ్ల వయసు నుంచి జైలు జీవితం గడుపుతున్నాడు. అతడి నేరాలు గురించి తెలుసుకుని విస్తుపోతారు. ఎందుకంటే అతడు ఖైదీనా నిరపరాధుల పాలిట దైవమా..!అనిపిస్తుంది. చేసిన నేరాలు..1974లో, చిన్న పిల్లలపై లైంగిక దాడి చేసిన 30 సంవత్సరాల వ్యక్తి జాన్ ఫారెల్ని అతను చంపేశాడు.ఆ తర్వాత 1977లో, అతను మరో ఖైదీతో కలిసి, చిన్నపిల్లలపై లైంగిక దాడి నేరానికి జైలు శిక్ష అనుభవిస్తున్న డేవిడ్ ఫ్రాన్సిస్( David Francis )ని చంపేశాడు.వేక్ఫీల్డ్ జైలులో కూడా మాడ్స్లీ నేరాలు కొనసాగాయి.1978 జులై 29న, తన భార్యను హత్య చేసిన ఖైదీ సల్నీ డార్వడ్ని హతమార్చాడు.అంతేకాకుండా, ఏడేళ్ల బాలికపై అత్యాచార చేసిన బిల్ రాబర్ట్స్‌ను కూడా చంపేశాడు.ఈ హత్యల కారణంగా, అధికారులు మాడ్స్లీని ఇతర ఖైదీలతో కలిపి ఉంచడం చాలా ప్రమాదకరమని భావించారు.ఫలితంగా, 1983లో అతని కోసం ప్రత్యేక అద్దాల గదిని నిర్మించారు. అప్పటి నుంచి, అతను అదే గదిలో ఉన్నాడు. తన జైలు జీవితాన్ని మాడ్స్లీ ఒకసారి నరకంలో బంధించడం లాగా ఉందని వర్ణించాడు. ప్రస్తుతం అతని వయసు 71 సంవత్సరాలు. ఇప్పటికీ అదే జైలులో ఉండడం వల్ల, అతన్ని నేరస్తుడిగా చూడాలా లేక నిరపరాధుల రక్షకుడిగా భావించాలా అనే సందేహం బ్రిటన్ ప్రజల్లో కలుగుతుంటుంది. కనీసం ఇప్పుడైనా మాడ్స్లీ క్షమాభిక్ష పెట్టి స్వేచ్ఛగా జీవించేలా చేస్తే బాగుండనని కొందరూ భావిస్తుండటం విశేషం. (చదవండి: ఆ ఫోబియాకు పుస్తకాలతో చెక్‌పెట్టి..స్ఫూర్తిగా నిలిచిన ట్రాన్స్‌విమెన్!) -
లోయలోకి దూసుకెళ్లిన కారు కేసు: ‘భారత సంతతి డాక్టర్‌కు జైలు శిక్ష విధించలేం’
న్యూయార్క్: భార్య, పిల్లలను ఉద్దేశపూర్వకంగా హత్య చేసేందుకు కారును లోయలోకి నడిపారనే కేసులో భారత సంతతి డాక్టర్ ధర్మేష్ పటేల్ జైలు శిక్ష విధించలేదని కాలిఫోర్నియ కోర్టు ప్రకటించింది. ధర్మేష్ పటేల్ తీవ్రమైన ఒత్తిడితో ఇబ్బంది పడుతున్నారని, ఆయన మానసిక అనారోగ్యం కారణంగా జైలు శిక్ష విధించటం లేదని జడ్జి సుసాన్ జకుబోవ్స్ తెలిపారు. ఆయన మానసిక ఆరోగ్యానికి చికిత్స అందించాలని కోర్టు ఆదేశించింది. ఈ కేసులో ఆయన విడుదల, అనారోగ్యానికి సంబంధించి చికిత్స వివరాలను జూలై 1న వెల్లడిస్తామని కోర్టు పేర్కొంది. గతేడాది కాలిఫోర్నియాలో ఉండే డాక్టర్ ధర్మేష పటేల్.. పిల్లలతోపాటు తన భార్య ప్రయాణం చేస్తున్న కారు శాన్ మాటియోలోని హైవే పక్కన ఉన్న భారీ లోయలో పడిపోయింది. ఈ క్రమంలో సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే రెస్క్యూ ఆపరేషన్ చేపట్టారు. అదృష్టవశాత్తు కారులో ప్రయాణిస్తున్న 4 ఏళ్ల అమ్మాయి, 9 ఏళ్ల బాలుడు సహా ధర్మేష్, ఆయన భార్య ప్రాణాలతో భయటపడ్డారు.ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న అధికారులు.. ధర్మేష్ కావాలనే కారును లోయలో పడేశాడని అనుమానిస్తూ ఆయన్ను అదుపులోకి తీసుకున్నారు. ధర్మేష్‌ను శాన్ మాటియో కౌంటీలోని జైలుకు తరలించే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ఈ నేపథ్యంతో కేసుపై విచారణ జరిపిన కోర్టు జైలు శిక్ష విధించటంలేదని పేర్కొంది. -
హత్య కేసులో.. అన్నదమ్ములకు యావజ్జీవం!
కరీంనగర్: తమపై పెట్టిన హత్యాయత్నం కేసు ను రాజీ కుదర్చుకోవడం లేదనే కారణంతో ఓ వ్యక్తి ని హత్య చేసిన అన్నదమ్ములకు యావజ్జీవ శిక్షతోపా టు రూ.5వేల చొప్పున జరిమానా విధిస్తూ జగిత్యా ల జిల్లా ప్రధాన న్యాయమూర్తి జి.నీలిమ మంగళవారం తీర్పు చెప్పారు.పబ్లిక్ ప్రాసిక్యూటర్ మల్లికా ర్జున్ కథనం ప్రకారం.. మెట్పల్లి మండలం వేంపేట కు చెందిన ధనరేకుల రాజేందర్ వ్యవసాయంతోపా టు ఉపాధిహామీలో మేట్‌గా పనిచేస్తున్నాడు. అదే గ్రామానికి చెందిన మహిళతో వివాహేతర సంబంధం నెరుపుతున్నాడంటూ సదరు మహిళ భర్త జెల్ల రమేశ్, అతని తమ్ముడు జెల్ల మహేశ్ 2020 మార్చి 3న కత్తితో రాజేందర్‌పై దాడి చేశారు. దీంతో రాజేందర్ మెట్పల్లి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా అన్నదమ్ములపై కేసు నమోదైంది.ఇద్దరూ జైలుకు వెళ్లి బెయిల్‌పై వచ్చారు. ఆ కేసును రాజీ చేసుకోవా లంటూ పెద్దమనుషుల సమక్షంలో పలుమార్లు పంచాయితీ జరిగింది. రాజీకి రాజేందర్ ససేమిరా అన్నాడు. దీంతో అతడిని ఎలాగైనా చంపాలని అన్నదమ్ములు నిర్ణయించుకున్నారు. 2020 మే 19న గ్రా మ శివారులో ఉపాధి హామీ పనులకు వెళ్లిన రాజేందర్‌పై జెల్ల రమేశ్, జెల్ల మహేశ్ విచక్షణరహితంగా కత్తులతో దాడి చేయగా అక్కడికక్కడే మృతి చెందా డు.రాజేందర్ భార్య హరిణి ఫిర్యాదు మేరకు అప్ప టి మెట్పల్లి ఎస్సై ఎన్.సదాకర్ కేసు నమోదు చేశా రు. అప్పటి సీఐలు రవికుమార్, ఎల్.శ్రీనివాస్ దర్యాప్తు చేసి నిందితులను అరెస్ట్ చేసి కోర్టులో చార్జిషీట్ దాఖలు చేశారు. కోర్టు మానిటరింగ్ అధి కారులు కిరణ్‌కుమార్, రంజిత్‌కుమార్ సాక్ష్యాలను కోర్టులో ప్రవేశపెట్టారు. వాటిని పరిశీలించిన జడ్జి రమేశ్, మహేశ్‌కు యావజ్జీవ శిక్షతో పాటు ఒక్కొక్కరికి రూ.5వేల జరిమానా విధిస్తూ తీర్పు చెప్పారు. -
బాలికపై లైంగిక దాడి కేసులో పదేళ్ల జైలు
విజయవాడస్పోర్ట్స్: ఐదేళ్ల బాలికపై లైంగిక దాడికి పాల్పడిన కేసులో నిందితుడికి పదేళ్ల జైలుశిక్ష విధిస్తూ విజయవాడ పోక్సో కోర్టు ఇన్చార్జ్ న్యాయమూర్తి తిరుమల వెంకటేశ్వర్లు సోమవారం తీర్పు చెప్పారు. వివరాలిలా ఉన్నాయి. ఇబ్రహీంపట్నం ప్రాంతానికి చెందిన మహిళకు, నున్న గ్రామానికి చెందిన వ్యక్తితో వివాహం జరిగింది. వీరికి ఇద్దరు సంతానం. భర్తతో మనస్పర్థల కారణంగా ఆమె పిల్లలను తీసుకుని ఇబ్రహీంపట్నంలోని పుట్టింట్లో ఉండేది.కొన్నాళ్ల తరువాత భర్త వచ్చి తన ఐదేళ్ల పెద్ద కుమార్తెను నున్నలోని తన ఇంటికి తీసుకెళ్లాడు. అయితే ఇంట్లో ఎవరూ లేని సమయంలో వాంబేకాలనీకి చెందిన 20 ఏళ్ల కుంచాల దుర్గారావు అలియాస్ తమ్మిశెట్టి దుర్గారావు అలియాస్ దుర్గా ఆ పాపను డాబాపైకి తీసుకెళ్లి లైంగిక దాడికి పాల్పడ్డాడు. మరుసటి రోజు పాపకు స్నానం చేయిస్తుండగా మర్మాంగాల వద్ద ఇన్ఫెక్షన్ రావడాన్ని గమనించిన తల్లి ఆరా తీయగా దుర్గారావు చేసిన అత్యాచారం బయటపడింది.వెంటనే పాపను చికిత్స నిమిత్తం విజయవాడలోని ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లారు. పాపపై అత్యాచారం జరిగినట్లు వైద్యులు నిర్ధారించడంతో పాప తల్లి ఇచి్చన ఫిర్యాదు మేరకు 2019 ఏప్రిల్ ఆరో తేదీన నున్న పోలీసులు కేసు నమోదు చేసి 2020 ఆగస్టు 12వ తేదీన నిందితుడు దుర్గారావును అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపర్చారు. నేరం రుజువు కావడంతో నిందితుడు దుర్గారావుకు కఠిన కారాగార శిక్షతో పాటు రూ.10 వేల జరిమానా విధిస్తూ న్యాయమూర్తి తీర్పు చెప్పారు. -
చేయని నేరానికి ఏకంగా 40 ఏళ్లు..!ఆ మందుల ప్రభావంతో..
టైం బాగోకపోతే ఎంతటి వారైన దారుణమైన పరిస్థితుల్లోకి వెళ్లిపోవాల్సిందే. అంతేగాదు చేయని తప్పులకు బాధ్యత వహించాల్సి వస్తుంది, నిందలు కూడా పడాల్సి వస్తుంటుంది. శిక్ష అంత అనుభవించాక గానీ అసలు నిజం వెలుగులోకి రాదు. తీరా వచ్చినా పెద్దగా ప్రయోజనం ఉండదు కూడా. ఎందుకంటే దాని తాలుకా చేదు అనుభవాలన్ని భరించేసి ఉంటారు బాధితులు. ఇక వాస్తవం ఏంటో తేలినా..చివరికి సమాజం నుంచి వచ్చే టన్నుల కొద్ది జాలి బాధిస్తుందే తప్ప ఓదార్పునివ్వదు. పైగా అవేమీ వారి కోల్పోయిన సంతోషాన్ని, పరువును తెచ్చి ఇవ్వలేవు. 'నాకే ఎందుకు ఇలా'.. అన్న మాటలకందని వేదనే మిగులుతుంది. ఇలాంటి బాధనే ఫేస్ చేసింది యూఎస్‌కి చెందిన ఓ మహిళ. చేయని నేరానికి ఎన్నేళ్లు కటకటాల్లో మగ్గిందో వింటే కంగుతింటారు. అసలేం జరిగిందంటే..సాండ్రా హెమ్మె అనే 64 ఏళ్ల మిస్సౌరీ మాజీ పోలీసు అధికారి. తన సహ పోలీసు అధికారిణి జెష్కేని హత్య చేసిన కేసులో ఏకంగా 40 ఏళ్లకు పైగానే జైల్లో గడిపింది. అంతేగాదు యూఎస్ చరిత్రలోనే ఎక్కువకాలం తప్పుగా ఖైదు చేయబడిన మహిళగా నిలిచింది. ఆమె ఎన్నో ఏళ్ల నుంచి నిర్ధొషిగా విడుదలవ్వటం కోసం ఆశగా పోరాడుతోంది. ఈ కేసులో సరైన సాక్ష్యాధారాలు ఏమీ లేవు. కేవలం హెమ్మె నుంచి తీసుకున్న వాగ్మూలం ఒక్కటే ఆధారం చేసుకుని దోషిగా నిర్థారించి కోర్టు శిక్ష విధించినట్లు పిటిషన్లో ఉంది. నిజానికి ఆమె మానసిక అనారోగ్యంతో బాధపడుతుంది. వాటికోసం వాడిన బలమైన మందులు ప్రభావంతో పోలీసులు అడిగిన ప్రశ్నలకు అస్ఫష్టంగా ఇచ్చిన సమాధానాలనే బేస్ చేసుకుంది కోర్టు. అసలైన ట్విస్ట్ ఏంటంటే ఈ కేసుకి సంబంధించి సాక్ష్యాలు, కొన్ని భౌతిక సాక్ష్యాలు చాలా విరుద్ధంగా ఉన్నాయి. అలాగే హెమ్మె ఇచ్చిన సమాధానాల్లో నేరానికి లింక్ అప్ అయ్యేలా ఎలాంటా సమాధానాలు కూడా ఇవ్వలేదని బాధితరుపు న్యాయవాది హార్స్‌మన్ పిటిషన్లో పేర్కొన్నారు. పైగా కోర్టు మాత్రం ఆమె వాగ్ములాన్నే ప్రధానంగా తీసుకుని ఇంతలా శిక్ష విధించడం అమానుషమని వాదించారు కూడా. అంతేగాదు న్యూయార్క్‌లో ఉన్న ఇన్నోసెన్స్ ప్రాజెక్ట్ హెమ్మీ కేసును స్వీకరించి ఆమెకు న్యాయ చేసేందుకు ముందుకొచ్చింది. అంతేగాదు ప్రాజెక్ట్‌కి సంబంధించిన పోలీసులు హెమ్మెని ఈ కేసులో ఇరికించేలా సాక్ష్యాధారాలను సృష్టించారని ఆరోపణలు చేశారు. ఎందుకంటే..ఇన్నోసెన్స్ చేసిన దర్యాప్తులో.. హత్య జరిగిన తరువాత రోజే తన సహ పోలీసు అధికారి క్రెడిట్ కార్డుని హెమ్మె ఉపయోగించిందని, అలాగే ఆమె ట్రక్ చనిపోయిన బాధితురాలి ఇంటి వద్ద పార్క్ చేసి ఉందని పిటిషన్లో పోలీసులు చెప్పారు. అలాగే ఆ ప్రదేశంలోనే బాధితురాలి చెవిపోగులు గుర్తించినట్లు కూడా తెలిపారు. అయితే ఇవేమీ క్లియర్‌గా హెమ్మెనే ఈ హత్య చేసిందనేందుకు కచ్చితమైన సాక్ష్యాధారాలు కావు. పైగా బాధితురాలు పోలీసు అధికారి జెష్కే హత్యకు ముందు తర్వాత కూడా ఇలాంటి నేరాలు మహిళలపై చాలా జరగాయని, అందువల్ల ఈ నేరం హెమ్మె చేసే అవకాశం లేదని వెల్లడించింది. దీంతో కోర్టు ఆమెను నిర్దోషిగా ప్రకటించింది. ఏదీఏమైనా చేయని నేరానికి మానసిక సమస్యల రీత్యా ఓ అమాయకురాలు ఏకంగా 40 ఏళ్లుకు పైగా జైలు శిక్ష అనుభవించి రావడం నిజంగా చాలా బాధకర విషయం. వందమంది దోషులు తప్పించుకున్న పర్లేదు గానీ ఒక్క నిర్దోషికి అన్యాయంగా శిక్షపడకూడదు అన్న మాట ఈమె విషయంలో రివర్స్ అయ్యింది కదూ!.(చదవండి: మిస్ ఏఐ అందాల పోటీలో టాప్ 10 ఫైనలిస్ట్‌గా జరా శతావరి! ఎవరీమె..?) -
రష్యా జైలులో ‘ఐసిస్’ కలకలం
మాస్కో: రష్యాలోని ఓ డిటెన్షన్ సెంటర్లో కొంతమంది విచారణ ఖైదీలు సిబ్బందిని బందీలుగా పట్టుకోవడం సంచలనం రేపింది. ఈ షాకింగ్ ఘటనతో వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు జైలు సిబ్బందిని నిర్బంధించిన ఖైదీల్లో కొందరిని అంతమొందించారు.అధికారులు తెలిపిన వివరాల ప్రకారం రోస్తోవ్-ఆన్-డాన్ నగరంలో ఉన్న ప్రీ-ట్రయల్ డిటెన్షన్ సెంటర్లో ఆరుగురు ఖైదీలు ఇద్దరు జైలు గార్డులను బందీలుగా పట్టుకున్నారు. ఆ ఖైదీలకు ఉగ్రవాదసంస్థ ఇస్లామిక్ స్టేట్ గ్రూపు(ఐసిస్)తో సంబంధాలున్నట్లు ఆరోపణలున్నాయి. వారి వద్ద మారణాయుధాలున్నట్లు అధికారులు తెలిపారు.ఖైదీల బారి నుంచి ఇద్దరు సిబ్బంది సురక్షితంగా బయటపడ్డారని, వారికి ఎలాంటి గాయాలు కాలేదని రష్యా మీడియా తెలిపింది. ఈ ఘటనలో ఎంతమంది ఖైదీలు మృతి చెందారనేదానిపై క్లారిటీ రావాల్సి ఉంది. కాగా, ఈ ఏడాది మార్చిలో మాస్కోలోని ఓ మ్యూజిక్ కన్సర్ట్ హాల్‌పై ఐసిస్ ఉగ్రవాదులు జరిపిన కాల్పుల్లో 145 మంది ప్రాణాలు కోల్పోయారు. -
చైనాలో మహిళా జర్నలిస్టుకు ఐదేళ్ల జైలు
చైనాలో ‘మీటూ’ఉద్యమంలో పాల్గొన్న మహిళా జర్నలిస్టు హువాంగ్ షుకిన్‌పై దేశద్రోహం ఆరోపణలు చేస్తూ, ఐదేళ్ల జైలు శిక్ష విధించారు. చైనా జర్నలిస్టుల సంఘం ఈ వివరాలను తెలియజేసింది. ‘ది అసోసియేటెడ్ ప్రెస్’ వెల్లడించిన వివరాల ప్రకారం షుకిన్‌కు ఒక లక్ష యువాన్ (రూ. 1,155,959) జరిమానా కూడా విధించారు. మూడు సంవత్సరాల క్రితం షుకిన్‌లో పాటు మరో కార్యకర్తను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.మీటూ ఉద్యమం చైనాలో గతంలో ఉధృతంగా సాగింది అయితే ప్రభుత్వం దానిని అణిచివేసింది. ఇలా ఉద్యమాల్లో పాల్గొనే నేతలను, కార్యర్తలను చైనా అజ్ఞాతంలో ఉంచడం గానీ లేదా వారికి జైలు శిక్ష విధించడం గానీ చేస్తుందనే ఆరోపణలున్నాయి. కాగా మహిళా జర్నలిస్టు షుకిన్ విడుదల తేదీ 2026, సెప్టెంబర్ 18గా కోర్టు ప్రకటించింది. ఇదే ఆరోపణలపై ఆమె స్నేహితుడు వాంగ్ జియాన్‌బింగ్‌కు మూడేళ్ల ఆరు నెలల శిక్ష విధించారు. షుకిన్ ఫ్రీలాన్స్ జర్నలిస్ట్. మహిళా హక్కుల కార్యకర్తగానూ పనిచేస్తున్నారు. కోర్టు తీసుకున్న నిర్ణయంపై అప్పీల్ చేస్తామని ఆమె అభిమానులు మీడియాకు తెలిపారు.ప్రస్తుతం ఫ్రీలాన్సర్‌గా పనిచేస్తున్న షుకిన్ 2018లో తాను యూనివర్సిటీలో పీహెచ్డీ చేస్తున్నప్పుడు, అక్కడి సూపర్వైజర్ తనను లైంగికంగా వేధించాడని ఆరోపిస్తూ మీటూ ఉద్యమం బాట పట్టారు. షుకిన్‌కు జైలు శిక్ష విధించడాన్ని ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్‌కు చెందిన చైనా యూనిట్ డైరెక్టర్ సారా బ్రూక్స్ ఖండించారు. ఇది చైనాలో మహిళల హక్కులపై దాడి అని ఆరోపించారు. -
బిహార్ జైలులో చైనీయుడి మృతి
పాట్నా:బిహార్‌లోని ఓ జైలులో ఆత్మహత్యాయత్నం చేసిన చైనీయుడు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు. చైనాలోని షాండాంగ్ ప్రావిన్సుకు చెందిన లీ జియాకీ సరైనా పత్రాలు లేకుండా భారత్‌లోకి ప్రవేశించాడు. జూన్6వ తేదీన బ్రహ్మపురలోని లక్ష్మీచౌక్ వద్ద తిరుగుతుండగా సరైన వీసా పత్రాలు లేకపోవడంతో పోలీసులు అతడిని అరెస్టు చేశారు. ఫారనర్స్ యాక్ట్ కింద లీపై కేసు నమోదు చేశారు. అరెస్టు సమయంలో లీ వద్ద చైనా మ్యాపు, మొబైల్ ఫోన్, చైనా, నేపాల్, ఇండియా కరెన్సీలు దొరికాయి. అరెస్టు తర్వాత లీని ముజఫర్‌పూర్ జైలుకు తరలించారు. జూన్7న జైలులో లీ ఆత్మహత్యాయత్నం చేశాడు.తన కళ్లద్దాలను పగులగొట్టి గాజుతో శరీరాన్ని గాయపరుచుకున్నాడు. తీవ్ర రక్త స్రావంతో అపస్మారకస్థిలో జైలు గదిలోని బాత్రూమ్లో పడి ఉన్నాడు. విషయం తెలుసుకున్న పోలీసులు లీని ముజఫర్‌పూర్‌లోని శ్రీ కృష్ణా మెడికల్ కాలేజీ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ లీ మంగళవారం(జూన్11) మరణించాడని పోలీసులు తెలిపారు. -
వరుసగా మూడోసారి బీజేపీ క్లీన్‌స్వీప్
సాక్షి, న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో మరోమారు భారతీయ జనతా పార్టీ సత్తా చాటింది. వరుసగా మూడోసారి విజయం సాధించి హ్యాట్రిక్‌ను సాధించింది. ఢిల్లీలోని ఏడు లోక్‌సభ స్థానాలకు ఏడింటినీ గెలుచుకుంది. జైలు నుంచి వచ్చి ప్రచారం చేసిన ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ సానుభూతితో ఓట్లు తెచ్చుకునేందుకు చేసిన ప్రయత్నాలను ప్రజలు తిప్పికొట్టారు. 2009లో ఢిల్లీలో ద్వితీయ స్థానంలో నిలిచిన బీజేపీ 2014, 2019తోపాటు ప్రస్తుత ఎన్నికల్లో ఏడు స్థానాల్లోనూ గెలిచి సత్తా చాటింది.ఓట్లు రాబట్టని ప్రసంగంఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో తీహార్ జైలులో ఉన్న కేజ్రీవాల్ ఎన్నికల ప్రచారంలో పాల్గొనేందుకు సుప్రీంకోర్టు బెయిలిచ్చింది. తనను అక్రమంగా అరెస్టు చేశారని, ఇండియా కూటమిని గెలిపిస్తే కేజ్రీవాల్ జైలుకు వెళ్లాల్సిన పరిస్థితి ఉండదంటూ ప్రజల్లో సానుభూతి కోసం ప్రయత్నించారు. ప్రతిచోటా ఇదే ప్రసంగంతో ఓట్లు రాబట్టుకునేందుకు ప్రయత్నాలు చేశారు. కానీ, అవి ఫలించలేదు.తగ్గిన బీజేపీ ఓటింగ్ శాతంవరుసగా మూడు పర్యాయాలు ఢిల్లీలో బీజేపీ తన అధిపత్యాన్ని కనబరిచింది. 2009 ఎన్నికల్లో ఢిల్లీలో బీజేపీ 35.23% ఓట్లు తెచ్చుకుంది. 2014లో 46.40శాతం, 2019లో 56.85 శాతం ఓట్లతో వరుసగా విజయం సాధించింది. తాజా ఎన్నికల్లో మాత్రం బీజేపీ 54.30 శాతం ఓట్లను మాత్రమే తన ఖాతాలో వేసుకుంది. అంటే గత ఎన్నికలతో పోల్చితే ఈ ఎన్నికల్లో బీజేపీ 2.55శాతం ఓట్లను కోల్పోయింది. డీలా పడ్డ కాంగ్రెస్ గ్రాఫ్2009 ఎన్నికల్లో 57.11 శాతం ఓట్లతో కాంగ్రెస్ ఏడు స్థానాలను కైవసం చేసుకుని అగ్రస్థానంలో నిలిచిన కాంగ్రెస్, 2014కు వచ్చేసరికి ఓటమిని చవి చూసింది. కేవలం 15.10% ఓట్లతో ద్వితీయస్థానంలో నిలిచిన కాంగ్రెస్ 2019 ఎన్నికల్లో 22.63% ఓట్లతో పుంజుకుంది. తాజా ఎన్నికల్లో 19.11% ఓట్లతో తృతీయ స్థానానికి చేరింది. ఇక 24.02% ఓట్లతో ఆప్ ద్వితీయ స్థానంలో నిలిచాయి. ఈ రెండు పార్టీలు ఓట్ల శాతాన్ని పెంచుకున్నా సీట్ల సాధనలో విఫలమయ్యాయి. -
జూన్-2న తీహార్ అధికారుల ఎదుట లొంగిపోనున్న కేజ్రీవాల్
-
చిన్నారులపై అత్యాచారం కేసుల్లో జైలు
విశాఖ లీగల్/విజయవాడ స్పోర్ట్స్: వావి వరసలు మరచి అభంశుభం తెలియని చిన్నారులపై అత్యాచారానికి పాల్పడిన ఇద్దరు నిందితులకు వేర్వేరు కేసుల్లో జైలుశిక్ష, జరిమానా విధిస్తూ.. ఆయా న్యాయమూర్తులు సోమవారం తీర్పునిచ్చారు. సొంత మనవరాలిపై అత్యాచారానికి పాల్పడిన వృద్ధుడికి 20 ఏళ్ల కఠిన కారాగార శిక్ష, రూ.5 లక్షల జరిమానా విధిస్తూ విశాఖ నగరంలోని పోక్సో ప్రత్యేక న్యాయస్థానం న్యాయమూర్తి జి.ఆనంది తీర్పు చెప్పారు. అలాగే 12 ఏళ్ల బాలికపై లైంగిక దాడి యత్నం చేసిన మేనమామకు ఐదేళ్ల జైలుశిక్ష విధిస్తూ విజయవాడ పోక్సో కోర్టు ఇన్చార్జ్ న్యాయమూర్తి తిరుమల వెంకటేశ్వర్లు తీర్పు వెల్లడించారు.కేసుల పూర్తి వివరాల్లోకి వెళితే.. విశాఖ నగరంలోని మల్కాపురం పోలీస్‌స్టేషన్ పరిధిలోని మల్కాపురం జాలరి వీధిలో ప్రభుత్వ ఉద్యోగిగా పదవీ విరమణ చేసిన వాడమొదుల శ్యాంసుందరరావు (70) నివాసం ఉంటున్నాడు. అతనికి ఇద్దరు కొడుకులు. బాధితురాలు (ప్రస్తుతం 19) పెద్దకొడుకు చంద్రశేఖర్ కూతురు. చంద్రశేఖర్ వృత్తిరీత్యా కారు డ్రైవరు. నిత్యం బయటకు వెళ్లేవాడు. బాధితురాలి తల్లి సత్యవతి, తన ఇద్దరు పిల్లలు, అత్తమామలతో కలిసి ఉంటుంది. ఆ ఇల్లు రెండంతస్తుల భవనం. గ్రౌండ్ ఫ్లోర్లో బాధితురాలు, వారి కుటుంబ సభ్యులు ఉంటున్నారు.రెండో అంతస్తులో నిందితుడు శ్యాంసుందరరావు, అతని భార్య ఉంటున్నారు. 2017 అక్టోబర్ ఒకటో తేదీకి ముందు నిందితుడు బాలికను భయపెట్టి లోబర్చుకుని ఆమెపై పలుమార్లు లైంగిక దాడి చేశాడు. ఈ విషయాన్ని ఎవరికైనా చెప్తే కుటుంబం మొత్తాన్ని చంపేస్తానని బెదిరించాడు. అక్టోబర్ ఒకటో తేదీన బాలిక పాఠశాల నుంచి ఇంటికి వచి్చన వెంటనే సుమారు మూడున్నర గంటల సమయంలో వృద్ధుడు బాలికపై మళ్లీ లైంగిక దాడికి యతి్నస్తుండగా ఆ బాలిక గట్టిగా అరిచింది. ఆ కేకలు విన్న ఆమె చెల్లెలు కింద ఫ్లోర్లో ఉన్న తల్లికి చెప్పింది. అది విన్న తల్లి మేడ మీద మొదటి అంతస్తుపైకి వెళ్లి చూడగా నిందితుడు చేస్తున్న అకృత్యాన్ని కళ్లారా చూసింది. వెంటనే మల్కాపురం పోలీసులకు ఫిర్యాదు చేసింది. నేరం రుజువు కావడంతో వృద్ధుడికి 20 ఏళ్ల కఠిన కారాగార శిక్ష, రూ.5 లక్షల జరిమానా విధిస్తూ తీర్పు చెప్పారు. ఐదు లక్షల రూపాయలను బాధితురాలికి ఇవ్వాలని న్యాయమూర్తి తన తీర్పులో స్పష్టం చేశారు.కసాయి మేనమామకు ఐదేళ్ల జైలు.. ఖమ్మం జిల్లాకు చెందిన బాలిక (12) తల్లితో కలిసి పండుగలకు విజయవాడ వన్‌టౌన్‌లోని అమ్మమ్మ ఇంటికి వస్తుంటుంది. 2017న దసరా పండుగకు వచ్చిన బాలిక పట్ల ఆమె మేనమామ లైంగికదాడికి యతి్నంచడమే కాకుండా ఎవరికైనా చెబితే చంపేస్తానని బెదిరించాడు. అప్పటినుంచి మానసికంగా కుంగిపోయిన బాలిక 2018 జనవరిలో మేనమామ తన పట్ల ప్రవర్తించిన తీరును తల్లికి వివరించింది. బాలిక తల్లి ఫిర్యాదు మేరకు 2018 జనవరి 9న వన్‌టౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఏడుగురు సాక్షులను విచారించిన అనంతరం నేరం రుజువు కావడంతో నిందితుడికి ఐదేళ్ల కఠిన కారాగార శిక్షతో పాటు రూ.15 వేలు జరిమానా విధిస్తూ విజయవాడ పోక్సో కోర్టు ఇన్చార్జ్ న్యాయ మూర్తి తిరుమల వెంకటేశ్వర్లు తీర్పు చెప్పారు. -
విశాఖ జైలులో ఈ–ములాఖత్‌లు ప్రారంభం
ఆరిలోవ: విశాఖ జైలులో ఖైదీలు వారి కుటుంబ సభ్యులందరినీ ఒకేసారి చూసుకునే వెసులుబాటు లభించింది. ఇందుకోసం సోమవారం నుంచి ప్రత్యేకంగా ఈ–ములాఖత్‌ల విధానాన్ని జైలు అధికారులు అందుబాటులోకి తెచ్చారు. సాధారణంగా జైలులో ఉన్న ఖైదీలను వారి కుటుంబ సభ్యులు వారానికి రెండుసార్లు కలిసే అవకాశం ఉంది. కుటుంబ సభ్యుల్లో కొందరికే ఈ అవకాశం ఉండేది. ములాఖత్‌కు వెళ్లిన వారి ద్వారానే మిగిలిన కుటుంబ సభ్యుల క్షేమ సమాచారాన్ని తెలుసుకోవాల్సి వచ్చేది. ఇకపై స్వయంగా ములాఖత్‌లతో పాటు ఈ–ములాఖత్ విధానాన్ని కూడా అందుబాటులోకి తేవడంతో ఖైదీలు ఇంట్లో వారందరిని చూస్తూ వారితో మాట్లాడే అవకాశం కలుగుతుంది. ప్రత్యేక వెబ్సైట్లో దరఖాస్తు ఈ – ములాఖత్ కోసం అధికారులు ప్రత్యేకంగా వెబ్సైట్లో అప్లికేషన్‌ను రూపొందించారు. ఖైదీ కుటుంబ సభ్యులు ముందుగా ఆ వెబ్సైట్ ద్వారా ములాఖత్‌కు దరఖాస్తు చేసుకోవాలి. జైలు అధికారులు వాటిని పరిశీలించి వారికి నిర్దిష్టమైన తేదీ, సమయాన్ని కేటాయిస్తారు. ఆ వివరాలను ఖైదీకి కూడా తెలియజేస్తారు. ఆ సమయానికి ఖైదీ కంప్యూటర్లో కుటుంబ సభ్యులను చూస్తూ వారితో ముచ్చటించొచ్చు.ఇందుకోసం జైలులో కూడా ప్రత్యేకంగా కంప్యూటర్లు ఏర్పాటు చేశారు. భౌతికంగా ములాఖత్‌కు రాలేని వారు ఇకపై ఆన్లైన్ ద్వారా అయినా వారానికి రెండుసార్లు మాట్లాడుకునే వెసులుబాటు లభించింది. ఈ–ములాఖత్ ద్వారా సోమవారం పలువురు ఖైదీలు వారి కుటుంబ సభ్యులతో ముచ్చటించినట్లు విశాఖ జైలు సూపరింటెండెంట్ ఎస్.కిశోర్‌కుమార్ తెలిపారు. -
రాజ్యాంగ పరిరక్షణే ప్రధానం: కేజ్రీవాల్
న్యూఢిల్లీ: తాను మళ్లీ జైలుకెళ్తే ఎలాగ అనే విషయం వదిలేసి రాజ్యాంగ పరిరక్షణ మీదే దృష్టిపెట్టాలని, అది మీ బాధ్యత అని ఓటర్లకు ఆప్ కనీ్వనర్ కేజ్రీవాల్ హితవు పలికారు. బుధవారం చాంద్నీ చౌక్, నార్త్‌వెస్ట్ ఢిల్లీ కాంగ్రెస్ అభ్యర్థుల తరఫున ప్రచార రోడ్‌షోలో కేజ్రీవాల్ ప్రసంగించారు. ‘ హరియాణా, ఉత్తరప్రదేశ్.. ఇలా దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో వాకబు చేశా. దేశవ్యాప్తంగా చూస్తే బీజేపీ గెలవబోయే సీట్లు బాగా తగ్గిపోతున్నాయి. విపక్షాల ‘ఇండియా’ కూటమి అధికారంలోకి రాగానే దేశాభివృద్ధి కోసం పని మొదలుపెడతాం. దీంతో నియంతృత్వం అంతమవుతుంది. నేను మళ్లీ జైలుకెళ్తే ఎలాగ అన్న ఆలోచనలు పక్కనపడేయండి. రాజ్యాంగ పరిరక్షణే అత్యవశ్యకం. అది మీ బాధ్యత’’ అని ఓటర్లకు హితవు పలికారు. -
బాంబే హైకోర్టు షాక్.. జైలుకు చంద్రబాబు?
-
‘జైలును తప్పించుకునేందుకే పార్టీ ఫిరాయించాను’
ముంబై: మహారాష్ట్రలోని ముంబై వాయువ్య లోక్‌సభ నియోజకవర్గ శివసేన అభ్యర్థి రవీంద్ర వైకర్.. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అరెస్ట్, జైలును తప్పించుకునేందుకే తాను శివసేన (యూబీటీ) నుంచి ఫిరాయించానని ప్రకటించి తన పార్టీని ఇరుకున పడేశారు. జోగేశ్వరిలోని సివిక్ ప్లాట్‌లో ఫైవ్ స్టార్ హోటల్ నిర్మాణానికి సంబంధించి ఈడీ ఆయనపై పీఎంఎల్ఏ కేసు నమోదు చేసింది.ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే నేతృత్వంలోని శివసేనలో చేరడం మినహా తనకు వేరే మార్గం లేదని ఒక మరాఠీ దినపత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో రవీంద్ర వైకర్ పేర్కొన్నారు. శివసేన (యూబీటీ) చీఫ్ ఉద్ధవ్ థాకరేకు అత్యంత విధేయుడిగా రవీంద్ర వైకర్ పేరుగాంచారు. ఉద్ధవ్ థాకరే స్వయంగా వైకర్ నివాసానికి వెళ్లి బుజ్జగించారంటేనే ఆయనకు శివసేన (యూబీటీ) ప్రాధాన్యత ఇస్తోందో అర్థం చేసుకోవచ్చు.తన వ్యాఖ్యలతో తీవ్ర దుమారం రేగడంతో రవీంద్ర వైకర్ దిద్దుబాటుకు ప్రయత్నించారు. ఇంటర్వ్యూలో తన వ్యాఖ్యలను వక్రీకరించారని ఆరోపించారు. శివసేన (యూబీటీ) నుండి వైదొలగే ముందు తాను ఉద్ధవ్‌తో మూడు సార్లు సమావేశమయ్యానని, తన ఇబ్బందులను తెలియజేశానని చెప్పారు.కాగా ముంబై నార్త్-వెస్ట్ స్థానంలో శివసేన (యూబీటీ)కి చెందిన అమోల్ కీర్తికర్‌తో వైకర్ పోటీలో ఉన్నారు. అమోల్ తండ్రి కీర్తికర్ ప్రస్తుతం ఇక్కడ సిటింగ్ ఎంపీ. ఈ లోక్‌సభ స్థానానికి ఐదో దశలో మే 20న పోలింగ్ జరగనుంది. జూన్ 4న ఓట్ల లెక్కింపు జరుగుతుంది. -
రాకాసి నర్సుకు 760 ఏళ్ల జైలు శిక్ష : అసలు ఏమైందంటే..!
వైద్యో నారాయణో హరిః అంటాం. వైద్యులు దేవుళ్లతో సమానమని అర్థం.అలాగే రోగులకు సేవచేసే నర్సులని దైవదూతలుగా భావిస్తాం. నిస్సార్థంగా, కుటుంబ సభ్యులకంటే మిన్నగా వారు చేసే సపర్యలు రోగులకు ఎక్కడలేని ఊరటనిస్తాయి. కానీ ఒక నర్సుమాత్రం దీనికి పూర్తి భిన్నంగా ప్రవర్తించింది. రాక్షసిలా మారి రోగులను పొట్టన బెట్టుకుంది. ఎక్కడ ఏంటి వివరాల కోసం ఈ కథనాన్ని చదవండి..!అమెరికాలోని పెన్సిల్వేనియాలో హీథర్ ప్రెస్డీ (41) అనే నర్సుకు ఏకంగా 760 సంవత్సరాల జైలు శిక్ష పడింది. మూడు హత్య కేసుల్లో దోషిగా తేలడంతో ఆమెకు యావజ్జీవ కారాగార శిక్ష పడింది. మూడు జీవిత కాలాలు అంటే 760 సంవత్సరాల జైలు శిక్షను విధించారు.మూడేళ్ల పాటు ప్రాణాంతకమైన ఇన్సులిన్ ను అధిక మోతాదులతో ఇవ్వడంతో 17 మంది రోగులు ప్రాణాలు కోల్పోయినట్టుప్రెస్డీపై ఆరోపణలు నమోదైనాయి. మూడు హత్యలు, 19 హత్యాయత్నాల్లో నేరాన్ని అంగీకరించింది. ఈ కేసుల్లో దోషిగా తేలడంతో ఆమెకు యావజ్జీవ కారాగార శిక్ష విధించింది కోర్టు.ప్రెస్డీ 22 మంది రోగులకు అధిక మొత్తంలో ఇన్సులిన్ ఇచ్చినట్లు అభియోగాలు మోపారు. వీరిలో చాలా మంది రోగులు మోతాదు తీసుకున్న వెంటనే లేదా కొంత సమయం తరువాత మరణించారు. బాధితులు 43 నుండి 104 ఏళ్ల వయసు ఉంటుంది.ఇద్దరు రోగులను చంపినందుకు ఆమెపై తొలుత గత ఏడాది మేలో అభియోగాలు నమోదు కాగా, తర్వాత జరిగిన పోలీసు విచారణలో మరిన్ని విషయాలు ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి. ప్రాథమిక అభియోగాలు నమోదు చేసిన అనంతరం ఆమె నర్సింగ్ లైసెన్స్ రద్దు చేశారు. ‘‘ఆమెకు ఏ జబ్బూ లేదు. మతిస్థిమితమూ లేదు. ఆమెది దుష్ట వ్యక్తిత్వం. ఆమె నా తండ్రిని చంపిన రోజు ఉదయం ఆమె కూృరమైన ముఖంలోకి చూశాను'’ అంటూ బాధిత కుటుంబ సభ్యుల్లో ఒకరు కోర్టుకు తెలిపారు.రోగులు, సహోద్యోగులు పట్ల కూడా ఆమె దురుసుగా ప్రవర్తించేదని విచారణ అధికారులు గుర్తించారు. అంతేకాదు ప్రెస్డీ తన తల్లికి ఏప్రిల్ 2022 – మే 2023 మధ్య కాలంలో రోగుల పట్ల తన అసంతృప్తిని మెస్సేజ్‌లను పంపించిందట.ఇన్సులిన్ అధిక మోతాదు హైపోగ్లైసీమియాకు దారితీస్తుంది, హృదయ స్పందనను పెంచుతుంది. గుండెపోటుకు కూడా దారితీస్తుంది. చివరికి ప్రాణాలను కూడా తీస్తుంది. -
ఖైదీల మధ్య ఘర్షణ.. ఇద్దరు మృతి!
పంజాబ్‌లోని సంగ్రూర్ జైలులో ఖైదీల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందగా, మరో ఇద్దరు ఖైదీలు తీవ్రంగా గాయపడ్డారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం శుక్రవారం అర్థరాత్రి ఘర్షణ జరిగింది. ఈ నేపధ్యంలో తీవ్రంగా గాయపడిన నలుగురు ఖైదీలను ఆసుపత్రికి తరలించారు. వీరిలో ఇద్దరు మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. మరో ఇద్దరు ఖైదీల పరిస్థితి విషమంగా మారింది. మెరుగైన చికిత్స కోసం వారిని పాటియాలా ఆసుపత్రికి తరలించారు. ఈ సందర్భంగా డాక్టర్ కరణ్‌దీప్ కహెల్ మాట్లాడుతూ తీవ్రంగా గాయపడిన నలుగురు ఖైదీలను జైలు నుంచి ఇక్కడికి తీసుకు వచ్చారని, వారిలో ఇద్దరు మృతి చెందారని, మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందన్నారు. వారిని పటియాలాకు రిఫర్ చేశామని తెలిపారు. మరణించిన ఖైదీల పేర్లు హర్ష్, ధర్మేంద్ర అని పోలీసులు పేర్కొన్నారు. ఈ ఘర్షణలో గగన్‌దీప్ సింగ్, మహ్మద్ హరీష్, సిమ్రాన్ గాయపడ్డారు. ఖైదీలు నిద్రించడానికి తమ బ్యారక్లకు వెళుతుండగా సిమ్రంజీత్ తన సహచరుల సహాయంతో హర్ష్, ధర్మేంద్రలపై దాడి చేశాడు. నిందితులు ధర్మేంద్ర, హర్షలపై కట్టర్‌తో మెడ, ఛాతీ, నోటిపై దాడి చేశారు. సిమ్రంజీత్‌పై హత్యతో పాటు 18 కేసులు ఉన్నాయి. ఇతను ఆరేళ్లుగా జైలులో శిక్ష అనుభవిస్తున్నాడు. ఈ ఘర్షణ తర్వాత జైలు అధికారులు ఈ రెండు గ్రూపుల ఖైదీలను వేర్వేరు బ్యారక్‌లలో ఉంచారు. -
మూడు మామిడి పండ్లే తిన్నా.. ఢిల్లీ కోర్టులో కేజ్రీవాల్ వాదన
న్యూఢిల్లీ: జైలులో తాను తీసుకుంటున్న ఆహారాన్ని ఈడీ రాజకీయం చేస్తోందని ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ విమర్శించారు. డయాబెటిస్ బాధితుడినైన తనకు జైలులో ఇన్సులిన్ ఇవ్వాలని కోరుతూ కేజ్రీవాల్ దాఖలు చేసిన పిటిషన్‌పై ఢిల్లీ రౌస్అవెన్యూ కోర్టులో శుక్రవారం వాదనలు కొనసాగాయి. మెడికల్ బెయిల్ పొందడానికి లేదా చికిత్స పేరిట ఆసుపత్రిలో చేరడానికి వీలుగా రక్తంలో చక్కెర స్థాయిలు పెంచుకోవడానికి కేజ్రీవాల్ ఉద్దేశపూర్వకంగా మామిడి పండ్లు, స్వీట్లు తింటున్నారని ఈడీ గురువారం కోర్టు దృష్టికి తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. ఈడీ వాదనపై కేజ్రీవాల్ శుక్రవారం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. జైలులో ఉన్న తనకు ఇప్పటిదాకా 48 సార్లు ఇంటి నుంచి భోజనం పంపగా, కేవలం మూడుసార్లు మాత్రమే మామిడిపండ్లు తిన్నానని కేజ్రీవాల్ తెలిపారు. కేవలం ఒకే ఒక్కసారి ఆలూ పూరీ తీసుకున్నానని, అది కూడా నవరాత్రి ప్రసాదంగా స్వీకరించానని కోర్టుకు తెలియజేశారు. వైట్ రైస్, బ్రౌన్ రైస్ కంటే మామిడి పండ్లలో చక్కెర స్థాయి తక్కువగా ఉంటుందని పేర్కొన్నారు. షుగర్ లేని స్వీట్లు ఆరుసార్లు తిన్నానని, షుగర్ లేకుండా టీ తాగుతున్నానని వెల్లడించారు. తనకు చికిత్స అందించే రెగ్యులర్ వైద్యుడు సూచించిన డైట్ చార్ట్ ప్రకారమే ఆహారం తీసుకుంటున్నానని వివరించారు. ప్రతిరోజూ 15 నిమిషాలపాటు డాక్టర్‌ను సంప్రదించడానికి అనుమతి ఇవ్వాలంటూ శుక్రవారం మరో పిటిషన్ దాఖలు చేశారు. ఇన్సులిన్ కోసం దాఖలు చేసిన పిటిషన్‌తోపాటు ఈ పిటిషన్‌పై తీర్పును న్యాయస్థానం రిజర్వ్ చేసింది. -
‘కేజ్రీవాల్‌ను మూడోసారీ ఓడించలేకపోతే చంపేద్దాం.. ఇదీ వారి కుట్ర’
న్యూఢిల్లీ, సాక్షి: ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌ను జైల్లో చంపే కుట్ర జరుగుతోందని ఆ పార్టీ నాయకురాలు, రాష్ట్ర మంత్రి అతిషి ఆరోపించారు. టైప్ 2 డయాబెటిస్ పేషెంట్ అయిన కేజ్రీవాల్ పదేపదే అభ్యర్థనలు చేసినప్పటికీ ఆయనకు ఇన్సులిన్ ఇవ్వడం లేదని తెలిపారు. మద్యం పాలసీ స్కామ్ ఆరోపణలతో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌ను మార్చి 21న ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అరెస్టు చేసింది. తాజాగా కేజ్రీవాల్ తన రెగ్యులర్ డాక్టర్‌తో వీడియో సంప్రదింపుల కోసం చేసిన అభ్యర్థనను ఈడీ వ్యతిరేకించిన అనంతరం ఆప్ నేతల నుంచి ఈ ఆరోపణలు వచ్చాయి. ‘అరవింద్ కేజ్రీవాల్‌ను మూడు ఎన్నికల్లో (మూడు ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు) బీజేపీ ఓడించలేకపోతే, ఆయన్ను జైల్లో ఉంచి చంపేందుకు పథకం పన్నుతోంది’ అని అతిషి అన్నారు. "అరవింద్ కేజ్రీవాల్ తీవ్రమైన మధుమేహంతో బాధపడుతున్నారని అందరికీ తెలుసు. ఆయనకు గత 30 సంవత్సరాలుగా ఈ సమస్య ఉంది. తన చక్కెర స్థాయిని అదుపులో ఉంచుకోవడానికి రోజూ 54 యూనిట్ల ఇన్సులిన్ తీసుకుంటారు" అని ఆమె పేర్కొన్నారు. ‘ఇంత తీవ్రమైన మధుమేహం ఉన్న వ్యక్తి మాత్రమే అంత ఇన్సులిన్ తీసుకుంటాడు. కావాలంటే ఏ డాక్టర్నైనా అడగండి.. అందుకే అరవింద్ కేజ్రీవాల్ ఇంట్లో వండిన ఆహారాన్ని తినడానికి, డాక్టర్ సూచించిన ఆహారాన్ని తినడానికి కోర్టు అనుమతించింది’ అన్నారు. అయితే బీజేపీ తన అనుబంధ సంస్థ (ఈడీ) ద్వారా కేజ్రీవాల్ ఆరోగ్యాన్ని చెడగొట్టేందుకు ప్రయత్నిస్తోందని, ఈడీ పదే పదే అబద్ధాలు చెబుతోందని అని ఆమె కోర్టులో ఏజెన్సీ వాదనలను తిప్పికొట్టారు. తన వైద్యుడితో సంప్రదింపు కోసం చేసిన అభ్యర్థనను వ్యతిరేకిస్తూ, మధుమేహ వ్యాధిగ్రస్తులు తినకూడని మామిడిపండ్లు, స్వీట్లను కేజ్రీవాల్ తింటున్నారని, చక్కెర కలిగిన టీ తాగుతున్నారని ఈడీ వాదించింది. దీనికి కౌంటర్ ఇస్తూ ఇది పూర్తిగా అబద్ధమని, డాక్టర్ సూచించిన స్వీటెనర్ తోనే టీ, స్వీట్లను కేజ్రీవాల్ తీసుకున్నారని అతిషి చెప్పుకొచ్చారు. -
సౌదీ జైల్లో భారతీయుడు.. విడుదలకు రూ.34 కోట్ల నిధుల సేకరణ
కోజికోడ్: ప్రపంచంలో ఏమూల ఉన్నాసరే విపత్కర సమయాల్లో కేరళ ప్రజలంతా ఒక్కటవుతుంటారు. ఈ క్రమంలో సౌదీ అరేబియాలో మరణ శిక్ష పడిన ఓ వ్యక్తి కోసం ఇప్పుడూ వాళ్లంతా ఏకం అయ్యారు. ఓ హత్య కేసులో మరణశిక్ష పడ్డ వ్యక్తి జైల్లో మగ్గుతున్న ఆ వ్యక్తిని కాపాడటానికి ఏకంగా రూ. 34 కోట్లు నిధుల సేకరణకు ముందుకొచ్చారు. కోజికోడ్‌కు చెందిన అబ్దుల్ రహీమ్.. 2006లో సౌదీలో ఓ బాలుడికి అబ్దుల్ రహీమ్ కేర్‌టేకర్‌గా చేరారు. అయితే ప్రమాదవశాత్తు ఆ బాలుడు రహీమ్ సంరక్షణలో మృతి చెందాడు. దీంతో ఈ కేసులో అక్కడి న్యాయస్థానం రహీమ్‌కు మరణశిక్ష విధించింది. సుమారు 18 ఏళ్ల నుంచి సౌదీ అరేబియాలో జైలు శిక్ష అనుభవిస్తున్నాడు. ఈ కేసులో రహీమ్‌కు క్షమాభిక్ష ప్రసాదించడానికి బాధిత కుటుంబం తొలుత నిరాకరించింది. అయితే.. బ్లడ్‌మనీ (నష్ట పరిహారం రూపంలో) చెల్లిస్తే క్షమించేందుకు ఎట్టకేలకు ఒప్పుకుంది. బ్లడ్ మనీ కింద రూ.34కోట్లు చెల్లించాలని ఆ బాలుడి కుటుంబం షరతు విధించింది. అయితే రహీం ఆర్థిక స్తోమత అంతంత మాత్రమే కదా!. ఈ క్రమంలో సౌదీలోని కేరళీయులు అంతా ఏకమై నిధలు సేకరించడానికి ఓ కమిటిగా ఏర్పడ్డారు. ముందుగా నిధులు సమీకణకు పెద్దగా స్పందన రాలేదు. కొన్ని రోజుల అనంతరం కేరళీయుల నుంచి భారీ విరాళాలు రావటం ప్రారంభమైందని నిధుల సేకరణ కమిటీ మీడియాకు వెల్లడించింది. రియాద్‌లోని సుమారు 75 సంస్థలు, కేరళకు వ్యాపారవేత్తలు, స్థానిక రాజకీయ సంస్థలు విరాళాలు అందిచినట్లు తెలుస్తోంది. విరాళాల్లో పారదర్శకత కోసం సదరు కమిటి ప్రత్యేక నిధులకు సేకరణకు యాప్‌ను కూడా తయారు చేసింది. ‘ఇంత పెద్ద భారీ నిధులు సేకరణ సాధ్యం అవుతుందని అస్సలు ఊహించలేదు. రూ. 34 కోట్లు సేకరిస్తామన్న నమ్మకం మొదట్లో లేదు. కానీ మెల్లగా విరాళాలు పెరగటంతో సాధ్యం అయింది’ అబ్దుల్ రహీం తల్లి సంతోషం వ్యక్తం చేసింది. త్వరలోనే రహీమ్ జైలు నుంచి విడుదల కానున్నాడని అతని కుటుంబం సంతోషం వ్యక్తం చేస్తోంది. -
ఆ ‘ఆప్’ నేతలు ఎక్కడ? నిరసనలకు ఎందుకు దూరం?
లోక్‌సభ ఎన్నికలు తరుముకొస్తున్న తరుణంలో ఆమ్ ఆద్మీ పార్టీ చిక్కుల్లో పడింది. పార్టీ కన్వీనర్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ జైలులో ఉండటం పార్టీకి పెద్ద సమస్యగా పరిణమించింది. సీఎంను జైలుకు పంపడాన్ని నిరసిస్తూ పార్టీ చేపడుతున్న నిరసన ప్రదర్శనలకు కొందరు పార్టీ ఎమ్మెల్యేలు గైర్హాజరు కావడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. పార్టీలోని మొత్తం 10 మంది ఎంపీల్లో ముగ్గురు పార్టీ కోసం తమ గొంతు వినిపిస్తుండగా, ఏడుగురు ఎంపీలు ఏమయ్యారో ఎవరికీ తెలియడం లేదు. కాగా ఆప్‌కి చెందిన ఏకైక లోక్‌సభ ఎంపీ సుశీల్ కుమార్ రింకూ బీజేపీలో చేరారు. ఈ విషయమై ఇటీవలే బెయిల్‌పై బయటకు వచ్చిన పార్టీ నేత సంజయ్‌సింగ్‌ను ప్రశ్నించగా, ఈ అంశాన్ని పార్టీ పరిశీలిస్తుందని చెప్పారు. ఇతనితోపాటు ఆప్ జాతీయ ప్రధాన కార్యదర్శి సందీప్ పాఠక్, ఎన్డీ గుప్తా నిరసన ప్రదర్శనల్లో చురుగ్గా పాల్గొంటున్నారు. అయితే పార్టీలో ఇంత జరుగుతున్నా ముఖం చాటేస్తున్న కొందరు కీలక నేతలున్నారు. రాజ్యసభ ఎంపీ రాఘవ్ చద్దా పంజాబ్‌కు చెందిన ఆప్ రాజ్యసభ ఎంపీ రాఘవ్ చద్దా గత నెలలో కంటి ఆపరేషన్ కోసం లండన్ వెళ్లారు. ఆయన మార్చి చివరిలో తిరిగి రావాల్సి ఉంది. కానీ ఇప్పటికీ లండన్‌లోనే ఉన్నారని సమాచారం. మార్చి 21న కేజ్రీవాల్‌ను అరెస్టు చేసిన తర్వాత రాఘవ్ చద్దా సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటున్నారు. స్వాతి మలివాల్ ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన రాజ్యసభ ఎంపీ స్వాతి మలివాల్ కూడా ప్రస్తుతం అమెరికాలో ఉన్నారు. తన సోదరి అనారోగ్యంతో బాధపడుతున్నారని, ఆమెకు అండగా ఉండేందుకు అక్కడే కొన్నాళ్లు ఉండాల్సివస్తున్నదని స్వాతి మలివాల్ తెలిపారు. మలివాల్ ఆప్ పార్టీకి మద్దతుగా సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. హర్భజన్ సింగ్ క్రికెటర్ హర్భజన్ సింగ్ పంజాబ్ ఆప్ ఎంపీ అయినప్పటి పార్టీ కార్యకలాపాల్లో అప్పుడప్పుడు పాల్గొంటున్నారు. కేజ్రీవాల్ అరెస్టుపై కూడా హర్బజన్ స్పందించలేదు. ఆప్ నిర్వహించే నిరసన కార్యక్రమంలో పాల్గొంటారా? అని మీడియా ప్రశ్నించగా అందుకు సమాధానం చెప్పేందుకు హర్బజన్ నిరాకరించారు. అశోక్ కుమార్ మిట్టల్ పంజాబ్‌కు చెందిన లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్శిటీ వ్యవస్థాపకుడు, ఆప్ ఎంపీ అయిన మిట్టల్ కూడా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉన్నారు. పార్టీ నిరసనల గురించి మాట్లాడే అధికారం తనకు లేదని ఆయన పేర్కొన్నారు. ఏం చేయాలో పార్టీ అధిష్టానం చూసుకుంటుందని, ఇటీవల పార్టీ నిర్వహించిన ఓ కార్యక్రమానికి కూడా తనను ఆహ్వానించలేదని ఆయన ఆరోపించారు. సంజీవ్ అరోరా పంజాబ్‌కు చెందిన మరో ఆప్ ఎంపీ సంజీవ్ అరోరా సీఎం కేజ్రీవాల్ అరెస్టు తర్వాత మార్చి 24న కేజ్రీవాల్ భార్య సునీతా కేజ్రీవాల్‌ను కలుసుకున్నారు. అయితే, రాంలీలా మైదాన్‌లో జరిగిన నిరసనల్లో ఆయన పాల్గొనలేదు. లూథియానాలో పార్టీ అసైన్మెంట్తో బిజీగా ఉన్నందున నిరసనలకు హాజరు కాలేకపోయానని అరోరా తెలిపారు. బల్వీర్ సింగ్ పంజాబ్‌కు చెందిన ఆప్ రాజ్యసభ ఎంపీ బల్వీర్ సింగ్ కూడా పార్టీ నిరసన ప్రదర్శనల్లో కనిపించలేదు. ఆయనను గైర్హాజరు గురించి ప్రశ్నించగా తాను తన విధులను సక్రమంగా నిర్వర్తిస్తున్నానని, పార్టీ ఆదేశిస్తే నిరసనల్లో పాల్గొంటానని తెలిపారు. -
‘సందేశ్‌ఖాలీ’ అరాచకాలు.. షేక్ షాజహాన్ మళ్లీ అరెస్టు
కలకత్తా: పశ్చిమబెంగాల్లోని సందేశ్‌ఖాలీ కేసుల్లో ప్రధాన నిందితుడు తృణమూల్ మాజీ నేత షేక్ షాజాహన్ను మనీలాండరింగ్ ఆరోపణలపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) శనివారం(మార్చ్ 30) అరెస్టు చేసింది. సందేశ్‌ఖాలీలో భూములు కబ్జాలకు పాల్పడి మహిళలపై లైంగిక దాడులు చేసిన కేసులో షాజాహాన్‌ను సీబీఐ ఇప్పటికే అరెస్టు చేసింది. ప్రస్తుతం బసిర్హట్ జైలులో ఉన్న షాజాహాన్‌ను మనీలాండరింగ్‌కు సంబంధించి ఈడీ శనివారం జైలులోనే ప్రశ్నించింది. అనంతరం అరెస్టు చేసింది. షాజాహాన్‌ను కస్టడీకి ఇవ్వాల్సిందిగా ఈడీ బసిర్హట్ కోర్టులో సోమవారం పిటిషన్ దాఖలు చేసే అవకాశం ఉంది. సందేశ్‌ఖాలీ ఆందోళనలకు కారణమయ్యారన్న కారణంతో టీఎంసీ షాజహాన్‌ను ఆరేళ్ల పాటు పార్టీ నుంచి బహిష్కరించింది. సందేశ్ ఖాలీలో షేక్ షాజహాన్ ఆగడాలకు వ్యతిరేకంగా ఉద్యమించన రేఖా పత్ర అనే మహిళకు బీజేపీ ప్రస్తుత లోక్‌సభ ఎన్నికల్లో టికెట్ కూడా ప్రకటించింది. ఇదీ చదవండి.. ఇండియా జిందాబాద్ నినాదాలు చేసిన పాకిస్తానీలు -
భర్తలు జైల్లో.. భార్యలు రాజకీయాల్లో..
మనదేశంలో కొందరు రాజకీయ నేతలు జైలుకు వెళ్లిన సందర్భంలో వారి భార్యలు రాజకీయాల్లోకి ప్రవేశించడాన్ని చూస్తుంటాం. ఇటువంటి దృశ్యం రాబోయే లోక్‌సభ ఎన్నికల్లోనూ కనిపించనుంది. జైల్లో ఉన్న తమ భర్తల రాజకీయ వారసత్వాన్ని కాపాడుకునేందుకు వారి భార్యలు సిద్ధమయ్యారు. ఈ జాబితాలో ముగ్గురి పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. వారే జార్ఖండ్ మాజీ సీఎం హేమంత్ సోరెన్ భార్య కల్పన, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ భార్య సునీత, యూపీ మాజీ ఎంపీ ధనంజయ్ సింగ్ భార్య శ్రీకళ. వీరి భర్తలు వేర్వేరు కేసుల్లో అరెస్టయ్యారు. వారు లోక్‌సభ ఎన్నికల్లోగా బయటకు వచ్చే అవకాశాలు చాలా తక్కువ. దీంతో తమ భర్తల రాజకీయ పలుకుబడిని కాపాడేందుకు ఈ ముగ్గురూ రాజకీయాల్లోకి దిగారు. ఇక్కడ ఆసక్తికరమైన విషయమేమిటంటే జైలులో ఉన్న ఈ ముగ్గురు నేతలు ప్రతిపక్ష శిబిరానికి చెందినవారే. భూ కుంభకోణం ఆరోపణలపై జార్ఖండ్ మాజీ సీఎం హేమంత్ సోరెన్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కస్టడీలో ఉన్నారు. అతనిని జ్యుడీషియల్ కస్టడీ కింద రాంచీ జైలులో ఉంచారు. హేమంత్ జైలుకు వెళ్లిన తర్వాత ఆయన భార్య కల్పనా సోరెన్ రాజకీయాల్లో క్రియాశీలకంగా మారారు. ఉత్తరప్రదేశ్‌లోని జౌన్పూర్ మాజీ ఎంపీ ధనంజయ్ సింగ్ ప్రస్తుతం జైలులో ఉన్నారు. కిడ్నాప్ కేసులో దోషిగా తేలిన ధనంజయ్‌కు ఏడేళ్ల జైలు శిక్ష పడింది. ఈసారి కూడా ధనంజయ్ జౌన్పూర్ నుంచి లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయాలని భావించారు. అయితే జైలులో ఉండటంతో ఆయన ఆశలు నెరవేరలేదు. ఈ నేపధ్యంలో ఆయన భార్య శ్రీకళారెడ్డి జౌన్పూర్ నుంచి పోటీ చేస్తారనే చర్చ జరుగుతోంది. ఢిల్లీ మద్యం కుంభకోణంలో ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌ను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అరెస్ట్ చేసింది. ఎన్నికల వేళ కేజ్రీవాల్ అరెస్ట్ ఆమ్ ఆద్మీ పార్టీని ఉలిక్కిపడేలా చేసింది. అయితే కేజ్రీవాల్ భార్య సునీతా కేజ్రీవాల్ పార్టీ తరపున ప్రచారం చేయనున్నట్లు తెలుస్తోంది. -
Delhi liquor scam: ఈడీ కస్టడీ నుంచి కేజ్రీవాల్ పరిపాలన
న్యూఢిల్లీ: జైలులో ఉన్నా, బయట ఉన్నా ప్రజల సంక్షేమం కోసమే పని చేస్తానని చెప్పిన ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఆ దిశగా తొలి ఉత్తర్వు జారీ చేశారు. మద్యం కుంభకోణం కేసుకు సంబంధించిన మనీ లాండరింగ్ కేసులో అరెస్టయిన కేజ్రీవాల్ ప్రస్తుతం ఈడీ కస్టడీలో ఉన్నారు. ముఖ్యమంత్రి హోదాలో ఆయన ఢిల్లీలో కొన్ని ప్రాంతాల్లో తాగునీటి సరఫరా, మురుగునీటికి సంబంధించిన సమస్యలను పరిష్కరించాలంటూ ఆదేశాలు జారీ చేశారు. ముఖ్యమంత్రి నుంచి శనివారం రాత్రి ఆదేశాలు అందాయని ఢిల్లీ నీటి మంత్రి అతీషి చెప్పారు. ఆమె ఆదివారం మీడియాతో మాట్లాడారు. కేజ్రీవాల్ పంపించిన నోట్‌ను చూసిన తర్వాత తనకు కన్నీళ్లు వచ్చాయంటూ భావోద్వేగానికి గురయ్యారు. అరెస్టై ఇబ్బందుల్లో ఉన్నప్పటికీ ప్రజల బాగు కోసం ఆయన ఆలోచిస్తున్నారని తెలిపారు. నీటి కొరత ఉన్న ప్రాంతాలకు తగినన్ని వాటర్ ట్యాంకర్లు పంపించాలంటూ కేజ్రీవాల్ ఆదేశించారని పేర్కొన్నారు. వేసవి ఎండలు ముదురుతుండడంతో నీటి సరఫరాను మెరుగుపర్చాలని చెప్పారని అన్నారు. ఈ విషయంలో చీఫ్ సెక్రటరీతోపాటు సంబంధిత అధికారులకు సీఎం ఈడీ కస్టడీ నుంచి స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారని వెల్లడించారు. అవసరమైతే లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా సాయం తీసుకోవాలని సూచించారని మంత్రి అతీషి చెప్పారు. కస్టడీ నుంచి అరవింద్ కేజ్రీవాల్ జారీ చేసిన ఉత్తర్వుపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) స్పందించింది. ఈ ఉత్తర్వు కేజ్రీవాల్‌ను ఈడీ కస్టడీకి అనుమతిస్తూ పీఎంఎల్ఏ కోర్టు జారీ చేసిన ఆర్డర్‌కు అనుగుణంగా ఉందా? లేదా? అనేది పరిశీలించనున్నట్లు ఈడీ అధికార వర్గాలు ఆదివారం తెలియజేశాయి. -
జైలు నుంచే కేజ్రీవాల్ పరిపాలన..
-
మారుతున్న ఢిల్లీ రాజకీయాలు.. ఎల్జీ నిర్ణయంపై ఉత్కంఠ
దేశ రాజకీయాల్లోనే పెను సంచలనం చోటు చేసుకుంది. తీవ్ర చర్చనీయాంశంగా మారిన ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో.. అదీ అవినీతి ఆరోపణల మీద ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌ను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) గురువారం రాత్రి అరెస్టు చేసింది. తద్వారా పదవిలో ఉండగా అరెస్టయిన మొదటి ముఖ్యమంత్రిగా నిలిచారాయన. అయితే ఆయన అరెస్ట్ నేపథ్యంలో.. ఢిల్లీకి నెక్ట్స్ సీఎం ఎవరనే చర్చ సాధారణంగానే తెరపైకి వచ్చింది. ఆప్ మాత్రం మరో మాట చెబుతోంది. ‘‘అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్ పూర్తిగా రాజకీయ కుట్ర. ఢిల్లీకి కేజ్రీవాలే ముఖ్యమంత్రి. ఆయనే మా పార్టీ కన్వీనర్‌గా కొనసాగుతారు. జైలుకు వెళ్లినా అక్కడి నుంచే ఆయన పాలన కొనసాగిస్తారు. ఆప్ ప్రభుత్వానికి వచ్చిన ఢోకా ఏం లేదు..’’ ఇది ఇప్పుడు ఆప్ కీలక నేతలు చెబుతున్న మాట. ఇప్పుడే కాదు.. గత నవంబర్‌లో లిక్కర్ స్కాంలో తొలిసారి ఈడీ కేజ్రీవాల్‌కు సమన్లు ఇచ్చింది. అప్పటి నుంచి ఆయన అరెస్ట్ అవుతారనే ప్రచారం నడుస్తూ వచ్చింది. అయితే ఆ సమయంలోనూ ఆప్ ఒక్కటే ప్రకటన చేసింది. కేజ్రీవాల్ ఎట్టిపరిస్థితుల్లో రాజీనామా చేయబోరని.. అరెస్ట్ అయ్యి జైలుకు వెళ్లినా ఆయనే సీఎంగా పాలన కొనసాగిస్తారని. అంతేకాదు ఒకవేళ ఆయన అరెస్ట్ అయితే గనుక రాజీనామా చేయాలా? లేదంటే సీఎంగా కొనసాగొచ్చా? అంటూ.. ‘మై బీ కేజ్రీవాల్’ పేరుతో ఈ జనవరిలో ఏకంగా ఓ పబ్లిక్ సర్వేను సైతం చేపట్టింది ఆప్. అయితే.. ఒక వ్యక్తి అరెస్ట్ అయ్యి ముఖ్యమంత్రి హోదాలో జైలు నుంచే పాలన నడిపించేందుకు వీలుందా?అందుకు భారత రాజ్యాంగం అనుమతిస్తుందా? చట్టాలు ఏం చెబుతున్నాయి?.. రాష్ట్రపతి, గవర్నర్ పోస్టులు మాత్రమే రాజ్యాంగం పరిధిలోని పోస్టింగులు. చట్టం ప్రకారం.. వీళ్లకు మాత్రమే అరెస్ట్ నుంచి రక్షణ ఉంటుంది. వాళ్ల పదవీకాలం ముగియడం లేదంటే స్వచ్ఛందంగా రాజీనామా చేసేదాకా వాళ్లకు ఊరట లభిస్తుంది. అప్పటిదాకా ఆర్టికల్ 361 ప్రకారం వాళ్లకు కల్పించిన రక్షణ ప్రకారం.. న్యాయస్థానాలకు వాళ్లు జవాబుదారీలుకారు. అయితే.. ప్రధాన మంత్రి, ముఖ్యమంత్రి లాంటి పదవులకు మాత్రం ఎలాంటి రక్షణ ఉండదు. అందుకే ఢిల్లీ హైకోర్టు సైతం కేజ్రీవాల్‌కు అరెస్ట్ నుంచి రక్షణ కల్పించేందుకు విముఖత వ్యక్తం చేసింది. అలాగని కేవలం అరెస్ట్ అయినంత మాత్రానా వాళ్లు(పీఎం, సీఎంలాంటి పదవుల్లో ఉన్నవాళ్లు) ఆ పదవులకు అనర్హులైపోరు. ప్రజాప్రాతినిధ్య చట్టం, 1951 ప్రకారం కచ్చితంగా శిక్ష పడితేనే పదవుల్ని కోల్పోతారు. కేజ్రీవాల్‌కు జైలుకెళ్తే.. తాజా పరిణామాల్ని పరిశీలిస్తే.. జైలు నుంచి కేజ్రీవాల్ ఢిల్లీని పాలించడాన్ని ఏ చట్టం అడ్డుకోదు. ఒకవేళ ఆయనకు శిక్ష పడితే మాత్రం అనర్హతకు గురవుతారు. ఇప్పటివరకైతే ఆయనకు శిక్ష పడలేదు. కాబట్టి ఆయన పాలన కొనసాగించేందుకు ఎలాంటి ఆటంకాలు ఉండకపోవచ్చని న్యాయ నిపుణులు చెబుతున్నారు. అలాగని జైలు నుంచే సీఎంగా బాధ్యతలు నిర్వర్తించడం అంత సులువైన పనీ కాదని కూడా అభిప్రాయపడుతున్నారు. అందుకు జైలు అధికారులు ఆయనకు పలు సడలింపులు ఇవ్వాల్సి ఉంటుంది. ఇందుకు అక్కడి జైళ్ల శాఖ నిబంధనలపై స్పష్టత రావాల్సి ఉంది. స్వచ్ఛందంగా రాజీనామాను మినహాయిస్తే ఒక ముఖ్యమంత్రి తన పదవిని కోల్పోయేది అసెంబ్లీలో మెజారిటీని కోల్పోవడమో లేదంటే అవిశ్వాస తీర్మానంలో ఓడిపోవడం వల్లనో. కేజ్రీవాల్‌కు కలిసొచ్చే మరో అంశం ఏంటంటే.. ఇప్పటి వరకు ఆప్ మంత్రులు ఇద్దరు మనీశ్ సిసోడియా , సత్యేందర్ జైన్ అరెస్టై జైలుకు వెళ్లారు. కానీ, కేజ్రీవాల్ కేవలం ముఖ్యమంత్రిగానే ఉన్నారు. ఆయన వద్ద ఎలాంటి పోర్ట్‌ఫోలియో లేదు. లెఫ్టినెంట్ గవర్నర్దే నిర్ణయం? ప్రస్తుతం ఉన్న ఢిల్లీ అసెంబ్లీ కాలపరిమితి వచ్చే ఏడాది ఫిబ్రవరితో ముగియనుంది. అయితే.. ఢిల్లీ అధికార నిర్మాణం చాలా భిన్నంగా ఉంటుందన్నది తెలిసిందే. ప్రజలు ఎన్నుకునే ముఖ్యమంత్రి.. కేంద్రం ఎంపిక చేసే లెఫ్టినెంట్ గవర్నర్ పాలనలో కొనసాగుతోంది. ప్రస్తుతం ఢిల్లీ ఎల్జీగా వినయ్ కుమార్ సక్సేనా ఉన్నారు. ఆయనతో కేజ్రీవాల్ సర్కార్‌కు అంత సత్సంబంధాలు కూడా ఏం లేవు. దీంతో.. ఇప్పుడు కేజ్రీవాల్ ముఖ్యమంత్రిగా కొనసాగుతారా? లేదా?.. ఎల్జీ ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారన్నది ఉత్కంఠ రేకెత్తిస్తోంది. రాజధాని రీజియన్‌లోని ఢిల్లీకి మాత్రమే వర్తించే రాజ్యాంగంలోని ఆర్టికల్ 239 ఏఏ ప్రకారం.. కేజ్రీవాల్ జైలుకు వెళ్తే గనుక ఆయన్ని అధికారం నుంచి తొలగించమని ఎల్జీ రాష్ట్రపతిని కోరేందుకు అవకాశం లేకపోలేదు. ఒకవేళ లిక్కర్ కేసులో కేజ్రీవాల్ జైలుకు గనుక వెళ్లాల్సి వస్తే.. రాష్ట్రంలో రాజ్యాంగ యంత్రాంగం విఫలమైందని పేర్కొంటూ ఢిల్లీ ప్రభుత్వాన్ని గవర్నర్ రద్దు చేయించొచ్చు. ఆర్టికల్ 239ఏబీ ప్రకారం ఎల్జీ రాష్ట్రపతి పాలనకు సిఫార్సు చేయవచ్చు. తద్వారా బలవంతంగా అయినా కేజ్రీవాల్ రాజీనామా చేయాల్సి వస్తుంది. అప్పుడు రాష్ట్రపతి పాలన కింద ఢిల్లీ కేంద్రం చేతుల్లోకి వెళ్తుంది. రిమాండ్ పిటిషన్‌పై తీర్పు, బెయిల్ ఏదో ఒకటి వచ్చేదాకా ఎదురుచూసే అవకాశం లేకపోలేదు. -
‘స్వర్గంలో ఎంజాయ్ చేస్తున్నా’.. జైలు నుంచి హత్య కేసు ఖైదీ వీడియో
లక్నో: ఓ హత్య కేసులో శిక్ష అనుభవిస్తున్న ఖైదీ జైలు నుంచి సోషల్ మీడియాలో లైవ్ వీడియో స్ట్రీమింగ్ చేసిన ఘటన కలకలం రేపుతోంది. ‘జైలు స్వర్గంలా ఉందని, తన జీవితాన్ని ఎంజాయ్ చేస్తున్నానని చెబుతున్న వీడియో ప్రస్తుతం నెట్టింటా వైరల్‌గా మారింది. . ఉత్తర్‌ప్రదేశ్‌లోని బరేలి సెంట్రల్ జైలులో ఈ ఘటన వెలుగు చూసింది. వివరాలు.. బరేలీ సెంట్రల్ జైలులో సోషల్ మీడియా ద్వారా ఆసిఫ్ అనే ఖైదీ వీడియో స్ట్రీమింగ్ చేసినట్లు పోలీసులు గుర్తించారు. రెండు నిమిషాల ఈ వీడియోలో ‘జైలు స్వర్గంలా ఉంది. ఇక్కడ జీవితాన్ని ఆస్వాదిస్తున్నా. త్వరలోనే బయటికి వస్తా’ అంటూ అతడు పేర్కొన్నాడు. కాగా 2019 డిసెంబర్ 2న ఢిల్లీలోని షాజహాన్‌పూర్‌లోని సదర్ బజార్ పోలీస్ స్టేషన్ ప్రాంతంలో. రాకేష్ యాదవ్ అనే కాంట్రాక్టర్‌ను హత్య చేసిన కేసులో ఆసిఫ్ శిక్ష అనుభవిస్తున్నాడు. జైలులో శిక్ష అనుభవిస్తున్న ఖైదీ చేతికి ఫోన్ రావడంతో అక్కడి సిబ్బంది పనితీరుపై విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావడంతో రాకేష్ సోదరుడు జిల్లా మేజిస్ట్రేట్‌కు ఫిర్యాదు చేశారు. నిబంధనలకు విరుద్ధంగా జైలు అధికారులు ఆసిఫ్‌కు ప్రత్యేక సదుపాయాలు కల్పిస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నాడు. దీనిపై సమగ్ర విచారణ జరపాలని జిల్లా మేజిస్ట్రేట్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఈ ఘటనపై యూపీ జైళ్లశాఖ డీఐజీ కుంత్ కిశోర్ స్పందించారు. ఈ వీడియో తమ దృష్టి వచ్చిందని.. దర్యాప్తు జరుగుతున్నట్లు వెల్లడించారు. పూర్తి విచారణ అనంతరం బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. చదవండి: కాంగ్రెస్‌కు సవాల్.. బీజేపీలో చేరిన ప్రణీత్ కౌర్ रामराज्य हैं उत्तर प्रदेश बरेली जेल में बन्द जेल में बंद आरोपी का वीडियो वायरल PWD ठेकेदार हत्याकांड का आरोपी जेल में है बंद जेल में बंद आरोपी का लाइव वीडियो चैट वायरल,, pic.twitter.com/8yZOg1m2xK— Mαɳιʂԋ Kυɱαɾ αԃʋσƈαƚҽ 🇮🇳🇮🇳 (@Manishkumarttp) March 14, 2024 -
కాశీ విశ్వనాథునికి మధుర జైలు నుంచి గులాల్
మహాశివుడు కొలువైన కాశీలో రంగ్భరి ఏకాదశి(మార్చి 20)రోజున హోలీ వేడుకలు జరగనున్నాయి. ఆ రోజున విశ్వనాథుడు, పార్వతిమాత భక్తుల నడుమ హోలీ ఆడనున్నారు. దీంతో కాశీ మొత్తం రంగులమయంగా మారనుంది. ఈసారి కాశీ విశ్వనాథుని హోలీ వేడుకల కోసం మథురలో ప్రత్యేక గులాల్ సిద్ధం చేస్తున్నారు. మథుర జైలులోని ఖైదీలు కాశీలో కొలువైన పరమశివుని కోసం పండ్లు, పూలు, కూరగాయల రసాలతో హోలీ రంగులు తయారు చేస్తున్నారు. ఈ విధంగా తయారైన ఎరుపు, పసుపు గులాల్‌లను కాశీలో హోలీ వేడుకలకు వినియోగించనున్నట్లు సమాచారం. మథుర నుండి ఒక క్వింటాల్ హెర్బల్ గులాల్ కాశీకి రానున్నదని, ఈ గులాల్ తయారీలో సుగంధాన్ని కూడా ఉపయోగిస్తున్నారని ఉత్సవ నిర్వాహకులు తెలిపారు. అయోధ్య నుండి కూడా కాశీ విశ్వేశ్వరుని హోలీ వేడుకలకు హెర్బల్ గులాల్ రానుంది. అలాగే కాశీ వ్యాపారులు కూడా విశ్వేశ్వరునికి హెర్బల్ గులాల్ సమర్పించనున్నారు. హోలీ వేడుకల్లో మహాశివుడు, పార్వతిమాత ఆసీనులయ్యే సింహాసనం ప్రస్తుతం తుదిమెరుగులు దిద్దుకుంటోంది. హోలీ వేడుకలకు ఏర్పాట్లు ముమ్మరంగా జరుగుతున్నాయి. -
ప్రేయసిని పెళ్లాడిన ఖైదీ.. జైల్లో జరిగిన వివాహం
భువనేశ్వర్: పెళ్లిళ్లు స్వర్గంలో జరుగుతాయన్నది నిజమే కానీ, ఇది మాత్రం జైలులో భిన్నంగా జరిగిన పెళ్లి. ప్రియురాలి వర్గాల నేరారోపణతో జైలు పాలైన ప్రేమికుడితో చట్టపరమైన లాంఛనాలతో పెళ్లి జరిగింది. జైలు అధికారుల అనుమతి మేరకు వీరి వివాహం సనాతన ధర్మం, ఆచారాల ప్రకారం వేడుకగా జరిపించారు. వివరాల్లోకి వెళ్తే.. స్థానిక ఝరపడా ప్రత్యేక జైలు సోమవారం పెళ్లి కళతో కళకళలాడింది. ఈ జైలులో శిక్ష అనుభవిస్తున్న ఖైదీ ప్రేమించిన అమ్మాయిని వివాహం చేసుకున్నాడు. వధూవరుల కుటుంబాల మధ్య కొన్ని మనస్పర్థల కారణంగా అమ్మాయి తరపువారు ఇదివరకు ఫిర్యాదు చేశారు. దీని ఆధారంగా యువకుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే కాలానుక్రమంగా వివాదాలతో సతమతమైన వీరి ప్రేమ కథకు సంతోషకరమైన మలుపు దక్కింది. ఇరువురి కుటుంబాలు తమ మనసు మార్చుకుని సమస్యకు పరిష్కారం చూపించారు. ప్రేమికులకు పెళ్లి జరిపించేందుకు హృదయపూర్వకంగా ముందుకొచ్చారు. దీంతో యువతి తన ప్రియుడితో వివాహం కోసం ఖుర్దా జిల్లా లీగల్ సర్వీసెస్ అథారిటీని సంప్రదించింది. ఈ క్రమంలో జైలులో శిక్ష అనుభవిస్తున్న యువకుడు ప్రియురాలితో పెళ్లి కోసం జైలు అధికారుల ఆధ్వర్యంలో ఖుర్దా జిల్లా లీగల్ సర్వీసెస్ అథారిటీని అభ్యర్థించాడు. వీరి అభ్యర్థనపై జైలు, న్యాయ శాఖ అధికార వర్గాలు సానుకూలంగా స్పందించాయి. పెళ్లి తంతుని మరింత ప్రోత్సహించి ముందుకు నడిపించారు. చట్టపరమైన నిబంధనల మేరకు వీరి వివాహాన్ని అత్యంత ఆనందోత్సాహాలతో జరిపించారు. -
కేటీఆర్ కడుపు సల్లగుండాలి...
మల్యాల(చొప్పదండి): పెళ్లైన ఏడాదికే ఉపాధి కోసం గల్ఫ్ వెళ్లి.. అక్కడ హత్యకేసులో ఇరుక్కుని జైలుకెళ్లి 18 ఏళ్ల తర్వాత ఇంటికి చేరాడు జగిత్యాల జిల్లా మల్యాల మండలం మానాల గ్రామానికి చెందిన శివరాత్రి హనుమంతు. గ్రామానికి చెందిన శివరాత్రి హనుమంతుకు బుగ్గారం మండలం గోపులాపురానికి చెందిన పద్మతో 20ఏళ్ల క్రితం వివాహమైంది. పెళ్లైన ఏడాదికే ఉపాధి కోసం హనుమంతు దుబాయ్ వెళ్లేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టాడు. పాప పుట్టిన తర్వాత పురుడు చేసిన మరునాడే దుబాయ్ వెళ్లాడు. మూడు నెలలకే హత్య కేసులో జైలుకెళ్లాడు. అప్పటి నుంచి ఆయన భార్య పద్మ భర్త కోసం ఎదురుచూస్తూనే ఉంది. ఆమె 18ఏళ్ల నిరీక్షణ ఫలించాయి. దుబాయ్ జైలు నుంచి విడుదలై ఇంటికి చేరిన భర్త హనుమంతును చూసి కడుపులో దాచుకున్న దుఃఖం కట్టలు తెంచుకుంది. ‘మాది రెక్కాడితేగాని డొక్కాడని నిరుపేద వడ్డెర కుటుంబం. ఉపాధి కోసం ఆయన (హనుమంతు) దుబాయ్ పోయిండు. అక్కడ జైలులో పడ్డడు. పద్దెనిమిదేళ్లుగా భర్త కోసం ఎదురుచూసిన. నా ఐదుగురు అన్నలు, ఇద్దరు తమ్ముళ్ల సహకారంతో తల్లిగారింట్లో ఉంటూ.. బీడీలు చేస్తూ, వ్యవసాయ కూలీ పనులకు వెళ్తూ కాలం వెళ్లదీసిన. మూడు, నాలుగు నెలలకు ఒకసారి భర్తతో ఫోన్లో మాట్లాడిన. భర్తను తలుచుకుని ఏడుస్తూ నిద్రలేని రాత్రులు గడిపిన. కూతురు గౌతమిని కంటికి రెప్పలా కాపాడుకుంటూ వచ్చిన. హనుమంతును ఇంటికి రప్పించేందుకు కేటీఆర్ సారును కలిసినం. కేటీఆర్ సారు కడుపు సల్లగుండ ఆయన చేసిన మేలుతో దుబాయ్ జైలు నుంచి నా భర్త బయటపడి ఇంటికి చేరిండు. ఆయన చేసిన మేలు జీవితకాలం మరిచిపోను..’ అని తన భర్త జైలు నుండి విడుదల కోసం కృషి చేసిన మాజీ మంత్రి కేటీఆర్‌కు హనుమంతు భార్య పద్మ కృతజ్ఞతలు తెలిపింది. -
బండ్లగణేశ్‌కు బిగ్ షాక్.. ఆ కేసులో జైలు శిక్ష!
టాలీవుడ్ ప్రముఖ నిర్మాతకు బండ్లగణేశ్‌కు జైలు శిక్ష పడింది. చెక్ బౌన్స్ కేసులో ఆయనకు ఏడాది జైలు శిక్ష విధిస్తూ ఒంగోలు కోర్టు తీర్పు వెలువరించింది. అంతే కాకుండా శిక్షతో పాటు బండ్లగణేశ్‌కు రూ.95 లక్షల జరిమానా విధించింది. జరిమానాతో పాటు కోర్టు ఖర్చులు కూడా బండ్ల గణేష్ చెల్లించాలంటూ తీర్పు వెల్లడించింది. ప్రస్తుతం ఈ టాపిక్ టాలీవుడ్లో హాట్ టాపిక్‌గా మారింది. 2019లో మద్దిరాలపాడుకు చెందిన జానకిరామయ్య అనే వ్యక్తి దగ్గర బండ్ల గణేశ్ రూ. 95 లక్షల అప్పు తీసుకున్నారు. అయితే జానకి రామయ్య మరణాంతరం ఆయన తండ్రికి బండ్ల గణేశ్ రూ.95 లక్షల చెక్ ఇచ్చారు. ఆయన ఇచ్చిన చెక్ బౌన్స్ కావడంతో జానకి రామయ్య తండ్రి కోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారణ చేపట్టిన న్యాయస్థానం జైలు శిక్ష, జరిమానా విధిస్తూ తీర్పు వెల్లడించింది. గతంలో ఆరునెలల జైలు శిక్ష గతంలో 2017లో సినీ నిర్మాత బండ్ల గణేష్ కు ఎర్రమంజిల్ కోర్టు ఆరునెలల జైలు శిక్ష విధించింది. టెంపర్ సినిమాకు కథ అందించిన వక్కంతం వంశీ వేసిన కేసులో ఇరు పక్షాల వాదనలు విన్న న్యాయస్థానం ఈ తీర్పును వెలువరించింది. జైలు శిక్షతో పాటు 15 లక్షల 86 వేల 550 రూపాయల జరిమానా కూడా విధించింది. 25 లక్షల రూపాయలకు సంబంధించిన చెక్ బౌన్స్ కేసులో బండ్ల గణేశ్‌కు కోర్ట్ ఈ శిక్ష విధించింది. కానీ వెంటనే బెయిల్ కోసం దరఖాస్తు చేసుకోగా.. షరతులతో కూడిన బెయిల్‌ను న్యాయస్థానం మంజూరు చేసింది. కాగా.. ఎన్టీఆర్, కాజల్ హీరో హీరోయిన్లుగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన టెంపర్ సినిమాను బండ్ల గణేష్ పరమేశ్వర ఆర్ట్ ప్రొడక్షన్ బ్యానర్ పై నిర్మించారు. చిన్న చిన్న పాత్రలతో నటుడిగా కెరీర్ ప్రారంభించిన బండ్ల గణేష్, రవితేజ హీరోగా తెరకెక్కిన ఆంజనేయులు సినిమాతో నిర్మాతగా మారాడు. తరువాత వరుసగా పవన్ కళ్యాణ్, ఎన్టీఆర్, రామ్ చరణ్ లాంటి స్టార్ హీరోలతో సినిమాలు నిర్మించారు. -
పాక్ యువతకు ఇమ్రాన్ ‘అవినీతి’ పట్టలేదా?
పాకిస్తాన్లో నేషనల్ అసెంబ్లీకి ఫిబ్రవరి 8న ఎన్నికలు జరిగాయి. ఇప్పటి వరకు వెలువడిన ఫలితాల ప్రకారం పలు అవినీతి కేసుల్లో శిక్ష అనుభవిస్తున్న ఇమ్రాన్ ఖాన్ పార్టీ ‘పాకిస్తాన్ తెహ్రీక్-ఏ-ఇన్సాఫ్ (పీటీఐ) మద్దతు కలిగిన స్వతంత్ర అభ్యర్థులు కింగ్ మేకర్లుగా కనిపిస్తున్నారు. నవాజ్ షరీఫ్ పార్టీ ‘పాకిస్తాన్ ముస్లిం లీగ్-నవాజ్ (పీఎంఎల్-ఎన్) సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించింది. పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ (పీపీపీ) మూడో స్థానంలో ఉంది. పాకిస్తాన్ జాతీయ అసెంబ్లీలో మొత్తం 336 సీట్లు ఉన్నాయి. వీటిలో 265 స్థానాలకు ఎన్నికలు జరిగాయి. పలు వార్తా సంస్థల కథనాల ప్రకారం పాకిస్తాన్ యువ ఓటర్లు ఇమ్రాన్ ఖాన్ పార్టీకి మద్దతు పలికారు. దీని వెనుకనున్న కారణమేమిటనే దానిపై పలు విశ్లేషణలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం ఇమ్రాన్‌ఖాన్ జైల్లో ఉన్నారు. ఈ నేపధ్యంలో అతని పార్టీ పేరు, గుర్తును రద్దు చేశారు. అయితే ఈ పార్టీకి చెందిన నేతలు స్వతంత్ర అభ్యర్థులుగా ఎన్నికల బరిలోకి దిగారు. వీరు స్వతంత్ర అభ్యర్థుల కంటే మెరున ఫలితాలు దక్కించుకోవడం విశేషం. 2022లో ఇమ్రాన్‌ఖాన్‌ను అధికారం నుంచి తొలగించారు. ఆయనపై అనేక అవినీతి కేసులు ఉన్నాయి. 2023 ఆగస్టులో ఇమ్రాన్‌ను జైలుకు తరలించారు. దీనితోపాటు ఎన్నికల్లో పోటీ చేయకుండా ఇమ్రాన్ ఖాన్‌పై కొన్నాళ్ల పాటు నిషేధం విధించారు. అయితే ఈ ఎన్నికల్లో పాక్ యువత ఇమ్రాన్‌కు మద్దతు పలికింది. పాక్‌లో సైనిక మద్దతుతో అణిచివేతకు వ్యతిరేకంగా పోరాడుతున్న యువ ఓటర్లు ఇమ్రాన్‌కు అండగా నిలిచారు. అయితే ఈ వాదనను పాక్ ఆర్మీ ఖండించింది. మరోవైపు రాజకీయాలలో మిలటరీ ప్రమేయంపై పాక్ యువతకు అవగాహన ఏర్పడిన కారణంగా వారు ఇమ్రాన్ ఖాన్ మద్దతుదారులకు ఓటు వేశారని పలువురు విశ్లేషకులు అంటున్నారు. అంతేకాకుండా ద్రవ్యోల్బణం పెరగడం, ఇమ్రాన్‌ఖాన్‌ను జైలుకు పంపడంపై పాక్ యువత ఆగ్రహం వ్యక్తం చేసినట్లు కనిపిస్తోంది. పాక్‌కు చెందిన న్యాయ విద్యార్థి నైలా ఖాన్ మార్వాత్ మాట్లాడుతూ ‘నేను 2016లో పీటీఐ పార్టీలో చేరాను. 2018లో నా మొదటి ఓటు ఈ పార్టీకే వేశాను. ఇమ్రాన్ ఖాన్ మాటలు నన్ను, నా సహోద్యోగులను ఎంతగానో ఉత్సాహపరిచాయి. నెల్సన్ మండేలా లాంటి పలువురు నేతలు జైలులో ఉంటూనే తమ సత్తా చాటారు’ అని పేర్కొన్నారు. -
ప్రేమికుల రోజుని జైల్లో సెలబ్రేట్ చేసుకోవడం గురించి విన్నారా?
వాలెంటైన్స్ డేని కేవలం ప్రేమికులే గాక పెద్దల అంగీకారంతో చేసుకున్న జంటలు కూడా హ్యాపీగా చేసుకుంటారు. అంతేగాదు మనల్ని ఎంతగానో ప్రేమించే మన ఆత్మీయులు, స్నేహితులు కూడా ఆ రోజుని ఎంతగానో సెలబ్రెట్ చేసుకుంటారు. అయితే ఆ రోజు కచ్చితంగా చాలమంది బయటే డిన్నర్ చేసేందుకు ప్లాన్లు చేస్తుంటారు. ఇది కామన్. అయితే విలక్షణతను ఇష్టపడే వాళ్లు మర్చిపోలేని గుర్తులా ఉండేలా వెరైటీగా చేసుకునేందుకు ఆరాటపడుతుంటారు. అలాంటి వాళ్లు ఈ జైల్లోని ఖైదీల సెల్లో చేసుకోండి. అంతేగాదండోయ్! ప్రేమికుల రోజు సందర్భంగా విభిన్న రుచులతో కూడిన మెనూని కూడా ఆ జైలు అందిస్తోంది. ఖైదీలు ఉంచే సెల్లో డిన్నర్ చేస్తే ఎలా ఉంటుంది? అనే అనుభూతి కూడా పొందొచ్చు. ఎక్కడ? ఏ జైలు ఈ ఆఫర్ అందిస్తోందంటే..? వివరాల్లోకెళ్తే..బ్రిటన్ ఆక్స్ఫర్డ్ జైలు ప్రేమికులకు గొప్ప ఆఫర్ అందిస్తోంది. వాలెంటైన్స్ డే సందర్భంగా సరదాగా సెల్లో డిన్నర్ చెసేలా వసతులు ఏర్పాటు చేసింది. పైగా అందుకోసం ప్రత్యేకమైన మూడు విధాన మెనూని కూడా ఏర్పాటుచేసింది. అంతేగాదు ఆ జైలులో ఖైదీలు ఉండే సెల్లో తినాలనుకుంటే సుమారు 17 వేల రూపాయాలు వరకు చెల్లించాల్సి ఉంటుంది. ఘోరమైన హత్యానేరాలకు పాల్పడ్డ ఖైదీలసెల్లో తినాలనుకుంటే ఏకంగా 19 వేలు వరకు చెల్లించాల్సి ఉంటుంది. ఈ జైల్లో భోజనం చేయడానికి వచ్చే అతిథుల కోసం క్యాండిల్స్, పువ్వులతో అలంకరించిన డైనింగ్ టేబుల్ ఆహ్వానం పలుకుతుంది. మాంసాహారు కోసం బ్రైజ్డ్ బీఫ్ బ్లెడ్, షార్ట్ రిబ్ పిరోగి, వైన్ తదితర పానీయాలను అందిస్తారు. అలాగే శాకాహరలు కోసం టొమాటో టార్టేర్, కాల్చిన చీజ్ సౌఫిల్, బ్రైజ్డ్ క్యాబేజీ, చాక్లెట్, రాస్బెర్రీస్, పిస్తాతో డెకరేట్ సిన కేక్, కాక్టైల్ వంటి పానీయాలు కూడా ప్యాకేజ్‌లో ఉన్నాయి. ఇక్కడకు వచ్చే అతిథులు తమకు నచ్చిన ప్యాకేజ్ని ఎంపిక చేసుకోవచ్చని అని ఆక్స్ఫర్డ్ జైలు తన వెబ్సైట్లో పేర్కొంది. నిజానికి ఈ జైలు సుమారు వెయ్యి ఏళ్ల నాటి చారిత్రాత్మక కోట. 1073లో ఈ కోటని వైద్యశాలగా నిర్మించారు. అయితే 1642 నుంచి 1651ల మధ్య బ్రిటీషర్ల అంతర్యుద్ధం కారణంగా గణనీయమైన నష్టాన్ని ఎదుర్కొని 1786లో జైలుగా మార్చబడింది. అలా జైలుగా 1996 వరకు పనిచేసింది. ఆ తర్వాత ఆ ఆక్స్ఫర్డ్ జైలుని ప్రసిద్ధ పర్యాటక కేంద్రంగా మార్చేశారు. (చదవండి: ఆసియాలోనే ఉత్తమ మహిళా చెఫ్‌గా 'పిచాయా పామ్') -
మహిళా ఖైదీల గర్భంపై హైకోర్టు సీరియస్!
సంస్కరణా కేంద్రాలుగా ఉండాల్సిన జైళ్లో మహిళల పరిస్థితి దారుణంగా మారిన ఘటన కలకలం రేపుతోంది. రాష్ట్రవ్యాప్తంగా వివిధ దిద్దుబాటు కేంద్రాల్లో మహిళా ఖైదీలు గర్భం దాల్చడం, 196 మంది పిల్లలు జన్మించడంతో మహిళా ఖైదీల దుస్థితికి బాధ్యులెవరు అనే చర్చకు దారి తీసింది. జైళ్లలో ఉన్న కొంతమంది మహిళా ఖైదీలు గర్బం దాల్చిన ఘటన పశ్చిమ బెంగాల్లో పెను దుమారం రేపుతోంది. ఈ వ్యవహారంపై కోలకత్తా హైకోర్టు సీరియస్‌గా స్పందించింది. రాష్ట్రంలోని వివిధ జైళ్లను పరిశీలించి అమికస్ క్యూరీ గురువారం అందించిన నివేదికపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. జైళ్లలో మహిళా ఖైదీలు గర్భం దాల్చి, బిడ్డల్ని కంటున్న ఘటనలపై దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని విచారించిన చీఫ్ జస్టిస్ టీఎస్ శివజ్ఞానం, జస్టిస్ సుప్రతిమ్ భట్టాచార్యలతో కూడిన ద్విసభ్య ధర్మాసనం జైలు సంస్కరణలపై ఆందోళన వ్యక్తం చేసింది. ఈ అంశాన్ని తీవ్రమైన సమస్యగా పరిగణిస్తున్నట్టు వ్యాఖ్యానించింది. మహిళా జైళ్లలోకి పురుష ఉద్యోగుల ప్రవేశాన్ని నిషేధించాలని కోలకత్తా హైకోర్టు కోరింది. అలాగే ఈ విషయాన్ని క్రిమినల్ కేసులు విచారించే బెంచ్‌కు బదిలీ చేయడం సరైందని భావించిన ధర్మాసనం ఆ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. ఈ సమస్యను తీవ్రమైందిగా పరిగణిస్తున్నట్లు ధర్మాసనం పేర్కొంది. ప్రస్తుతం ఈ అంశాన్ని హైకోర్టులోని మరో డివిజన్ బెంచ్‌కు అప్పగించారు. ఈ కేసులో తదుపరి విచారణ సోమవారం జరగనుంది. ఈ వ్యవహారంలో 2018లో అమికస్ క్యూరీగా ఎంపికైన న్యాయవాది తపస్ కుమార్ భంజా తన నివేదికను కోర్టుకు సమర్పించారు. పశ్చిమ బెంగాల్‌లోని జైళ్లలో శిక్ష అనుభవిస్తున్న మహిళలకు రాష్ట్రంలో గత ఏడాది నుంచి ఇప్పటివరకు 196 మంది పిల్లలు పుట్టారని అమికస్ క్యూరీ కోర్టుకు వివరించారు. కస్టడీలో ఉండగానే మహిళా ఖైదీలు గర్భం దాల్చి, జైళ్లలోనే ప్రసవించినట్లు గుర్తించినట్టు తెలిపారు. ఈ నేపథ్యంలో మహిళా ఖైదీలుండే ఎన్క్లోజర్లలో, కరెక్షన్ హోమ్స్‌లో పురుష ఉద్యోగులు, ఇతర పురుషుల ప్రవేశాన్ని పూర్తిగా నిషేధించాలని తపస్ ధర్మాసనాన్ని కోరారు. ఇటీవల తాను దిద్దుబాటు గృహాల ఇన్స్పెక్టర్ జనరల్ (స్పెషల్), జిల్లా లీగల్ సర్వీసెస్ అథారిటీ కార్యదర్శితో కలిసి మహిళా దిద్దుబాటు గృహాన్ని సందర్శించాననీ ఈ సమయంలో ఒక గర్భవతిని, దాదాపు15 మంది ఇతర మహిళా ఖైదీలు వారి పిల్లలతో ఉన్నట్టు కోర్టుకు నివేదించారు. మరోవైపు పశ్చిమ బెంగాల్ కరెక్షనల్ సర్వీసెస్‌కు చెందిన ఓ సీనియర్ ఐపీఎస్ అధికారి ఈ ఘటనపై స్పందించారు. శిక్ష పడిన మహిళకు ఆరేళ్ల లోపు వయసున్న పిల్లలు ఉంటే వారిని తల్లితో ఉండేందుకు అనుమతి ఉంమటుందని తెలిపారు. కానీ పశ్చిమ బెంగాల్‌లోని జైలులో మహిళలు గర్భవతులు కావడం తన దృష్టికి రాలేదని, వస్తే కఠిన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. -
జైలులో హెచ్ఐవీ కలకలం.. 63 మందికి పాజిటివ్
లక్నో: ఉత్తరప్రదేశ్‌లోని లక్నో జిల్లా జైలులో ఖైదీల ఆరోగ్యానికి సంబంధించి సంచలన విషయం బయటపడింది. ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా జైలులోని 63 మంది ఖైదీలకు హెచ్ఐవీ(ఎయిడ్స్) ఉన్నట్లు తేలింది. గత ఏడాది డిసెంబర్ నెలలో నిర్వహించిన పరీక్షల్లో 36 మందికి హెచ్ఐవీ సోకినట్లు తేలగా తాజా పరీక్షల్లో ఈ సంఖ్య 63కు చేరింది. వైరస్ ఇంత పెద్ద ఎత్తున వ్యాప్తి చెందడానికి గల స్పష్టమైన కారణాలు మాత్రం తెలియాల్సి ఉంది. హెచ్ఐవీ సోకిన ఖైదీల్లో చాలా మందికి డ్రగ్స్ తీసుకునే అలవాటు ఉండటంతో ఒకరు వాడిన ఇంజెక్షన్లతో మరొకరు డ్రగ్స్ ఎక్కించుకునే సమయంలో వైరస్ ఒకరి నుంచి మరొకరికి సోకినట్లు ప్రాథమికంగా తెలుస్తోంది. అయితే వీరిందరికీ ముందే హెచ్ఐవీ ఉందని, జైలులోకి వచ్చిన తర్వాత ఎవరికీ వైరస్ సోకలేదని మరో వాదన వినిపిస్తోంది. హెచ్ఐవీ సోకినట్లు తేలిన వారందరికీ లక్నోలోని ఒక ఆస్పత్రిలో చికిత్సనందిస్తున్నట్లు జైలు అధికారులు తెలిపారు. ఒక్కసారిగా భారీ సంఖ్యలో హెచ్ఐవీ కేసులు బయటపడిన నేపథ్యంలో జైలులో వైరస్ మరింత వ్యాప్తి చెందకుండా చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. ఇదీచదవండి.. రిసార్ట్ పాలిటిక్స్.. తొలిసారి ఎక్కడ..ఎప్పుడంటే -
జార్ఖండ్ సర్కార్‌ను కూల్చే కుట్ర: రాహుల్
పాకూర్(జార్ఖండ్): హేమంత్ సోరెన్‌ను అక్రమంగా జైలుకు పంపి జార్ఖండ్‌లో రాష్ట్ర ప్రభుత్వాన్ని కూలదోయాలని బీజేపీ కుట్ర పన్నిందని, ప్రజాతీర్పుకు భంగం కల్గకుండా తాము అడ్డుకున్నామని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు. శుక్రవారం జార్ఖండ్‌లోకి భారత్ జోడో న్యాయ్ యాత్ర అడుగుపెట్టిన సందర్భంగా పాకూర్ జిల్లాలో కార్యకర్తలనుద్దేశించి రాహుల్ ప్రసంగించారు. ‘‘ ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాన్ని కూలదోసి ప్రజాతీర్పును బీజేపీ పరిహసించాలని చూసింది. మేం దానిని అడ్డుకున్నాం. ధనం, దర్యాప్తు సంస్థల అండతో బీజేపీ చెలరేగుతోంది’’అని రాహుల్ ఆరోపించారు. కాంగ్రెస్ సిద్ధాంతాలకు తాను కట్టుబడిఉంటానన్నారు. ‘‘ అస్సాంలో యాత్రకు అడ్డుపడిన సీఎం హిమంత బిశ్వ శర్మ, మహారాష్ట్రలో పార్టీ మారిన మిలింద్ దేవ్రా వంటి నేతలతో పార్టీకి పనిలేదు’’ అని రాహుల్ అన్నారు. నకిలీ రాహుల్ ఆచూకీ దొరికింది: హిమంత మరోవైపు, అస్సాంలో న్యాయ్‌యాత్ర వేళ బస్సులో రాహుల్ స్థానంలో కూర్చుని అభివాదం చేస్తున్న నకిలీ రాహుల్ ఆచూకీ తామ గుర్తించామని హిమంత చెప్పారు. ‘‘ అస్సాంలో మోదీ పర్యటన ముగిశాక పత్రికా సమావేశం ఏర్పాటుచేసి మరో రాహుల్ వివరాలు బహిర్గతం చేస్తా. జనానికి చేతులు ఊపుతూ, యాత్ర బస్సులో ఉన్నది రాహుల్ కాదు’’ అని హిమంత అన్నారు. -
ఇమ్రాన్‌కు పదేళ్ల జైలు
ఇస్లామాబాద్: ఫిబ్రవరి 8న జరిగే ఎన్నికల్లో విజయం సాధించి, మళ్లీ అధికార పగ్గాలు చేపట్టాలని తీవ్రంగా ప్రయత్నిస్తున్న పాకిస్తాన్ తెహ్రీక్–ఇ–ఇన్సాఫ్(పీటీఐ) చీఫ్, మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్(71)కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. అధికార పత్రాల లీకేజీ కేసులో ఆయనతో పాటు మాజీ విదేశాంగ మంత్రి మహ్మూద్ ఖురేషీకి పదేళ్ల జైలు శిక్ష విధిస్తూ ప్రత్యేక కోర్టు జడ్జి అబ్దుల్ హస్నత్ మంగళవారం తీర్పు వెలువరించారు. రావల్పిండిలోని అడియాలా జైలులో కేసు విచారణ జరిగింది. అవినీతి ఆరోపణలపై ఇప్పటికే ఇమ్రాన్ మూడేళ్ల జైలు శిక్ష అనుభవించారు. ఒకవైపు, ఆయన పార్టీ ఎన్నికల గుర్తు క్రికెట్ బ్యాట్‌ను వాడరాదంటూ ఎన్నికల సంఘం నిషేధం విధించగా మరోవైపు ఇమ్రాన్, ఖురేషిలతోపాటు పార్టీకి చెందిన ఇతర ముఖ్య నేతల నామినేషన్ పత్రాలు సైతం తిరస్కరణకు గురయ్యాయి. గత ఏడాది ఆగస్ట్‌లో తోషఖానా అవినీతి కేసును విచారించిన కోర్టు ఇమ్రాన్ ఖాన్‌కు మూడేళ్ల జైలు శిక్ష విధించింది. ప్రధానిగా ఉన్న ఇమ్రాన్ ఖాన్ 2022 మార్చి 7వ తేదీన జరిగిన బహిరంగ సభలో ఒక లెటర్‌ను ప్రజలకు చూపుతూ..తన ప్రభుత్వాన్ని గద్దె దించేందుకు రాజకీయ విరోధులు ఓ విదేశంతో చేతులు కలిపారనేందుకు సాక్ష్యం ఇదేనని పేర్కొన్నారు. ఆ తర్వాత కొన్ని రోజుల తర్వాత అమెరికా ప్రభుత్వం తనపై కుట్ర పన్నుతోందని ఆరోపించారు. అనంతరం ఆయన పదవీచ్యుతు డయ్యారు. పాక్ మాజీ రాయబారి అమెరికా ఉన్నతాధికారితో జరిపిన భేటీకి సంబంధించిన ఆ పత్రాన్ని ఇమ్రాన్ బహిరంగంగా చూపడాన్ని రహస్య పత్రాల లీకేజీ నేరంగా పేర్కొంటూ గత ఏడాది ఆగస్ట్‌లో ఇమ్రాన్‌తోపాటు అప్పటి విదేశాంగ మంత్రి ఖురేషిపై కేసు నమోదైంది. మరో 9 రోజుల్లో ఎన్నికలు జరగనున్న సమయంలో ఇమ్రాన్, ఖురేషిలు జైలులోనే ఉన్నారు. తాజా తీర్పుతో వీరిద్దరూ అయిదేళ్లపాటు ఎన్నికల్లో పోటీ చేసే అర్హత కోల్పోనున్నారు. -
పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌కు పదేళ్ల జైలు
ఇస్లామాబాద్: పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌కు పదేళ్ల జైలు శిక్ష పడింది. ప్రభుత్వ రహస్యాలను లీక్ చేసిన కేసు(సైఫర్)లో న్యాయస్థానం ఈ మేరకు శిక్షను ఖరారు చేసింది. పాకిస్థాన్ తెహ్రీక్-ఏ-ఇన్సాఫ్ (పీటీఐ) వ్యవస్థాపకుడు ఇమ్రాన్ ఖాన్, వైస్ ఛైర్మన్ షా మహమూద్ ఖురేషీలకు పాకిస్థాన్‌లోని ప్రత్యేక కోర్టు మంగళవారం ఈ తీర్పును వెలువరించింది. సైఫర్ కేసు.. సైఫర్ కేసు అనేది దౌత్య పరమైన సమాచారానికి సంబంధించినది. గత ఏడాది మార్చిలో వాషింగ్టన్‌లోని రాయబార కార్యాలయం పంపిన రహస్య దౌత్య కేబుల్ (సైఫర్)ను బహిర్గతం చేశారని ఇమ్రాన్ ఖాన్‌పై ఆరోపణలు వచ్చాయి. దీంతో అధికారిక రహస్యాల చట్టాన్ని ఉల్లంఘించారనే ఆరోపణలపై ఆయనపై కేసు నమోదైంది. ఈ సైఫర్ కేసులో తనను ప్రధాని పదవి నుంచి తప్పించడానికి కుట్ర జరుగుతోందని అప్పట్లోనే ఖాన్ ఆరోపించారు. ఏప్రిల్ 2022లో అవిశ్వాస తీర్మానంలో ఓడి పాకిస్తాన్ ప్రధానమంత్రి పదవి నుండి ఇమ్రాన్ ఖాన్ వైదొలిగారు. తోషాఖానా కేసులో ఇస్లామాబాద్ కోర్టు ఆయనకు మూడు ఏళ్ల జైలు శిక్ష విధించింది. ఆగస్టు 5, 2023న ఇమ్రాన్ జైలు పాలయ్యారు. పోలీసులు ఆయన్ని అటాక్ జైలులో ఉంచారు. అయితే.. ఇస్లామాబాద్ హైకోర్టు ఈ శిక్షను రద్దు చేసింది. కానీ ఇతర కేసులలో ఇమ్రాన్‌ను నిర్బంధంలో ఉంచారు. ఇదీ చదవండి: పాకిస్థాన్ నావికుల్ని కాపాడిన భారత నేవీ -
వేధింపుల కేసులో భారతీయ అమెరికన్ జంటకు 20 ఏళ్ల జైలు?
అమెరికాలోని వర్జీనియా ఫెడరల్ జ్యూరీ రెండు వారాల విచారణ అనంతరం ఒక భారతీయ అమెరికన్ జంటను దోషులుగా నిర్థారించింది. ఈ దంపతులు తమ బంధువును వేధించారని స్పష్టమైన నేపధ్యంలో జ్యూరీ వారిని దోషులుగా తేల్చిచెప్పింది. ఆ భారతీయ అమెరికన్ జంట తమ గ్యాస్ స్టేషన్, కన్వీనియన్స్ స్టోర్‌లో తమ బంధువును కార్మికునిగా నియమించుకునేందుకు బలవంతంగా ప్రయత్నించిందని ఫెడరల్ జ్యూరీ నిర్ధారించింది. ఈ కేసులో హర్మన్‌ప్రీత్ సింగ్(30), కుల్బీర్ కౌర్(43)లు దోషులుగా తేలడంతో వారికి 2024, మే 8న శిక్ష ఖరారు చేయనున్నారు. హర్మన్‌ప్రీత్ సింగ్, కుల్బీర్ కౌర్ దంపతులు తమ బంధువు చేత ఆహారాన్ని వండించడం, క్యాషియర్‌గా పని చేయించడం, స్టోర్ రికార్డులను శుభ్రపరచడం, నిర్వహించడం తదితర పనులు బలవంతంగా చేయించారు. ఇటువంటి కేసులలో గరిష్టంగా 20 సంవత్సరాల జైలు శిక్ష విధించేందుకు అవకాశం ఉంది. అలాగే 2,50,000 అమెరికన్ డాలర్ల వరకు జరిమానా విధించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. జస్టిస్ డిపార్ట్మెంట్, పౌర హక్కుల విభాగానికి చెందిన అసిస్టెంట్ అటార్నీ జనరల్ క్రిస్టెన్ క్లార్క్ మాట్లాడుతూ ఈ దంపతులు.. యునైటెడ్ స్టేట్స్లో పాఠశాలకు వెళ్లాలనే బాధితుని ఆశను అణగార్చారని, శారీరక, మానసిక వేధింపులకు గురి చేశారని అన్నారు. బాధితుని ఇమ్మిగ్రేషన్ పత్రాలను దాచేయడం, తీవ్రమైన హాని కలిగించే ఇతర బెదిరింపులకు గురిచేయడం, కనీస వేతనం కూడా చెల్లించకపోవడం, అధికంగా పనిచేయించడం లాంటి దుశ్చర్యలకు పాల్పడ్డారని అసిస్టెంట్ అటార్నీ జనరల్ పేర్కొన్నారు. యూఎస్ ఈస్టర్న్ డిస్ట్రిక్ట్ ఆఫ్ వర్జీనియా అటార్నీ జెస్సికా డి'అబెర్ మాట్లాడుతూ ఈ కేసులో నిందితులు తప్పుడు హామీలతో బాధితుని ఇక్కడకు తీసుకువచ్చి, మానసిక, శారీరక వేధింపులకు గురిచేశారన్నారు. మానవ అక్రమ రవాణా అనేది సమాజంలో అత్యంత జుగుప్సాకరమైన నేరమని, అయితే ఈ కేసులో బాధితునికి న్యాయం జరిగేలా హామీ ఇచ్చినందుకు ప్రాసిక్యూటర్లకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నానన్నారు. ఫెడరల్ ప్రాసిక్యూటర్లు తమ వాదనలో.. 2018లో నిందితులు.. ఆ సమయంలో మైనర్‌గా ఉన్న బాధితుని స్కూల్లో చేర్పిస్తామంటూ తప్పుడు వాగ్దానాలతో యునైటెడ్ స్టేట్స్కు తీసుకువెళ్లారని పేర్కొన్నారు. బాధితుతుడు అమెరికా వచ్చాక అతని ఇమ్మిగ్రేషన్ పత్రాలను తీసుకొని, తమ పనులలో నియమించుకున్నారు. బాధితుని దుకాణం పర్యవేక్షణలో నియమించారు. కొద్దిపాటి ఆహారాన్ని మాత్రమే అందించారు. బాధితుడు కోరినప్పటికీ వైద్య సంరక్షణ, విద్యను అందించడానికి నిరాకరించారు. బాధితునిపై నిరంతర నిఘా ఉంచారు. భారతదేశానికి వెళ్లిపోతాననే బాధితుని అభ్యర్థనను సింగ్ దంపతులు తిరస్కరించారు. వీసా గడువు దాటినా బాధితుని పనులలో కొనసాగేలా నిర్బంధించారు. బాధితుడు తన ఇమ్మిగ్రేషన్ పత్రాలను తిరిగి అడిగినపుడు సింగ్.. బాధితుని జుట్టు పట్టుకుని లాగి, చెంపమీద కొట్టి, కాలితో తన్నాడు. బాధితుడు తనకు ఒక రోజు సెలవు కావాలని అడిగితే రివాల్వర్‌తో బెదిరించినట్లు ఆధారాలు లభ్యమయ్యాయి. -
నీళ్లలాంటి ఆహారం.. టాయిలెట్ పక్కనే పడుకున్నా..: హీరోయిన్
బాలీవుడ్ నటుడు, ఎంఎంస్ ధోని హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య అప్పట్లో సంచలనం సృష్టించింది. యంగ్ హీరో సూసైడ్ చేసుకోవడంతో ఇండస్ట్రీ ఒక్కసారిగా షాక్‌కు గురైంది. అయితే సుశాంత్ ప్రియురాలు, నటి రియా చక్రవర్తిపై ఫిర్యాదు రావడంతో పోలీసులు కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. నెల రోజుల పాటు జైలులో ఉన్న రియా ఆ తర్వాత బెయిల్‌పై రిలీజై బయటికొచ్చారు. తాజాగా ఓ షోకు హాజరైన రియా జైలులో ఉన్నప్పటి చేదు అనుభవాలను పంచుకున్నారు. రియా మాట్లాడుతూ.. 'నాకు జైలులో ఎక్కువగా రోటీ, క్యాప్సికం పెట్టేవాళ్లు. కేవలం అవీ పేరుకే గానీ మొత్తం నీళ్లలాగే ఉండేది. అయినప్పటికీ ఆకలిగా ఉండటంతో గతిలేక తినేసేదాణ్ని. నేను పడుకునే ప్లేస్ పక్కనే బాత్రూమ్ ఉండేది. ఇలాంటివి దుర్భర పరిస్థితులు జైలులో చవిచూశా. ఆ సమయంలో పడిన శారీరక బాధల కన్నా.. మానసిక క్షోభనే ఎక్కువ అనుభవించా. కానీ మిగిలిన వారితో పోలిస్తే నా పరిస్థితి కాస్తా ఫరవాలేదనిపించేది. కొందరు బెయిల్ వచ్చినా రూ.5 వేలు, రూ.10 వేలు కూడా కట్టలేక అక్కడే ఉండేవారు. నాకు బెయిల్ వచ్చినప్పుడు.. మీరు హీరోయిన్ కదా.. మీ సంతోషాన్ని డ్యాన్స్ చేసి చూపిచండని కొందరు అడిగారు. అందుకే ఆ సమయంలో నాగిని పాటకు డ్యాన్స్ చేశా' అని జైలులోని అనుభవాలను చెప్పుకొచ్చారు. View this post on Instagram A post shared by Rhea Chakraborty (@rhea_chakraborty) -
జైలులో ఖైదీ బర్త్‌డే పార్టీ.. విచారణకు ఆదేశాలు!
పంజాబ్‌లోని లూథియానా సెంట్రల్ జైలులో కలకలం చెలరేగింది. ఖైదీలంతా పుట్టినరోజు వేడుకలు జరుపుకుంటున్న వీడియో ఆన్లైన్లో కనిపించడంతో, దీనిని సీరియస్‌గా తీసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. రెండు రోజుల క్రితం లూథియానాలోని సెంట్రల్ జైలులోని ఖైదీలకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో షేర్ అయ్యింది. ఆ క్లిప్‌లో కొందరు ఖైదీలు ఒక చేతితో గ్లాసులు పట్టుకుని, మరో చేతితో పకోడీలు తింటూ కనిపిస్తున్నారు. ఆ ఖైదీలు ‘నేడు మణి భాయ్ పుట్టినరోజు’ అని పాడటం కూడా ఆ వీడియోలో వినిపిస్తోంది. జైలులోని ఖైదీలు అరుణ్ కుమార్ అలియాస్ మణి రాణా పుట్టినరోజు వేడుకలు జరుపుకున్నారని తెలుస్తోంది. హిమాచల్ ప్రదేశ్‌లో 2019లో జరిగిన దోపిడీ కేసులో మణి అండర్ ట్రయల్‌గా ఉన్నాడు. వీడియో రికార్డు చేసి, అప్లోడ్ చేయడానికి ఉపయోగించిన మొబైల్‌ను స్వాధీనం చేసుకున్నట్లు జైలు అధికారులు తెలిపారు. అయితే ఆ ఫోన్ పగిలిపోయిందని, పూర్తి డేటా వెలువడలేదని వారు పేర్కొన్నారు. ఈ ఉదంతంలో 10 మంది ఖైదీలపై ఎఫ్ఐఆర్ నమోదు చేశామని తెలిపారు. ఈ ఖైదీలపై జైలు చట్టంలోని సెక్షన్ 52ఏ (జైలు నిబంధనల ఉల్లంఘన) కింద కేసు నమోదు చేసినట్లు అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ (లూథియానా ఈస్ట్) గుర్దేవ్ సింగ్ తెలిపారు. ఈ ఘటనను సీరియస్‌గా తీసుకున్న ఇన్స్పెక్టర్ జనరల్ (జైలు) ఆర్కే అరోరా, పాటియాలా రేంజ్ డిప్యూటీ ఇన్స్పెక్టర్ జనరల్ (డీఐజీ) సురీందర్ సింగ్ సైనీ ఈ ఘటనపై సమగ్ర విచారణ ప్రారంభించారు. ఇటువంటి ఉదంతాలతో పంజాబ్ జైళ్లు వార్తల్లోకి రావడం ఇదేమీ మొదటిసారి కాదు. ఇటువంటి పరిస్థితుల నేపధ్యంలో జైళ్ల భద్రతను మెరుగుపరచాల్సిన అవసరం ఉన్నదని పంజాబ్ గవర్నర్ బన్వరీలాల్ పురోహిత్ ఇటీవల వ్యాఖ్యానించారు. -
జైలుకు వెళ్లేందుకు సిద్ధంగా ఉండండి: కేజ్రీవాల్
ఢిల్లీ: ప్రజా క్షేమమే లక్ష్యంగా.. పనే ధ్యేయంగా ఆమ్ ఆద్మీ పార్టీ రాజకీయాలు చేసిందని సీఎం అరవింద్ కేజ్రీవాల్ అన్నారు. ఆ కారణంగానే ఆప్‌కు ప్రజాధరణ లభించిందని చెప్పారు. ప్రజలకు మంచి చేయడానికి తాము ఎంచుకున్న మార్గం కోసం జైలుకు వెళ్లడానికైనా పార్టీ కార్యకర్తలు సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. ఢిల్లీ మద్యం కుంభకోణం ఆరోపణలపై ఐదుగురు ఆప్ నేతలు జైలులో ఉన్నందుకు గర్విస్తున్నట్లు చెప్పారు. జాతీయ కౌన్సిల్ సమావేశాల్లో పార్టీ నేతలను ఉద్దేశించి ఆప్ అధినేత ఈ మేరకు మాట్లాడారు. "పిల్లలకు మంచి చదువులు చెప్పాలని, పేదలకు ఉచితంగా వైద్యం అందించాలని మాట్లాడితే జైలుకు పంపిస్తారా?. అందుకు ఎప్పుడైనా కార్యకర్తలు సిద్ధంగా ఉండాలి. మేము పోరాటాన్ని ఎదుర్కొంటున్నాం. మనం బాధపడాల్సిన అవసరం లేదు. ఈ రోజు జైలులో ఉన్న మా ఐదుగురు నాయకులు హీరోలే. వారందరినీ చూసి మేము చాలా గర్వపడుతున్నాం. ఏ ఇతర పార్టీలు దృష్టి సారించని విషయాలను పట్టించుకున్నందుకే ఆప్ రాజకీయాల్లోకి ఎదిగింది." అని కేజ్రీవాల్ అన్నారు. ఢిల్లీ ఎక్సైజ్ పాలసీతో ముడిపడి ఉన్న మనీలాండరింగ్ కేసులో జనవరి 3న హాజరుకావాలని ఈడీ సమన్లు పంపిన నేపథ్యంలో కేజ్రీవాల్ ఈ వ్యాఖ్యలు చేశారు. గతంలోనూ ఈడీ రెండు సార్లు కేజ్రీవాల్‌కు సమన్లు జారీ చేసింది. కానీ ఆయన గౌర్హాజరయ్యారు. ఇదీ చదవండి: PM Narendra Modi Wishes: దేశ ప్రజలకు ప్రధాని మోదీ శుభాకాంక్షలు! -
నేరాలకు దూరంగా... ఉపాధికి దగ్గరగా..!
ఆరిలోవ(విశాఖ తూర్పు): వివిధ కేసుల్లో శిక్ష పడి జైలులో ఉన్న ఖైదీల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం పలు చర్యలు చేపడుతోంది. ఇప్పటికే ఏ రాష్ట్రంలో లేనివిధంగా ఖైదీలకు ఆరోగ్యశ్రీ సౌకర్యం కల్పించి కార్పొరేట్ ఆస్పత్రుల్లో మెరుగైన వైద్యం అందిస్తోంది. తాజాగా ఖైదీల ప్రవర్తనలో మార్పు తీసుకురావడంతోపాటు జైలు నుంచి విడుదలయ్యాక నేర ప్రవృత్తిని విడనాడి అందరిలాగే పనిచేసుకుని ఆర్థికంగా ఎదిగేందుకు కృషి చేస్తోంది. ఇందుకోసం రాష్ట్రంలోని అన్ని కేంద్ర కారాగారాల్లో సోషల్ ఇంక్యుబేషన్ సెంటర్లు ఏర్పాటు చేయాలని ఆదేశించింది. ఈ మేరకు ఇటీవల విశాఖ కేంద్ర కారాగారంలో సోషల్ ఇంక్యుబేషన్ సెంటర్ ఏర్పాటు చేశారు. ఈ కేంద్రంలో వివిధ విభాగాలకు చెందిన సోషల్ వర్కర్లను సభ్యులుగా నియమిస్తారు. దీనికోసం ఈ నెల 5న సోషల్ కౌన్సెలర్, ఎన్జీవోలు, సోషల్ వర్కర్లు, సైకాలజిస్ట్‌లు, వెల్ఫేర్ ఆఫీసర్లు, బ్యాంకుల ప్రతినిధులు, జిల్లా స్కిల్ డెవెలప్మెంట్ కార్పొరేషన్ ప్రతినిధులతో కేంద్ర కారాగారంలో సమావేశం నిర్వహించారు. వారిలో ఐదుగురిని ఉన్నతాధికారులు ఎంపిక చేస్తారు. సోషల్ ఇంక్యుబేషన్ సెంటర్ ద్వారా ఏం చేస్తారంటే... ► ఖైదీలకు సైకాలజిస్టులు కౌన్సిలింగ్ ఇచ్చి వారి ప్రవర్తనలో మంచి మార్పు తీసుకువస్తారు. మానసిక ఒత్తిడిని తగ్గించడానికి కృషి చేస్తారు. ► ఆంధ్రప్రదేశ్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (ఏపీఎస్ఎస్డీసీ) ప్రతినిధులు వచ్చి ఖైదీలకు వివిధ చేతివృత్తుల్లో శిక్షణ ఇస్తారు. శిక్షణ పూర్తయినవారికి సర్టీఫికెట్ అందజేస్తారు. ► ఈ శిక్షణ వల్ల ఖైదీలు జైలు నుంచి విడుదలైన తర్వాత సమాజంలో పని చేసుకునే వెసులుబాటు ఉంటుంది. ► ఏపీఎస్ఎస్డీసీ ఇచ్చిన సర్టిఫికెట్ ఉన్న ఖైదీలు ఆర్థికంగా ఎదిగేందుకు బ్యాంకుల ద్వారా రుణ సదుపాయం కల్పిస్తారు. ► ఈ చర్యల వల్ల ఖైదీల్లో నేరప్రవృత్తి తగ్గుతుందని, ఆర్థికంగా ఎదిగి కుటుంబంతో ఆనందంగా గడిపే అవకాశం ఉంటుందని జైలు అధికారులు అభిప్రాయపడుతున్నారు. -
‘నిర్భయ’కు 11 ఏళ్లు... మహిళల భద్రతకు భరోసా ఏది?
అది దేశరాజధాని ఢిల్లీ.. 2012, డిసెంబరు 16.. రాత్రివేళ ఓ ప్రైవేట్ బస్సులో చోటుచేసుకున్న దారుణ అత్యాచార ఘటన భారతదేశాన్నే కాదు యావత్ ప్రపంచాన్నీ కుదిపేసింది. ఈ నేపధ్యంలో ఢిల్లీని అత్యాచారాల క్యాపిటల్‌గా అభివర్ణించారు. నాడు అత్యంత క్రూరంగా జరిగిన అత్యాచార ఘటన దేశంలోని ప్రతీఒక్కరినీ కంటతడి పెట్టించింది. డిసెంబరు నాటి వణికించే చలిలో పారామెడికల్ విద్యార్థిని నిర్భయ కామాంధుల చేతుల్లో చిగురుటాకులా వణికిపోయింది. ఈ నేపధ్యంలో బాధితురాలికి న్యాయం చేయాలంటూ దేశంలోని ప్రజలంతా రోడ్లపైకి వచ్చి ఆందోళనలకు దిగారు. ఈ దారుణ అత్యాచారం దరిమిలా దేశంలో మహిళల రక్షణ విషయంలో పెను మార్పులు వచ్చాయి. దేశవ్యాప్తంగా మహిళల భద్రత కోసం అనేక చర్యలు చేపట్టారు. నిర్భయ అత్యాచార ఘటన దర్యాప్తు అనంతరం జస్టిస్ జేఎస్ వర్మ కమిటీ సిఫార్సులు అమలయ్యాయి. దేశంలోని ప్రతీ రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో అత్యాచార బాధితుల కోసం వన్ స్టాప్ సెంటర్లు, హెల్ప్లైన్లు ప్రారంభించారు. నిర్భయ ఫండ్ విడుదల చేశారు. నిర్భయ స్క్వాడ్, నిర్భయ యాప్ అందుబాటులోకి వచ్చింది. ఎనిమిదేళ్ల పాటు నిర్భయ కేసు విచారణ కొనసాగగా దోషులైన ముఖేష్, పవన్, అక్షయ్, వినయ్‌లను 2020, మార్చి లో ఢిల్లీలోని తీహార్ జైలులో ఉరితీశారు. ఒక మైనర్‌కు విముక్తి లభించగా, మరో నిందితుడు రామ్ సింగ్ విచారణ సమయంలో జైలులో ఆత్మహత్య చేసుకున్నాడు. నిర్భయ ఘటన, కేసు దర్యాప్తు, దోషులకు శిక్ష అమలు తర్వాత దేశంలో అత్యాచార ఘటనలు తగ్గుముఖం పట్టివుంటాయని అందరూ భావించివుంటారు. అయితే దీనికి భిన్నమైన పరిస్థితులు దేశంలో తాండవిస్తున్నాయి. ప్రముఖ జాతీయ ఏజెన్సీ ఎన్సీఆర్బీ.. నిర్భయ ఘటన అనంతరం గత 11 ఏళ్లలో దేశంలో చోటుచేసుకున్న అత్యాచార గణాంకాల వివరాలను విడుదల చేసింది. ఇవి మరింత ఆందోళన కలిగించేలా ఉన్నాయని పలువురు అంటున్నారు. సంవత్సరం అత్యాచారం కేసులు 2022 31,516 2021 31,677 2020 28,046 2019 32,032 2018 33,356 2017 32,559 2016 38,947 2015 34,651 2014 36,735 2013 33,707 2012 24,923 నిర్భయ లాంటి హృదయ విదారక అత్యాచార ఘటనల తర్వాత కూడా దేశంలో మహిళల భద్రత విషయంలో ఆశించినంత మార్పు రాలేదు. నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో ఇటీవల విడుదల చేసిన 2022 సంవత్సరానికి సంబంధించిన నివేదిక ప్రకారం.. గత ఏడాది దేశంలో మొత్తం 31,516 అత్యాచార కేసులు నమోదయ్యాయి. అంటే ప్రతిరోజూ దాదాపు 87 మంది , ప్రతి గంటకు మూడు నుంచి నలుగులు బాలికలు లేదా మహిళలు అత్యాచారానికి గురవుతున్నారు. ఈ నివేదిక ప్రకారం అత్యాచార ఘటనల విషయంలో రాజస్థాన్ మొదటి స్థానంలో ఉంది. గత ఏడాదిలో అత్యధికంగా 5,399 అత్యాచార కేసులు ఇక్కడ నమోదయ్యాయి. ఢిల్లీలో 1212 అత్యాచార కేసులు నమోదయ్యాయి. ఇది కూడా చదవండి: కరడుగట్టిన నియంత ఏడ్చిన వేళ.. -
Kathleen Folbigg: కన్నబిడ్డల మృతి కేసులో ఆస్ట్రేలియా మహిళ.. 20 ఏళ్లకు విముక్తి
సిడ్నీ: కన్నబిడ్డల మృతి కేసులో 20 ఏళ్లపాటు కారాగారంలో మగ్గిన ఆf స్ట్రేలి యా మహిళకు ఎట్టకేలకు విముక్తి లభించింది.న్యూ సౌత్ వేల్స్ లోని క్రిమినల్ కోర్టు ఆదేశాలతో గురువారం ఆమె విడుదలయ్యారు. కాథ్లీన్ ఫాల్బిగ్కు జన్మించిన నలుగురు సంతానం 1989–1999 సంవత్సరాల మధ్య వివిధ కారణాలతో చనిపో యారు. అయితే, వారి మరణాలకు తల్లి కాథ్లీనే కారణమంటూ పోలీసులు 2003లో హత్య కేసు నమోదు చేసి, జైలు శిక్ష విధించారు. తాను అమాయకురాలినని, తన బిడ్డల మరణాలు సహజంగానే జరిగినవని ఆమె ఎంతగా చెప్పినా ఎవరూ వినలేదు. మీడియా ఆమెను వరస్ట్ ఫిమేల్ సీరియల్ కిల్లర్‌గా అభివర్ణించింది. 2019లో మరోసారి జరిగిన దర్యాప్తులోనూ ఆమెనే దోషిగా తేలింది. 2022లో మాజీ న్యాయాధికారి జరిపిన విచారణలో మాత్రం..చనిపోయిన నలుగురు బిడ్డల్లో ఇద్దరు జన్యు సంబంధ వ్యాధులతోనే చనిపోయి ఉండొచ్చంటూ తెలిపింది. దీంతో, ఈ ఏడాది జూన్‌లో ఆమెకు కోర్టు క్షమాభిక్ష ప్రకటించింది. ఆమెపై వచ్చిన ఆరోపణలను న్యూ సౌత్ వేల్స్ కోర్టు కొట్టివేస్తూ జైలు నుంచి విడుదల చేసింది. జైలు నుంచి విడుదలైన కాథ్లీన్ ఫాల్బిగ్ హర్షం వ్యక్తం చేశారు. 1999లోనే తనపై మోపిన ఆరోపణలకు జవాబులు దొరికినా, నిరపరాధినని నిరూపించుకోలేకపోయాను. పిల్లలు ఆకస్మికంగా, గుర్తు తెలియని కారణాలతో చనిపోయే అవకాశం ఉందని భావించని యంత్రాంగం నన్ను దోషిగా చూసింది’అని పేర్కొన్నారు. రెండు దశాబ్దాలపాటు తనను నిర్బంధించిన యంత్రాంగం నుంచి భారీగా పరిహారం కోరుతూ దావా వేస్తానన్నారు. ఫాల్బిగ్ను విడుదల చేయాలంటూ పలువురు వైద్య నిపుణులు, వైద్యులు పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమాలను సైతం చేపట్టారు. -
మేకలకు ఏడాది జైలు శిక్ష! ఏం తప్పు చేశాయో వింటే షాకవ్వుతారు!
మనుషులకు విధించినట్లు జంతువులకు కూడా జైలు శిక్షలు విధిస్తారని విన్నారా?. ఔను! ఇది నిజం. ఇక్కడొక దేశం మేకలకు అలానే శిక్ష విధించి వార్తల్లో నిలిచింది. ఏం తప్పు చేశాయని అంత పెద్ద శిక్ష విధించారో తెలిస్తే షాకవ్వుతారు. ఇదేం విడ్డూరం రా బాబు..! అనుకోకండి. ఇలాంటివి అక్కడ మాములేనట. పాపం ఆ మేకలు ఒకటి రెండు రోజులు కాదు ..ఏకంగా ఏడాదికి పైగా జైలు శిక్ష అనుభవించాయి. వివరాల్లోకెళ్తే..ఈ వింత ఘటన బంగ్లాదేశ్‌లో చోటు చేసుకుంది. షహరియార్ సచిబ్ రాజీబ్‌కి చెందిన తొమ్మిది మేకులడిసెంబర్ 6, 2022న స్మశాన వాటికలో చెట్ల ఆకులు, గడ్డి తిన్నాయని అరెస్టు చేశారు అధికారులు. అలా అప్పటి నుంచి బారిసాల్‌లో బార్ల వెనుక ఆ మేకలు బంధీలుగా ఉండిపోయాయి. వాటి యజమాని వాటిని విడుదల చేసేందుకు పలు విధాల యత్నించి ప్రయోజనం లేకుండా పోయింది. అయితే ఇటీవలే ఎన్నికైన బరిషల్ సిటీ కార్పొరేషన్ మేయర్‌ని సంప్రదించి తన గోడును చెప్పుకున్నాడు. దీంతో ఆయన చొరవ కారణంగా బంగ్లాదేశ్ అడ్మనిస్ట్రేటివ్ అదికారులు రాజీబ్‌కు తొమ్మిది మేకలను విడుదల చేసి తిరిగి అప్పగించారు. దాదాపు ఏడాదికి పైగా జైలు శిక్ష అనుభవించి ఇటీవలే బంధిఖానా నుంచి విముక్తి పొందాయి ఆ తొమ్మిది మేకలు. ఇలా జంతువులకు శిక్ష విధించిన ఘటన మొదటిది కాదు. రష్యాలో కూడా ఇలాంటి ఘటనే జరిగింది. కోమి ప్రావిన్స్‌లో సిక్టివ్కర్ నగరంలోని జైలులో ఓ పిల్లి అక్రమంగా ఫోన్లు, గాడ్జెట్లు రవాణ చేస్తుందని అరెస్టు చేసి బంధించారు. అలాగే ఉత్తరప్రదేశ్‌ల్లో కూడా ఇలాంటి విచిత్ర ఘటనే చోటు చేసుకుంది. ఓ ఎనిమిది గాడిదలు లక్షలు విలువ చేసే మొక్కలను తినేశాయని అరెస్టు చేసి జైల్లో పడేశారు. Nine goats freed after one year in jail for eating grass in Barishal graveyard!#Bangladesh #barishal https://t.co/8vLLSSOgRf — UNB - United News of Bangladesh (@unbnewsroom) November 24, 2023 (చదవండి: ఆ లాటరీ టికెట్ వెయిటర్ జీవితాన్ని తలకిందులు చేసి చిక్కుల్లో పడేసింది!) (మరిన్ని వార్తల కోసం సాక్షి వాట్సాప్ ఛానెల్‌పై క్లిక్ చేయండి) -
ఖైదీల నుంచి కోట్లలో వసూళ్లకు పాల్పడ్డారు
న్యూఢిల్లీ: జైలులో విలాసవంతమైన జీవితం గడిపేందుకు సుకేశ్ చంద్ర శేఖర్ వంటి హై ప్రొఫైల్ ఖైదీల నుంచి ఢిల్లీ జైళ్ల శాఖ మాజీ మంత్రి సత్యేందర్ జైన్, ఆ శాఖ మాజీ డీజీ సందీప్ గోయెల్ కోట్లలో వసూళ్లకు పాల్పడ్డారని సీబీఐ ఆరోపించింది. ఈ మేరకు వారిపై కేసు నమోదుకు అనుమతివ్వాల్సిందిగా ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వినయ్ కుమార్ సక్సేనాను కోరింది. సత్యేందర్ జైన్‌తోపాటు జైలు అధికారి రాజ్‌కుమార్‌లపై కేసు నమోదు కోసం లెఫ్టినెంట్ గవర్నర్ వినయ్ కుమార్ సక్సేనాకు, సస్పెండైన ఐపీఎస్ అధికారి గోయెల్, రిటైర్డు ఐఏఎస్ ముకేశ్ ప్రసాద్‌లపై చర్యలకు కేంద్ర హోం శాఖకు వినతి పంపినట్లు సీబీఐ వివరించింది. వసూళ్లకు పాల్పడిన ఆరోపణలతో గత ఏడాది గోయెల్‌ను కేంద్ర హోం శాఖ సస్పెండ్ చేసింది. జైలులో విలాసవంతమైన జీవితం గడిపేందుకు మోసగాడు సుకేశ్ చంద్రశేఖర్ 2018–21 సంవత్సరాల మధ్య సుమారు రూ.12.50 కోట్లను వేర్వేరు మార్గాల్లో వీరికి ముట్టజెప్పినట్లు తమకు సమాచారం ఉందని సీబీఐ అంటోంది. -
జైలు నుంచి ఇంటికి సిసోడియా..అనుమతిచ్చిన కోర్టు
ఢిల్లీ : లిక్కర్ స్కామ్ కేసులో అరెస్టయి తీహార్ జైలులో ఉంటున్న ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా శనివారం జైలు నుంచి బయటికి వచ్చారు. అనారోగ్యంతో బాధపడుతున్న భార్యను చూసేందుకుగాను మధుర రోడ్‌లోని తన నివాసానికి వెళ్లారు. భార్యను చూసేందుకు కోర్టు సిసోడియాకు 6 గంటల పాటు ప్రత్యేక అనుమతిచ్చింది. అయితే ఈ ఆరు గంటల్లో మీడియాతో మాట్లాడవద్దని, ఎలాంటి రాజకీయ కార్యకలాపాలు చేయరాదని షరతు విధించింది. సిసోడియా భార్య మల్టీపుల్ స్క్లిరోసిస్‌తో బాధపడుతున్నారు. జూన్‌లో కూడా సిసోడియా తన భార్యను చూసేందుకు కోర్టు అనుమతితో జైలు నుంచి ఇంటికి వచ్చారు. అయితే అప్పుడు ఆమె ఆరోగ్యం క్షీణించడంతో ఆస్పత్రికి తీసుకెళ్లారు. దీంతో సిసోడియా భార్యను చూడకుండానే జైలుకు వెనుదిరిగారు. లిక్కర్ స్కామ్ కేసులో ఈ ఏడాది ఫిబ్రవరిలో అరెస్టయిన సిసోడియా అప్పటి నుంచి తీహార్ జైలులోనే రిమాండ్‌లో ఉంటున్నారు. ఆయన బెయిల్ పిటిషన్లను కోర్టులు పలుమార్లు రిజెక్ట్ చేశాయి. -
ఖైదీలను ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దాలి.. జైళ్ల శాఖ డీఐజీ
నల్లగొండ క్రైం: సమాజానికి తోడ్పాటునిచ్చేలా జైళ్లలో ఉన్న ఖైదీలను ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దాలని జైళ్ల శాఖ డీఐజీ డి.శ్రీనివాస్ అన్నారు. సోమవారం ఆయన నల్లగొండలోని జిల్లా జైల్‌ను సందర్శిం చారు. ఈ సందర్భంగా జైల్ సిబ్బంది నుంచి గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం ఖైదీలతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. జైలు సిబ్బంది సమస్యలను కూడా అడిగి తెలుసుకున్నారు. ఆ తర్వాత ఆయన మాట్లాడుతూ జైలు నుంచి విడుదలైన తర్వాత మంచి పౌరులుగా మారి సమాజంలో గౌరంగా జీవనం సాగించాలని కోరారు. కార్యక్రమంలో జైల్ సూపరింటెండెంట్ దేవ్లానాయక్, జైలర్ జనార్దన్‌రెడ్డి, డీఎస్పీ శోభన్‌బాబు, రామలింగం పాల్గొన్నారు. -
వర్క్ ఫ్రమ్ జైల్ చేయండి: కేజ్రీవాల్‌తో ఆప్ ఎమ్మెల్యేలు!
న్యూ ఢిల్లీ : ఆప్ జాతీయ కన్వీనర్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌ను లిక్కర్ స్కామ్‌లో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) విచారణ ఎదుర్కొనున్నారు. ఒకవేళ ఆయన గనుక అరెస్ట్ చేస్తే సీఎంగా వర్క్ ఫ్రమ్ జైల్ (జైలు నుంచే పని) చేస్తారని ఢిల్లీ మంత్రి ఆతిషి చెబుతున్నారు. లిక్కర్ స్కామ్‌లో కేజ్రీవాల్‌కు ఈడీ సమన్ల నేపథ్యంలో కేజ్రీవాల్ సోమవారం ఢిల్లీలో ఆప్ ఎమ్మెల్యేలతో భేటీ అయ్యారు. ఆమ్ ఆద్మీ పార్టీపై కేంద్ర ప్రభుత్వం కక్ష సాధిస్తోందని, ఇందుకే మీరు జైలుకు వెళ్లినా సీఎం పదవికి రాజీనామా చేయవద్దని ఎమ్మెల్యేలు కేజ్రీవాల్‌ను కోరినట్లు తెలుస్తోంది. ఒకవేళ అరెస్ట్ అయితే పదవికి రాజీనామా చేయొద్దని.. జైలు నుంచే సీఎంగా పని చేయాలని కేజ్రీవాల్ మీటింగ్‌లో విజ్ఞప్తి చేసినట్లు ఆతిషి వెల్లడించారు. జైలులోనే కేబినెట్ మీటింగ్ పెట్టుకునేందుకు కోర్టు అనుమతి కూడా తీసుకుంటామని చెప్పారు. లిక్కర్ స్కామ్‌లో ప్రశ్నించేందుకుగాను ఈ నెల 2న తమ ముందు హాజరవ్వాలని కేజ్రీవాల్‌కు ఈడీ నోటీసులు పంపిన విషయం తెలిసిందే. ఈ విచారణకు కేజ్రీవాల్ హాజరుకాలేదు. దీంతో అరెస్టు చేస్తారని ప్రచారం జరుగుతోంది. మరోవైపు లిక్కర్ స్కామ్ కేసులో అరెస్టైన ఆప్ నేత మనీశ్ సిసోడియా తన మంత్రి పదవిని కోల్పోవాల్సి వచ్చిన సంగతి తెలిసిందే. -
కేసీఆర్‌ను జైలుకు పంపడం ఖాయం
పెద్దపల్లిరూరల్: కాళేశ్వరం ప్రాజెక్టు పేరిట కోట్లాది రూపాయలు దిగమింగిన సీఎం కేసీఆర్‌ను, ఆయన కుటుంబసభ్యులను జైలు కు పంపడం ఖాయమని బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు ఆర్.ఎస్.ప్రవీణ్‌కుమార్ అన్నారు. పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో ఆదివారం ఏర్పాటు చేసిన బహిరంగసభలో ఆయన మాట్లాడారు. రూ.లక్షన్నర కోట్లు వెచ్చించి నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ కుంగిపోతోందని, అందుకు కల్వకుంట్ల కుటుంబసభ్యులే కారకులని ఆరోపించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే నీళ్లు, నిధులు, నియామకాలు అందుబాటులోకి వస్తాయని చెప్పిన కేసీఆర్.. అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యావంతులైన నిరుద్యోగ యువతశక్తిని నీరుగార్చారని ఆరోపించారు. ఇప్పుడు ఏంచేయాలో తెలియక విద్యావంతులు ఆవేదన చెందుతున్నారని పేర్కొన్నారు. రాష్ట్ర హోంమంత్రి మహమూద్ అలీ ప్రతి ఏటా రంజాన్ పండుగకు ఇఫ్తార్ విందులు ఏర్పాటు చేసుడే తప్ప మైనారిటీలకు జరుగుతున్న అన్యాయాలను ప్రశ్నించలేనిస్థితిలో ఉన్నారని ఎద్దేవా చేశారు. ఇఫ్తార్ విందులు కావు.. న్యాయం కావాలని మైనారిటీలు అడుగుతున్నారని పేర్కొన్నారు. సభలో పార్టీ నాయకులు ఈర్ల కొమురయ్య తదితరులు పాల్గొన్నారు. -
'తల్లిని కావాలనుంది.. భర్తను వదలండి'
భోపాల్: బిడ్డను కనడానికి తన భర్తను జైలు నుంచి బయటకు పంపాలని కోరుతూ ఓ మహిళ మధ్యప్రేదశ్ హైకోర్టును ఆశ్రయించింది. సంతానం తన ప్రాథమిక హక్కుగా పేర్కొంటూ న్యాయస్థానాన్ని అభర్థించింది. నంద్ లాల్ Vs కేసులో రాజస్థాన్ హైకోర్టు ఆదేశం ప్రకారం సంతానోత్పత్తికి ప్రాథమిక హక్కు అని కోరింది. మహిళ పిటిషన్‌పై అక్టోబర్ 27న విచారణ ప్రారంభించిన న్యాయస్థానం.. బిడ్డను కనడానికి ఆ మహిళ ఆరోగ్యంగా ఉందో? లేదో? పరీక్షించాలని ఐదుగురు డాక్టర్లతో కూడిన బృందాన్ని కోరింది. అయితే.. రికార్డ్ల ప్రకారం మహిళ మోనోపాజ్(బుుతుక్రమం) వయస్సు దాటిపోయిందని ప్రభుత్వ న్యాయవాది సుబోధ్ కథార్ తెలిపారు. వైద్యుల రిపోర్టు నవంబర్ 7న రానున్నాయి. వైద్యుల రిపోర్టు తర్వాత న్యాయస్థానం తుది నిర్ణయం తీసుకోనుంది. తదుపరి విచారణను నవంబర్ 22కు వాయిదా వేసింది. ఇదీ చదవండి: అమానవీయం: రక్తపు మడుగులో ఫిల్మ్‌మేకర్.. ఫోన్, కెమెరా దొంగతనం -
నేరం చేస్తే మూడు తరాలకు శిక్ష? ఎందుకలా?
ఏ దేశంలోనైనా నేరానికి తగిన శిక్ష విధిస్తారు. నేరం చేసిన వ్యక్తి శిక్షనుంచి తప్పించుకోలేడు. అయితే ఒక వ్యక్తి చేసిన నేరానికి మూడు తరాలు శిక్షను అనుభవించాల్సి వస్తే.. అది మన ఊహకు అందదు. ఒక వ్యక్తి చేసిన నేరానికి మూడు తరాలవారు శిక్ష అనుభవించే చట్టం ఆ దేశంలో అమలులో ఉంది. మనం ఇప్పుడు చెప్పుకోబోతున్న దేశం పేరు ఉత్తర కొరియా. నియంత కిమ్ జాంగ్ ఉన్ ఆ దేశాన్ని పాలిస్తున్నాడు. ఈ దేశం గురించి ప్రపంచవ్యాప్తంగా పలు చర్చలు జరుగుతుంటాయి. ఇక్కడ చట్టం అమలయ్యే తీరు తెలుసుకుంటే ఎవరికైనా వెన్నులో వణుకు పుడుతుంది. ఉత్తర కొరియాలో ఎవరైనా నేరం చేస్తే వారి తల్లిదండ్రులు, పిల్లలు కూడా శిక్షను ఎదుర్కోవలసి వస్తుంది. అయితే ఏ నేరానికి ఇంతటి శిక్ష విధిస్తారనే ప్రశ్న ఇప్పుడు మన మదిలో మెదులుతుంది. దేశంలోని ఏ ఖైదీ కూడా జైలు నుంచి తప్పించుకోకుండా ఉండేందుకే ఈ చట్టాన్ని రూపొందించారని సమాచారం. ఇక ఉత్తర కొరియాలోని ప్రత్యేక చట్టాల విషయానికొస్తే జుట్టు కటింగ్‌కు సంబంధించి కూడా చట్టాలు రూపొందించారు. ఉత్తర కొరియాలో ప్రభుత్వం 28 హెయిర్ కటింగ్ స్టైల్స్‌కు మాత్రమే అనుమతినిచ్చింది. వీటిలో మహిళలకు 18, పురుషులకు 10 హెయిర్ కటింగ్ స్టైల్స్ ఉన్నాయి. ఈ స్టైల్స్ కాకుండా, ఎవరైనా వేరే విధంగా జుట్టు కత్తిరించుకున్నట్లయితే దానిని నేరంగా పరిగణిస్తారు. అందుకు తగిన శిక్ష కూడా విధిస్తారు. ప్రపంచంలోని ఏ ప్రజాస్వామ్య దేశంలోనూ ఇటువంటి చట్టాలు కనిపించవు. 21వ శతాబ్దంలో కూడా ఉత్తరకొరియా ప్రపంచంలోని ఇతర దేశాలకు భిన్నంగా కనిపించడానికి ఇదే ప్రధాన కారణం. ఇది కూడా చదవండి: ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ జెండాలపై యూనియన్ జాక్ ఎందుకు? -
అరెస్టు కానున్న నేతలు వీరే: ఆప్
కోల్‌కతా: మమత ఆరోపణలు వాస్తవమేనని ఆప్ పేర్కొంది. లోక్‌సభ ఎన్నికల్లోపు విపక్ష ఇండియా కూటమి నేతలందరినీ ఏదోలా జైలుపాలు చేయాలని మోదీ సర్కారు కుట్ర చేస్తోందని ఆ పార్టీ నేత రాఘవ్ ఛద్దా ఆరోపించారు. తొలుత తమ అధినేత కేజ్రీవాల్‌ను అరెస్టు చేయజూస్తోందన్నారు. 2014 నుంచి దర్యాప్తు సంస్థలు నమోదు చేసిన కేసుల్లో ఏకంగా 95 శాతం విపక్ష నేతలపైనే కావడం మోదీ సర్కారు కక్షపూరిత వైఖరిని అద్దం పడుతోందని ధ్వజమెత్తారు. ‘‘ఇండియా కూటమి ఆవిర్భావంతో బీజేపీ వణికిపోతోంది. అందుకే విపక్ష కూటమిలోని అగ్ర నేతలందరినీ లక్ష్యంగా చేసుకుందని మాకు విశ్వసనీయ వర్గాల నుంచి ఇప్పటికే సమాచారం అందింది. ‘‘కేజ్రీవాల్ తర్వాత జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్, బిహార్ డిప్యూటీ సీఎం తేజస్వీ యాదవ్, మమతా బెనర్జీ, ఆమె మేనల్లుడు, టీఎంసీ నేత అభిషేక్ బెనర్జీలను అరెస్టు చేయడం మోదీ సర్కారు లక్ష్యం. వారి తర్వాత జాబితాలో కేరళ సీఎం పినరయ్ విజయన్, తమిళనాడు సీఎం ఎం.కె.స్టాలిన్, శివసేన, ఎన్సీపీల అగ్ర నేతలున్నారు’’ అని ఆరోపించారు. -
చికిత్స తర్వాత చంద్రబాబు జైలుకు వెళ్లక తప్పదు
సాక్షి, అమరావతి: ఖజానా నుంచి రూ.371 కోట్లు దోచేసిన కేసులో రిమాండ్‌పై జైల్లో ఉన్న చంద్రబాబుకు కంటి ఆపరేషన్ కోసమే కోర్టు షరతులతో కూడిన బెయిల్ ఇస్తే విజయోత్సవాలు, ర్యాలీలు ఎందుకు నిర్వహిస్తున్నారని వైఎస్సార్సీపీ ప్రధాన కార్యదర్శి, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి చంద్రబాబు కుటుంబ సభ్యులు, టీడీపీ నేతలను నిలదీశారు. తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో మంగళవారం సజ్జల మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబు రోగిగా జైలు నుంచి బయటకు వస్తున్నారా లేక ఏదైనా యుద్ధంలో గెలిచి వీరయోధుడిగా వస్తున్నాడనుకుంటున్నారా అని ఎద్దేవా చేశారు. కంటి చికిత్స కోసం నాలుగు వారాల తాత్కాలిక బెయిల్‌పై చంద్రబాబు బయటకు వస్తున్నారని.. చికిత్స తర్వాత ఈ నెల 28న సాయంత్రం 5 గంటలకు రాజమండ్రి సెంట్రల్ జైలులో లొంగిపోవాల్సిందేనన్నారు. ఈ మాత్రానికే రాజమండ్రి నుంచి రోడ్ షో నిర్వహించడానికి, సంబరాలు చేసుకోవడానికి సిగ్గుండాలని టీడీపీ నేతలకు చురకలంటించారు. స్కిల్ స్కాంలో ఆధారాలతో సహా అడ్డంగా దొరికిపోయిన దొంగ చంద్రబాబు అని స్పష్టం చేశారు. ఈ కేసులో సీఐడీ పోలీసులు సమర్పించిన ఆధారాలతో ఏకీభవించిన ఏసీబీ కోర్టు చంద్రబాబును రిమాండ్‌పై జైలుకు పంపిందని గుర్తు చేశారు. సానుభూతి కోసమే నాటకాలని ఒప్పుకోండి చంద్రబాబు జైలుకెళ్లడంతో ప్రజల్లో పెద్దఎత్తున సానుభూతి వస్తుందని టీడీపీ నేతలు ఆశపడ్డారని.. తీరా పరిస్థితి చూసి భంగపడ్డారంటూ సజ్జల వ్యంగ్యాస్త్రాలు విసిరారు. ప్రజల్లో ఎలాంటి స్పందన కనిపించకపోవడంతో చర్మవ్యాధులే ప్రాణాంతకమైనట్టు చూపుతూ చంద్రబాబుకు ఆరోగ్యం క్షీణిస్తోందంటూ టీడీపీ సానుభూతి డ్రామాలకు తెరతీసిందన్నారు. చంద్రబాబు ఆరోగ్యం, భద్రతపై ఆయన కుటుంబ సభ్యులు రోజుకో అబద్ధం చెబుతూ జైలు అధికారులు, ప్రభుత్వంపై బురదజల్లే ప్రయత్నం చేశారని గుర్తు చేశారు. చెప్పుకోవడానికి కూడా న్యూసెన్స్‌గా అనిపించే చర్మ వ్యాధులు చంద్రబాబుకు ఉన్నాయనే అంశాన్ని ఆయన కుటుంబ సభ్యులే ప్రపంచానికి చెప్పి.. ఏసీ కావాలని కోర్టును అడిగారని దెప్పిపొడిచారు. జైలులో చంద్రబాబు ఉండే బ్యారక్‌లో ఏసీ ఏర్పాటుకు కోర్టు అనుమతి ఇవ్వడంతో ఆయనను బయటకు తెచ్చుకోవడానికి అడ్డదారుల్లో ఆలోచన చేశారని మండిపడ్డారు. రోగాల్ని చూపి సానుభూతి డ్రామాలాడి మొత్తానికి చంద్రబాబుకు తాత్కాలిక బెయిల్ తెచ్చుకున్నారు కనుక.. ఇప్పటికైనా తాము నాటకాలు ఆడామని ప్రజల ముందు ఒప్పుకోవాలని చంద్రబాబు కుటుంబ సభ్యులు, టీడీపీ నేతలను సజ్జల డిమాండ్ చేశారు. నిర్దోషిగా బయటకొచ్చారా.. నిజం గెలిచిందనడానికి స్కిల్ స్కాం కేసులో చంద్రబాబుకు బెయిల్ ఇవ్వాలని దాఖలు చేసిన పిటిషన్‌పై ఆయన న్యాయవాదులు వాదనలు వినిపించకుండా కంటి చికిత్సను సాకుగా చూపి తాత్కాలిక బెయిల్‌పై వాదనలు వినిపించారని సజ్జల గుర్తు చేశారు. కంటి చికిత్స కోసమే.. మానవీయ కోణంలో షరతులతో కూడిన బెయిల్ ఇస్తే నిజం గెలిచిందంటూ చంద్రబాబు కుటుంబ సభ్యులు, టీడీపీ నేతలు సంబరాలు జరుపుకోవడం వెనుక అర్థమేమిటని ప్రశి్నంచారు. చంద్రబాబు నిర్దోíÙగా బయటకొస్తున్నారా నిజం గెలిచిందనడానికి అని నిలదీశారు. ఇలా చెప్పుకోవడానికి టీడీపీ నేతలకు సిగ్గు అనిపించడం లేదా అని చురకలంటించారు. ‘చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉండి సీమెన్స్ సంస్థతో చేసుకున్నది ఫేక్ అగ్రిమెంటా? కాదా?, చేసుకున్న ఒప్పందం ప్రకారం 90 శాతం అంటే రూ.3,000 కోట్లు సీమెన్స్ సంస్థ పెట్టుబడి పెట్టకుండానే.. 10 శాతం మొత్తం అంటే, 370 కోట్లు ముఖ్యమంత్రిగా చంద్రబాబు రిలీజ్ చేశాడా? లేదా?, సీమెన్స్ సంస్థ ప్రభుత్వం నుంచి మాకెటువంటి సొమ్ము అందలేదని చెప్పిందా? లేదా?, చంద్రబాబు తన సొంత మనుషుల్ని బయటినుంచి తెచ్చుకుని స్కిల్ స్కామ్‌కు పాత్రధారులుగా పెట్టుకున్నాడా? లేదా?, 13 చోట్ల చంద్రబాబు సంతకాలు ఉన్నాయా? లేవా?, చంద్రబాబు రిలీజ్ చేయమంటేనే.. ఖజానా నుంచి ఫండ్స్ రిలీజ్ చేస్తున్నామని ఫైనాన్స్ డిపార్ట్మెంట్ అధికారులు నోట్ ఫైల్స్ రాశారా? లేదా? ప్రభుత్వం రిలీజ్ చేసిన ఫండ్స్‌లో రూ.240 కోట్లు షెల్ కంపెనీలకు వెళ్లాయని కేంద్ర జీఎస్టీ విజిలెన్స్ సంస్థ బయటపెట్టిందా? లేదా?, షెల్ కంపెనీలకు వెళ్లిన ఫండ్స్ క్యాష్ రూపంలో తిరిగి చంద్రబాబు పీఏ పెండ్యాల శ్రీనివాస్ ద్వారా చేరాయని ఐటీ దాడుల్లో రుజువైందా? లేదా?, ఈ విషయం పూర్తి నిర్థారణ కోసం పెండ్యాల శ్రీనివాస్‌ను పట్టుకుంటే అసలు వాస్తవాలు తెలుస్తాయనడం నిజమా? కాదా?, పెండ్యాల శ్రీనివాస్ కోసం సీఐడీ నోటీసులు జారీ చేస్తే.. ఆయన్ను అమెరికాకు పంపడం ద్వారా తప్పు చేసినట్టుగా చంద్రబాబు అంగీకరించారా? లేదా?’ అంటూ టీడీపీ నేతలపై ప్రశ్నల వర్షం కురిపించారు. అందరూ నీ తండ్రిలా ఉంటారు అనుకుంటే ఎలా లోకేశ్! చంద్రబాబు రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్నన్ని రోజులూ ఆయన కుటుంబ సభ్యులు, టీడీపీ నేతలు చేసిన విషప్రచారం అంతాఇంతా కాదని సజ్జల గుర్తు చేశారు. సీఎం వైఎస్ జగన్ వ్యవస్థల్ని మేనేజ్ చేస్తున్నారంటూ లోకేశ్ చౌకబారు మాటలు మాట్లాడారన్నారు. ‘అందరూ నీ తండ్రిలా ఉంటారనుకుంటే ఎలా’ అని లోకేశ్‌పై మండిపడ్డారు. ఆదినుంచీ వ్యవస్థల్ని మేనేజ్ చేయడానికి విష సర్పాలను పెంచి పోషించిందే చంద్రబాబు అని మండిపడ్డారు. నిజంగా సీఎం వైఎస్ జగన్ వ్యవస్థల్ని మేనేజ్ చేసి ఉంటే 52 రోజుల తర్వాత చంద్రబాబు జైలు నుంచి ఎలా బయటకొస్తాడని ప్రశ్నించారు. ఇదీ చదవండి: స్కిల్ స్కాం కేసులో చంద్రబాబుకి మధ్యంతర బెయిల్ మంజూరు -
జైలులో రావణ దహనం.. నలుగురు అధికారులు సస్పెండ్!
విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన గోవాలోని కోల్వాలే సెంట్రల్ జైలుకు చెందిన నలుగురు అధికారులను సస్పెండ్ చేశారు. జైలు ఖైదీలు రావణుని దిష్టిబొమ్మను దహనం చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఈ నేపధ్యంలో అసిస్టెంట్ సూపరింటెండెంట్ చంద్రకాంత్ హరిజన్, జైలర్లు మహేష్ ఫడ్తే, అనిల్ గాంకర్, అసిస్టెంట్ జైలర్ రామ్‌నాథ్ గౌడ్లను సస్పెండ్ చేస్తూ, జైలు ఇన్స్పెక్టర్ జనరల్ ఓంవీర్ సింగ్ ఉత్తర్వులు జారీ చేశారు. దసరా సందర్భంగా ఖైదీలు టపాకులు కాల్చి, రావణుని బొమ్మను దహనం చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో, ఇందుకు బాధ్యులైన అధికారులపై చర్యలు తీసుకున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ముందస్తు అనుమతి తీసుకోకుండానే ఖైదీలు దిష్టిబొమ్మను ఎలా దహనం చేశారనే దానిపై జైలు అధికారులు సమాధానం చెప్పాల్సి ఉంటుందని వారి సస్పెన్షన్ ఉత్తర్వుల్లో పేర్కొన్నట్లు ఓ అధికారి తెలిపారు. జైలు ఆవరణలో మొబైల్ ఫోన్లు తీసుకెళ్లేందుకు ఎలా అనుమతి ఇచ్చారనే దానిపై కూడా విచారణ జరగనుంది. ఈ ఘటన జైలు భద్రతపై అనుమానాలను లేవదీస్తుందని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఈ సంఘటనకు జైలు అధికారులను ప్రాథమికంగా బాధ్యులుగా పరిగణించారని, అందుకే వారిని సస్పెండ్ చేశారని ఒక పోలీసుల అధికారి తెలిపారు. ఇది కూడా చదవండి: భారత్‌లో ఇరాన్ జంట కష్టాలు.. ఆదుకున్న ఎస్పీ నేత! -
చంద్రబాబుకు జైల్లో పూర్తి భద్రత
కంబాలచెరువు(రాజమహేంద్రవరం): చంద్రబాబుకు సెంట్రల్ జైల్లో పూర్తి భద్రత ఉందని, దీనిపై అవాస్తవ వార్తలను నమ్మొద్దని జైళ్ల శాఖ డీఐజీ రవికిరణ్, ఎస్పీ జగదీష్ స్పష్టం చేశారు. చంద్రబాబు ఆరోగ్యం, ఆయనను చంపేస్తామంటూ మావోల పేరుతో వచ్చిన లేఖ, జైల్లో పెన్ కెమెరాలు ఉన్నాయంటూ వస్తున్న వార్తలపై సెంట్రల్ జైల్లో శుక్రవారం రాత్రి వారు మీడియాతో మాట్లాడారు. చంద్రబాబు సెక్యూరిటీపై ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉన్నామని, 24 గంటలూ సెక్యూరిటీతో పాటు అడిషనల్ సీసీ కెమెరాల ద్వారా మానిటరింగ్ చేస్తున్నామన్నారు. ఈ నెల 19న చంద్రబాబు రిమాండ్ నేపథ్యంలో ఆయనను బ్లూ జీన్ యాప్ ద్వారా న్యాయమూర్తి ఎదుట ప్రవేశపెట్టామని, అందులో చంద్రబాబు కొన్ని విషయాలను న్యాయమూర్తికి తెలిపారని, వాటిని లెటర్ రూపంలో తిరిగి ఆయన ఇస్తే దానిని తాము కోర్టుకు పంపామన్నారు. జైలు చుట్టూ ఐదు వాచ్‌టవర్స్ ఉన్నాయని, గంటకోసారి గార్డ్ సెర్చ్ జరుగుతోందని చెప్పారు. జైలు వాటర్ ట్యాంక్ వైపు డ్రోన్ తిరిగినట్టు నార్త్ ఈస్ట్ వాచ్‌టవర్ గార్డు నుంచి సమాచారం వచ్చిందని, అయితే ఆ డ్రోన్ క్లోజ్డ్ జైలు వైపు రాలేదని, దీనిపై సమీప పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశామని, విచారణ జరుగుతోందన్నారు. మావోల పేరుతో వచ్చిన లేఖ నకిలీది.. చంద్రబాబును చంపేస్తామంటూ మావోల పేరుతో వచ్చిన లేఖ నకిలీదిగా గుర్తించినట్టు తెలిపారు. జైలు నుంచి చంద్రబాబు రాశారంటూ బయటకొచ్చిన లెటర్‌కు జైలు ముద్ర, సూపరింటెండెంట్ సంతకం లేదన్నారు. చంద్రబాబు ప్రింటెడ్ సంతకాన్ని తీసి దానిపై వేసి వైరల్ చేస్తున్నారని తెలిపారు. అలాగే జైల్లోకి వచ్చే ప్రతి ఖైదీని పూర్తిగా తనిఖీ చేశాకే లోపలికి అనుమతిస్తామన్నారు. శ్రీనివాస్ అనే ఖైదీ రిమాండ్‌కు వచ్చినప్పుడు అతని వద్ద ఒక బటన్ కెమెరా ఉన్నట్టు గుర్తించామన్నారు. జైలు లోపలికి అనుమతించే ముందు అతని దుస్తులు తనిఖీ చేస్తుంటే అది లభించిందని తెలిపారు. అందులో ఎలాంటి జైలు ఫుటేజీ లేదని, ఆ కెమెరాను స్వాదీనం చేసుకుని.. పోలీసులకు అప్పగించామని, ఆ కెమెరాను ఎందుకు తెచ్చారనే విషయంపై దర్యాప్తు జరుగుతోందన్నారు. చంద్రబాబు వచ్చిన దగ్గర నుంచి ఇప్పటివరకు గంజాయి ప్యాకెట్లు జైల్లోకి విసిరారన్నది పూర్తి అవాస్తవమన్నారు. చంద్రబాబు కుడికంటి కేటరాక్ట్ ఆపరేషన్‌కు సంబంధించి రాజమండ్రి జీజీహెచ్ వైద్యులు పరీక్షలు చేశారని, కొంతకాలం తర్వాత అయినా ఆపరేషన్ చేయించుకోవచ్చని తెలిపారని వివరించారు. ఆయన ఆరోగ్యంపై తప్పుడు రిపోర్టులు విడుదల చేయడంలేదని, వాటిని ఎప్పటికప్పుడు కోర్టుకు నివేదిస్తున్నట్టు తెలిపారు. జైల్లో చంద్రబాబును తాము కలవాలన్నా ఏడుగురు అధికారులు కలిస్తేనే.. అది సాధ్యమన్నారు. చంద్రబాబు తనకున్న ఎలర్జీలపై గతంలో ప్రభుత్వ వైద్యులకు చెప్పారని, దీనికి సంబంధించి వారి కుటుంబ సభ్యులకు రెండు లెటర్లు కూడా రాశామన్నారు. చంద్రబాబు ఆరోగ్యానికి సంబంధించి వ్యక్తిగత వైద్యుడిని సంప్రదించి ఎలాంటి చికిత్స అవసరమో తెలపాలని ఆయన భార్య భువనేశ్వరికి, ఇదే విషయాన్ని కోర్టుకూ తెలియజేసినట్టు తెలిపారు. రాజమండ్రి సెంట్రల్ జైలు బయట సైతం 24 గంటలూ డీఎస్పీ స్థాయి అధికారి నేతృత్వంలో పకడ్బందీగా గస్తీ ఏర్పాటు చేసినట్టు రవికిరణ్, జగదీ‹Ù వివరించారు. -
తెలంగాణ పాలపిట్ట కేసీఆర్
సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి డీఎన్ఏ ఏంటో రాహుల్‌గాంధీ తెలుసుకోవాలని ఆర్థిక, వైద్యారోగ్యశాఖల మంత్రి టి.హరీశ్‌రావు ఎద్దేవా చేశారు. రాహుల్, రేవంత్ డీఎన్ఏలు మ్యాచ్ కావడం లేదన్నారు. బీజేపీపై పోరాడే డీఎన్ఏ తనదని చెప్పుకున్న రాహుల్.. రేవంత్ డీఎన్ఏ తెలుసుకోవాలని చెప్పారు. గతంలో సోనియాగాంధీని బలిదేవత.. ఇటలీబొమ్మ అంటూ నోరు పారేసుకుని.. ఇప్పుడు సోనియాను దేవత అంటున్న రేవంత్ నోటికి మొక్కాలన్నారు. హరీశ్‌రావు మంగళవారం సంగారెడ్డి, నారాయణఖేడ్లలో పర్యటించారు. 30న నారాయణఖేడ్‌లో జరగనున్న ముఖ్యమంత్రి కేసీఆర్ బహిరంగసభ ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా వేర్వేరు ప్రాంతాల్లో హరీశ్‌రావు మాట్లాడారు. టీడీపీలో ఉన్నప్పుడు అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వంలో కరెంట్ సరిగ్గా ఇవ్వలేదని అసెంబ్లీలో వ్యాఖ్యానించిన రేవంత్‌రెడ్డి.. ఏ ఎండకు ఆ గొడుగు పట్టే రకమని మండిపడ్డారు. కుర్చీల కోసం పార్టీలు మారే వ్యక్తి అని దుయ్యబట్టారు. బీఆర్ఎస్ ఎవ్వరికీ బీ టీమ్ కాదన్న హరీశ్.. తాము తెలంగాణ ప్రజల టీమ్ అని స్పష్టం చేశారు. బీజేపీ, బీఆర్ఎస్ ఎప్పటికీ ఒక్కటి కాదంటూ.. నీళ్లు, నూనె కలుస్తాయా అని ప్రశ్నించారు. కేసీఆర్ తలుచుకుంటే రేవంత్ రెడ్డిని ఓటుకు నోటు కేసులో జైల్లో వేసే వారన్నారు. కాంగ్రెస్ నేతలపై నాడు ఓటుకు నోటు కేసు ఉండగా.. నేడు నోటుకు సీటు అమ్ముకుంటున్నారని ధ్వజమెత్తారు. బీజేపీని ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరని హరీశ్ విమర్శించారు. కిషన్‌రెడ్డి వెన్నుచూపి పారిపోయారు పాలపిట్టను శుభప్రదంగా భావిస్తామని, తెలంగాణ పాలపిట్ట కేసీఆర్ రాష్ట్రానికి హ్యాట్రిక్ సీఎంగా ఉండటం కూడా అంతే శుభమని హరీశ్‌రావు వ్యాఖ్యానించారు. తెలంగాణ ఉద్య మకారులను తుపాకీతో బెదిరించిన రేవంత్‌రెడ్డి వంటి ద్రోహులు ఒకవైపు., రాష్ట్రం కోసం పద వులను త్యాగం చేసి, ప్రాణత్యాగానికి సైతం సిద్ధమైన కేసీఆర్ మరోవైపు ఉన్నార న్నారు. తెలంగాణ కోసం పదవికి రాజీనామా చేయా లని డిమాండ్ వస్తే వెన్ను చూపి పారిపోయిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి తెలంగాణకు ఏం మంచి చేస్తారని ప్రశ్నించారు. -
సమాజ్ వాదీ నేత ఆజాం ఖాన్‌కు ఏడేళ్ల జైలు శిక్ష
లక్నో: సమాజ్‌వాదీ పార్టీ నాయకుడు ఆజాం ఖాన్, ఆయన భార్య తజీన్ ఫాతిమా, కుమారుడు అబ్దుల్లా ఆజాంలకు యూపీలోని రాంపూర్ కోర్టు ఏడేళ్ల జైలు శిక్షను విధించింది. 2019 నాటి నకిలీ జనన ధృవీకరణ పత్రాల కేసులో ఈ ముగ్గుర్ని దోషులుగా నిర్ధారించింది. ఎంపీ-ఎమ్మెల్యే కోర్టు న్యాయమూర్తి షోబిత్ బన్సల్ ముగ్గురు దోషులకు గరిష్టంగా ఏడేళ్ల జైలు విధిస్తూ శిక్షను ఖరారు చేశారు. నకిలీ ధ్రువపత్రాలపై బిజెపి ఎమ్మెల్యే ఆకాష్ సక్సేనా రాంపూర్‌లోని గంజ్ పోలీస్ స్టేషన్లో జనవరి 3, 2019న పోలీసులకు ఫిర్యాదు చేయగా.. ఎఫ్ఐఆర్ నమోదైంది. వారి కుమారుడు అబ్దుల్లా ఆజాంకు రెండు నకిలీ పుట్టిన తేదీ సర్టిఫికేట్లు పొందేందుకు ఆజాం ఖాన్, ఆయన భార్య తజీన్ ఫాతిమా సహాయం చేశారని సక్సేనా ఫిర్యాదులో పేర్కొన్నారు. ఒక సర్టిఫికెట్ లక్నో నుంచి కాగా మరొకటి రాంపూర్ నుంచి పొందినట్లు ఫిర్యాదులో స్పష్టం చేశారు. "కోర్టు తీర్పు తర్వాత, ముగ్గురిని జ్యుడీషియల్ కస్టడీలోకి తీసుకున్నారు. కోర్టు నుండే దోషులను జైలుకు తరలించారు" అని ప్రాసిక్యూషన్ తరపున వాదిస్తున్న మాజీ జిల్లా ప్రభుత్వ న్యాయవాది అరుణ్ ప్రకాష్ సక్సేనా అన్నారు. ఛార్టిషీటు ప్రకారం అబ్దుల్లా ఆజాం జనవరి 1,1993న జన్మించినట్లు రాంపూర్ మున్సిపాలిటీ నుంచి ఒక ధ్రువపత్రాన్ని పొందగా.. మరొకటి సెప్టెంబర్ 30, 1990న జన్మించినట్లు లక్నో నుంచి పొందారు. నాలుగేళ్లపాటు విచారణ తర్వాత న్యాయస్థానం ఈ మేరకు శిక్షను ఖరారు చేసింది. ఇదీ చదవండి: దేశవ్యాప్తంగా 16 మంది హైకోర్టు జడ్జిల బదిలీ -
బాబు, రవళి @ ఐదు కిలోల కష్టం
-
ఎన్నాళ్లీ తెలుగుదేశం పార్టీ నాటకాలు: విజయసాయి రెడ్డి
ఢిల్లీ: చంద్రబాబుకు ఇంటి భోజనం అందుతోందని వైయస్సార్ కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి అన్నారు. జైలులో ప్రత్యేక గది కేటాయించారని తెలిపారు. ప్రతిరోజు మూడుసార్లు ముగ్గురు డాక్టర్లు చెక్ అప్ చేస్తున్నారని వెల్లడించారు. 8 మంది పోలీసులు కాపలాగా ఉంటున్నారని స్పష్టం చేశారు. నేరాలకు తగిన శిక్ష అనుభవించేందుకు చంద్రబాబు పూర్తి ఆరోగ్యంతో ఉన్నారని ట్వీట్ చేశారు. నెలరోజులు జైలులో ఉండేసరికి పూర్తి విశ్రాంతితో చంద్రబాబు గారు కిలో బరువు పెరిగారు. ఇతరత్రా ఆరోగ్య సమస్యలు కూడా పోయాయని సంతోషంగా ఉన్నారని జైలు అధికారులే చెప్పారు. స్కామ్స్ లో బెయిల్ రాకపోయేసరికి అలజడి సృష్టించేందుకు దుష్ప్రచారం చేస్తున్నట్లు రుజువైంది. ఎన్నాళ్ళీ తెలుగు డ్రామాల… pic.twitter.com/FvpkwM5kEE — Vijayasai Reddy V (@VSReddy_MP) October 14, 2023 'నెలరోజులు జైలులో ఉండేసరికి పూర్తి విశ్రాంతితో చంద్రబాబు గారు కిలో బరువు పెరిగారు. ఇతరత్రా ఆరోగ్య సమస్యలు కూడా దూరమై సంతోషంగా ఉన్నారని జైలు అధికారులే చెప్పారు. స్కామ్స్ లో బెయిల్ రాకపోయేసరికి అలజడి సృష్టించేందుకు దుష్ప్రచారం చేస్తున్నట్లు రుజువైంది. ఎన్నాళ్లీ తెలుగుదేశం పార్టీ డ్రామాలు' అంటూ విజయసాయి రెడ్డి దుయ్యబట్టారు. ఇదీ చదవండి: మరి ఇంత నీచంగా డ్రామాలు ఆడతారా? Follow the Sakshi TV channel on WhatsApp: -
'అందుకే జైలులో నాగిని డ్యాన్స్ చేశా'.. సుశాంత్ ప్రియురాలు!
ఎంఎస్ ధోని మూవీ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య బాలీవుడ్లో సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ విషాదం ఆయన అభిమానుల్లో తీవ్రంగా కలిచివేసింది. 2020లో ముంబైలోని బాంద్రా నివాసంలో సుశాంత్ సూసైడ్ తర్వాత అతని ప్రియురాలు రియా చక్రవర్తిపై ఆరోపణలు రావడంతో ఎన్సీబీ అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఈ కేసులో ఆమె సోదరుడు షోక్ చక్రవర్తి కూడా నిందితుడిగా ఉన్నారు. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన రియా.. తన జైలు జీవితం గురించి ఆసక్తికర కామెంట్స్ చేసింది. జైలులో ఉన్న ఇతర మహిళలను చూసి తాను చాలా నేర్చుకున్నానని చెప్పింది. ఈ కేసులో నేను కేవలం నిందితురాలినే తప్ప.. దోషిని కాదని రియా స్పష్టం చేశారు. బెయిల్ వచ్చిన తర్వాత అక్కడున్న జైలులో మహిళలతో కలిసి నాగిన్ డ్యాన్స్ చేసిన విషయాన్ని ఆమె గుర్తు చేసుకున్నారు. తనకు బెయిల్ వచ్చిన రోజు తన సోదరుడికి బెయిల్ రాలేదని.. ఆరోజు తాను చాలా బాధపడ్డానని తెలిపారు. అయితే తనకు బెయిల్ వచ్చిన రోజు డ్యాన్స్ చేస్తానని నా తోటి మహిళా ఖైదీలకు మాట ఇచ్చానని.. అందుకే అలా చేశానని తెలిపింది రియా. వారిని నేను మళ్లీ చూడలేను కాబట్టే.. వారితో ఐదు నిమిషాల పాటు డ్యాన్స్ చేసి ఆనందాన్ని ఇవ్వగలిగానని చెప్పుకొచ్చింది. ఇది నా జీవితంలో అత్యంత ఆనందకరమైన క్షణమని వెల్లడించింది. మహిళలతో కలిసి డ్యాన్స్ చేస్తున్నప్పుడు వారి కళ్లలో కనిపించిన ఉత్సాహం, ఆనందం, సంతోషం బహుశా ఇప్పటి వరకు తన జీవితంలో ఎప్పుడు చూడలేదని రియా అన్నారు. ఈ కేసులో రియా దాదాపు ఆరు వారాల పాటు బైకుల్లా జైలులో రిమాండ్‌లో ఉన్నారు. కాగా.. రియా ప్రస్తుతం ఎంటీవీ రోడీస్: కర్మ యా కాంద్లో కనిపించనుంది. ఇందులో ఆమె గ్యాంగ్ లీడర్ పాత్ర పోషిస్తోంది. -
200 ఏళ్లనాటి జైలు ఎందుకు మూతపడింది? 800 మంది ఖైదీలు ఏం చేశారు?
మనకు తెలిసినవారు ఎవరైనా జైలుకు వెళ్లారనే వార్త వినిపిస్తే, ముందుగా మన రోమాలు నిక్కబొడుచుకుంటాయి. ప్రపంచంలో 200 సంవత్సరాల క్రితం నిర్మితమైన జైలు గురించి ఇప్పుడు తెలుసుకుందాం. అయితే ఇప్పుడు ఈ జైలులో దెయ్యాలు ఉన్నాయని స్థానికులు చెబుతుంటారు. ఈస్టర్న్ స్టేట్ పెనిటెన్షియరీ ప్రపంచంలోనే మొదటి జైలుగా పరిగణిస్తారు. ప్రమాదకరమైన ఖైదీల కోసం ఈ జైలును నిర్మించారు. జైళ్ల నిర్మాణానికి ఈ జైలు నమూనాగా నిలిచింది. అమెరికాలోని పెన్సిల్వేనియా రాష్ట్రంలోని ఫిలడెల్ఫియా నగరంలో ఈ జైలు నిర్మితమయ్యింది. 1829లో నిర్మించిన ఈ జైలులో 1971 వరకు కార్యకలాపాలు కొనసాగాయి. మొదట్లో ఈ జైలును 250 మంది ఖైదీల కోసం మాత్రమే నిర్మించారు. ఐదు దశాబ్దాల్లో జైలులోని సంఖ్య 1000కు పైగా పెరిగింది. ఆ తర్వాత జైల్లో ఖైదీల కష్టాలు ఎక్కువయ్యాయి. 1900లలో ఈ జైలులో టీబీ వంటి ప్రాణాంతక వ్యాధి వ్యాపించింది. దీంతో చాలా మంది ఖైదీలు చనిపోయారు. చలికాలంలో ఈ జైలులో ఉష్ణోగ్రతలు మైనస్‌కు పడిపోవడంతో చలికి ఖైదీలు వణికిపోయేవారు. ఖైదీల సంఖ్య పెరిగిన నేపధ్యంలో జైలు అధికారులను మరిన్ని సెల్‌లను నిర్మించవలసి వచ్చింది. వీటిలో కొన్ని భూగర్భంలో నిర్మితమయ్యాయి. జైలులో 1961లో జరిగిన ఒక సంఘటన సంచలనం రేకెత్తించింది. జైలులోని 800 మందికి పైగా ఖైదీలు జైలు గార్డులు తమను హింసించారని ఆరోపిస్తూ వారిపై దాడి చేశారు. ఈ జైలులో కరుడుగట్టిన నేరస్తులు కూడా ఉండేవారు. వీరిలో చికాగో గ్యాంగ్‌స్టర్ అల్ కాపోన్ పేరు కూడా వినిపిస్తుంది. కొన్ని అనివార్య పరిస్థితుల్లో ఈ జైలు 1971లో మూసివేశారు. అయితే 1994లో హిస్టరీ టూరిజం కోసం జైలు తిరిగి తెరిచారు. ఇప్పుడు ఈ జైలు ఆసక్తికర పర్యాటక ప్రదేశాలలో ఒకటిగా నిలిచింది. నేటికీ ఈ జైలు నుంచి వింత శబ్దాలు వస్తుంటాయని స్థానికులు చెబుతుంటారు. ఇది కూడా చదవండి: మూగజీవిపై ప్రేమ అంటే ఇదే..! -
Babu Case : లోకేషా.. ఈ ప్రశ్నలకు జవాబేదీ?
తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి, చంద్రబాబు తనయుడు నిన్న ఢిల్లీలో మీడియాతో మాట్లాడారు. కొన్ని ప్రకటనలు చేశారు. ఇంతకీ ఆయన చేసిన ప్రకటనలేంటీ? వాటి అంతరార్థమేంటీ? లోకేష్ : తెలుగుదేశం పార్టీ ఏనుగు లాంటిది. సిద్ధమవడానికి సమయం పడుతుంది. సందేహాలు : పార్టీని ఏనుగులా పోల్చడమేంటీ? అసలు ఏనుగు అనడంలో లోకేష్ ఉద్దేశ్యమేంటీ? ఎవరూ కదలలేకపోతున్నారనా? లేక పార్టీ బలంగా ఉందని చెప్పడమా? తెలుగుదేశం పార్టీ ఒకవేళ ఏనుగే అనుకుంటే, సిద్ధమవడానికి సమయం పడుతుందనుకొందాం. కానీ తెలుగుదేశం పార్టీ కొత్తగా వచ్చింది కాదు కదా. దాదాపు 40 ఏళ్లుగా ఉన్న ఒక పార్టీలో చంద్రబాబు అనే ఒకే ఒక వ్యక్తి అవినీతి పాలయి జైల్లోకి వెళ్లాడు. ఒక్క అరెస్ట్‌తోనే పార్టీ తలకిందులయిందన్నది లోకేష్ ఉద్దేశ్యమా? లేక పార్టీ నిద్రాణంగా ఉందన్న భావనలో ఉన్నారా? లోకేష్ : చేయని తప్పుకు శిక్షించే వ్యవస్థ ఉండకూడదన్న ఉద్దేశ్యంతో, ఆ వ్యవస్తను మార్చడానికే నేను రాజకీయాల్లోకి వచ్చాను. సందేహాలు : లోకేష్ రాజకీయాల్లోకి 2014 తర్వాత వచ్చాడు. రాజకీయాల్లోకి వచ్చాను అని చెప్పుకుంటున్న లోకేష్ ముందెక్కడ పోటీ చేయలేదు. అప్పటికే పార్టీ అధికారంలో ఉంది. తండ్రి ముఖ్యమంత్రి కావడంతో లోకేష్ నేరుగా ఎమ్మెల్సీ అయ్యాడు. దొడ్డిదారిన ఎమ్మెల్సీ పదవి తీసుకున్నాడు. పార్టీ చెప్పుచేతల్లో ఉంది కాబట్టి జాతీయ కార్యదర్శి పదవి తీసుకున్నాడు. అధికారం తమదే కాబట్టి క్యాబినెట్ మినిస్టర్ అయ్యాడు. అంతే తప్ప.. ఎక్కడ ఎన్నికల్లో పోటీ చేసి పదవులు సాధించుకోలేదు. తెలుగు రాజకీయాలను భ్రష్టు పట్టించి ఓటుకు కోట్లు కెమెరాల సాక్షిగా ఇస్తూ అడ్డంగా దొరికి, లంచం ఇవ్వడం తప్పు కాదని వాదించే మీలాంటి నాయకులు ఉండడం వల్లే రాజకీయాల్లోకి కొత్తగా ఎవరూ రావడం లేదు. ఇంకొక ముఖ్యమైన విషయం గమనించాల్సింది ఏంటంటే.., లోకేష్ రాజకీయాల్లోకి వచ్చేసమయంలో లోకేష్ గానీ, లోకేష్ తండ్రి చంద్రబాబు గానీ జైల్లో లేరు. నిజానికి ఆ సమయంలో చేయని తప్పుకు కేసులు పెట్టి జైలుకు పంపింది వైఎస్ జగన్మోహన్ రెడ్డిని. కాంగ్రెస్ కక్ష కడితే, దానికి చంద్రబాబు నేతృత్వంలోని తెలుగుదేశం వంత పాడి కేసుల్లో ఇంప్లీడ్ అయి తప్పుడు అభియోగాలు బనాయించి వైఎస్ జగన్మోహన్రెడ్డిని అక్రమంగా జైలుకు పంపించారు. ఈ కేసులు తప్పని ప్రజలు అర్థం చేసుకున్నారు కాబట్టే.. 2014లో 67 స్థానాలు, 2019లో 151 స్థానాలు కట్టబెట్టారు. అంటే లోకేష్ చెప్పే అరెస్ట్ ఇదేనా.? తాము అక్రమంగా అరెస్ట్ చేసి పంపామన్న అపరాధన భావనలో ఉన్నాడా? లోకేష్ : మేం ఎనిమిదేళ్లుగా ఆస్తులు ప్రకటిస్తున్నాం. మాకు హైదరాబాద్/సైబరాబాద్‌లో ఎకరం జాగా లేదు. అసలు నిజాలు : లోకేష్, చంద్రబాబు ఆస్తుల వెల్లడి అన్న కార్యక్రమం ఎంత కామెడీనో తెలుగు ప్రజలందరికీ తెలుసు. హైదరాబాద్‌లోని అత్యంత ఖరీదైన జూబ్లీహిల్స్‌లో కట్టిన రాజసౌధం విలువ లక్షల్లోచూపిస్తావు. ఏంటంటే.. కొన్నప్పుడు అంతే ఉందంటావు. ఇక అసలు మాకు ఒక్క గజం భూమి ఉన్నా.. ఇచ్చేస్తానంటావు. మరి మదీనాగూడలో 14 ఎకరాల్లో ఉన్న ఫాంహౌజ్ సంగతేంటీ? అంత ఖరీదైన లోకేషన్లో అంత భూమి ఎలా వచ్చింది? ఖరీదైన స్థలాలన్నీ మీ నానమ్మ నీ ఒక్కరికే ఎందుకు గిఫ్ట్‌గా ఇచ్చింది? ఇందులో క్విడ్ ప్రో కోల గురించి ఎప్పుడైనా వివరణలిస్తావా? దీని గురించి వేసిన కేసుల్లో విచారణ జరగకుండా స్టేలు ఎందుకు తెచ్చుకున్నారు? మీకు, మీ కొడుకు దేవాన్ష్ కు ఇచ్చిన బహుమతులు అమ్మణ్ణమ్మ, బాలకృష్ణ ఐటీ రిటర్నులు, ఎన్నికల అఫిడవిట్లలో ఎందుకు లేవు? లోకేష్ : మా నాన్న చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉండడం వల్ల మా సంస్థ హెరిటేజ్ నిదానంగా ఎదిగింది. లేదంటే సంస్థ విలువ ఇప్పటికీ మూడు రెట్లు పెరిగేది. అసలు నిజాలు : హెరిటేజ్ విలువ ఎంత? ఆ సంస్థ అంచలంచెలుగా ఎలా ఎదిగింది అన్నది చిత్తూరు నుంచి విజయనగరం వరకు ఎవరిని అడిగినా చెబుతారు. పదవిని అడ్డు పెట్టుకుని హెరిటేజ్ కోసం చిత్తూరు డెయిరీని దివాళా తీయించినప్పుడే వ్యవస్థలను ముంచే మీ ప్రతిభ అర్థం చేసుకోవాలి. అయినా హెరిటేజ్ అసలు లెక్కలు ఎప్పుడయినా బయటపెట్టారా? ఇందులో మీ కుటుంబ సభ్యులు కాకుండా ఇంకెవరయినా కీలక స్థానాల్లో ఉన్నారా? ఈ మధ్యే మీ అమ్మ భువనేశ్వరీ ఏం చెప్పారు? మా సంస్థ హెరిటేజ్‌లో 2% షేర్లు అమ్మినా మాకు రూ.400 కోట్లు వస్తాయన్నారు. అంటే ఈ లెక్క ప్రకారం మీ సంస్థ విలువ రూ.20వేల కోట్లు. కేవలం పాలు, డెయిరీ ప్రొడక్ట్‌లు, సూపర్ మార్కెట్ల ద్వారా రూ.20వేల కోట్ల సామ్రాజ్యాన్ని నెలకొల్పిన మానవ మాత్రుడు ఎవరయినా ప్రపంచంలో ఉంటారా? మీరు తప్ప. ఇందులో అక్రమ సంపాదన ఎంత? వ్యవస్థలను ముంచిందెంత? మీ సంస్థ బాగు కోసం ఎవరెవరిని తొక్కేశారు. కొంచెం లెక్కలు వివరంగా చెబితే అందరూ నోళ్లు వెల్లబెట్టి వింటారు. లోకేష్ : రాజకీయాల్లోకి బ్రాహ్మణి రావడం ఆమె ఇష్టం. మేం మా దారులు ఎంచుకొన్నాం. అసలు నిజమేంటీ : పార్టీ లోడు నువ్వెత్తడం లేదని విషయం స్పష్టమయిన తర్వాతే మీ నాన్న చంద్రబాబు పవన్ కళ్యాణ్‌ను ఎంచుకున్నారని తెలుగుదేశంలో ప్రచారం జరుగుతోంది. ఇప్పుడు గత మూడు వారాలుగా మీకు సంబంధించిన ఎల్లో మీడియాలోనే బ్రాహ్మణి పేరు విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. బ్రాహ్మణి రావాలి, పాదయాత్ర చేయాలి, పార్టీని నడిపించాలని ప్రచారం చేస్తున్నారు. అంటే దానర్థమేంటన్నది మీ స్టాన్ఫోర్డ్ బ్రెయిన్‌కు అర్థం కానంత గొప్పదేం ఉండదు. మీరు తారా స్థాయిలో రాజకీయాలు నడిపితే బ్రాహ్మణి పేరు ముందుకు ఎందుకు వస్తుంది? హెరిటేజ్ సంస్థను విడిచిపెట్టి బ్రాహ్మణి రాజకీయాల్లోకి రావాలి అని పచ్చమీడియా పిచ్చిగా ప్రచారం చేస్తోందంటే ఇంతకు మించిన అర్థం ఇంకేముంటుంది? (Courtesy : Nidhi) లోకేష్ : స్కిల్ డెవలప్మెంట్, రింగ్‌రోడ్డు అక్రమ అలైన్మెంట్, ఫైబర్ గ్రిడ్.. ఈ మూడు ప్రాజెక్టులు నా మంత్రిత్వ పరిధిలోనివి కావు, కాబట్టి వాటికి నేను బాధ్యుడిని కాదు సందేహాలేంటీ : మొన్నటి వరకు ఏం వాదించారు.? బ్యాంకు మేనేజర్ తప్పు చేస్తే బ్యాంకు ఓనర్‌ను అరెస్ట్ చేస్తారా? అని ఎదురు ప్రశ్నించారు. అంటే అర్థమేంటీ? తప్పు జరిగింది కానీ మాది బాధ్యత కాదంటున్నావు. ఇక ఈ మూడు ప్రాజెక్టులకు సంబంధించిన శాఖలకు కూడా నేను మంత్రిగా పని చేయలేదంటున్నావు. అంటే అర్థమేంటీ? కుంభకోణం జరిగింది కానీ నా ప్రమేయం ప్రత్యక్షంగా లేదని అర్థమా? స్కిల్ డెవలప్మెంట్ మీ నాన్న శాఖలోనిది అయితే మీ ప్రమేయం అంతగా ఎందుకుంది? ఫైబర్ గ్రిడ్‌కు మీకు సంబంధం లేకుంటే.. మీవైపే అన్ని ఆధారాలు ఎందుకు చూపిస్తున్నాయి? మీ సంస్థ భూములు రింగ్‌రోడ్డు చుట్టే భూములు కొనాలని మీకు కలలో ఐడియా వచ్చిందా? పైగా మీ బెయిల్ పిటిషన్లో మీ అడ్వొకేట్ దమ్మాలపాటి శ్రీనివాస్ ఏం వాదించారు? కరకట్టపై ఉన్న లింగమనేని గెస్ట్ హౌజ్‌లో తండ్రి చంద్రబాబుతో కలిసి ఉన్నందుకు నాపై కేసు ఎలా పెడతారని కోర్టు ముందు వాదించారు. అంటే మునగాల్సి వస్తే తండ్రిని కూడా వదిలేస్తారా? ఇవేనా మీరు నేర్చుకున్న కుటుంబ విలువలు? అసలు నోటీసులు రాకముందే ఢిల్లీకి ఎందుకు వెళ్లిపోయారు? సుప్రీంకోర్టు లాయర్లతో మాట్లాడాల్సిన మంతనాలకు ఇన్ని రోజులు పడుతుందా? అయినా న్యాయశాస్త్రంలో మీరేమీ డాక్టరేట్ చేయలేదు కదా.. మీకున్న ప్రతిభకు సాల్వే, లూథ్రా లాంటి సీనియర్ లాయర్లకు ఏం సూచనలు చేస్తారు? రాజమండ్రిలో కుటుంబాన్ని వదిలేసి ఢిల్లీ హోటళ్లలో ఉంటూ వీడియో కాన్ఫరెన్స్‌లు పెట్టేకంటే.. పాదయాత్ర ద్వారా ప్రజల్లో ఉండడం మిమ్మల్ని నాయకుడిగా నిలిపేది కదా. పైగా నన్ను అరెస్ట్ చేసే అవకాశముంది కాబట్టి ఏపీ నుంచి ఢిల్లీ వచ్చానని నిజాయతీగా చెబితే సగటు తెలుగు ప్రజలకు కనీసం సానుభూతి అయినా వచ్చేది కదా. ఇంత చిన్న పాయింట్ ఎలా మిస్సయ్యారు? -
టీడీపీని, చంద్రబాబును పవన్ ఎన్నోసార్లు తిట్టాడు
-
22 ఏళ్లుగా ఖైదీ.. విడుదల రోజే పరారీ!
ఒక నేరస్తుడు విడుదలకు కొద్దిసేపటి ముందు పరారైన ఉదంతం ఆసక్తికరంగా మారింది. నేరం, అరెస్టు, జైలు.. ఇదే దశాబ్దాలుగా నేరస్తులకు ఎదురవుతున్న క్రమం. అయితే కాలం గడిచేకొద్దీ దీనిలో మార్పులు చోటుచేసుకున్నాయి. పలు కోర్టులు నేరస్తులను నిర్ణీత కాలం తర్వాత విడుదల చేస్తున్నాయి. తద్వారా వారు వారికి నచ్చినట్టు మిగిలిన జీవితాన్ని గడిపే అవకాశం కలుగుతుంది. అయితే ఒక నేరస్తుడు విడుదల కావడానికి కొన్ని గంటల ముందు పరారీ అయితే.. ఏం జరుగుతున్నదనేది ఊహించడం కష్టం. రష్యాలోని ఇర్కుట్స్క్ సమీపంలో ఉన్న మార్కోవా జైలులో ఇటువంటి ఉదంతమే చోటుచేసుకుంది. కమోల్జోన్ కలోనోవ్ అనే ఖైదీ విడుదల కావాల్సిన రోజే జైలు నుండి తప్పించుకున్నాడు. కమోల్జోన్ కలోనోవ్ డబుల్ మర్డర్, దొంగతనం, అక్రమ ఆయుధాల సరఫరా, మందుగుండు సామగ్రిని కలిగి ఉండటం లాంటి క్రిమినల్ కేసులలో గత 22 సంవత్సరాలుగా జైలులో శిక్ష అనుభవిస్తున్నాడు. ఎన్నో ఏళ్ల నిరీక్షణ తర్వాత ఎట్టకేలకు ఆయన విడుదల కావాల్సిన రోజు రానే వచ్చింది. అయితే ఆ ఖైదీ అదే రోజున తెల్లవారుజామున 4 గంటలకు జైలు నుండి అదృశ్యమయ్యాడు. దీంతో జైలు అధికారులు సదరు ఖైదీ పరారైనట్లు ప్రకటించడంతో పాటుఅతనిపై మరొక కేసు నమోదు చేశారు. రష్యాలోని ఫెడరల్ పెనిటెన్షియరీ సర్వీస్ ప్రాంతీయ విభాగం అధికారులు ఈ ఉదంతం గురించి తెలియజేస్తూ ఖైదీ కమోల్జోన్ కలోనోవ్.. ఇర్కుట్స్క్ ప్రాంతంలోని జిమా నగరవాసి అని, పలు నేరాలలో ప్రమేయం ఉండటంతో జైలుకు తరలించారని తెలిపారు. 1997లో జైలు నుంచి విడుదలయ్యాడు. అయితే 2001లో అతను డబుల్ మర్డర్‌లో దోషిగా తేలడంతో అతనికి 22 ఏళ్ల పాటు జైలు శిక్ష విధించారు. తాజాగా అతను విడుదల కావాల్సిన రోజు రాగానే జైలు నుండి పరారయ్యాడు. ఫెడరల్ పెనిటెన్షియరీ సర్వీస్ ఆఫ్ రష్యా ప్రకారం కమోల్జోన్ కలోనోవ్ కఠినమైన శిక్షను అనుభవిస్తున్నాడు. విడుదలైన అనంతరం కమోల్జోన్ కలోనోవ్ను కూలీ పనులకు పంపనున్నారు. బహుశా ఈ పనులు చేయడం ఇష్టంలేకనే కమోల్జోన్ కలోనోవ్ పరారయ్యాడని జైలు అధికారులు భావిస్తున్నారు. అతని కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఇది కూడా చదవండి: ఇలా దాటేస్తున్నారు.. అందుకే మస్క్ బాధ పడుతున్నాడు! -
అధికారుల నిర్లక్ష్యం.. బెయిల్ వచ్చినా మూడేళ్లు జైళ్లోనే..
అహ్మదాబాద్: గుజరాత్లో విస్తుపోయే ఘటన వెలుగులోకి వచ్చింది. జైలు అధికారుల నిర్లక్ష్యం ఓ దోషి పాలిట శాపంగా మారింది. బెయిల్ వచ్చినప్పటికీ మూడేళ్లపాటు జైలులోనే ఉండాల్సి వచ్చింది. ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణించిన కోర్టు.. లక్ష రూపాయల జరిమానా విధించింది. చందన్ జీ ఠాకూర్(27)కు ఓ కేసులో జీవితఖైదు శిక్ష పడింది. సెప్టెంబర్ 29, 2020న హైకోర్టు అతని శిక్షను నిలిపివేసింది. అందుకు సంబంధించిన ఆర్డర్ పత్రాలను హైకోర్టు రిజిస్ట్రీ మెయిల్ ద్వారా పంపించింది. ఆ మెయిల్ అటాచ్‌మెంట్‌ను జైలు అధికారులు ఓపెన్ చేయలేదు. దీంతో చందన్ ఠాకూర్ ఇప్పటివరకు జైలులోనే ఉండాల్సి వచ్చింది. బెయిల్ కోసం మళ్లీ కోర్టును సంప్రదించగా.. విషయం వెలుగులోకి వచ్చింది. జైలు అధికారులు కోర్టు పంపిన ఆర్డర్ కాపీలను మెయిల్లో ఓపెన్ చేయలేదనే విషయం ఈ వ్యవహారంలో బయటపడింది. దీనికారణంగా చందన్ ఠాకూర్‌కు శిక్ష నుంచి విముక్తి కలిగినా.. ప్రయోజనం లభించలేదు. ఈ విషయాన్ని కోర్టు సీరియస్‌గా తీసుకుంది. జైలు అధికారుల నిర్లక్ష్యానికి రూ.లక్ష రూపాయల జరిమానా విధించింది. గుజరాత్ రాష్ట్ర ప్రభుత్వం ఈ మేరకు జరిమానా చెల్లించాలని ఆదేశించింది. ఇదీ చదవండి: జమిలి ఎన్నికలపై లా కమిషన్ నివేదిక -
చంద్రబాబును కోర్టే జైలుకు పంపింది..
శ్రీకాకుళం రూరల్: చంద్రబాబును కోర్టే జైలుకు పంపిందని, కేంద్ర ఏజెన్సీలే ఆయనను దోషిగా తేల్చాయని రాష్ట్ర రెవెన్యూ, రిజిస్ట్రేషన్లు, స్టాంప్స్ శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు చెప్పారు. ఆయన ఆదివారం శ్రీకాకుళం మండలం బైరి గ్రామంలో సచివాలయ ప్రారంబోత్సవంలో పాల్గొని ప్రసంగించారు. స్కిల్‌స్కామ్‌లో సూత్రధారి, పాత్రధారి చంద్రబాబేనని, ఈ కేసు 2021లో నమోదైందని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వానికి, జర్మనీ కంపెనీకు ఒప్పందమంటూ ఫేక్ అగ్రిమెంట్లతో అడ్డంగా దొరికిపోయి అడ్డగోలు వాదనలు చేయడం బాబు కోటరీకి తగదని హితవుపలికారు. సాంకేతిక విద్య పేరుతో రూ.371 కోట్ల ప్రజాధనాన్ని 6 షెల్ కంపెనీల్లో పెట్టుబడుల పేరిట దోచేసిన వారిని జైల్లో పెట్టకుండా ఉత్తమ పురుషుడంటూ పొగడాలా.. అంటూ ధర్మాన ప్రశ్నించారు. ఈడీ తనిఖీల్లో ఈ దోపిడీ వ్యవహారం బట్టబయలైందని తెలిపారు. నరసన్నపేట ఎమ్మెల్యే ధర్మాన కృష్ణదాస్ పాల్గొన్నారు. -
‘స్కిల్’లో చంద్రబాబు దోపిడీ
నెల్లూరు(దర్గామిట్ట): మాజీ సీఎం చంద్రబాబు తన నైపుణ్యాన్ని ప్రదర్శించి స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్లో రూ.371 కోట్లు దోచుకున్నారని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి విమర్శించారు. నెల్లూరులోని వైఎస్సార్సీపీ జిల్లా కార్యాలయంలో ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ నిర్మాతల వద్ద రెమ్యూనరేషన్ తీసుకుని కెమెరాల ముందు మాట్లాడిన విధంగానే చంద్రబాబు దగ్గర ప్యాకేజ్ తీసుకుని ప్రజల ముందు మాట్లాడడం అలవాటు చేసుకున్నారని ఎద్దేవా చేశారు. అందుకే చంద్రబాబు, లోకేశ్‌లపై నమ్మకం లేక బాలకృష్ణను మధ్యవర్తిగా పెట్టుకుని జైల్లో డీల్ కుదుర్చుకున్నారని మండిపడ్డారు. కేంద్రంలోని నాయకుల కాళ్లమీద పడి తన తండ్రిని బయటకు తెచ్చుకునేందుకు లోకేశ్ ఢిల్లీలో గడప గడపకు తిరుగుతున్నాడని అన్నారు. గతంలో అనేక కేసుల్లో చంద్రబాబు వ్యవస్థలను మేనేజ్ చేసి, కోర్టులకు వెళ్లి సాంకేతిక కారణాలు చూపించి స్టేలు తెచ్చుకున్నారని విమర్శించారు. ప్రస్తుతం చంద్రబాబు అక్రమాలపై కోర్టులకు కూడా స్పష్టత వచ్చిందన్నారు. చంద్రబాబు బయటకు వచ్చే అవకాశాలు ఉన్నాయా.. అని టీడీపీ శ్రేణులే అనుకుంటున్నాయని, చివరకు సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి కూడా బాబు పనైపోయిందని మాట్లాడుతున్నారని చెప్పారు. వీటన్నింటినీ పరిశీలిస్తే చంద్రబాబు అవినీతికి పాల్పడ్డారని టీడీపీ క్యాడర్‌కు కూడా అర్థమైందని తెలుస్తోందన్నారు. తన భార్య ఆస్పత్రిలో ఉన్నారని రాజమహేంద్రవరం జైలు సూపరింటెండెంట్ సెలవు పెడితే పచ్చ మీడియా ప్రజలను రెచ్చగొట్టేలా అసత్య ప్రచారం చేయడం సిగ్గుచేటన్నారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వ పాలనలో మీ కుటుంబాలకు మేలు జరిగితేనే తమకు ఓటు వెయ్యాలని సీఎం జగన్ ధైర్యంగా చెబుతున్నారని, కానీ చంద్రబాబు మాత్రం ఎవరో ఒకరితో పొత్తులు పెట్టుకుని ప్రజలను బలి చేయాలని చూస్తున్నారని విమర్శించారు. -
పవన్ నువ్వెంత.. నీ బతుకెంత?
సాక్షి, అమరావతి: ప్యాకేజీ కోసం కన్న తల్లిని దుర్భాషలాడిన వ్యక్తుల దగ్గర పవన్‌కళ్యాణ్ బానిసలా బతుకుతున్నారని పర్యాటక శాఖ మంత్రి ఆర్కే రోజా మండిపడ్డారు. అవినీతి కేసులో జైలులో ఉన్న చంద్రబాబుతో పొత్తు పెట్టుకుని.. సొంత కార్యకర్తలు, సొంత సామాజికవర్గాన్ని అమ్మేసిన పవన్‌ను ‘నువ్వెంత? నీ బతుకెంత?’.. అంటూ ఆగ్రహంతో ప్రశ్నించారు. తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో ఆదివారం ఆమె మీడియాతో మాట్లాడుతూ దేశ చరిత్రలో పవన్‌లాంటి సిగ్గులేని రాజకీయ నాయకుడిని ఎవరూ చూసి ఉండరన్నారు. ప్రజలకిచ్చిన మాట కోసం ఢిల్లీని ఢీకొట్టి.. ప్రతిపక్ష నేతగా.. ముఖ్యమంత్రిగా జగన్ తనను తాను నిరూపించుకుంటే.. పవన్ మాత్రం పార్టీ పెట్టి దశాబ్దం గడిచినా ఇప్పటికీ అందరి జెండాలు మోసే కూలీగానే మిగిలిపోయారని ఎద్దేవా చేశారు. ఆమె ఇంకా ఏమన్నారంటే.. ఆరోగ్యశ్రీలో నీ పిచ్చి కుదురుస్తాం.. జనసేన పోటీచేసిన 136 స్థానాల్లో 120 చోట్ల డిపాజిట్లు గల్లంతయ్యాయి. నీ స్థాయికి తగ్గట్టు నువ్వు మాట్లాడాలి పవన్. అసలు నువ్వు ఒక్క దానిలోనైనా సక్సెస్ అయ్యావా? చదువులో, ఫ్యామిలీలో, కొడుకుగా, భర్తగా, రాజకీయ నాయకుడిగా అన్నింట్లోనూ ఫెల్యూర్. నీ తల్లిని తిట్టిన వాళ్లతో అంటకాగుతున్నావు.. త్వరలోనే ఆరోగ్యశ్రీ కింద నీ పిచ్చి కుదురుస్తాం. ఇక అమిత్ షా దగ్గరకెళ్లి ఏమని ఫిర్యాదు చేస్తావు? నీ మీద చెప్పులు, రాళ్లు వేయించిన చంద్రబాబుతో నేను పొత్తు పెట్టుకున్నా.. మీరూ రండి.. అని చెప్తావా? మోడీని, ఆయన భార్యను, తల్లిని తిట్టించిన టీడీపీతో కలుద్దామని పిలుస్తావా? ఎన్నికల్లో సొంతంగా పది మంది అభ్యర్థులను నిలపలేని వ్యక్తి యుద్ధానికి సిద్ధమనడం హాస్యాస్పదంగా ఉంది. బ్రాహ్మణి బ్రహ్మాస్త్రం తుస్సుమంది.. చంద్రబాబు అరెస్టును ప్రజలు పట్టించుకోకపోవడంతో పచ్చ బ్యాచ్‌కు పిచ్చెక్కిపోతోంది. లోకేశ్, భువనేశ్వరి, బాలకృష్ణ, పవన్ విఫలమవడంతో బ్రహ్మాస్త్రంగా బ్రాహ్మణిని తీసుకొచ్చారు. రాజకీయ పరిజ్ఞానం లేకుండా మాట్లాడిన బ్రహ్మాస్త్రం తుస్సుమంది. చంద్రబాబును డైరెక్టుగా ఎలా అరెస్టు చేశారని బ్రాహ్మణి అంటోంది. సాక్ష్యాధారాలతో దొరికిన దొంగను జైలుకు పంపుతారు కానీ.. జైలర్ సినిమాకు పంపుతారా? అలాగే, దేవాన్షుకి దయచేసి బాబు రిమాండ్ రిపోర్ట్ చూపించొద్దు. వాళ్ల తాత ఎంతపెద్ద దొంగో తెలిస్తే అసహ్యించుకునే పరిస్థితి వస్తుంది. మీ మామ(చంద్రబాబు) గురించి మీ తాత ఎన్టీఆర్ చివరి క్షణాల్లో విడుదల చేసిన వీడియో చూడు. చంద్రబాబు గొడ్డుకన్నా హీనం.. గాడ్సే కన్నా ఘోరం అని స్వయంగా ఎన్టీఆర్ విలపించారు. మీ మామ నిరపరాధని మీ దగ్గర ఆధారాలుంటే మీడియాలో కాదు కోర్టుల్లో చూపించాలి. ఇక స్కిల్ స్కాంలో లోకేశ్, అచ్చెన్నాయుడుతో పాటు పాత్రధారులందరూ జైలుకెళ్లకతప్పదు. -
బాబుకు తోడు దొంగల వత్తాసు
సాక్షి, అమరావతి: ఓ దొంగ... మరో దొంగకు మద్దతిస్తే ఎలా ఉంటుంది? ఒకరికి మద్దతుగా మరొకరు తెరమీదికొచి్చ ‘తనేమీ తప్పు చేయలేదు’ అని చెప్పటం!!.. వినటానికే విచిత్రంగా ఉంది కదూ? నిజానికి కోర్టుల్లో కనుక ఇలా సాక్ష్యాలు చెబితే జైల్లో పడేస్తారు. కానీ ఎల్లో మీడియా మాత్రం... ఆ దొంగలు చంద్రబాబు నాయుడికి ఇస్తున్న సర్టిఫికెట్లను పతాక శీర్షికల్లో ప్రచురిస్తోంది. అవే నిజాలని జనాలను మభ్యపెట్టే ప్రయత్నాలు చేస్తోంది. ఒకవేళ అవి నిజాలే అనుకుంటే... ఇలా ఎల్లో మీడియాలో సాక్ష్యాలు చెబుతున్న దొంగలను గతంలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఇదే కేసులో ఎందుకు అరెస్టు చేసింది? ఐటీ శాఖ ఎందుకు వాళ్లకు నోటీసులిచ్చింది? తాము తప్పు చేశామని వాళ్లు ఎందుకు ‘ఈడీ’ ఎదుట ఒప్పుకున్నారు? ఈ ప్రశ్నల్లో దేనికీ ‘ఈనాడు’ దగ్గర గానీ, దాని తోక మీడియా దగ్గర గానీ సమాధానాలు లేవు. వారికి తెలిసిందల్లా... చంద్రబాబు శుద్ధ పూస అని జనాన్ని నమ్మించేందుకు మొత్తం తమ మీడియా సామ్రాజ్యాన్ని అబద్ధాలకు తాకట్టు పెట్టడమే. అదే జరుగుతోంది కూడా!. దుర్యోధనుడు మంచోడని దుశ్శాసనుడు, శకుని సాక్ష్యం చెబుతున్నట్లే ఉంది టీడీపీ వ్యవహారం. స్కిల్ కుంభకోణంలో ఆధారాలతోసహా అడ్డంగా దొరికిపోయిన చంద్రబాబుకు మద్దుతుగా ఆ కేసులో ఇతర నిందితులు వికాస్ ఖన్విల్కర్, సుమన్ బోస్ వంటి వారు ఇంటర్వ్యూలిస్తుండటం... సిగ్గులేకుండా వాటిని ఎల్లో మీడియా పతాక శీర్షికల్లో ప్రచురిస్తుండటం రాష్ట్రం మొత్తాన్ని విస్మయపరుస్తోంది. షెల్ కంపెనీల ద్వారా నిధుల తరలింపులో కీలక పాత్ర పోషించిన డిజైన్ టెక్ కంపెనీ ఎండీ వికాస్ వినాయక్ ఖన్విల్కర్ ఇటీవల చంద్రబాబుకు అనుకూలంగా వీడియో విడుదల చేశారు. కాగా తాజాగా ఈ కేసులో మరో నిందితుడు సుమన్ బోస్ ‘మా చంద్రబాబు నీతిమంతుడు’ అని సరి్టఫికెట్ ఇచ్చేశారు. నిజానికి సీమెన్స్ కంపెనీకి తెలియకుండానే ఆ కంపెనీ పేరిట ఒప్పందం చేసుకుని కోట్లు కొల్లగొట్టడంలో కీలక పాత్రధారి ఈ సుమన్ బోసే. ఈయనను, వికాస్ ఖన్విల్కర్‌ను ఇప్పటికే కేంద్ర దర్యాప్తు సంస్థ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్, సీఐడీ రెండూ అరెస్టు చేశాయి. జైల్లో ఉండి... బెయిలుపై బయటకు వచ్చారు. ఇలా బెయిలుపై వచి్చన వాళ్లు కేసులోని మరో నిందితుడికి మద్దతుగా మీడియాతో మాట్లాడటమే చిత్రాతిచిత్రం. వాస్తవానికి సుమన్‌బోస్ అసలు బండారాన్ని బయటపెడుతూ సీమెన్స్ కంపెనీ ప్రధాన కార్యాలయం ఇప్పటికే ఇటు సీఐడీకీ అటూ న్యాయస్థానానికి కూడా వాంగ్మూలాన్ని ఇచ్చిందన్నది టీడీపీ ఉద్దేశపూర్వకంగానే తొక్కిపెడుతోంది. మాకు తెలీదు.. సంబంధం లేదు: సీమెన్స్ టీడీపీ ప్రభుత్వంలో స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (ఏపీఎస్ఎస్డీసీ) ప్రాజెక్ట్‌లో తమ అవినీతి దందాకు ‘సీమెన్స్ కంపెనీ ముసుగు వేయాలన్న చంద్రబాబు పన్నాగం బెడిసికొట్టింది. అసలు ఏపీఎస్ఎస్డీసీ ప్రాజెక్ట్ గురించి తమకు తెలియనే తెలియదని సీమెన్స్ కంపెనీ కుండబద్దలు కొట్టింది. డిజైన్ టెక్ కంపెనీతో కలసి ఏపీఎస్ఎస్డీసీతో తాము కుదర్చుకున్నట్టు చెబుతున్న త్రైపాక్షిక ఒప్పందానికి, తమకు ఏమాత్రం సంబంధం లేదని స్పష్టం చేసింది. ఏదైనా ప్రాజెక్ట్ కింద 90 శాతం నిధులు గ్రాంట్ ఇన్ ఎయిడ్‌గా సమకూర్చే పద్ధతి అసలు తమ కంపెనీ పాలసీలోనే లేదని విస్పష్టంగా తేల్చింది. తమ కంపెనీ పేరిట సుమన్ బోస్ టీడీపీ ప్రభుత్వంతో చేసుకున్న ఒప్పందంతో తమకు ఎలాంటి సంబంధం లేదని... అసలు అటువంటి ఒప్పందాలు చేసుకునే అధికారాన్ని ఆయనకు కంపెనీ అప్పగించనే లేదని వెల్లడించింది. ఈ మేరకు ఏపీఎస్ఎస్డీసీ ప్రశ్నలకు సవివరంగా సమాధానాలు చెబుతూ పంపిన ఈ–మెయిల్ తాజాగా వెలుగులోకి వచ్చింది. ఇక ఏపీఎస్ఎస్డీసీ కుంభకోణాన్ని దర్యాప్తు చేస్తున్న సీఐడీ ప్రత్యేక దర్యాప్తు బృందానికి సీమెన్స్ కంపెనీ పూర్తిగా సహకరిస్తోంది. కుంభకోణంలో ప్రధాన పాత్రధారులు వారిద్దరే.. స్కిల్ కుంభకోణంలో ప్రధాన సూత్రధారి చంద్రబాబు కాగా, సుమన్ బోస్, వికాస్ వినాయక్ ఖన్విల్కర్ ప్రధాన పాత్రధారులుగా వ్యవహరించారు. వారి బండారాన్ని సీఐడీ, ఈడీ ఆధారాలతోసహా బట్టబయలు చేశాయి. ఒప్పందంలో ఓ చోట సుమన్ బోస్ అని మరో చోట సౌమ్యాద్రి బోస్ అని సంతకాలు చేసినట్టు ఆడిట్ నివేదిక నిగ్గు తేల్చింది. సీమెన్స్ కంపెనీ కూడా అంతర్గతంగా విచారించి సుమన్ బోస్ తమ కంపెనీ పేరిట చేసిన మోసాన్ని నిర్ధారించింది. ఆయన అప్పటికే డిలీట్ చేసిన ఈ–మెయిల్స్, వాట్సాప్, ఎస్ఎంఎస్ సందేశాలను రిట్రీవ్ చేసి ఆ రికార్డులను సీఐడీకి అప్పగించింది. తమ కంపెనీకి తెలియకుండానే సుమన్ బోస్ ఏపీఎస్ఎస్డీసీతో ఒప్పందం చేసుకున్నారని, అటు తమ కంపెనీని మోసం చేయడంతోపాటు ఇటూ ఏపీ ఖజానాను కొల్లగొట్టడంలో కీలకంగా వ్యవహరించారని న్యాయస్థానంలో 164 సీఆర్పీసీ కింద వాంగ్మూలం ఇచ్చింది. ఇక షెల్ కంపెనీల ద్వారా నిధులు అక్రమంగా తరలించడంలో డిజైన్ టెక్ ఎండీ వికాస్ వినాయక్ ఖన్విల్కర్ కీలక పాత్ర పోషించారు. దాంతో సుమన్ బోస్, వికాస్ వినాయక్ ఖన్విల్కర్‌లను సీఐడీ 2021, డిసెంబర్10న అరెస్ట్ చేసి న్యాయస్థానంలో హాజరుపరచగా రిమాండ్ విధించింది. వారిద్దరు 2022, జనవరి 18 వరకు అంటే 40 రోజులపాటు జైలులో ఉన్నారు. బెయిలుపై వచ్చి ఎల్లో మీడియాలో చిలకపలుకులు చెబుతుండటమే ఘోరాతిఘోరం. సుమన్‌బోస్, ఖన్విల్కర్‌లను అరెస్ట్ చేసిన ఈడీ ఇక స్కిల్ కుంభకోణంపై కేంద్ర దర్యాప్తు సంస్థ ఈడీ కూడా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టింది. సుమన్ బోస్, వికాస్ వినాయక్ ఖన్విల్కర్లతోపాటు షెల్ కంపెనీల ప్రతినిధులు సురేష్ గోయల్, ముకుల్ చంద్ర అగర్వాల్‌లను ఈ ఏడాది మార్చి 4న అరెస్ట్ చేసింది. వారికి విశాఖపట్నంలోనీ సీబీఐ న్యాయస్థానం రిమాండ్ విధించింది. ఆ నలుగురినీ ఈడీ అధికారులు కస్టడీకి తీసుకుని 10 రోజులపాటు విచారించారు. అటువంటి సుమన్ బోస్, వికాస్ వినాయక్ ఖన్విన్వేల్కర్ ప్రస్తుతం స్కిల్ కుంభకోణంలో అవినీతి జరగలేదని చెబుతూ చంద్రబాబుకు వత్తాసు పలుకుతుండటం దెయ్యాలు వేదాలు వల్లించినట్టుందని పరిశీలకులకు వ్యాఖ్యానిస్తున్నారు. ఈ అంశంలో ప్రశ్నావళికి సీమెన్స్ కంపెనీ ఈమెయిల్ ద్వారా చెప్పిన సమాధానాలు ఇలా ఉన్నాయి.. ప్రశ్న: జీవోలో పేర్కొన్నట్టుగా రాష్ట్ర స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కోసం సీమెన్స్–డిజైన్ టెక్ కంపెనీలు రూ.3,300కోట్లతో ప్రాజెక్ట్ నెలకొల్పడానికి అంగీకరించారా? మొత్తం ప్రాజెక్టు వ్యయం రూ.3,300 కోట్లలో ప్రభుత్వం వాటా 10 శాతంగా, గ్రాంట్ ఇన్ ఎయిడ్‌గా సీమెన్స్ 90శాతం వాటా సమకూర్చేందుకు సమ్మతించిందా? గ్రాంట్ ఇన్ ఎయిడ్ కింద అటువంటి ప్రాజెక్ట్‌లు చేపట్టే విధానం సీమెన్స్ కంపెనీలో ఉందా? సీమెన్స్ కంపెనీ సమాధానం: గ్రాంట్ ఇన్ ఎయిడ్ కింద ప్రాజెక్ట్‌లకు 90% నిధులు సమకూర్చే విధానం సీమెన్స్ కంపెనీలో లేనే లేదు. డిజైన్ టెక్ కంపెనీతో కలసి మేము స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్‌తో ఎలాంటి ఒప్పందం చేసుకోలేదు. అలాంటి ఒప్పందం గురించి మాకు అసలు తెలీదు. ప్రశ్న: ఏపీలో యువతకు నైపుణ్య శిక్షణ కోసం కుదుర్చుకున్న త్రైపాక్షిక ఒప్పందానికి సంబంధించి ఏపీఎస్ఎస్డీసీ నుంచిగానీ డిజైన్ టెక్ కంపెనీ నుంచి ఏమైనా వర్క్ ఆర్డర్ మీకు వచ్చిందా? సీమెన్స్ కంపెనీ సమాధానం: ఏపీఎస్‌ఎస్‌ఎస్‌డీసీ ప్రాజెక్ట్‌కు సంబంధించి మాకు ఏపీఎస్ఎస్డీసీ నుంచిగానీ డిజైన్ టెక్ కంపెనీ నుంచి ఎలాంటి వర్క్ ఆర్డర్ రాలేదు. ప్రశ్న: ఏపీఎస్ఎస్డీసీ, డిజైన్‌టెక్‌తో కలిసి సీమెన్స్ కంపెనీ పేరున కుదుర్చుకున్నట్టు చెబుతున్న ఒప్పందంపై సీమెన్స్ కంపెనీ తరపున అని చెబుతూ సుమన్ బోస్ సంతకాలు చేశారు. సీమెన్స్ కంపెనీలో ఆయన హోదా ఏమిటి? ప్రస్తుతం ఆయన ఎక్కడ ఉన్నారు? సీమెన్స్ కంపెనీ సమాధానం: సీమెన్స్ కంపెనీ తరపున ప్రాజెక్ట్‌లు కుదర్చుకునేందుకుగానీ గ్రాంట్ ఇన్ ఎయిడ్ కింద నిధులు సమకూరుస్తామని ఒప్పందం చేసుకునేందుకుగానీ సుమన్ బోస్‌కు ఎలాంటి అధికారం లేదు. కంపెనీ ఆ అధికారాన్ని ఆయనకు ఎప్పుడూ ఇవ్వ లేదు. సుమన్ బోస్ మా కంపెనీకి ఎప్పుడో రాజీనామా చేశారు. ఆయనకు మా కంపెనీకి ఎలాంటి సంబంధం లేదు. ఆయన ప్రస్తుతం ఎక్కడ ఉన్నారో కూడా మాకు సమాచారం లేదు. ఏపీఎస్ఎస్డీసీ ప్రాజెక్ట్ పేరిట అవినీతి కేసులో సుమన్ బోస్‌ను సీఐడీ దర్యాప్తు చేస్తోందని మాకు తెలిసింది. సీమెన్స్ కంపెనీ ఎలాంటి ప్రాజెక్ట్‌లలోనూ గ్రాంట్ ఇన్ ఎయిడ్ కింద నిధులు వెచ్చించదు. కాబట్టి సుమన్ బోస్ సంతకాలు చేసినట్టు చెబుతున్న ఒప్పందంతో సీమెన్స్ కంపెనీకి ఎలాంటి సంబంధం లేదు. కరెంటు పోయింది.. కొవ్వొత్తుల వెలుగులోసంతకాలు చేశా ఏపీఎస్‌ఎస్‌ఎస్‌డీసీ ప్రాజెక్ట్‌లో అవినీతి జరగలేదంటూ బుకాయించేందుకు యతి్నంచి సుమన్ బోస్ అడ్డంగా దొరికిపోయారు. అసలు ఆ ప్రాజెక్ట్ ఒప్పంద పత్రంలో ఏమని రాసి ఉందో కూడా తెలియదని ఆయన పరోక్షంగా చెప్పడం గమనార్హం. ఆ ఒప్పందంపై సంతకాలు చేసిన రోజున కరెంట్ పోయిందని... కొవ్వొత్తులు తెప్పించారని...ఆ కొవ్వొత్తుల వెలుగులోనే తాము సంతకాలు చేశామని చెప్పారు. ఇంతకీ ఆ ఒప్పందంతో తమకు ఏమాత్రం సంబంధం లేదని సీమెన్స్ కంపెనీ ప్రకటించడం ప్రాధాన్యం సంతరించుకుంది. -
2వ రోజు జైల్లో... చంద్రబాబు ఫుడ్ మెనూ ఇదే..!
-
ఇన్నాళ్లకు న్యాయం, ధర్మం గెలిచింది
సాక్షి, అమరావతి :ప్రభుత్వ ఖజానా నుంచి రూ.371 కోట్లు దోచేసిన స్కిల్ డెవలప్మెంట్ స్కాం కుంభకోణంలో ప్రధాన నిందితుడైన చంద్రబాబుకు ఏసీబీ కోర్టు రిమాండ్ విధించి, జైలుకు పంపడంతో ఇన్నాళ్లకు న్యాయం గెలిచింది, ధర్మం గెలిచిందని రాష్ట్ర ప్రజలు సంతోషం వ్యక్తంచేస్తున్నట్లు మాజీమంత్రి, మచిలీపట్నం ఎమ్మెల్యే పేర్ని నాని చెప్పారు. చంద్రబాబు సిగ్గుపడకుండా.. వేళ్లూపుకుంటూ జైలుకు వెళ్లారంటూ ఎద్దేవా చేశారు. తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. 45 ఏళ్లుగా ఎన్నో స్కాములు చేస్తూ.. స్టేల మీద నెట్టుకొస్తూ.. ప్రతి వ్యవస్థలోనూ, తాను ఏర్పాటుచేసుకున్న స్లీపర్ సెల్స్ ద్వారా బయటపడుతూ, సమాజానికి మాత్రం చంద్రస్వామిజీ నీతులు చెబుతూ వచ్చారంటూ విమర్శించారు. 2014–19 మధ్యలో జరిగిన అన్ని కుంభకోణాలపై విచారణ జరుపుతామని స్పష్టంచేశారు. పేర్ని నాని ఇంకా ఏమన్నారంటే.. అరెస్టు నుంచి జైలుకు పంపే వరకు ఆయన్ను ప్రభుత్వం కక్ష సాధింపుగా కాకుండా మర్యాదగా చూసుకుంది. ఇన్ని వందల, వేల కోట్లు కొట్టేసిన వారిని ఎవరైనా ఇంత మర్యాదగా చూస్తారా? బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి దగ్గర నుంచి, దత్తపుత్రుడు పవన్‌కళ్యాణ్, సీపీఐ నాయకులు, ఎల్లో మీడియా బాబును వేధిస్తున్నారని అనడం హేయం. చంద్రబాబు సీఐడీ విచారణకు అసలు సహకరించలేదు. ఏమో, తెలియదు, గుర్తులేదు.. ఈ మూడే కదా బాబు చెప్పింది. కోర్టులోకి చంద్రబాబు కుటుంబ సభ్యులంతా వస్తుంటే పోలీసులు అనుమతించారా? లేదా? జైల్లో ఆయనకు సకల సౌకర్యాలు ఇవ్వమని ప్రభుత్వం తరఫున, సీఐడీ తరఫున న్యాయవాదులు అభ్యంతరంలేదని చెప్పారా? లేదా? చంద్రబాబును ఇంత మర్యాదగా చూస్తే.. వేధించారని మాట్లాడతారా? కోర్టు రిమాండ్ విధిస్తే.. సిగ్గులేకుండా రెండువేళ్లూ ఊపుతూ జైలుకెళ్లాడు. ఇక కేంద్ర ప్రభుత్వం ఇంటర్నెట్ కోసం రూ.5 వేల కోట్లు ఇస్తుందని తెలిసి, చంద్రబాబు, ఆయన కొడుకు ఫైబర్‌నెట్ స్కాం చేశారు. అమరావతిలో పేదలకు ఇళ్లు కట్టిస్తామంటూ కాంట్రాక్టుల పేరుతో రూ.119 కోట్లు లూటీ చేసినా ఏమీ పట్టించుకోకూడదా? అవినీతిపై రాజీలేని పోరాటమంటే.. రోడ్ల మీద పడి పొర్లాడటమా పవన్? వారాహి యాత్రలో గోదావరి జిల్లాల్లో కనీసం 50 మందిని చంపేయడానికి రెండువేలమంది కిరాయి రౌడీలను వైఎస్సార్సీపీ నేతలు పంపారని పవన్ చెప్పడం హేయం. సైకలాజికల్ డిజార్డర్‌తో ఉన్న పవన్‌ను సైక్రియాటిస్టు ఇండ్ల రామసుబ్బారెడ్డికి చూపించాలి. పవన్ చెప్పే నిఘా వర్గాలు కేంద్రానివి కాదు.. చంద్రబాబువి. -
చంద్రబాబూ ఆత్మవిమర్శ చేసుకో
ఖైరతాబాద్(హైదరాబాద్): ఏపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఇకనైనా ఆత్మవిమర్శ చేసుకోవాలని ఎన్టీఆర్ సతీమణి లక్ష్మీపార్వతి అన్నారు. సోమవారం ఎన్టీఆర్ ఘాట్‌లో నివాళులు అర్పించిన అనంతరం ఆమె మాట్లాడారు. 74 ఏళ్ల వయస్సులో ఎన్టీఆర్‌ను అవమానాలకు గురిచేసి, చివరకు ఆయన చనిపోయేలా చేశావో, అదే 74వ ఏట మీరు చేసిన పాపాలు పండి అరెస్టు అయ్యి జైలుకు వెళ్లిన ఈ ఉద్వేగభరిత క్షణాల్ని నా భర్త సమాధితో పంచుకోవాలని ఇక్కడకు వచ్చి నివాళులు అర్పించినట్టు చెప్పారు. చంద్రబాబు ఎప్పటికీ తప్పించుకోలేడని ఎన్టీఆర్ ఆనాడు చెప్పిన మాటల్ని లక్ష్మీపార్వతి ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. నా భర్తకు జరిగిన అన్యాయాన్ని ప్రజలకు చెప్పాలనే ఇంతకాలం బతికున్నానని, నా ఆశయం నా భర్త నిర్దేశించారని తెలిపారు. 40 ఏళ్ల రాజకీయ జీవితం, 14 ఏళ్ల ముఖ్యమంత్రిగా చంద్రబాబు ఏం చేశాడు. ప్రజల సొమ్ము దోచుకొని, అవినీతి కేసుల్లో వ్యవస్థలను మేనేజ్ చేసుకుంటూ, అధికారం అడ్డుపెట్టుకొని వ్యవస్థలను కొనుక్కోవడం చేస్తూ వచ్చాడని, చివరికి అదే వ్యవస్థలో చిక్కుకుపోయి జైలు పాలయ్యాడని, ఇప్పుడు నా కోపం అంతా తీరిపోయిందన్నారు. ఎన్టీఆర్ కుటుంబం ఇప్పటికైనా ఆలోచించాలని, చంద్రబాబు అక్రమాలను మీరు సహిస్తారా... ప్రజాధనం లూటీ చేస్తూ దొరికిపోయాడు, ఆలోచించండన్నారు. నిప్పులాగా బతికిన ఎన్టీఆర్ జీవిత చరిత్ర ఎక్కడ, అధికారం కోసం తడిగుడ్డతో గొంతులు కోసే మనస్తత్వం ఉన్న చంద్రబాబు గురించి తెలుసుకోవాలన్నారు. -
తాగి నడిపితే.. మాములుగా వుండదు..!
మహబూబ్‌నగర్: జిల్లాలో రోడ్డు ప్రమాదాలు పెరుగుతున్న నేపథ్యంలో వాటిని కట్టడి చేయడానికి జిల్లా పోలీస్ శాఖ డ్రంకెన్ డ్రైవ్ కేసులపై ప్రత్యేక దృష్టిపెట్టింది. ఈ ఏడాది రికార్డు స్థాయిలో డ్రంకెన్ డ్రైవ్ కేసులు నమోదు చేశారు. జనవరి నుంచి సెప్టెంబర్ 9 వరకు జిల్లాలోని 17 పోలీస్స్టేషన్ల పరిధిలో మొత్తం 4,809 కేసులు నమోదు చేయగా.. ఇందులో 2,922 మందికి రూ.46.62 లక్షల జరిమానా విధించగా మరో 55 మందికి జైలుశిక్ష విధించారు. ఇటీవల హౌజింగ్‌బోర్డుకు చెందిన రాములు అనే వాహనదారుడికి అత్యధికంగా 16 రోజుల సాధారణ జైలుశిక్ష పడింది. 2021లో 3,057 కేసులు నమోదు చేయగా 3,045 కేసులకు సంబంధించి రూ.38,00,700 జరిమానా విధించగా 12 మందికి జైలుశిక్ష పడింది. అలాగే 2022లో 4,628 కేసులు నమోదు చేసి రూ.36 లక్షల జరిమానా వసూలు చేశారు. ఈ ఏడాది ఇంకా ఐదు నెలలు ఉండగా.. మరో 3 వేల కేసులు నమోదు చేసే అవకాశం ఉంది. కేసు నమోదు.. బ్రీత్ ఎనలైజర్ ఆల్కహాల్‌లోని ఇథనాల్‌ను పసిగట్టే సెన్సార్ ఉంటుంది. ఇందులో కొన్ని రసాయన పదార్థాలను నిక్షిప్తం చేస్తారు. మద్యం తాగిన వ్యక్తి పరికరంలోకి గాలి ఊదినప్పుడు అతని శ్వాసలో కరిగి ఉన్న ఇథైల్ ఆల్కహాల్ సెన్సార్‌ను చేరుతుంది. ఇది శ్వాసలో ఇథనాల్ ఎంతశాతం ఉందో నమోదు చేస్తోంది. 0–30మిల్లీ గ్రాములు నమోదు సాధారణంగా చెబుతారు. 30 మి.గ్రా ఆపైన నమోదైతే కేసు నమోదు చేసి జరిమానా విధిస్తారు. ఇలా రెండుసార్లు వాహనం నడుపుతూ దొరికితే లైసెన్స్ రద్దు చేస్తారు. 100 మి.గ్రా., పైగా నమోదైతే జైలుకు పంపుతారు. పోలీస్ నిబంధనల ప్రకారం ఒక యూనిట్ లేదా 100 మి.లీ., రక్తంలో 0.03 శాతం లేదా 30 మి.గ్రా., మించి ఆల్కహాల్ ఉంటే మోటారు వాహనచట్టం 185 సెక్షన్ కింద కేసు నమోదు చేయవచ్చు. తాగిన మోతాదును బట్టి రూ.2 వేలు జరిమానా, వారం నుంచి పదిరోజుల వరకు జైలుశిక్ష విధించే అవకాశం ఉంది. ఇదే నేరాన్ని పునరావృతం చేస్తే ఎక్కువ రోజుల జైలుశిక్షతోపాటు రూ.3–5 వేల వరకు జరిమానా విధించవచ్చు. పాయింట్ల కేటాయింపు.. రాష్ట్ర ప్రభుత్వం ట్రాఫిక్ నిబంధనలు ఉల్లఘించిన వారికి జరిమానాలు విధించి.. వారికి జీఓ 26 ప్రకారం పాయింట్లు ఇస్తోంది. 24 నెలల్లో 12 పాయింట్లు దాటిన వారి డ్రైవింగ్ లైసెన్స్ ఏడాదిపాటు రద్దు చేస్తారు. ఏడాదిలో లైసెన్స్ పునరుద్ధరించాక మళ్లీ 12 పాయింట్లు సాధిస్తే రెండేళ్లపాటు తర్వాత మళ్లీ ఇలాగే చేస్తే మూడేళ్లపాటు రద్దు చేస్తారు. ద్విచక్ర వాహనదారుడు మద్యం తాగితే 4 పాయింట్లు, నాలుగు చక్రాల వాహనదారుడు మద్యం తాగితే 4 పాయింట్లు, బస్సు, క్యాబ్ వాహనదారుడు మద్యం తాగితే 5 పాయింట్లు, ఆటోడ్రైవర్ తన పక్కన ప్రయాణికుడిని కూర్చొబెట్టుకోవడం, హెల్మెట్ లేకుంటే, సీటు బెల్టు పెట్టకుంటే ఒక పాయింట్ వేస్తారు. కఠిన చర్యలు తప్పవు.. డ్రంకెన్ డ్రైవ్‌లో రెండోసారి పట్టుబడిన వారి డ్రైవింగ్ లైసెన్స్ రద్దు చేస్తాం. మొదట వారి కుటుంబ సభ్యుల సమక్షంలో కౌన్సిలింగ్ ఇస్తున్నాం. ఆ తర్వాతే కోర్టులో హాజరుపరుస్తున్నాం. ప్రస్తుతం డ్రైంకెన్ డ్రైవ్‌లో పట్టుబడిన వారిని ట్యాబ్‌లో ఫొటో తీస్తున్నాం. వారు బార్లో తాగారా.. శివారు ప్రాంతాల్లో తాగారా.. ఇలా ప్రతీది నమోదు చేస్తున్నాం. ఒక్కసారి పట్టుబడిన వ్యక్తి మరోసారి పట్టుబడితే సులభంగా తెలిసిపోతుంది. జిల్లాలో డ్రంకెన్ డ్రైవ్ కేసులపై ప్రత్యేక దృష్టిపెట్టాం. రోడ్డు ప్రమాదాలు తగ్గించడానికి ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో తనిఖీలు చేపడుతున్నాం. – మహేష్, డీఎస్పీ, మహబూబ్‌నగర్ వినూత్నంగా శిక్షలు.. మొదట్లో డ్రంకెన్ డ్రైవ్ కేసుల్లో ఎక్కువ మోతాదులో తాగి దొరికిన వారికి జరిమానాతోపాటు కౌన్సిలింగ్ నిర్వహించి వదిలిపెట్టేవాళ్లు. ప్రస్తుతం చట్టాలకు మరింత పదును పెట్టారు. మోతాదుకు మించి అతిగా తాగిన వారికి 1 నుంచి 7 రోజుల జైలుశిక్ష విధిస్తున్నారు. మళ్లీ మళ్లీ డ్రంకెన్ డ్రైవ్‌లో దొరికిన వారికి గరిష్టంగా 30 రోజుల వరకు జైలుశిక్ష విధిస్తున్నారు. -
బాబు స్కిల్డ్ క్రిమినల్..
బాబుది అంతా చీకటి చరిత్ర: అమర్నాథ్ అసలు చంద్రబాబు రాజకీయ జీవితమంతా.. కుట్రలు, కుతంత్రాలు, అవినీతితో నిర్మితమైందని, ఆయనదంతా చీకటి చరిత్ర అని విశాఖలో మంత్రి గుడివాడ అమర్నాథ్ అన్నారు. దేశంలోని ఏ రాజకీయ నాయకుడిపై లేనన్ని అవినీతి ఆరోపణలు, కుంభకోణాలు చంద్రబాబుపై ఉన్నాయని చెప్పారు. నేరుగా రాజకీయాల్లో ఎదగలేక, వెన్నుపోటు పొడిచి దొడ్డిదారిన ముఖ్యమంత్రి అయ్యాడన్నారు. తాను నిజాయితీపరుడిని అని రోజూ ప్రవచనాలు వల్లించే చంద్రబాబు రూ.118 కోట్లు ఎలా బొక్కేశాడని ప్రశ్నించారు. చంద్రబాబు తాజా ఆర్థిక నేరాలపై పత్రికలు, టీవీ చానళ్లు అనేక కథనాలు వెల్లడిస్తున్నా.. చంద్రబాబు ఎందుకు స్పందించడంలేదని ఆయన ప్రశ్నించారు. చంద్రబాబు పీఏ శ్రీనివాస్ బాబు ఆర్థిక నేరాలను స్పష్టంగా ఐటీ అధికారులకు వివరించాడని ఆయన తెలిపారు. దుబాయ్ నుంచి కూడా అక్కడి కరెన్సీలో రూ.15 కోట్ల వరకు దండుకున్నారని మంత్రి ఆరోపించారు. స్కిల్ డెవలప్మెంట్ పేరుతో చంద్రబాబు అధికారులను, మంత్రివర్గాన్ని తప్పుదోవ పట్టించి సుమారు రూ.350 కోట్లు కొట్టేశాడని ఆయన వివరించారు. చంద్రబాబు ఆర్థిక నేరాల విషయంలో ఈడీ జోక్యం చేసుకోవాలని అమర్నాథ్ డిమాండ్ చేశారు. తండ్రీకొడుకులను జైలుకు పంపాలి: రోజా చంద్రబాబు, లోకేశ్‌పై సీబీఐ విచారణ జరిపించి, జైలుకు పంపాలని మంత్రి ఆర్కే రోజా తిరుమలలో మీడియాతో అన్నారు. గతంలో 14 ఏళ్లు సీఎంగా ఉన్న చంద్రబాబు ఈ రాష్ట్రానికి ఏమీ చేయలేదని, రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించారన్నారు. ఏపీలో చంద్రబాబుకి ఆధార్ కార్డుగానీ, ఓటరు కార్డు గానీ, ఇల్లుగానీ లేకపోయినా హైదరాబాదు నుంచి అప్పుడప్పుడు వచ్చి వైఎస్సార్సీపీ నేతలపై విమర్శలు చేసి వెళ్లిపోతుంటారన్నారు. అలాగే, చంద్రబాబుకు ఐటీ నోటీసులిస్తే ఎందుకు ఎవరూ నోరు మెదపడంలేదని ఆమె ప్రశ్నించారు. కాంట్రాక్టు పనుల్లో కోట్లాది రూపాయల కమీషన్లు దండుకున్నారని రోజా ఆరోపించారు. చంద్రబాబుకు ఐటీ అధికారులు నోటీసులిస్తే ఆయన దత్తపుత్రుడు ఎందుకు ట్వీట్ చేయలేదని ప్రశ్నించారు. పవన్ కళ్యాణ్‌ను సైతం సీబీఐ అధికారులు విచారణ చేయాలని రోజా డిమాండ్ చేశారు. బాబు అత్యంత అవినీతిపరుడు: కొడాలి నాని చంద్రబాబు అత్యంత అవినీతిపరుడు, స్వార్థపరుడు, నమ్మక ద్రోహి అని మాజీ మంత్రి, గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని ఆగ్రహం వ్యక్తంచేశారు. ఆయన మచిలీపట్నంలో మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబు ఇప్పుడు రికార్డులతో సహా దొరికిన దొంగని చెప్పారు. 2024 ఎన్నికల్లో ఒక్కో అభ్యర్థికి రూ.40 కోట్ల నుంచి రూ.50 కోట్లయినా ఖర్చుపెడదామని ఆయన చెబుతున్నారన్నారు. చంద్రబాబు హయాంలో ఇప్పటివరకు నిర్వహించిన ఎన్నికల్లో రూ.10 వేల కోట్లు వరకు ఖర్చుచేశారని, ఈ డబ్బంతా ఇలా కమీషన్లు తీసుకోకపోతే ఎక్కడి నుంచి వచ్చిందని కొడాలి నాని ప్రశ్నించారు. ఇన్ని కోట్ల రూపాయల ఖర్చు ఎలా చేస్తున్నారో రాష్ట్ర ప్రజలకు తెలుసునన్నారు. చట్టాలు, రాజ్యాంగాలను అనుసరించి ఏ విధంగా డబ్బులు దోచుకోవాలో ఆయనకు బాగా తెలుసునన్నారు. ఇప్పుడు ఐటీ శాఖాధికారులు ఇచ్చిన నోటీసుల నుంచి తప్పించుకునేందుకు బీజేపీ నాయకుల కాళ్లు పట్టుకుంటున్నారని ఎద్దేవా చేశారు. బాబు అవినీతి బాగోతం బయటపడిందని ఇప్పుడు తప్పించుకోలేరని నాని అన్నారు. బాబు, లోకేశ్ పెద్ద అవినీతిపరులు: ధర్మాన ప్రపంచంలోనే చంద్రబాబు, లోకేశ్‌లు పెద్ద అవినీతిపరులని, దోచుకుని పంచుకోవడమే పనిగా పెట్టుకున్నారని, రానున్న ఎన్నికల్లో వారికి ఓటు అడిగే అర్హత లేదని రెవెన్యూ శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు ఆగ్రహం వ్యక్తంచేశారు. శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మాళిలో ఆయన మీడియాతో మాట్లాడుతూ 14 ఏళ్లు సీఎంగా ఉన్న బాబు ఒక్క పేదవాడికి సెంటు భూమి ఇవ్వలేదని, ఒక్క శాశ్వత పథకం కూడా తీసుకురాలేకపోయారన్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఇలాంటి గజదొంగలకు అధికారమిస్తే రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తారన్నారు. ఇక అచ్చెన్నాయుడు, ఎంపీ రామ్మోహన్నాయుడు శ్రీకాకుళం జిల్లాకు చేసిందేమీ లేదని, చంద్రబాబు ముందు చేతులు కట్టుకుని నిలబడడం తప్ప జిల్లాకు ఒక్క ప్రాజెక్టు కూడా వీరు తీసుకురాలేకపోయారన్నారు. -
US presidential election 2020 Case: ట్రంప్ అరెస్ట్.. విడుదల
వాషింగ్టన్: అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్ట్ ట్రంప్ చరిత్ర సృష్టించారు. ఫొటో సహా పోలీసుల రికార్డుల్లోకి ఎక్కిన తొలి మాజీ అధ్యక్షుడయ్యారు. 2020 అధ్యక్ష ఎన్నికల సమయంలో జార్జియాలో ఫలితాల తారుమారుకు యత్నించారన్న ఆరోపణల కేసులో ట్రంప్(77) గురువారం జార్జియాలోని ఫుల్టన్ కౌంటీ జైలులో అధికారుల ఎదుట లొంగిపోయారు. ఈ సమయంలో అధికారులు మగ్ షాట్ తీశారు. అమెరికా చరిత్రలో మాజీ అధ్యక్షుడి మగ్ షాట్ తీయడం ఇదే మొదటిసారి. ఆరడుగుల 3 అంగుళాల ఎత్తు, 97 కిలోల బరువు, స్ట్రాబెర్రీ రంగు జుట్టు, నీలం కళ్లు..అంటూ ట్రంప్ వివరాలను జైలు అధికారులు నమోదు చేశారు. ఆయనకు ఖైదీ నంబర్ పి01135809 కేటాయించారు. 22 నిమిషాల సేపు జైలులో గడిపిన ట్రంప్ రెండు లక్షల డాలర్ల బెయిల్ బాండ్‌పై విడుదలయ్యారు. అంతకుముందు, విమానంలో అట్లాంటా ఎయిర్‌పోర్టుకు చేరుకున్న ట్రంప్‌ను భారీ బందోబస్తు మధ్య ఫుల్టన్ కౌంటీ కోర్టుకు తీసుకొచ్చారు. ఫెడరల్, రాష్ట్ర అధికారులు నమోదు చేసిన వివిధ నేరారోపణలకు గాను ట్రంప్ ఈ ఏడాదిలో ఇప్పటి వరకు నాలుగుసార్లు లొంగిపోయారు. మగ్ షాట్ తీయడం మాత్రం ఇదే తొలిసారి. మగ్ షాట్ ఫొటోను ట్రంప్ తన సొంత ‘ట్రూత్ సోషల్’తోపాటు ‘ఎక్స్’ఖాతాలో పోస్ట్ చేశారు. ఎన్నికల్లో జోక్యం..ఎన్నటికీ లొంగను అంటూ వ్యాఖ్యానించారు. ఫుల్టన్ కౌంటీ జైలు అధికారులు విడుదల చేసిన ట్రంప్ మగ్ షాట్ సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యింది. విడుదలైన అనంతరం ట్రంప్ మీడియాతో మాట్లాడారు. తానెలాంటి తప్పు చేయలేదని చెప్పుకున్నారు. అమెరికాకు ఇది చెడు దినమని వ్యాఖ్యానించారు. -
‘తిండి పెట్టరు.. టాయిలెట్ నీళ్లే గతి’.. లిబియాలో నరకం చూసిన హరియాణా యువకులు
డాలర్లు సంపాదించాలనే కోరికతో హరియాణా, పంజాబ్‌కు చెందిన యువత ఇటలీకి తరలివెళుతుంటుంది. అయితే వారు ఊహించిన వాతావరణం అక్కడ ఉండదు. జైళ్లలో మగ్గిపోయే పరిస్థితులు కూడా ఏర్పడుతుంటాయి. ఇటువంటి నరకాన్ని చవిచూసిన హరియాణాకు చెందిన ఇద్దరు యువకులు ఆరు నెలల అనంతరం భారత్‌లోని తమ ఇంటికి తిరిగివచ్చారు. ఇక్కడికి చేరుకోగానే వారు తాము లిబియాలో ఎదుర్కొన్న చేదు అనుభవాలను ఢిల్లీలో మీడియా ముందు వెళ్లగక్కారు. ఒక ఏజెంట్ తమను ఇటలీ పంపిస్తామని చెప్పి రూ. 13 లక్షలు తీసుకుని లిబియాకు పంపించాడన్నారు. కొన్నాళ్లు లిబియాలో పనిచేశాక ఇటలీ పంపిస్తామని అ ఏజెంట్ నమ్మబలికాడన్నారు. అయితే తమకు లిబియాలో ఎవరికో అమ్మివేశాడన్నారు. వారు తమ చేత అన్నిరకాల పనులు చేయించారని, తరువాత ఏవో ఆరోపణలతో తమను జైలుకు పంపించారన్నారు. లిబియా జైలులో రెండుమూడు రోజుల పాటు ఎటువంటి ఆహారం ఇచ్చేవారు కాదని తెలిపారు. తాము చనిపోకుండా ఉండేందుకు టాయిలెట్ నీటిని అందించేవారన్నారు. లిబియాలో తమ లాంటి వారు చాలా మంది ఉన్నారని, వారంతా భారత్‌తో పాటు పలు దేశాలకు చెందినవారున్నారని తెలిపారు. తామంతా జైలులో నరకం చూశామన్నారు. అయితే తమలోని ఒక యువకుని దగ్గర ఫోన్ ఉందని, ఆ ఫోను సాయంతో రహస్యంగా భారత ఎంబసీకి ఫోన్ చేసి, తమ గోడు వెళ్లబోసుకున్నామన్నారు. ఎట్టకేలకు తమ ప్రయత్నాలు ఫలించి భారత ఎంబసీ సాయంతో 6 నెలల అనంతరం భారత్‌కు చేరుకోగలిగామన్నారు. బాధితుడు రాహుల్ సోదరి సోనియా మాట్లాడుతూ తన సోదరునికి ఇప్పుడు మరో జీవితం లభించినట్లయ్యిందన్నారు. తమ సోదరుడు తిరిగి రావడం వెనుక ప్రభుత్వం చొరవ ఉందన్నారు. ఇది కూడా చదవండి: చికెన్, పిజ్జా, వేడి ఆహారం కావాలంటూ ఖైదీల ఆందోళన.. జైలు గార్డును బంధించి.. -
జైలులో లొంగిపోతా: డొనాల్డ్ ట్రంప్
వాషింగ్టన్: అమెరికాలో రాబోయే అధ్యక్ష ఎన్నికల్లో మళ్లీ పోటీచేయడానికి సన్నాహాల్లో చేసుకుంటున్న మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ను కేసుల భయం, అరెస్టు భయం వెంటాడుతోంది. 2020లో జార్జియా రాష్ట్ర ఎన్నికల ఫలితాలను మార్చేయడానికి ప్రయతి్నంచిన కేసులో ట్రంప్ గురువారం ఫుల్టన్ కౌంటీ జైలులో లొంగిపోనున్నారు. ఈ విషయాన్ని ఆయన స్వయంగా సోషల్ మీడియాలో వెల్లడించారు. అరెస్టు కావడానికి జార్జియాలోని అట్లాంటాకు వెళ్తున్నానని తెలియజేశారు. అక్కడ జిల్లా అటార్నీ ఫానీ విల్లీస్ తనను అరెస్టు చేస్తారని పేర్కొన్నారు. తన అరెస్టు ప్రక్రియను అధ్యక్షుడు జో బైడెన్ ఆధ్వర్యంలోని డిపార్టుమెంట్ ఆఫ్ జస్టిస్ సమన్వయం చేస్తోందని ఆరోపించారు. ఎన్నికల ఫలితాలను తారుమారు చేయడానికి ప్రయతి్నంచిన కేసులో ట్రంప్‌తోపాటు మరో 18 మంది ఆగస్టు 25లోగా లొంగిపోవాలని గతంలో జడ్జి ఆదేశించారు. అయితే ట్రంప్‌తో పాటు మరో 18 మంది కూడా సరెండర్ కావడానికి సిద్ధమైనట్లు సమాచారం. -
ఒకసారి మంత్రి కుమారుడు, మరోసారి మనుమడు.. మధ్యలో తారలకు లేఖలు.. బ్లఫ్ మాస్టర్ స్టోరీ!
అతను మోసపూరితంగా రూ. 200 కోట్లు కొల్లగొట్టాడు. తీహార్ జైలులో ఉంటూ కూడా తన హవాను చాటుతున్నాడు. పలువులు హీరోయిన్లను తన వలలో బంధించాడు. లంచాలిచ్చి ప్రభుత్వ ఉద్యోగులను కొనేస్తాడనే ఆరోపణలున్నాయి. వీటిపై కించిత్తు కూడా స్పందించనట్టు కనిపిస్తాడు. ఈ రోజుకీ జైలు గోడల మధ్య ఉంటూనే తన ప్రియురాలికి ఉత్తరం రాశాడు.. అతను మరెవరో కాదు.. దేశంలో అతిపెద్ద మోసగాని(బ్లఫ్ మాస్టర్)గా పేరున్న సుఖేష్ చంద్రశేఖర్. ఇప్పుడు సుఖేష్ బాలీవుడ్ నటి జాక్వెలిన్ ఫెర్నాండెజ్‌కు రాసిన ప్రేమలేఖ చర్చనీయాంశంగా మారింది. నటి జాక్వెలిన్ ఫెర్నాండెజ్‌పై అమితమైన ప్రేమ హిందీ బాషలో రాసిన ఈ ఉత్తరంలో సుఖేష్ నటి జాక్వెలిన్ ఫెర్నాండెజ్‌పై తనకున్న ప్రేమను వ్యక్తం చేశాడు. ‘జీవితంలోకి ఎందరో వస్తుంటారు. అయితే కొందరు మాత్రమే మనసులో నిలిచిపోతుంటారు. వారిలో మీరొకరు’ అని ఆ ఉత్తరంలో రాశాడు. దీనికి ముందు సుఖేష్ మరో నటి నోరా ఫతేహీపై కూడా ఇదేవిధంగా తన ప్రేమను వ్యక్తం చేశాడు. 2015లో నటి లీనా మారియాను వివాహం చేసుకున్న సుఖేష్ చంద్రశేఖర్ భార్యతో కలసి మోసాలకు పాల్పడేవాడు. రాజకీయ నేత కుమారుడినని నమ్మబలికి.. సుఖేష్ చంద్రశేఖర్ బెంగళూరు వాస్తవ్యుడు. తన 17 ఏళ్ల వయసు నుంచే మోసాలకు పాల్పడుతూ వస్తున్నాడు. సుఖేష్ బెంగళూరులోని బిషప్ కాటన్ బాయిస్ స్కూలులో ప్రాథమిక విద్యను పూర్తిచేశాడు. అనంతరం మధురై యూనివర్శిటీ నుంచి గ్రాడ్యుయేషన్ చేశాడు. ఆ తరువాతి నుంచి మోసాల్లో మునిగితేలాడు. బెంగళూరుకు చెందిన ఒక కుటుంబం నుంచి సుఖేష్ కోట్ల రూపాయలు కొల్లగొట్టాడు. తాను ఒక పెద్ద రాజకీయ నేత కుమారుడినని చెప్పి, వారికి కావలిసిన పనులు చేయిస్తానని నమ్మబలికి, వారి నుంచి డబ్బులు లూటీ చేశాడు. ఈ ఘటనలో పోలీసులు అతనిని అరెస్టు చేశారు. అయినా సుఖేష్ తన తీరు మార్చుకోకుండా మోసాలు కొనసాగిస్తూ వచ్చాడు. మంత్రి మనుమడినని నమ్మించి.. ఈ ఉదంతం అనంతరం సుఖేష్ తాను ఒక మంత్రి మనుమడినని చెప్పి, కొంతమంది దగ్గర వారి పనులు చేయిస్తానని చెప్పి వారి నుంచి డబ్బులు వసూలు చేశాడు. చిన్నప్పటి నుంచి ధనవంతుడిని కావాలని తాపత్రయపడే సుఖేష్ లగ్జరీ లైఫ్ కోసం మోసపూరిత సామ్రాజ్యాన్ని ఏర్పరుచుకున్నాడు. ఈ నేపధ్యంలోనే 2017లో సుఖేష్ మరోమారు అరెస్టయ్యాడు. పార్టీ ఎన్నికల గుర్తు కేటాయిస్తానని చెబుతూ కొందరు నేతలను మోసగించాడు. ఈ కేసులో పోలీసులు అతనిని ఒక ఫైవ్‌స్టార్ హోటల్లో అరెస్టు చేశారు. అతనిని జైలు నుంచి విడిపిస్తానని.. ఆ తరువాత కూడా సుఖేష్ చంద్రశేఖర్ మోసాలు కోట్ల రూపాయలకు చేరుకున్నాయి. బెయిలుపై బయటకు వచ్చిన సుఖేష్ ఫార్టీస్ హెల్త్‌కేర్‌కు చెందిన ప్రొఫెసర్ శివిందర్ మోహన్ సింగ్ భార్య అదితి సింగ్‌ను మోసగించాడు. ఆ సమయంలో ఏదో కేసులో శివిందర్ సింగ్ జైలులో ఉన్నాడు. అతనిని జైలు నుంచి విడిపిస్తానని చెప్పి అదితి సింగ్ నుంచి రూ. 200 కోట్లు కొల్లగొట్టాడు. ఈ కేసులో సుఖేష్ చంద్రశేఖర్‌ను పోలీసులు మరోమారు అరెస్టు చేశారు. తీహార్ జైలులో ఊచలు లెక్కబెడుతూ.. ఎన్నోసార్లు అరెస్టయినా సుఖేష్ చంద్రశేఖర్ తన తీరుతెన్నులను మార్చుకోలేదు. ప్రస్తుతం తీహార్ జైలులో ఉన్న సుఖేష్ చంద్రశేఖర్ అక్కడ కూడా విలావంతమైన జీవితాన్ని గడుపుతున్నాడనే ఆరోపణలున్నాయి. ఇటీవలే బాలీవుడ్ నటి జాక్వెలిన్ ఫెర్నాండెజ్‌కు ఆమె పుట్టినరోజు సందర్భంగా ప్రేమ లేఖ రాశాడు. దీనికిముందు ఈస్టర్ రోజున కూడా జాక్వెలిన్‌కు లవ్ లెటర్ పంపాడు. ఇది కూడా చదవండి: అందం.. నేర సామ్రాజ్యంలోకి అడుగిడితే.. లేడీ డాన్ లవ్ స్టోరీస్! -
అబద్దాలతో పెళ్లి చేసుకుంటే.. ఇకపై పదేళ్ల జైలు..
ఢిల్లీ: 1860 నాటి భారత శిక్షాస్మృతి స్థానంలో భారతీయ న్యాయ సంహిత బిల్లును కేంద్ర హోంమంత్రి అమిత్ షా లోక్‌సభలో ప్రవేశపెట్టారు. మహిళలపై నేరాలకు సంబంధించిన నిబంధనలపై ప్రత్యేక దృష్టి సారించినట్లు తెలుస్తోంది. గుర్తింపును దాచిపెట్టి యువతిని వివాహం చేసుకుంటే ఇలాంటి నేరాలకు ఇకపై 10 ఏళ్ల వరకు శిక్ష పడే విధంగా నింబంధనలను పొందుపరిచారు. ఇదే కాకుండా ఉద్యోగం, పదోన్నతి వంటి తప్పుడు వాగ్దానంతో మహిళను వివాహమాడటం లేదా లైంగిక చర్యలకు పాల్పడితే కూడా పదేళ్ల వరకు శిక్ష పడే విధంగా నూతనంగా తీసుకువచ్చిన న్యాయ చట్టాల్లో నిబంధనలు పొందుపరిచారు. ఉద్యోగం, పదోన్నతి, వివాహం వంటి అంశాల్లో తప్పుడు వాగ్దానాలతో స్త్రీతో లైంగిక చర్యను అత్యాచారంగా పరిగణించలేదు కానీ పదేళ్ల వరకు శిక్ష ఉంటుందని స్టాండింగ్ కమిటీ పేర్కొంది. అత్యాచార ఘటనల్లో.. కొత్త న్యాయ చట్టాల ప్రకారం గ్యాంగ్‌రేప్ నేరంలో దోషికి 20 ఏళ్ల శిక్ష పడుతుంది. 18 ఏళ్లలోపు బాలికలపై అత్యాచారానికి ఒడిగడితే మరణిశిక్ష ఉంటుంది. అత్యాచారంలో బాధితురాలు మరణిస్తే.. 20 ఏళ్లకు తగ్గకుండా శిక్ష, జీవితకాలం లేదా మరణశిక్ష పడే అవకాశాలను చట్టంలో సూచించారు. 12 ఏళ్లలోపు బాలలపై రేప్ ఘటనల్లోనూ ఇదే తరహా శిక్షలు అమల్లోకి వస్తాయి. బ్రిటీష్ వలస పాలన తాలూకు అవశేషాలుగా కొనసాగుతూ వస్తున్న మూడు కీలక నేర న్యాయ చట్టాలకు చెల్లు చీటీ పాడే దిశగా శుక్రవారం పెద్ద ముందడుగు పడింది. వాటి స్థానంలో స్వదేశీ చట్టాలను తెచ్చేందుకు రంగం సిద్ధమైంది. ఇండియన్ పీనల్ కోడ్, క్రిమినల్ ప్రొసీజర్ కోడ్, ఎవిడెన్స్ యాక్ట్ లు చరిత్రగా మిగలనున్నాయి. వాటి స్థానంలో పూర్తి భారతీయ చట్టాలు రానున్నాయి. ఈ మేరకు న్యాయ సంహిత బిల్లు– 2023, భారతీయ నాగరిక్ సురక్షా సంహిత బిల్లు–2023, భారతీయ శిక్షా బిల్లు–2023లను కేంద్ర హోం మంత్రి అమిత్ షా లోక్ సభలో ప్రవేశపెట్టారు. ఇదీ చదవండి: ఐపీసీ, సీఆర్పీసీ స్దానంలో కొత్త చట్టాలు.. చిల్లర నేరాలకు శిక్షగా సామాజిక సేవ -
సామూహిక అత్యాచారం కేసులో ఇద్దరికి 20 ఏళ్ల జైలు
సాక్షి, అమరావతి/ గుంటూరు లీగల్/నగరంపాలెం: రాష్ట్రంలో సంచలనం రేకెత్తించిన రేపల్లె రైల్వేస్టేషన్లో జరిగిన సామూహిక అత్యాచారం కేసులో ఇద్దరు ముద్దాయిలకు 20 సంవత్సరాల జైలు శిక్ష, ఒక్కొక్కరికీ రూ.2,500 జరిమానా విధిస్తూ నాలుగో అదనపు జిల్లా, సెషన్స్ జడ్జి ఆర్.శరత్‌బాబు బుధవారం తీర్పు చెప్పారు. ప్రాసిక్యూషన్ కథనం ప్రకారం.. ప్రకాశం జిల్లా, యర్రగొండపాలెం మండలం, వెంకటాద్రిపురానికి చెందిన కొర్రపోలు రమేష్ వ్యవసాయ, తాపీ కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఆయనకు భార్య ఏసమ్మ, ముగ్గురు పిల్లలు సంతానం కాగా, భార్య మళ్లీ గర్భంతో ఉంది. కృష్ణాజిల్లా నాగాయలంకలో కూలి పనులు చేసుకునేందుకు రమేష్ తన భార్య, పిల్లలతో 2022 ఏప్రిల్ 30న గుంటూరులో రైలు ఎక్కి రేపల్లె వెళ్లాడు. అప్పటికి సమయం 11.45 కావడంతో రైల్వేస్టేషన్లోనే తన భార్య, పిల్లలతో రమేష్ నిద్రకు ఉపక్రమించాడు. అర్ధరాత్రి ఒంటిగంట సమయంలో పాలుబోయిన విజ యకృష్ణ, పలుచూరి నిఖిల్, మరో మైనర్ బాలు డు మద్యం మత్తులో రైల్వేస్టేషన్‌లోకి వచ్చారు. అక్కడ భార్య,పిల్లలతో నిద్రిస్తున్న రమేష్‌ను నిఖిల్ నిద్రలేపి టైం అడిగాడు. టైం చెప్పకపోవడంతో రమేష్‌ను కొట్టడం ప్రారంభించాడు. దీంతో రమేష్ స్టేషన్ బయటకు పరుగెత్తాడు. అక్కడే ఉన్న రమేష్ భార్యపై విజయకృష్ణ లైంగికదాడికి పాల్పడ్డాడు. రమేష్ పోలీసుస్టేషన్‌కు వెళ్లి పోలీసులను తీసుకొచ్చేసరికి నిందితులు పారిపోయారు. నిందితులు తన భార్యపై సామూహిక అత్యాచారం చేసినట్లు రమేష్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. రేపల్లె డీఎస్పీ టి.మురళీకృష్ణ, దిశ డీఎస్పీ యు.రవిచంద్ర దర్యాప్తు అనంతరం కోర్టులో చార్జిషీటు దాఖలు చేశారు. నేరం రుజువు కావడంతో న్యాయమూర్తి పైవిధంగా తీర్పు చెప్పారు. ప్రాసిక్యూషన్ తరఫున స్పెషల్ పీపీ శారదమణి వాదించారు. ఈ కేసులో మూడో ముద్దాయి మైనర్ కావడంతో తెనాలి పోక్సో కోర్టులో విచారణ జరుగుతుంది. సత్ఫలితాలనిస్తున్న కన్విక్షన్ బేస్డ్ పోలీసింగ్ అత్యాచార కేసుల్లో దోషులకు సత్వరం శిక్షలు విధించేలా పోలీసు శాఖ కోర్ట్ ట్రయల్ మానిటరింగ్ విధానాన్ని సమర్థంగా అమలు చేస్తున్నదని డీజీపీ కేవీ రాజేంద్రనాథ్ రెడ్డి చెప్పారు. బాపట్ల జిల్లా రేపల్లె రైల్వేస్టేషన్లో గతేడాది ఓ మహిళపై అత్యాచారం చేసిన కేసులో పాలుబోయిన విజయకృష్ణ, పాలుచురి నిఖిల్‌ను దోషులుగా గుర్తిస్తూ న్యాయస్థానం 20 ఏళ్లు జైలు శిక్ష విధించడం కేసు దర్యాప్తులో పోలీసుల సమర్థతకు నిదర్శనమన్నారు. కన్విక్షన్ బేస్డ్ పోలీసింగ్ ద్వారా గతేడాది కాలంగా గుర్తించిన 122 కేసుల్లో 102 కేసుల్లో దోషులకు శిక్షలు పడ్డాయన్నారు. ముగ్గురికి మరణశిక్ష, 37మందికి జీవిత ఖైదు, 62 కేసుల్లో 7 ఏళ్ల నుంచి 20 ఏళ్ల వరకు జైలు శిక్ష పడిందన్నారు. ఈ తీర్పు ఓ గుణపాఠం.. రేపల్లె రైల్వేస్టేషన్లో జరిగిన సామూహిక అత్యాచారం కేసులో ఇచ్చిన తీర్పు మహిళలపై అఘాయిత్యాలకు పాల్పడే వారికి ఓ గుణపాఠమని బాపట్ల జిల్లా ఎస్పీ వకుల్‌జిందాల్ తెలిపారు. గుంటూరు జిల్లా పోలీస్ కార్యాలయ ఆవరణలోని స్పందన హాల్లో బుధవారం సాయంత్రం విలేకరులతో మాట్లాడారు. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు బాధితురాలికి తక్షణ సాయంగా రూ.10 లక్షలు, ఎస్సి, ఎస్టి కేసు కింద రూ.8.50 లక్షలు, ఎంపీ, ఎమ్మెల్యే నుంచి రూ.1.50 లక్షలు అందజేసినట్లు చెప్పారు. కాగా, ఈ కేసులో అన్ని కోణాల్లో దర్యాప్తు వేగవంతం చేసి, నిందితులకు శిక్షలు పడే వరకు ప్రతిభ కనబరిచిన స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ శారదామణి, డిప్యూటీ డైరెక్టర్ ప్రాసిక్యూషన్ మధుసూదనరావు, తదితర పోలీసు సిబ్బందిని ఎస్పీ అభినందించి, ప్రశంసాపత్రాలు, రివార్డులు అందజేశారు. -
'ఇంత భయంకరమైన జైలులో ఉండలేను..'
ఇస్లామాబాద్: తొషాఖానా కేసులో పాకిస్థాన్ మాజీ అధ్యక్షుడు ఇమ్రాన్ ఖాన్ జైలు శిక్షను అనుభవిస్తున్నారు. ఇమ్రాన్ ఖాన్‌ను అతి దారుణమైన సెల్లో ఉంచారనే విషయాన్ని ఇటీవల ఆయన తరుపు లాయర్ చెప్పిన విషయం తెలిసిందే. అయితే.. తనను ఆ జైలు నుంచి బయటకు తీసుకురావాలని ఇమ్రాన్ ఖాన్ కోరినట్లు ఆయన తరుపు న్యాయవ్యాది చెప్పారు. పగలు ఈగలు, రాత్రి కీటకాలు ఇబ్బంది పెడుతున్న భయంకరమైన జైలులో జీవితాంతం ఉండలేనని చెప్పినట్లు వెల్లడించారు. అవినీతి కేసులో ఇస్లామాబాద్ ట్రయల్ కోర్టు ఇమ్రాన్ ఖాన్ దోషిగా నిర్ధారించిన కొద్దిసేపటికే లాహోర్‌లోని అతని ఇంటి నుండి ఖాన్‌ను అరెస్టు చేశారు. అనంతరం రావల్పిండిలోని అడియాలా జైలుకు పంపాలని అధికారులను ఆదేశించినప్పటికీ, అతన్ని పంజాబ్ ప్రావిన్స్‌లోని అటాక్ నగరంలోని అటాక్ జైలుకు తరలించారు. కోర్టు తీర్పును సవాలు చేసేందుకు ఖాన్ తరపు న్యాయవాది హైకోర్టులో పిల్ దాఖలు చేశారు. తీర్పును సవాలు చేసే క్రమంలో ఇమ్రాన్ ఖాన్‌ను కలిసేందుకు ఆయన తరపు న్యాయవాది నయీమ్ హైదర్ పంతోజీ ఇటీవల జైలుకి వెళ్లారు. ఈ నేపథ్యంలో ఇమ్రాన్‌తో ఆయన దాదాపు గంట పాటు మాట్లాడారు. తనకు జైల్లో కల్పిస్తున్న సదుపాయాలు చాలా దారుణంగా ఉన్నాయని ఇమ్రాన్ చెప్పినట్లు న్యాయవాది మీడియాతో వెల్లడించారు. ఇదీ చదవండి: పాకిస్తాన్ జాతీయ అసెంబ్లీ రద్దు.. తాత్కాలిక ప్రధాని ఎవరు? -
పురుగులున్న చీకటి గదిలో ఉంచారు, జీవితాంతం జైల్లోనే ఉంటా: ఇమ్రాన్ ఖాన్
ఇస్లామాబాద్: తోషాఖానా కేసులో అరెస్టైన పాకిస్తాన్ మాజీ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ ప్రస్తుతం జైల్లో శిక్ష అనుభవిస్తున్నారు. కోర్టు తీర్పును సవాలు చేసే క్రమంలో ఇమ్రాన్ ఖాన్‌ను కలిసేందుకు ఆయన తరపు న్యాయవాది నయీమ్ హైదర్ పంతోజీ జైలుకి వెళ్లారు. ఈ నేపథ్యంలో ఇమ్రాన్‌తో ఆయన దాదాపు గంట పాటు మాట్లాడారు. తనకు జైల్లో కల్పిస్తున్న సదుపాయాలు చాలా దారుణంగా ఉన్నాయని ఇమ్రాన్ చెప్పినట్లు న్యాయవాది మీడియాతో వెల్లడించారు. అరెస్టు చేసే సమయంలోనూ పోలీసులు కనీసం వారెంటు చూపించలేదని, అంతేకాకుండా తన భార్య గది తలుపులను పగలగొట్టేందుకు ప్రయత్నించారని ఇమ్రాన్ ఆరోపించినట్లు చెప్పారు. ‘ నన్ను ఓపన్ వాష్‌రూం ఉన్న ఓ చిన్న చీకటి గదిలో ఉంచారు. టీవీ, వార్తాపత్రిక కూడా లేదు. ఈగలు, చీమల బెడద ఎక్కువగా ఉంది. ఉగ్రవాదిగా చూస్తున్నారు! ఎవరినీ కలిసేందుకు అనుమతించడం లేదు. అయినప్పటికీ.. జీవితమంతా జైలులో గడపడానికి తాను సిద్ధంగా ఉన్నానని ఇమ్రాన్ చెప్పారని ఆయన తరఫున న్యాయవాది తెలిపారు. కాగా అవినీతి కేసులో ఇస్లామాబాద్ ట్రయల్ కోర్టు అతన్ని దోషిగా నిర్ధారించిన కొద్దిసేపటికే లాహోర్‌లోని అతని ఇంటి నుండి ఖాన్‌ను శనివారం అరెస్టు చేశారు. అనంతరం రావల్పిండిలోని అడియాలా జైలుకు పంపాలని అధికారులను ఆదేశించినప్పటికీ, అతన్ని పంజాబ్ ప్రావిన్స్‌లోని అటాక్ నగరంలోని అటాక్ జైలుకు తరలించారు. ఇదిలా ఉండగా.. ప్రస్తుత జాతీయ అసెంబ్లీ గడువు ఆగస్టు 12న పూర్తికానుండగా, ఈ ఏడాది చివర్లో పాకిస్థాన్ సార్వత్రిక ఎన్నికలకు వెళ్లనుంది. ఈ నేపథ్యంలో ఆయనకు మూడేళ్ల శిక్ష పడింది. దీంతో ఇమ్రాన్ రాజకీయ జీవితం ఇక ముగిసినట్లే కనిపిస్తోంది. చదవండి: స్మార్ట్ఫోనే కొంపముంచిందా? పాపులర్ పబ్లిషింగ్ హౌస్ సీఈవో దుర్మరణం -
జైలు గోడ దూకి నేపాలీ యువతి పరార్..!.. ఆచూకీ చెబితే..
ఉత్తరాఖండ్‌లోని పిథోర్‌గఢ్ జిల్లా జైలులో ఎన్డీపీఎస్ యాక్ట్ సంబంధిత ఆరోపణలతో బందీగా ఉంటున్న నేపాలీ యువతి జైలు గోడ దూకి పారిపోయింది. దుస్తులతో తాడు తయారు చేసుకుని, దాని సాయంతో ఆ యువతి గోడ దూకి పారిపోయిందని పోలీసులు చెబుతున్నారు. ఆమెను పట్టుకునేందుకు 12 పోలీసు బృందాలు వివిధ ప్రాంతాల్లో గాలింపు చర్యలను ముమ్మరం చేశాయి. ఆమె నేపాల్ పారిపోయే అవకాశం ఉన్నందున సహస్త్ర సీమా బల్(ఎస్ఎస్బీ)సాయంతో పోలీసులు నేపాల్ సరిహద్దుల్లో చెకింగ్ కట్టుదిట్టం చేశారు. ఆచూకీ చెబితే రూ. 10 వేలు పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం పిథోర్‌గఢ్ పట్టణంలోని వివిధ ప్రాంతాల్లో గల సీసీటీవీ ఫుటేజ్‌ల సాయంతో ఆ యువతిని వెదికిపట్టుకునేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. అలాగే ఈ యువతి ఆచూకీ తెలిపిన వారికి రూ. 10 వేలు అందజేస్తామని తెలిపారు. పరారైన యువతిని పట్టుకునేందుకు సహకరించాలని పోలీసులు కోరుతున్నారు. మాదకద్రవ్యం తరలిస్తుండగా.. నేపాల్‌లోని దుమలింగ్ గ్రామానికి చెందిన అనుష్క ఉరఫ్ ఆకృతి(25)ని రెండున్నరేళ్ల క్రితం ధార్చులాలో రెండున్నర కిలోల చరస్ (మాదకద్రవ్యం)తరలిస్తుండగా ఎస్ఎస్బీ పట్టుకుంది. ఆమె విచారణలో ఉన్నందున ఆమెను పిథోర్‌గఢ్ జిల్లా జైలులో బందీగా ఉంచారు. ఆమె పరారైన నేపధ్యంలో జైలుతో పాటు మొత్తం పోలీసు శాఖలో కలకలం చెలరేగింది. దీంతో పోలీసు బృందాలు ఆమె కోసం ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టాయి. పోలీసులకు అందిన సమాచారం ప్రకారం పరారైన యువతి లింక్ రోడ్డు పరిధిలోని సీసీటీవీలో కనిపించింది. అక్కడి నుంచి ఆమె పాండే గ్రామం మీదుగా పరారవుతూ కనిపించింది. ఇది కూడా చదవండి: తెలుగు పోలీసు అధికారికి గుజరాత్లో అరుదైన గౌరవం -
‘అడియాలా’కి బదులు ‘అటోక్’కి ఇమ్రాన్ ఖాన్
ఇస్లామాబాద్: తోషఖానా అవినీతి కేసులో మూడేళ్లు జైలు పడిన పాకిస్తాన్ మాజీ ప్రధానమంత్రి ఇమ్రాన్‌ఖాన్‌ను ప్రభుత్వం అటోక్ జైలుకు తరలించింది. కానీ ఇమ్రాన్‌ను రావలి్పండిలోని అడియాలా జైల్లో ఉంచాలని ఇస్లామాబాద్ ట్రయల్ కోర్టు ఆదేశాల్లో స్పష్టంగా పేర్కొంది. ఇమ్రాన్‌కు అడియాలా జైల్లో భద్రత కల్పించాలని పేర్కొంది. అయితే ప్రభుత్వం మాత్రం కోర్టు ఆదేశాలు పట్టించుకోకుండా అటోక్ జైలుకి తరలించినట్టుగా ఒక నివేదిక వెల్లడించింది. అటోక్ జైలుకి తరలించడం కోసమే లాహోర్ పోలీసులు ఇమ్రాన్‌ను అరెస్ట్ చేసినట్టు ఆ నివేదిక పేర్కొంది. ఇమ్రాన్‌ను కలవడానికి అనుమతించడం లేదు: పీటీఐ ఆందోళన జైల్లో ఉన్న ఇమ్రాన్‌ను కలవడానికి పార్టీ న్యాయవాదులకి అనుమతించడం లేదని తెహ్రీక్ ఇ ఇన్సాఫ్ పార్టీ ఆరోపించింది. కోర్టు కు సమర్పించాల్సిన డాక్యుమెంట్లపై సంతకాలు తీసుకోవడానికి అనుమతి కోరినా అధికారులు నిరాకరించినట్టు ఒక ప్రకటనలో పే ర్కొంది. ఇమ్రాన్‌ను అరెస్ట్ చేయలేదని కిడ్నా ప్ చేసి తీసుకువెళ్లారని విరుచుకుపడింది. -
Imran Khan:ఇమ్రాన్ క్లీన్‌బౌల్డ్
ఇస్లామాబాద్: పాకిస్తాన్ ఎన్నికలకి సన్నాహాలు జరుగుతున్న వేళ మాజీ ప్రధానమంత్రి ఇమ్రాన్‌ఖాన్‌కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. తోషఖానా అవినీతి కేసులో ఇస్లామాబాద్ జిల్లా కోర్టు ఆయనను దోషిగా తేలుస్తూ మూడేళ్ల జైలు శిక్ష విధించింది. వచ్చే అయిదేళ్ల పాటు ఎన్నికల్లో పోటీ చేయడానికి వీల్లేకుండా ఇమ్రాన్‌పై అనర్హత వేటు వేసింది. ఇస్లామాబాద్ జిల్లా సెషన్స్ కోర్టు అదనపు న్యాయమూర్తి హుమాయూన్ దిలావర్ శనివారం ఇమ్రాన్‌కు మూడేళ్ల జైలు శిక్ష విధిస్తూ తీర్పు చెప్పిన కాసేపటికే పోలీసులు ఆయనను అరెస్ట్ చేశారు. 2018 నుంచి 2022 మధ్య కాలంలో ప్రధానిగా ఉన్న ఇమ్రాన్‌ఖాన్ ప్రభుత్వానికి వచ్చిన కానుకల్ని అక్రమ మార్గాల్లో కారు చౌకగా తానే కొనుగోలు చేశారని తోషఖానా కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఈ కేసులో మూడేళ్ల జైలు శిక్షతో పాటుగా న్యాయమూర్తి లక్ష రూపాయల జరిమానా కూడా విధించారు. జరిమానా చెల్లించని పక్షంలో మరో ఆరు నెలలు జైల్లో ఉండాల్సి ఉంటుందని తీర్పులో స్పష్టం చేశారు. ‘‘ఇమ్రాన్‌ఖాన్ ఉద్దేశపూర్వకంగానే ప్రభుత్వానికి వచ్చిన కానుకల్ని తీసుకున్నారు. ఆ కానుకల ద్వారా తాను పొందిన ఆర్థిక లబ్ధిని దాచి ఉంచడానికి ప్రయత్నించారు. తోషఖానా కానుకలకు సంబంధించిన సమాచారం అందించడంలో ఇమ్రాన్‌ఖాన్ మోసం చేశారనడానికి తగిన ఆధారాలున్నాయి. ఇమ్రాన్ఖా న్ నిస్సందేహంగా అవినీతిపరుడని రుజువైంది’’ అని న్యాయమూర్తి హుమయూన్ ఆ తీర్పులో పేర్కొన్నారు. ఎప్పుడైతే మూడేళ్ల జైలు శిక్ష పడిందో రాజ్యాంగంలోకి ఆర్టికల్ 63(1)(హెచ్) ప్రకారం అయిదేళ్లపాటు ఇమ్రాన్‌పై అనర్హత వేటు పడింది. ఇమ్రాన్‌ఖాన్ పదవిలో ఉన్న మూడున్నరేళ్ల కాలంలో ప్రపంచ దేశాల అధినేతల నుంచి రూ.14 కోట్ల విలువైన 58 కానుకలు పొందారు. ఆగస్టు 9న జాతీయ అసెంబ్లీని రద్దు చేసి మూడు నెలల్లోగా ప్రభుత్వం ఎన్నికలకు వెళ్లనున్న నేపథ్యంలో ఇమ్రాన్‌కు శిక్ష పడడం చర్చనీయాంశంగా మారింది. న్యాయమూర్తి తీర్పు వెలువరించిన కొద్ది సేపటికే లాహోర్‌లోని జమన్ పార్క్‌లో ఇమ్రాన్‌ఖాన్ నివాసం నుంచి ఆయనను పోలీసులు అరెస్ట్ చేశారు. లాహోర్ నుంచి ఇమ్రాన్‌ను హెలికాఫ్టర్‌లో ఇస్లామాబాద్‌కు తరలించారు. శాంతియుతంగా నిరసనలు చేయండి: ఇమ్రాన్‌ఖాన్ అరెస్ట్‌ను ముందే ఊహించిన ఇమ్రాన్.. కార్యకర్తలనుద్దేశిస్తూ చేసిన ప్రసంగాన్ని రికార్డు చేసి ఉంచారు. ఇమ్రాన్ అరెస్ట్ అయిన కొద్ది గంటల్లోనే ఆయన సందేశాన్ని సామాజిక మాధ్యమాల్లో విడుదల చేశారు. ‘సందేశం మీరు వినే సమయానికి నేను జైల్లో ఉంటాను. పార్టీ సభ్యులందరూ ఇళ్లలో కూర్చోకుండా బయటకు వచ్చి శాంతియుతంగా నిరసనలు చేయండి. నేను చేస్తున్న పోరాటం నా కోసం కాదు. మీ కోసం. మీ పిల్లల భవిష్యత్ కోసం. మీరు మీ హక్కుల కోసం పోరాడకపోతే బానిసలుగా బతకాల్సి వస్తుంది. బానిసలకు ఎప్పుడూ బతుకు ఉండదు. బానిసలంటే నేల మీద పాకే చీమలతో సమానం. వారు పైకి ఎగరలేరు. ఎదగలేరు. మీ హక్కుల్ని మీరు కాపాడుకునే వరకు శాంతియుత నిరసనలు చేయండి. భవిష్యత్‌లో మీరు ఎన్నుకునే ప్రభుత్వం ఉండాలి కానీ కబ్జా మాఫియా కాదు’’ అని ఇమ్రాన్ తన సందేశంలో పేర్కొన్నారు. తనను అరెస్ట్ చేయడానికి ఒక్క రోజు ముందు ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. వచ్చే ఎన్నికల్లో తమ పార్టీ అఖండ విజయం సాధిస్తుందన్న భయం ప్రభుత్వానికి ఉందని విమర్శించారు. గణనీయంగా ఓటు బ్యాంకు పెరుగుతున్న తమ పార్టీని ఎలా నిర్వీర్యం చేస్తారని ఇమ్రాన్ ప్రశ్నించారు. భుట్టో నుంచి ఇమ్రాన్ వరకు పాకిస్తాన్ ప్రధానులు, మాజీ ప్రధానులు జైలు పాలవడం సర్వసాధారణంగా మారింది. ఒక్కసారి చరిత్రలోకి తొంగి చూస్తే ఎందరో తమ చరమాంకంలో జైలు జీవితాన్నే గడిపారు. మిలటరీయే శక్తిమంతంగా ఉండే దేశంలో జనరల్ అయూబ్‌ఖాన్, యాహ్యాఖాన్, జియా ఉల్ హక్, పర్వేజ్ ముషార్రఫ్ వంటి వారు నిర్దాక్షిణ్యంగా ప్రభుత్వాల్ని కూలదోసి పగ్గాలు చేపట్టారు. ► పాకిస్తాన్ అయిదో ప్రధానిగా సేవలందించిన షాహీద్ సుహ్రావార్డీ జాతి వ్యతిరేక కార్యకలా పాలకు పాల్పడుతున్నారన్న ఆరోపణలపై 1962లో జైలు పాలయ్యారు. అప్పటి మిలటరీ పాలకుడు జనరల్ అయూబ్ ఖాన్‌కు మద్దతు ఇవ్వడానికి నిరాకరించడంతోనే ఆయనపై కేసులు పెట్టారు. ► దేశ తొమ్మిదో ప్రధాని జుల్ఫీకర్ ఆలీ భుట్టో తన రాజకీయ ప్రత్యర్థి హత్యకు కుట్ర పన్నారన్న అభియోగాలపై 1974లో అరెస్ట్ చేశారు. 1979, ఏప్రిల్ 4న ఆయనని ఉరి తీశారు. ► దేశానికి ఏకైక మహిళా ప్రధాని అయిన బెనజీర్ భుట్టో పలుమార్లు అరెస్టయ్యారు. 1985లో తొలిసారిగా ఆమెను హౌస్ అరెస్ట్ చేశారు. తిరిగి 1999లో అవినీతి కేసులో ఆమెకు అయిదేళ్లు జైలు శిక్ష పడింది. శిక్షను తప్పించుకోవడానికి ఆమె ప్రవాసం వెళ్లిపోయారు. తిరిగి దేశానికి వచ్చాక 2007లో రావల్పిండిలో ఎన్నికల ప్రచార సభలో పాల్గొన్నాక బెనజీర్ దారుణ హత్యకు గురయ్యారు. ► 1999లో జనరల్ పర్వేజ్ ముషార్రఫ్ పదవీ పగ్గాలను తీసుకున్నాక అప్పటి ప్రధాని నవాజ్ షరీఫ్‌ను అరెస్ట్ చేశారు. ఆ తర్వాత ఆయన పదేళ్ల పాటు ప్రవాసంలో ఉన్నారు. 2018 జూలైలో నవాజ్ షరీఫ్, ఆయన కుమార్తె అవినీతి కేసులో పదేళ్ల జైలు శిక్ష పడింది. 2019లో చికిత్స కోసం లండన్ వెళ్లిన ఆయన ఇప్పటికీ తిరిగి రాలేదు. -
జైల్లో ఉన్న భర్తకి గంజాయి.. పక్కా ప్లాన్, చివరిలో అక్కడ దొరికిపోయింది!
బెంగళూరు: సాధారణంగా దంపతులు మధ్య అన్యోనత ఉండడం సహజం. ఇక కొందరు భార్యాభర్తలు ఒకరిమీద మరొకరు ఎనలేని ప్రేమను చూపిస్తుంటారు. అడిగిన వెంటనే తెచ్చి ఇవ్వడం, కాదని చెప్పలేకపోవడం, ప్రేమగా తమ తోడుని చూసుకుంటూ ఉంటారు. అయితే భార్యభర్తల మధ్య ఎంత ప్రేమ ఉన్నప్పటికీ ప్రతీ దానికి ఓ హద్దు ఉంటుంది. దాని దాటితే లేనిపోని చిక్కుల్లో పడాల్సి వస్తుంది. తాజాగా ఈ తరహా ఘటనే కలబురగిలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. జైల్లో ఉన్న భర్త కోసం గంజాయి అందివ్వాలని ఓ భార్య పథకం వేసింది. అనుకన్నట్టే గంజాయి సిద్ధం చేసి ఇవ్వటానికి వెళ్లిన ఆ మహిళ చివరికి తనిఖీల్లో పట్టుబడింది. పట్టణంలోని కేంద్ర కారాగారంలో జాలేంద్రనాథ్ కావళెకి అనే వ్యక్తి ఖైదీగా ఉన్నాడు. సోమవారం భర్తను కలవటానికి వచ్చిన భార్య సునీత రెండు జీన్స్ ప్యాంట్స్ అందజేసింది.భద్రతా సిబ్బంది బ్యాగును పరిశీలించగా గంజాయి లభ్యమైంది. దీంతో ఆమెను అరెస్ట్ చేశారు. చదవండి: అబిడ్స్‌లో బ్యూటీపార్లర్ నిర్వాకం.. ఆయిల్ పెట్టగానే ఊడిపోయిన మొత్తం జుట్టు -
జోకర్ వేషంలో కల్లోలం సృష్టించాడు..చివరికీ అదే..
ఓ వ్యక్తి ఎలాంటి కారణం లేకుండా మనుషులను చంపడమే ధ్యేయంగా పెట్టుకున్నాడు. ఎందుకు? ఏమిటీ అనే కారణాలతో సంబంధం లేకుండా దారుణాలకు ఒడిగట్టాడు. దొరకననే ధైర్యమా లేక టైం పాస్‌కి అలా చేశాడో తెలియదు. చివరికీ ప్రజలంతా అతడ్ని చంపేయాలని తీర్మానించారు. అప్పుడైనా మార్పు వచ్చిందో లేదో గానీ అకారణంగా అమాయకులు ప్రాణాలు బలిగ్నొ దుర్మార్గుడిగా నిలిచిపోయాడు. వివరాల్లోకెళ్తే..ఓ వ్యక్తి కామిక్ బుక్‌లో ఉండే జోకర్లా వేషం ధరించి టోక్యలోని ఓ రైలులో మారణకాండకు తెగబడ్డాడు. విచక్షణ రహితంగా కాల్పులు జరిపి 70 ఏళ్ల వృద్ధిడితో సహా దాదాపు 12 మంది వ్యక్తులను నిర్ధాక్షిణ్యంగా చంపేశాడు. ఆ దారుణం 2021లో జరిగింది. ఐతే ఆ టైంలో ఆ ఘటనకు పాల్పడిన వ్యక్తి ఎవ్వరో తెలియక పోలీసులు తలపట్టుకున్నారు. ఎందువల్ల ఇలా చేశాడని ఎంతలా ఆరా తీసినా? ఎవరా వ్యక్తి? అనేది ఓ మిస్టరీలా మిగిలిపోయింది. ఐతే చేసిన పాపం వదిలిపెట్టదు కదా. ఎట్టకేలకు పోలీసులు శతవిధాల చేసిన ప్రయత్నాలు సఫలం అయ్యి ఆగంతకుడిని పట్టించేలా చేసింది. పోలీసులు ఆ దారుణానికి పాల్పడిన వ్యక్తిని క్యోటా హట్టోరి(26)గా గుర్తించి అదుపులోకి తీసుకుని అరెస్టు చేసి..కోర్టు ముందు హాజరుపర్చారు. విచారణలో తాను ప్రజలు చంపాలనుకున్నట్లు ఒప్పుకున్నాడు కూడా. దీంతో కోర్టు అతడికి 23 ఏళ్ల జైలు శిక్ష విధించింది. దొరక్కూడదని చేసిన ఏ చిన్న నేరమైన ఏదో రూపంలో దోషిగా నిలబెట్టేస్తుంది. ఇక ఆ సమయంలో నువ్వు బాధపడినా ప్రయోజనం ఉండదు. (చదవండి: ఓ వ్యక్తి 'మానవశునకం'గా రూపాంతరం.. కుక్కలా వీధుల్లో సంచరిస్తూ..) -
ఒక్క ఎమోజీ చాలు.. జైలుకు పంపడానికి..!
‘థంబ్స్ అప్’ ఎమోజీ సంతకం మాదిరిగా చెల్లుబాటవుతుందా? అది ఎదైనా ఒప్పందానికి మిమ్మల్ని బంధించగలదా? ఒక సీనియర్ ఉద్యోగి పని ప్రదేశంలో అతని జూనియర్‌కు హార్ట్ ఎమోజీని పంపితే అవి లైంగిక వేధింపుల కిందికి వస్తాయా? ఇదేవిధంగా తుపాకీ లేదా కత్తి ఎమోజీని ఎవరైనా పంపితే దానిని ప్రాణాలకు ముప్పుగా భావించాలా? యుఎస్ నుండి యూకే వరకూ.. న్యూజిలాండ్, ఫ్రాన్స్, భారతదేశంలోనూ భావోద్వేగాలు, కార్యకలాపాలను వ్యక్తీకరించడానికి ఉపయోగించే చిన్నపాటి ఇలస్ట్రేటెడ్ క్యారెక్టర్ల విభిన్న వివరణలు ఇప్పుడు ముప్పుగా పరిణమిస్తున్నాయి. కొన్ని దేశాలు ఎమోజీలను సాక్ష్యంగా ఉపయోగించుకోవడంతో న్యాయ పోరాటాలు కొనసాగుతున్నాయి. ఈ జాబితాలో తాజాగా కెనడాలోని కోర్టు తీర్పు చేరింది. ఈ దేశానికిచెందిన న్యాయమూర్తి 'థంబ్స్ అప్' ఎమోజీ సంతకం మాదిరిగా చెల్లుబాటు అవుతుందని తేల్చిచెప్పారు. ఒక కేసులో ఎమోజీని ఆధారంగా చేసుకుని ఒకరైతు 61,000 యూఎస్ డాలర్ల మొత్తాన్ని ప్రత్యర్థికి చెల్లించాలని ఆదేశించారు! ఈ కొత్త వాస్తవికతకు న్యాయస్థానాలు అనుగుణంగా ఉండాలని ఆయన తన తీర్పులో వాదించారు. సహజమైన పురోగతి ఎమోజీల విషయంలో భారతదేశంలో చట్టమేదీ లేనందున వాణిజ్య చర్చల సమయంలో వ్యక్తులు,వ్యాపార సంస్థలు జాగ్రత్తగా ఉండటం కీలకంగా మారిందని సుప్రీంకోర్టు న్యాయవాది కుశాంక్ సింధు అన్నారు. డిజిటల్ చర్చలలో మరింత ఆలోచనాత్మకంగా ఉండటం, ఒప్పందపు చర్చలలో ఎమోజీలను ఉపయోగిస్తున్నప్పుడు మరింత జాగ్రత్తగా ఉండటం తెలివైన పని అని ఆయన హెచ్చరించారు. కమ్యూనికేషన్ విధానాలు అభివృద్ధి చెందుతున్న దశలో ఎమోజీలు కూడా న్యాయ వ్యవస్థలోకి ప్రవేశించడం సహజమైన పురోగతి అని తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ‘మిడిల్ ఫింగర్ ఎమోజీని తొలగించాలి’ థంబ్స్-అప్ ఎమోజీ కొన్ని దేశాల్లో అభ్యంతరకరంగా, అసభ్యంగా ఉందనే చర్చను లేవనెత్తగా, చైనాలో స్మైలీ ఫేస్ ఎమోజీని వ్యంగ్యంగా తీసుకుంటున్నారు. భారతదేశంలోని మధ్య వేలు ఎమోజీ అసభ్యకరంగా పరిగణిస్తున్నారు. దీనిపై ఢిల్లీకి చెందిన లాయర్ గుర్మీత్ సింగ్.. మొబైల్ మెసేజింగ్ యాప్ వాట్సాప్‌కు లీగల్ నోటీసు పంపి, 15 రోజుల్లోగా "మిడిల్ ఫింగర్" ఎమోజీని తొలగించాలని కోరారు. మధ్య వేలును చూపడం చట్టవిరుద్ధం మాత్రమే కాదు, అశ్లీలమైన, అసభ్యకరమైన సూచిక. ఇది భారతదేశంలో నేరమని పేర్కొన్నారు. సోషల్ మీడియా, మెసేజింగ్ ప్లాట్‌ఫారమ్‌ల ప్రాబల్యం అపరిమితంగా ఉన్నప్పటికీ వ్యాపారం, అధికారిక కమ్యూనికేషన్లో వృత్తి నైపుణ్యాన్ని కొనసాగించడం చాలా అవసరమని ఏఐసీఐ సీఐపీ, ఇండియన్ స్కూల్ ఆఫ్ ఇమేజ్ మేనేజ్మెంట్ వ్యవస్థాపకురాలు సోనియా దూబే దేవాన్ తన అభిప్రాయాన్ని వెల్లడించారు. ఇది కూడా చదవండి: వేలానికి 121 ఏళ్ల క్యాడ్బరీ చాక్లెట్.. నాటి తీయని వేడుకకు గుర్తుగా.. కాంట్రాక్ట్ ఫార్మేషన్ విషయంలో.. భారత న్యాయశాస్త్రంలో చట్టపరమైన సంబంధాలను నెలకొల్పే ఉద్దేశ్యంతో కాంట్రాక్ట్ ఏర్పాటుకు స్పష్టమైన ఆఫర్, స్పష్టమైన అంగీకారం అవసరం. ఇండియన్ కాంట్రాక్ట్ చట్టం, 1872 కాంట్రాక్ట్ ఫార్మేషన్లో ఎమోజీలు లేదా ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్ల వినియోగాన్ని ప్రస్తావించలేదు. అయితే మనదేశంలోని న్యాయస్థానాలు.. ఈ-మెయిల్లు, తక్షణ సందేశం వంటి ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్ ద్వారా ఏర్పడిన ఒప్పందాల చెల్లుబాటును గుర్తించాయి. కొన్ని ప్రత్యేక పరిస్థితులలో వాట్సాప్ సమన్లు చెల్లుబాటు అయ్యే మోడ్‌గా గుర్తించారు. ఈ నేపధ్యంలో వాణిజ్య చర్చల్లో పాల్గొనే వ్యక్తులు.. తాము ఎలా కమ్యూనికేట్ చేస్తున్నాం? తమ వాట్సాప్ సంభాషణలు,ఈ-మెయిల్లతో సహా మౌఖిక, రాతపూర్వక కమ్యూనికేషన్లలో ఏమి పేర్కొనాలనే దానిపై జాగ్రత్తగా ఉండటం చాలా ముఖ్యమని సుప్రీంకోర్టు న్యాయవాది కుశాంక్ సింధు తెలిపారు. ఎమోజీల వాడకంతో సంబంధం కలిగిన సంభావ్య చట్టపరమైన పరిణామాల గురించి పార్టీలు తప్పనిసరిగా తెలుసుకోవాలని, వివాదాలను నివారించడానికి, ఈ-ఎన్ఎఫ్ఓఆర్సి ఇ బిఐఎల్ఐటి వైని నిర్ధారించడానికి వారి ఉద్దేశాల స్పష్టతను గుర్తుంచుకోవాలని ఆయన తెలిపారు. మద్రాస్ హైకోర్టులో ఎమోజీ కేసు వాట్సాప్ గ్రూప్‌లో 'కన్నీళ్లతో నవ్వుతున్న ముఖం' అనే ఎమోజీని పోస్ట్ చేసినందుకు కొంతమంది వ్యక్తులపై ఫిర్యాదు వచ్చిన కేసును మద్రాస్ హైకోర్టు విచారించింది. 2018లో హైకోర్టు ఈ కేసులో.. ఎమోజీకి సంబంధించిన వివరణను గమనించినప్పుడు అనేక భావాలను తెలియజేయడానికి ఎమోజీలు పోస్ట్ చేస్తారని పేర్కొంది. ఏదైనా ఫన్నీ లేదా నవ్వు తెప్పించినప్పుడు ఈ ఎమోజీ ఉపయోగిస్తారు. ఎమోజీని ఉపయోగించడం వల్ల వేధింపులకు అవకాశం ఉండకపోవచ్చు, అయితే అది ఫిర్యాదుదారుని కించపరిచేలా ఉన్నందున అలాంటి చర్యను ఖండిస్తున్నట్లు హైకోర్టు ఒక హెచ్చరికతో ఆ ఫిర్యాదును తోసిపుచ్చింది. ఏది ఏమైనప్పటికీ పౌర, వాణిజ్య న్యాయ న్యాయశాస్త్రంలో ఎమోజీల ఉపయోగం వివరణ, ప్రభావం మారవచ్చని శశాంక్ పేర్కొన్నారు. ప్రాథమిక సాక్ష్యంగా న్యాయస్థానంలో.. సీనియర్ ఐపీఎస్ అధికారి శిఖా గోయెల్ ఈ అంశంపై స్పందిస్తూ కేవలం ఎమోజీలు మాత్రమే చట్టపరమైన చర్యలకు కారణం కాదని అన్నారు. ఎలక్ట్రానిక్ మెసేజ్‌లు, ఎమోజీల కంటెంట్లు ప్రాథమిక సాక్ష్యంగా న్యాయస్థానంలో అనుమతిపొందవు. అయితే అటువంటి ఎలక్ట్రానిక్ సందేశాలను సాక్ష్యంగా అంగీకరించనప్పటికీ.. విచారణ సమయంలో ప్రధాన సాక్ష్యం, క్రాస్ ఎగ్జామినేషన్ ద్వారా ఆ కంటెంట్లను నిరూపించాలన్నారు. ఐపీఎస్ అధికారి శిఖా గోయెల్ ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర పోలీసు మహిళా భద్రతా విభాగానికి నేతృత్వం వహిస్తున్న అదనపు డీజీపీ ర్యాంక్ అధికారి. ఆమె ఈ విషయమై ఒక తీర్పును ఉటంకిస్తూ (అంబాలాల్ సారాభాయ్ ఎంటర్ప్రైజ్ లిమిటెడ్ వెర్సెస్ కేఎస్ ఇన్‌ఫ్రాస్పేస్ ఎల్ఎల్పీ లిమిటెడ్‌తోపాటు మరో కేసులో.. ఇది జనవరి 6, 2020 నాటిది), వర్చువల్ వెర్బల్ కమ్యూనికేషన్లయిన వాట్సాప్ మెసేజ్‌లు సాక్ష్యాధారాల ద్వారా విచారణ జరిగే సమయంలో రుజువు చేయగల అంశం అని సుప్రీం కోర్టు పేర్కొంది. అయితే ఈ-మెయిల్లు, వాట్సాప్ సందేశాల ప్రకారం ఒక ఒప్పందం కుదిరిందా లేదా అనే విషయాన్ని అర్థం చేసుకోవడానికి స్పషంగా వాటిని అర్థం చేసుకోవాల్సి ఉంటుందని శిఖా గోయల్ పేర్కొన్నారు. ఇది కూడా చదవండి: సరస్సును ఖాళీ చేయిస్తారట.. ఎందుకంటే నిర్ణయించదగిన సాక్ష్యం రూపంలో.. భారత న్యాయస్థానాలు, దర్యాప్తు అధికారులు.. వినియోగదారు ఉద్దేశాన్ని అర్థంచేసుకోవడానికి చెల్లుబాటు అయ్యే నిర్ణయాత్మక సాక్ష్యంగా ఎమోజీల వినియోగాన్ని అంగీకరించారు. ముఖ్యంగా లైంగిక వేధింపులు, ఇతర క్రిమినల్ కేసులలో ఇది ఉపయోగపడుతుందని అకార్డ్ జ్యూరిస్ న్యాయవాది, సహ వ్యవస్థాపకురాలు శ్రద్ధా గుప్తా అన్నారు. మన బహుళసాంస్కృతిక సమాజంలో ఎమోజీలపై ఏకరీతి వివరణ లేదని ఆమె పేర్కొన్నారు. ఇటువంటి వ్యాఖ్యానం వ్యక్తికి వ్యక్తికి మారుతూ ఉంటుంది. ఇది సంస్కృతి, ప్రాంతం, తరం, వృత్తి మొదలైనవాటిని అనుసరించి కూడా మారవచ్చని అన్నారు. ఉదాహరణకు ఒక డాక్యుమెంట్‌ను స్వీకరించినందుకు లేదా పత్రాన్ని పంపడంలో చేసిన ప్రయత్నాన్ని తెలియజేస్తూ 'థమ్స్ అప్'ని పంపవచ్చు. ఇది ఇండియా కాంట్రాక్ట్ చట్టం ప్రకారం అంగీకారంగా భావిస్తే కేసులు మరింతగా పెరుగుతాయన్నారు. ది లా ఛాంబర్స్‌లోని సీనియర్ అసోసియేట్ అయిన శ్రద్ధ అభిప్రాయపడ్డారు. ఎమోజీలపై వివరణాత్మక మార్గదర్శకత్వం క్రమబద్ధీకరించే వరకు, ఇటువంటి కమ్యూనికేషన్ మోడ్‌ను ద్వితీయ సాక్ష్యంగా మాత్రమే పరిగణించాలన్నారు. అపార్థాలకు ఆస్కారం లేకుండా.. ఎమోజీలను ఒక్కొక్కరు ఒక్కో విధంగా అర్థం చేసుకోవడం వలన అపార్థాలకు ఆస్కారం ఏర్పడుతుంది. అందుకు ఎమోజీలను వినియోగించే విషయంలో స్పష్టతను నిర్ధారించడం, గందరగోళాన్ని తగ్గించడం చేయాలని న్యాయ నిపుణురాలు సోనియా తెలిపారు. పరస్పర మర్యాదలను అర్థం చేసుకుని వ్యాపార, అధికారిక వ్యవహారాలలో సమర్థవంతమైన కమ్యూనికేషన్‌ను ఈ విధమైన రీతిలో ప్రోత్సహించవచ్చన్నారు. వ్యాపారం లేదా అధికారిక సంభాషణలో ఇతర వ్యక్తులతో ఈవిధంగా కమ్యూనికేట్ చేయడం మంచి పద్ధతి అని ఆమె పేర్కొన్నారు. ఎమోజి గందరగోళాన్ని నావిగేట్ చేయడానికి ఉండవలసిన ప్రాథమిక నియమం ఏమిటంటే.. ఎమోజీ వినియోగించే ముందు మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోవాలి. అనవసరమైన ఎమోజీలను ఉపయోగించకపోవడమే శ్రేయస్కరమని కూడా ఆమె సూచించారు. ఇది కూడా చదవండి: ‘పెళ్లిళ్లే నా ఆరోగ్య రహస్యం’.. ఐదో పెళ్లి చేసుకున్న 90 ఏళ్ల వరుని స్టేట్మెంట్ -
నేరాలను తగ్గించేలా.. సరికొత్త అత్యాధునిక జైలు
జైలు అనగానే సినిమాలే గుర్తోస్తాయి. వాటిల్లో చూపించనంత అందంగా ఏమి ఉండవు. కానీ ఇప్పుడూ ఆ జైళ్లనే ఖైదీలలో పరివర్తన వచ్చేలా గొప్ప కేంద్రాలుగా మారుస్తున్నారు. అలాగే వారి శిక్షకాలం పూర్తి చేసుకున్న తదుపరి హాయిగా జీవించేలా నైపుణ్యాలు సంపాదించుకునేలా చేసేందుకు శ్రీకారం చుట్టింది బ్రిటన్ ప్రభుత్వం. మరోసారి ఎటువంటి నేరాలకు దిగకుండా ఉండి, వారి భవిష్యత్తును వారంతట వారే తీర్చిదిద్దకునేలా చేస్తున్నారు అక్కడి అధికారులు. అందుకోసం అని "హెచ్ఎంపీ ఫోస్సే వే" అనే పేరుతో అత్యాధునికి జైలుని నిర్మిస్తున్నారు. ఇందులో దగ్గర దగ్గరగా దాదాపు వెయ్యిమందికి పైగా అంటే 1,715 మంది దాక ఖైదీలు ఉండేంత స్థలం ఉంటుంది. ఖైదీలకు పునరావసం కల్పించడం తోపాటుగా ఆర్థిక వ్యవస్థను పెంచడంలో సహాయపడేందుకు ఈ కొత్త జైలుని ప్రారంభించారు. ఈ కొత్త జైలు నిర్మాణంలో 71 మంది ఖైదీలు, ఇద్దరు మాజీ నేరస్తులు పనిచేయాలనే ఒక నిబంధన కూడా ఉంది. ఇక్కడ మొత్తం 24 వర్కషాప్‌లు ఉంటాయి. నేరస్తులు ఇక్కడ నిర్మాణ వాహనాలను ఎలా నడపాలి, అద్దాలను ఎలా తయారు చేయాలి, జైలు నిర్మాణానికి సంబంధించి కాంక్రీట్ విభాగాలు, లైటింగ్ పరికరాలు తదితరాలకు సంబంధించిన పనులు నేర్చుకుంటారు. ఇప్పటి వరకు బ్రిటన్‌లో ఉన్న ఆరు అత్యాధునికి జైళ్లలో ఇది రెండోది. ఈ జైలుని.. చుట్టూ పచ్చని చెట్లతో ఆహ్లాదకరమైన వాతావరణంలో నిర్మించారు. అలాగే యూకేలో ఇప్పటి వరకు నిర్మించిన పచ్చటి జైలు కూడా అదే. బ్రిటన్ ప్రభుత్వం ప్రజలకు వాగ్దానం చేసిన నాలుగు బిలియన్ పౌండ్ల నిర్మాణ కార్యక్రమంలో భాగంగా ఈ అత్యాధునిక జైలుని నిర్మించింది. అలాగే ఖైదీలు తమ శిక్ష కాలం పూర్తి అయిన వెంటనే ఉపాధిని వెతుక్కోవడం ఈజీ అవ్వడమే గాక సమాజంలో ఎలాంటి ఢోకా లేకుండా ధైర్యంగా బతకగలగుతారని చెబుతున్నారు బ్రిటన్ అధికారులు. (చదవండి: యమహానగరీ..నీటిలో తేలియాడే నగరం) -
మహిళపై అత్యాచారం.. భారతీయ విద్యార్థికి యూకేలో ఆరేళ్ల జైలు శిక్ష
మద్యం మత్తులో ఉన్న ఓ మహిళను అత్యాచారం చేసిన కేసులో భారతీయ మూలాలున్న యువకునికి ఆరేళ్ల జైలు శిక్ష విధించింది యూకే కోర్టు. గత ఏడాది నైట్ క్లబ్లో పరిచయమైన ఓ మహిళపై ఈ దారుణానికి పాల్పడ్డాడని కోర్టు ఈ తీర్పు ఇచ్చింది. #INCOURT l A man has been jailed for raping at a woman at a halls of residence in #Cardiff. CCTV showed Preet Vikal carrying the victim in his arms and later across his shoulders out of the city centre. 1/2 pic.twitter.com/wfYrIggd7o — South Wales Police Cardiff (@SWPCardiff) June 16, 2023 ప్రీత్ వికాల్(20) యూకేలో ఇంజినీరింగ్ చదవడానికి వెళ్లిన భారతీయ యువకుడు. గత ఏడాది నైట్‌క్లబ్‌లో తప్పతాగి సృహలో లేని మహిళను ప్రీత్ చేతులపై ఎత్తుకెళ్లిన దృశ్యాలు సీసీటీవీ కెమెరాల్లో రికార్డ్ అయ్యాయి. మహిళను తన నివాసానికి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు. అనంతరం ఆమె ఫొటోలను తన స్నేహితులకు షేర్ చేశాడు. ఇవే ఈ కేసులో పోలీసులకు కీలకంగా మారాయి. ఈ ఆధారాలతో ప్రీత్ వికాల్ నేరానికి పాల్పడినట్లు పోలీసులు గుర్తించి అరెస్టు చేశారు. ఆధారాలను గమనించిన న్యాయస్థానం ప్రీత్‌ను దోషిగా గుర్తించి ఆరేళ్ల జైలు శిక్ష విధించింది. ఇదీ చదవండి:చైనా కంపెనీ వింత నిబంధన: అఫైర్లు వద్దు.. విడాకుల మాటే ఎత్తొద్దు...! -
32 ఏళ్లనాటి కేసులో గ్యాంగ్‌స్టర్ ముఖ్తర్ అన్సారీకి జీవిత ఖైదు
ఉత్తరప్రదేశ్: 32 ఏళ్ల నాటి హత్య కేసులో ఐదుసార్లు ఎమ్మెల్యే, గ్యాంగ్‌స్టర్ ముఖ్తర్ అన్సారీకి వారణాసి కోర్టు జీవిత ఖైదు విధించింది. దాంతో పాటు లక్ష రూపాయల జరిమానాను కూడా విధించింది. అతనిపై నమోదైన 61 కేసుల్లో ఇది ఆరో కేసు. అతడు నిందితుడిగా ఉన్న మరో 20 కేసులు విచారణ దశలో ఉన్నాయి. ముఖ్తర్ అన్సారీకి గత ఏప్రిల్‌లోనే ఓ కిడ్నాప్, హత్య కేసులో పదేళ్ల జైలు శిక్ష పడింది. అతనిపై అనేక క్రిమినల్ కేసులు, భూకబ్జాలు, హత్య, దోపిడీ కేసులు నమోదయ్యాయి. అన్సారీ రాజకీయంలోకి రాకముందు 1991లోనే కాంగ్రెస్ నాయకుడి హత్య కేసులో నిందితునిగా ఉన్నాడు. 1991 ఆగష్టు 3న మాజీ ఎమ్మెల్యే అజయ్ రాజ్ సోదరుడు అవదేశ్ రాయ్‌ని దుండగులు కాల్చి చంపారు. ఈ కేసులో ముఖ్తర్ అన్సారీ, భీమ్ సింగ్, ఎమ్మెల్యే అబ్దుల్ కలీమ్‌తో సహా మరో ఇద్దరి పేర్లను ఎఫ్ఐఆర్లో చేర్చారు. ఈ కేసులో ముఖ్తర్ అన్సారీని వారణాసి కోర్టు మే19 దోషిగా తేల్చి, తీర్పును రిజర్వ్ చేసింది. ఉత్తరప్రదేశ్ చరిత్రలోనే సంచలనమైన బీజేపీ నాయకుడు కృష్ణానంద్ రాయ్ హత్య కేసులోనూ అన్సారీ నిందితుడిగా ఉన్నాడు. ముఖ్తర్ అన్సారీ 1996, 2002, 2007,2012తో సహా 2017లో ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఇతని కుమారుడు అబ్బాస్ అన్సారీ 2022లో ఎస్బీఎస్పీ తరుపున ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ప్రస్తుత తీర్పుతో అవదేశ్ రాయ్ సోదరుడు అజయ్ రాజ్ సంతోషం వ్యక్తం చేశారు.'32 ఏళ్ల పోరాటానికి నేటికి దోషికి శిక్ష పడింది. ప్రభుత్వాలు మారాయి. అన్సారీ మరింత బలపడ్డారు.నేను, నా తల్లిదండ్రులు, సోదరుడు అవదేశ్ పిల్లలు ఎంతో ఓర్పుతో పోరాడాము' అని ఆయన అన్నారు. ఇదీ చదవండి:మంచు పెళ్లలు విరిగిపడి మహిళ మృతి -
కొత తరహాలో సైబర్ మోసం..ఆస్ట్రేలియా జైల్లో..
ఇంతవరకు సైబర్ నేరస్తులు ఏదో ఒక ఎర వేసి లేదా ఆశ చూపో వారి ట్రాప్‌లోకి దించి డబ్బులు దుండుకునేవారు. అదీ కుదరకపోతే ఏకంగా అత్యున్నత హోదా అధికారి పేరు చెప్పి ట్రాప్ చేసేవారు. ఇక వాటన్నింటిని అధిగమించి కొత్త తరహాలో నేరాలకు తెగబడుతున్నారు. అందుకోసం ఆయా వ్యక్తుల నేపథ్యం గురించి తెలుసుకుని ట్రాప్ చేసి మోసం చేస్తున్నారు. అచ్చం అలానే ఓ కుటుంబం రూ. 4 లక్షలు పొగొట్టుకుంది. వివరాల్లోకెళ్తే..ఉత్తర ఢిల్లీలోని ఓ కుటుంబం సైబర్ నేరగాళ్ల వలలో చిక్కుకుని రూ. 4 లక్షలు పోగొట్టుకుంది. 29 ఏళ్ల గుర్సిమ్రాన్ సింగ్ ఈ విషయమై పోలీసులుకు ఫిర్యాదు చేయడంతో ఈ ఘటన వెలుగు చూసింది. ఆ వ్యక్తి తన తల్లికి ఓ అంతర్జాతీయ కాల్ వచ్చిందని పోలీసులకు తెలిపాడు. వారి బంధువు నౌనిహాల్ ఆస్ట్రేలియాలో చదువుకుంటున్నాడు అతడి పేరు చెప్పి సైబర్ నేరగాళ్లు ఆ కుటంబాన్ని దోచుకున్నారు. ఓ రోజు తన తల్లికి నౌనిహాల్ సింగ్ అని పరిచయం చేసుకుంటూ ఓ కాల్ వచ్చింది. అతడు తమ బంధువే కదా అని అతడి తల్లి ఫోన్లో మాట్లాడింది. ఆ తర్వాత కొద్దిరోజుల అనంతరం నైనిహాల్ స్నేహితులందరూ జైల్లో ఉన్నారని, వారంతా ఓ వ్యక్తితో గొడపడ్డట్టు చెప్పుకొచ్చాడు. నైనిహాల్ మాత్రమే బయటే ఉన్నట్లు తెలిపాడు. కేసు గురించి మరింతగా విచారించడానికి ఒక న్యాయవాది ఆమెను పిలుస్తారని అతను తన తల్లికి చెప్పాడని పోలీసులకు వెల్లడించాడు. కొద్ది వ్యవధిలోనే ఓ న్యాయవాది ఫోన్ చేసి నౌనిహాల్ని జైలుకు పంపారని, బెయిల్ పొందడానికి పోలీసులకు డబ్బులు డిపాజిట్ చేయాలని చెప్పాడు. చెల్లించకపోతే సుమారు 15 నుంచి 20 ఏళ్ల వరకు కటకటాల్లోనే ఉంటాడని చెప్పాడు. పైగా డబ్బులు డిపాజిట్ చేసేందుకు రాంచీలోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్రాంచ్‌కి సంబంధించి విక్రమ్ కుమార్ ముండా పేరిట ఉన్న ఖాతా నెంబర్‌ను ఇచ్చాడు. మొదట రెండు లక్షలు అని చెప్పాడు. ఆ తర్వాత ఆస్ట్రేలియా పోలీసులు రూ. 2.5 లక్షలు డిమాండ్ చేస్తున్నట్లు తెలిపాడు. దీంతో ఆ కుటుంబం విడతలు వారీగా ఆర్టీజీఎస్ ద్వారా నగదును అతడిచ్చిన ఖాతా నెంబర్‌కు బదిలీ చేశారు. ఆ తర్వాత బంధువుల్ని విచారించగా..నౌనిహాల్ క్షేమంగా ఉన్నాడని, తనపై అతడి స్నేహితులపై ఎలాంటి కేసు నమోదు చేయలేదని తెలిసి ఆ కుటుంబం ఒక్కసారిగా షాక్‌కి గురైంది. తాము సైబర్ మోసానికి బలయ్యినట్లు గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు గుర్సిమ్రాన్ సింగ్ పేర్కొన్నాడు. ఉత్తర ఢిల్లీకి చెందిన మరో కుటుంబాన్ని ఇదే తరహాలో మోసం చేసేందుకు యత్నించి నేరగాళ్లు విఫలమైనట్లు అధికారులు తెలిపారు. ఆ కేసులో కూడా..ఆ కుటుంబానికి కెనడాలో బంధువులు ఉన్నారు. దీంతో సైబర్ నేరగాళ్లు మీ బంధువులు జైలులో ఉన్నారని వారిని బెయిల్‌పై విడుదల చేయడానికి డబ్బు అవసరమంటూ ట్రాప్ చేసేందుకు యత్నించారు. అయితే వారు డబ్బులు డిమాండ్ చేయడంతో అనుమానం వచ్చి ఎంక్వైయిరీ చేస్తే అది నకిలీ ఫోన్ కాల్ అని తేలిందని పోలీసులు చెప్పుకొచ్చారు. (చదవండి: షాకింగ్ ఘటన: ఏకంగా 45 బ్యాగుల్లో మానవ అవశేషాలు!) -
‘పిల్లలు కావాలి సార్.. నా భర్తకి పెరోల్ ఇవ్వండి’
భోపాల్: సెంట్రల్‌జైలు అధికారులకు ఓ మహిళ చేసిన అరుదైన అభ్యర్థన ప్రస్తుతం వార్తల్లోకెక్కింది. తనకు సంతానం కావాలని, అందుకు జైలులో ఉన్న తన భర్తను పెరోల్‌పై విడుదల చేయాలని ఆమె జైలు అధికారులకు దరఖాస్తు చేసింది. ఈ ఘటన మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. శివపురికి చెందిన ఓ మహిళ దారా సింగ్ జాదవ్ అనే వ్యక్తిని కొన్ని సంవత్సరాల క్రితం పెళ్లి చేసుకుంది. అయితే పెళ్లయిన కొద్ది రోజులకే జాదవ్ హత్య కేసులో పోలీసులు అరెస్ట్ చేశారు. ఇటీవల దారా సింగ్ జాదవ్ తండ్రి కరీం సింగ్ జాదవ్ అనారోగ్యానికి గురయ్యారు. చనిపోయేలోపు మనవడిని, మనవరాలిని చూడాలనుకున్నాడు. దీంతో ఆ మహిళ తన భర్తను పెరోల్‌పై విడుదల చేయాలని జైలు అధికారులకు దరఖాస్తు చేసింది. ఈ విషయంపై గ్వాలియర్ సెంట్రల్ జైలు సూపరింటెండెంట్ విదిత్ సిరివియా మాట్లాడుతూ.. జీవిత ఖైదు శిక్ష పడ్డ ఖైదీలు వారి రెండేళ్లు శిక్షాకాలంలో మంచిగా ప్రవర్తిస్తే పెరోల్ పొందే అవకాశముందని చెప్పారు. అయితే ఈ పెరోల్ మంజూరు నిర్ణయం జిల్లా కలెక్టర్ చేతుల్లోనే ఉందని అధికారలు చెబుతున్నారు. గతంలోనూ రాజస్థాన్‌లోని జోధ్‌పుర్ న్యాయస్థానం.. ఇటువంటి కేసులో ఓ ఖైదీకి 15 రోజుల పెరోల్ మంజూరు చేసిన సంగతి తెలిసిందే. చదవండి: ఎంతకు తెగించారు.. అద్దెకు ఇల్లు తీసుకుని ఇంటినే డ్రగ్స్ ఫ్యాక్టరీగా మార్చారు! -
Imran Khan: పదేళ్లు జైల్లో పెట్టేలా కుట్ర! అయినా తగ్గేదేలే! నాచివరి..!
పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు బెయిల్‌పై విడుదలైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఖాన్ లాహోర్‌లో తన నివాసంలో పీటీఐ నేతలతో సమామేశం నిర్వహించిన తదనంతరం పాక్ ఆర్మీ గురించి సంచలన వ్యాఖ్యలతో వరుస ట్వీట్లు చేశారు. పాక్‌లోని శక్తిమంతమైన సైనిక స్థాపన తనను పదేళ్ల పాటు జైల్లో ఉంచేందుకు ప్లాన్ చేస్తోందన్నారు. ప్రస్తుతం లండన్ ప్లాన్ ముగిసింది కాబట్టి ఆ దిశగా పావులు కదుపుతోందన్నారు. వారు చట్టాలను తమ చేతుల్లోకి తీసుకుని శిక్షలు అమలు చేసే దుశ్చర్యకు పాల్పడుతున్నారు. తన భార్యని జైల్లో పెట్టి తనను అవమానపాలు చేసే యోచనలో కూడా ఉన్నట్లు తెలిపారు. దేశద్రోహం వంటి బలమైన చట్టాలను ఉపయోగించి పదేళ్ల వరకు జైల్లో మగ్గిపోయేలా చేసేందుకు పాక్ ఆర్మీ కుట్ర పన్నుతోందని ట్వీట్ చేశారు. అంతేగాదు ఆ సమయంలో ప్రజాస్పందన రాకుండా జాగ్రత్త పడేలా రెండు కీలకమైన పనులు కూడా చేస్తారని అన్నారు. అందులో.. ఒకటి ఉద్దేశపూర్వకంగా తన పార్టీ పాకిస్తాన్ తెహ్రీక్ ఇ ఇన్సాఫ్ (పీటీఐ) కార్యకర్తలు, సాధారణ పౌరుల గొంతును అణిచివేసేలా హింసాత్మక దాడి, రెండోది మీడియాను నియంత్రించడం అని చెప్పుకొచ్చారు. అలాగే అరెస్టు చేసే ముందే ఇంటర్నెట్ సేవలను నిలిపేసి, సోషల్ మీడియాను నిషేధించడం వంటివి చేస్తారు. ప్రజలు భయబ్రాంతులకు లోనయ్యేలా పోలీసులు ఇళ్లలోకి చొరబడి మహిళల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించడం వంటి దారుణాలకు పాల్పడతారంటూ ఆర్మీపై ఆరోపణలు చేశారు ఖాన్. అలాగే ఈ సందర్భంగా పాక్ ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ..తన చివరి రక్తపు బొట్టు వరకు హకీకీ ఆజాదీ కోసం పోరాడతానని, క్రూరమైన మోసాలకు బానిసలవ్వడం కంటే మరణమే ఉత్తమమని అన్నారు. అయినా మనం చేసే ఇల్లా హ ఇల్లాల్లాహ్ అని ప్రతిజ్ఞను గుర్తుపెట్టుకోవాలని ప్రజలకు సందేశం ఇచ్చారు. మనం కేవలం అల్లాకు తప్ప మరెవరికి తలవంచం అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలని ప్రజలను కోరారు. ఇలాంటి అన్యాయపూరితమైన చట్టాలు దేశంలో ఎక్కువ కాలంపాటు మనుగడ సాగించలేవని చెప్పారు. కాగా ఇమ్రాన్ ఖాన్ అరెస్టుతో పాక్ ఒక్కసారిగా హింసాత్మకంగా మారిపోయింది. ఈ ఘటనలో పీటీఐ కార్యకర్తలు, పౌరులు తోసహ సుమారు 40 మంది దాక పాక్ ఆర్మీ చేతిలో మృతి చెందినట్లు అధికారులు పేర్కొన్నారు. (చదవండి: యువతి బంగీ జంప్! తాడు తెగడంతో..) -
బీఎస్పీ ఎంపీకి నాలుగేళ్ల జైలుశిక్ష
-
అతీఖ్ హంతకుల జైలు మార్పు
లక్నో: ఉత్తర ప్రదేశ్ గ్యాంగ్‌స్టర్-పొలిటీషియన్ అతీఖ్ అహ్మద్, అతని సోదరుడు అష్రాఫ్‌లను కాల్చి చంపిన నిందితులను అధికారులు జైలు మార్చారు. సన్నీ సింగ్, అరుణ్ మౌర్యా, లవ్లేష్ తొవారిలను ప్రయాగ్‌రాజ్ నైనీ జైలు నుంచి ప్రతాప్‌ఘడ్ జైలుకు మార్చేశారు ఉత్తర ప్రదేశ్ పోలీసులు. నైనీ జైలులో వాళ్లపై దాడి జరగవచ్చేనే నిఘా వర్గాల సమాచారం మేరకు ముగ్గురు హంతకులను జైలు మార్చేసినట్లు అధికారులు వెల్లడించారు. ఫేమస్ కావాలనే తాము అహ్మద్ గ్యాంగ్‌ను ఏరివేసే పనిలో దిగామని, ఈ క్రమంలోనే అతీఖ్, అతని సోదరుడిని కాల్చిచంపామని ఈ ముగ్గురు పోలీసుల ఎదుట నేరాన్ని అంగీకరించారు. మరోవైపు కోర్టు వీళ్లకు 14 రోజుల జ్యూడీషియల్ కస్టడీ విధించిన సంగతి తెలిసిందే. ఇక అతీఖ్,అష్రాఫ్‌ల హత్య ఘటనపై ముగ్గురు సభ్యులతో కూడిన జ్యూడీషియల్ ఎంక్వైరీ కమిటీని ఏర్పాటు చేసింది యూపీ ప్రభుత్వం. మరోవైపు యూపీ పోలీస్ శాఖ కూడా రెండు సిట్(స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం)లను ఏర్పాటు చేసినట్లు ప్రకటించింది. యూపీ పోలీసుల కథనం ప్రకారం.. శనివారం రాత్రి అతీఖ్, అష్రాఫ్‌లను వైద్యపరీక్షల కోసం తరలిస్తుండగా జర్నలిస్టుల ముసుగులో వచ్చిన ఆ ముగ్గురు.. తుపాకులతో కాల్చి చంపిన తర్వాత జై శ్రీరామ్ నినాదాలు చేస్తూ పోలీసులకు లొంగిపోయారు. వాళ్ల నుంచి ఫేక్ ఐడీకార్డులు , కెమెరా, మైక్‌లను స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. ముగ్గురిలో లవ్లేష్కు తూటా కాలి నుంచి దూసుకుపోవడంతో ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. అంతకు ముందు.. బుధవారం ఝాన్సీలో జరిగిన ఎన్కౌంటర్లో ఉమేష్‌పాల్ హత్య కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న అతీఖ్ తనయుడు అసద్ అహ్మద్‌ను, అతన్ని అనుచరుడ్ని పోలీసులు ఎన్కౌంటర్ చేశారు. -
నల్లులు కారణంగా చనిపోయిన ఖైదీ..దర్యాప్తు చేస్తున్న అధికారులు
ఓ ఖైదీ అనూహ్యంగా జైల్లోనే చనిపోయాడు. అయితే అతని ఒంటిపై ఎలాంటి గాయాలు లేవు. దీంతో అతడి కుటుంబ సభ్యులు ఎందువల్ల అతను చనిపోయాడో దర్యాప్తు చేయాలంటూ పట్టుబట్టారు. అతను నల్లుల కారణంగానే చనిపోయాడని, జైల్లో అపరిశుభ్ర వాతావరణం ఉందని ఆరోపణలు చేశారు. దీంతో అధికారులు ఈ ఘటనపై దర్యాప్తు చేయడం ప్రారంభించారు. ఈ ఘటన అమెరికాలో అట్లాంటాలో చోటు చేసుకుంది. అసలేం జరిగందంటే..లాషాన్ థాంప్సన్ అనే వ్యక్తి జూన్ 12, 2022న అరెస్టు అయ్యాడు. ఆ తర్వాత అతను ఫుల్టన్ కౌంటీ జైలుకి తరలించారు. అతడు మానసిక అనారోగ్యంతో ఉన్నట్లు నిర్ధారించి అధికారుల అతని మానసిక రోగుల విభాగంలోకి సెప్టంబర్ 13, 20222న మార్చారు. ఆ తర్వాత మూడు నెలలకే అతను అనుహ్యంగా చనిపోయాడు. థాంప్సన్ ఉంచిన గది ఒక రోగిని ఉంచాల్సిన సెల్ కాదని, చాలా అపరిశుభ్రంగా ఉందని అతడి బంధువులు ఆరోపించారు. అక్కడ ఉన్న నల్లుల కారణంగానే అతను చనిపోయాడని ఆరోపణలు చేశారు. అలాగే పోస్ట్‌మార్టం రిపోర్టులో కూడా అతని ఒంటిపై ఎలాంటి గాయాలు లేవని, తీవ్రమైన నల్లుల దాడి జరిగిందని తేలింది. దీంతో అతను ఎలా చనిపోయాడో దర్యాప్తు చేయాలంటూ జైలు అధికారులను డిమాండ్ చేశారు ఆ ఖైదీ బంధువులు. దీంతో ఫుల్టన్ కౌంటీ షెరీఫ్ కార్యాలయం అధికారులను ఆ దిశగా తక్షణ చర్యలు చేపట్టాల్సిందిగా ఆదేశాలు జారీ చేసింది. అలాగే సెల్లో ఉన్న మిగతా ఖైదీల భద్రతా ప్రోటోకాల్‌పై విచారణ చేయడమే గాక సంరక్షణ చర్యలు చేపట్టమని ఆదేశించింది. అక్కడ ఉన్న ఖైదీల ఆరోగ్య సంరక్షణపై తనీఖీలు నిర్వహించడమేగాక, ఏదైనా ఆరోపణ రుజవైతే తక్షణమే చర్యలు తీసుకుంటామని ఫుల్టన్ కౌంటీ షెరీఫ్ కార్యాలయం ప్రకటించింది. అయితే నల్లులు ప్రాణాంతకం కాదని, కొన్ని అరుదైన సందర్భాల్లో తీవ్రమైన రక్తహీనతకు కారణమవుతుందన్నారు కెంటకీ విశ్వవిద్యాలయ శ్రాస్తవేత్త. చికిత్స చేయకుండా అలా వదిలేస్తే ఒక్కోసారి ప్రాణాంతకమవుతుందని కూడా చెప్పారు. (చదవండి: హైట్‌గా ఉండేలా రెండుసార్లు సర్జరీలు..రీజన్ వింటే షాక్ అవుతారు!) -
పరివర్తన బాటతో పదుగురికీ సేవ
పెద్దాపురం: జైలులో అలవర్చుకున్న ఆరోగ్య స్పృహను పదిమందికీ తెలియజేస్తున్నాడు మసిముక్కల రామకృష్ణ. అక్కడ నేర్చుకున్న యోగాను బయటకొచ్చి నేర్పుతూ గురువుగా ఎదిగాడు. ఇప్పుడు మరో అడుగు ముందుకేసి ఉదయం పోషకవిలువతో కూడిన అల్పాహారాన్ని అందిస్తున్నాడు. కోరుకొండ మండలం బొల్లెద్దుపాలెంకు చెందిన రామకృష్ణకు సుమారు 15 ఏళ్ల కిందట రాజకీయ ఘర్షణల నేపథ్యంలో ఓ హత్య కేసులో యావజ్జీవ జైలుశిక్ష పడింది. అతను జైలుకు వెళ్లడంతో భార్య సుబ్బలక్ష్మి తన కుమారుడు, కుమార్తెను వెంటబెట్టుకుని పెద్దాపురం మండలం దివిలిలోని పుట్టింటికి చేరుకుంది. కుట్టు మిషన్ సాయంతో పిల్లలను పోషించింది. 2016 జనవరి 26న సత్పప్రవర్తన కేటరిగిలో రామకృష్ణ జైలునుంచి విడుదలయ్యాడు. స్వగ్రామం వెళ్లలేక అత్తావారింటికి కాపురం వచ్చేశాడు. ఇటు..యోగా అటు వైద్య సేవలు జైలు నుంచి వచ్చాక రామకృష్ణ తన చుట్టూ ఉన్న వారికి ఏదైనా మంచి చేయాలని స్పంకల్పించాడు. జైలులో నేర్చుకున్న యోగాపై చుట్టుపక్కల ఉన్నవారికి అవగాహన కల్పించడం ప్రారంభించాడు. దీనిపై పులిమేరు పరిసర గ్రామాల్లో విస్తృత ప్రచారం చేశారు. ఇప్పటికీ కొనసాగిస్తున్నాడు. పదిహేను రోజులకోసారి దివిలి, తిరుపతి, చదలాడ, పులిమేరు, పిఠాపురం మండలం విరవ గ్రామాల్లో యోగాసనాలపై శిక్షణ ఇస్తున్నాడు. పులిమేరులో యోగాశ్రమాన్ని నెలకొల్పాడు. 12 ఏళ్ల కుర్రాడి నుంచి 60 ఏళ్ల వృద్దుల వరకూ సుమారు వంద మంది యోగా నేర్చుకుంటున్నారు. తనకు తెలిసిన ఆయుర్వేద వైద్యంతో రామకృష్ణ చిన్నపాటి రోగాలకు చికిత్స చేస్తున్నాడు. ఇటీవల పోషక విలువల ఆహారాన్ని తయారుచేసి విక్రయించడం ప్రారంభించాడు. సేంద్రీయ సాగు ఉత్పత్తులతో ఆహార పదార్ధాలను తయారుచేస్తున్నాడు. బ్లాక్ రైస్ ఇడ్లీ, నానబెట్టిన మొలకలు, కొర్రలు ఉప్మా, ఆయిల్‌లెస్ దోసె, చోడి అంబలిని కలిపి అల్పాహారంగా అమ్ముతున్నాడు. సాధారణ ధరకే విక్రయిస్తూ ప్రజారోగ్య పరిరక్షణకు కృషి చేస్తున్నాడు. పోషకాల టిఫిన్ రోజూ ఉదయం గతంలో ఇక్కడి హోటల్స్‌లో చాలామంది ఆయిల్‌తో చేసిన టిఫిన్లు తినేవారు. జనంలో ఇప్పుడు ఆరోగ్యంపై అవగాహన పెరిగింది. ఉదయాన్నే ఇలాంటివి తినడం వల్ల అనారోగ్యాన్ని కొని తెచ్చుకోవడమేనని గ్రహిస్తున్నారు. అలాంటి వారంతా పౌషకాహారంపై మొగ్గు చూపిస్తున్నారు. సేంద్రీయ పంటలతో చేసిన వంటకాలపై ఆసక్తి కనబరుస్తున్నారు. ఈ తరహా ఆహారాన్ని ఇష్టపడేవారు తన లాంటి వారి వద్ద కొనుగోలు చేస్తున్నారని రామకృష్ణ చెప్పారు. ఆరోగ్యం గురించి తెలియజెప్పాలని.. జైలు నుంచి వచ్చాక పెట్రోల్ బంకులో పనిచేశాను. టైలరింగ్ వృత్తి చేశాను. బతుకు గడవడం మాటెలా ఉన్నా జైలులో నేర్చుకున్న ఆరోగ్య అంశాలను పదిమందికీ తెలియజేస్తే బాగుంటుందనే ఆలోచన వచ్చింది. జైలు జీవితం తెచ్చిన పరివర్తనను కూడా తెలియజెప్పాల్సిన అవసరం ఉందని అనిపించింది. ఇక్కడ నేర్చుకున్న యోగా గురించి చుట్టూ ఉన్నవారికి చెప్పాలని భావించాను. నెమ్మది నెమ్మదిగా ముందడుగు వేయగలిగాను. చాలామంది ప్రోత్సహించారు. ఏం చేసినా ప్రజల ఆరోగ్యం పెంచేదిగా ఉండాలని భావించి ఇప్పుడు పోషకాహారాన్ని కూడా విక్రయిస్తున్నాను. వ్యాపార దృక్పథంతో కాదు. ఆరోగ్య స్పృహ కలిగించాలనేదే నా ప్రయత్నం. – మసిముక్కల రామకృష్ణ, పులిమేరు -
'జైలులో నన్ను టార్చర్ పెట్టారు.. పిల్లలు అడిగిన ప్రశ్నలు బాధించాయి..'
ముంబై: మహారాష్ట్ర ఎంపీ, మాజీ నటి నవనీత్ రానా తనను గతేడాది జైల్లో టార్చర్ పెట్టారని ఆరోపించారు. ఎంత హింసించినా తన నమ్మకాన్ని మాత్రం విచ్ఛిన్నం చేయలేకపోయారని చెప్పుకొచ్చారు. ఆ రోజులు తలుచుకుని ఎమోషనల్ అయ్యారు. అసలు ఎందుకు జైలుకు వెళ్లావు? ఏం చేశావు? అని తన పిల్లలు తరచూ అడిగేవారని గుర్తు చేసుకుని ఆవేదన వ్యక్తం చేశారు. గతేడాది హనుమాన్ జయంతి సందర్భంగా అప్పటి సీఎం ఉద్ధవ్ థాక్రే ఇంటిముందు హునుమాన్ చాలీసా చదువుతానని శపథం చేశారు నవనీత్ రానా. తనతో పాటు వేలాది మంది కలిసిరావాలని పిలుపునిచ్చారు. దీంతో శివసేన కార్యకర్తలు ఆమెపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంటిని ముట్టడించేందుకు ప్రయత్నించారు. ఉద్రిక్త పరిస్థితులు తలెత్తడంతో ముందుజాగ్రత్తగా చర్యగా పోలీసులు ఆమెను అరెస్టు చేశారు. తాజాగా హనుమాన్ జయంతిని పురస్కరించుకుని నవనీత్ రానా ఆ విషయాన్ని గుర్తు చేసుకున్నారు. అప్పటి సీఎం థాక్రేకు తగిన శాస్తి జరిగిందని, పదవి పోయిందని విమర్శలు గుప్పించారు. ఆయన కుమారుడు కూడా పార్టీని కాపాడలేని పరిస్థితి వచ్చిందని ఎద్దేవా చేశారు. చదవండి: బీజేపీలో చేరిన కాంగ్రెస్ దిగ్గజ నేత కుమారుడు.. తప్పుడు నిర్ణయమని తండ్రి ఆవేదన -
రాజమండ్రి జైలు చూశారా? ఎంతలో ఎంత మార్పు.?
(డెస్క్–రాజమహేంద్రవరం): చదువు దారి చూపుతుంది. దారి తప్పిన వారిని సన్మార్గంలోనూ నడుపుతుంది. రాజమహేంద్రవరంలోని కేంద్రకారాగారంలోని కొందరు ఖైదీల గురించి తెలుసుకుంటే ఇది అక్షర సత్యమని అర్థమవుతుంది. వివిధ పరిస్థితుల నేపథ్యంలో.. క్షణికావేశంలో కొందరు నేరానికి పాల్పడుతుంటారు. వీరంతా జైలుకు వచ్చి శిక్ష అనుభవిస్తారు. అయితే ఇక్కడి కారాగారం అధికారులు మాత్రం వీరి శిక్షను శిక్షణగా మారుస్తున్నారు. ఇందులో భాగంగా వీరిలో విద్యావెలుగులు నింపుతున్నారు. జైలులో జీవితం వృథా కాకుండా ఖైదీలను విద్యాబాట పట్టిస్తున్నారు. పరివర్తన దిశగా అడుగులు వేయిస్తున్నారు. ఆగిన చదువకు నడక సెంట్రల్ జైలుకు రాకమునుపు ఆపేసిన విద్యను చాలామంది ఇక్కడికి వచ్చాక కొనసాగించగలుగుతున్నారు. డాక్టర్ అంబేడ్కర్ ఓపెన్ యూనివర్శిటీ ద్వారా వీరంతా పట్టభద్రులవుతున్నారు. కొందరు పోస్టు గ్రాడ్యుయేషన్ కూడా చేస్తున్నారు. ప్రస్తుతం 135 మంది డిగ్రీ చదువుతుండగా 87మంది ఎంఏ చదువుతున్నారు. 638 మంది ఇప్పటికే డిగ్రీ పూర్తి చేయడం విశేషం. వీరికోసం జైలు ప్రాంగణంలోనే పరీక్ష సెంటరు నిర్వహిస్తున్నారు. రెగ్యులర్‌గా వీరికి క్లాసులు చెప్పడానికి ప్రభుత్వ ఆర్ట్స్ కళాశాల నుంచి ఫ్యాకల్టీ సేవలను వినియోగించుకుంటున్నట్లు సెంట్రల్ జైలు డిప్యూటీ సూపరింటెండెంట్ రాజకుమార్ ‘సాక్షి’కి తెలిపారు. పెద్ద వయసుండీ నిరక్షరాస్యులైన ఖైదీలకు సైతం రాయడం చదవడం నేర్పుతున్నారు. ప్రస్తుతం 28మంది ప్రాథమిక విద్యను అభ్యసిస్తున్నారు. వీరికి అనంతలక్ష్మి అనే టీచరు బోధిస్తున్నారు. అబ్బురపరిచే లైబ్రరీ ఖైదీలు చదువుకునేందుకు లైబ్రరీ ఉంది. ఇందులో 4,300 పుస్తకాలు ఉన్నాయి. ముఖ్యంగా వ్యక్తిత్వ వికాసాన్ని పెంపొందించేందుకు..ఆధ్మాత్మిక భావన కలిగించేందుకు దోహదపడే పుస్తకాలు ఉన్నాయి. లక్ష రూపాయల విలువైన పుస్తకాలను జైలు అధికారులు కొనుగోలు చేశారు. చదువుతోపాటు వృత్తిపరమైన నైపుణ్యాన్ని పెంచేందుకు ఒక సెంటరును నిర్వహిస్తున్నారు. వెల్డింగ్..ప్లంబింగ్ కోర్సులకు ఇందులో శిక్షణ ఇస్తున్నారు. ఖరీదైన శిక్షణ పరికరాలను అందుబాటులో ఉంచారు. ప్రస్తుతం 30 మంది వంతున ఖైదీలు ఈ కోర్సులు నేర్చుకుంటున్నారు. గోల్డు మెడలిస్టులూ ఉన్నారు సెంట్రల్‌జైలులో శిక్షను అనుభవిస్తూ పట్టభద్రులైన కొందరు విశేష ప్రతిభ కనబరుస్తున్నారు. షేక్ అజారుద్దీన్ బీఏలో స్వర్ణ పతకాన్ని సాధించారు. షేక్ సుభానీ ..టి వెంకటేశ్వరరావులు కూడా ఇదీ డిగ్రీలో గోల్డు మెడల్ సాధించారు. విజయవాడకు చెందిన జీ విజయరామ్ జైలులోనే పీజీ చదివి విడుదలయ్యాక వీఆర్ఓ ఉద్యోగాన్ని పొందారు. సారేపల్లి శ్రీనివాస్ మూడు డిగ్రీలు చదివారు. రంపచోడవరానికి చెందిన శ్రీనివాస్ కూడా మూడు పీజీలు చేశారు. ఇక్కడ పీజీ చదివాను మాది గుంటూరు. 30సంవత్సరాలుగా ఇక్కడ జైలులో ఉంటున్నాను. జైలుకు రాకమునుపు కరస్పాండెన్స్ కోర్సు డిగ్రీ చేయాలనుకున్నాను. ఇక్కడకు వచ్చాక పూర్తిగా చదువుపై దృష్టి పెట్టాను. ఎంఏ చదివాను. ఇక్కడి అధికారుల ప్రోత్సాహం నాలో ఉత్సాహాన్ని పెంచింది. నాకు ఇప్పుడు 54 సంవత్సరాల వయసు వచ్చింది. చదవడం వల్ల చాలా తెలుసుకున్నాను. విద్య మనిషిలో సత్ప్రవర్తనను పెంచుతుందని గ్రహించాను. విడుదల కోసం ఎదురుచూస్తున్నాను. – గంటెల విజయవర్దన్ మూడు ఎంఏలు చేశాను మాది రంప చోడవరం. నేను జైలుకు వచ్చి 11 సంవత్సరాలు అవుతోంది. ఓ హత్య కేసులో నాకు శిక్ష పడింది. జైలుకు వచ్చే ముందు ఎమ్మెస్సీ బీఈడీ చదివాను. ఇప్పుడు మూడు ఎంఏలు చేశాను. పాలిటిక్స్..పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్..సోషియాలజీలతో ఈ పీజీలు చదివాను. ఈ శిక్షా కాలం నా జీవితంలో ఊరికే పోలేదని భావిస్తున్నాను. జైలు అధికారుల తోడ్పాటుతో మళ్లీ చదువుకోగలిగాను. చదువు వల్ల ఆత్మవిశ్వాసం పెరిగింది. గౌరవమూ పొందగలుగుతుండటం నాకు సంతోషం కలిగిస్తోంది. – శ్రీనివాస దొర పరివర్తనే ధ్యేయంగా.. ఖైదీలలో పరివర్తనే ధ్యేయంగా పనిచేస్తున్నాం. శిక్షాకాలంలో విద్య లేదా నైపుణ్య కోర్సు నేర్చుకునో బయటకు వెళ్లాక ఉపాధిబాట పట్టేలా తీర్చిదిద్దేందుకు మా వంతు కృషి చేస్తున్నాం. ఈ విషయంలో ఎప్పటికప్పుడు కొత్త ప్రణాళికలను రూపొందించి అనుసరిస్తున్నాం. మళ్లీ నేరాల వైపు మనసు మళ్లకుండా ఉద్యోగం లేదా ఉపాధి వైపు దృష్టి పెట్టాలనేది మా అభిమతం. అందుకే జైలులో శిక్షాకాలం వృథా కానీయడం లేదు. ప్రభుత్వం నుంచి కూడా ఇందుకు మంచి సహకారం లభిస్తోంది. ఖైదీలు చదువుకోడానికి ఎక్కువ ఆసక్తి కనబరుస్తున్నారు. వీరిని ఉత్సాహపరిచేలా సహకారం అందిస్తున్నాం. – రాజారావు, జైలు సూపరింటెండెంట్