చిన్నారులపై అత్యాచారం కేసుల్లో జైలు | Jail in child rape cases: Andhra pradesh | Sakshi
Sakshi News home page

చిన్నారులపై అత్యాచారం కేసుల్లో జైలు

Published Tue, May 28 2024 5:15 AM | Last Updated on Tue, May 28 2024 5:15 AM

Jail in child rape cases: Andhra pradesh

విశాఖలో మనవరాలిపై లైంగికదాడి కేసులో వృద్ధుడికి 20 ఏళ్ల జైలు 

విజయవాడలో లైంగికదాడియత్నం కేసులో మేనమామకు అయిదేళ్ల జైలు

జరిమానాలు విధింపు

విశాఖ లీగల్‌/విజయవాడ స్పోర్ట్స్‌: వావి వరసలు మరచి అభంశుభం తెలియని చిన్నారులపై అత్యాచారానికి పాల్పడిన ఇద్దరు నిందితులకు వేర్వేరు కేసుల్లో జైలుశిక్ష, జరిమానా విధిస్తూ.. ఆయా న్యాయమూర్తులు సోమవారం తీర్పునిచ్చారు. సొంత మనవరాలిపై అత్యాచారానికి పా­ల్ప­డిన వృద్ధుడికి 20 ఏళ్ల కఠిన కారాగార శిక్ష, రూ.5 లక్షల జరిమానా విధిస్తూ విశాఖ నగరంలోని పోక్సో ప్రత్యేక న్యాయస్థానం న్యాయమూర్తి జి.ఆనంది తీర్పు చెప్పారు. అలాగే 12 ఏళ్ల బాలికపై లైంగిక దాడి యత్నం చేసిన  మేనమామకు ఐదేళ్ల జైలుశిక్ష విధిస్తూ విజయవాడ పోక్సో కోర్టు ఇన్‌చార్జ్‌ న్యాయమూర్తి తిరుమల వెంకటేశ్వర్లు తీర్పు వెల్లడించారు.

కేసుల పూర్తి వివరాల్లోకి వెళితే.. విశాఖ నగరంలోని మల్కాపురం పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని మల్కా­పురం జాలరి వీధిలో ప్రభుత్వ ఉద్యోగిగా పదవీ విరమణ చేసిన వాడమొదుల శ్యాంసుందరరావు (70) నివాసం ఉంటున్నాడు. అతనికి ఇద్దరు కొడుకులు. బాధితురాలు (ప్రస్తుతం 19) పెద్దకొడుకు చంద్రశేఖర్‌ కూతురు. చంద్రశేఖర్‌ వృత్తిరీత్యా కారు డ్రైవరు. నిత్యం బయటకు వెళ్లేవాడు. బాధితురాలి తల్లి సత్యవతి, తన ఇద్దరు పిల్లలు, అత్తమామలతో కలిసి ఉంటుంది. ఆ ఇల్లు రెండంతస్తుల భవనం. గ్రౌండ్‌ ఫ్లోర్‌లో బాధితురాలు, వారి కుటుంబ సభ్యులు ఉంటున్నారు.

రెండో అంతస్తులో నిందితుడు శ్యాంసుందరరావు, అతని భార్య ఉంటున్నారు. 2017 అక్టో­బర్‌ ఒకటో తేదీకి ముందు నిందితుడు బాలికను భయపెట్టి లోబర్చుకుని ఆమెపై పలుమార్లు లైంగిక దాడి చేశాడు. ఈ విషయాన్ని ఎవరికైనా చెప్తే కుటుంబం మొ­త్తాన్ని చంపేస్తానని బెదిరించాడు. అక్టోబర్‌ ఒకటో తేదీన బాలిక పాఠశాల నుంచి ఇంటికి వచి్చన వెంటనే సుమారు మూడున్నర గంటల సమయంలో వృద్ధుడు బాలికపై మళ్లీ లైంగిక దాడికి యతి్నస్తుండగా ఆ బాలిక గట్టిగా అరిచింది. ఆ కేకలు విన్న ఆమె చెల్లెలు కింద ఫ్లోర్‌లో ఉన్న తల్లికి చెప్పింది. అది విన్న తల్లి మేడ మీద మొదటి అంతస్తుపైకి వెళ్లి చూడగా నిందితుడు చేస్తున్న అకృత్యాన్ని కళ్లారా చూసింది. వెంటనే  మల్కాపురం పోలీసులకు ఫిర్యాదు చేసింది. నేరం రుజువు కావడంతో వృద్ధుడికి 20 ఏళ్ల కఠిన కారాగార శిక్ష, రూ.5 లక్షల జరిమానా విధిస్తూ తీర్పు చెప్పారు. ఐదు లక్షల రూపాయలను బాధితురాలికి ఇవ్వాలని న్యాయమూర్తి తన తీర్పులో స్పష్టం చేశారు.

కసాయి మేనమామకు ఐదేళ్ల జైలు.. 
ఖమ్మం జిల్లాకు చెందిన బాలిక (12) తల్లితో కలిసి పండుగలకు విజయవాడ వన్‌టౌన్‌లోని అమ్మమ్మ ఇంటికి వస్తుంటుంది. 2017న దసరా పండుగకు వచ్చిన బాలిక పట్ల ఆమె మేనమామ లైంగికదాడికి యతి్నంచడమే కాకుండా ఎవరికైనా చెబితే చంపేస్తానని బెదిరించాడు. అప్పటినుంచి మానసికంగా కుంగిపోయిన బాలిక 2018 జనవరిలో మేనమామ తన పట్ల ప్రవర్తించిన తీరును తల్లికి వివరించింది. బాలిక తల్లి ఫిర్యాదు మేరకు 2018 జనవరి 9న వన్‌టౌన్‌ పోలీసులు కేసు నమోదు చేశారు. ఏడుగురు సాక్షులను విచారించిన అనంతరం నేరం రుజువు కావడంతో నిందితుడికి ఐదేళ్ల కఠిన కారాగార శిక్షతో పాటు రూ.15 వేలు జరిమానా విధిస్తూ  విజయవాడ పోక్సో కోర్టు ఇన్‌చార్జ్‌ న్యాయ మూర్తి తిరుమల వెంకటేశ్వర్లు తీర్పు చెప్పారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement