
వాషింగ్టన్: అమెరికాలో రాబోయే అధ్యక్ష ఎన్నికల్లో మళ్లీ పోటీచేయడానికి సన్నాహాల్లో చేసుకుంటున్న మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ను కేసుల భయం, అరెస్టు భయం వెంటాడుతోంది. 2020లో జార్జియా రాష్ట్ర ఎన్నికల ఫలితాలను మార్చేయడానికి ప్రయతి్నంచిన కేసులో ట్రంప్ గురువారం ఫుల్టన్ కౌంటీ జైలులో లొంగిపోనున్నారు. ఈ విషయాన్ని ఆయన స్వయంగా సోషల్ మీడియాలో వెల్లడించారు.
అరెస్టు కావడానికి జార్జియాలోని అట్లాంటాకు వెళ్తున్నానని తెలియజేశారు. అక్కడ జిల్లా అటార్నీ ఫానీ విల్లీస్ తనను అరెస్టు చేస్తారని పేర్కొన్నారు. తన అరెస్టు ప్రక్రియను అధ్యక్షుడు జో బైడెన్ ఆధ్వర్యంలోని డిపార్టుమెంట్ ఆఫ్ జస్టిస్ సమన్వయం చేస్తోందని ఆరోపించారు. ఎన్నికల ఫలితాలను తారుమారు చేయడానికి ప్రయతి్నంచిన కేసులో ట్రంప్‌తోపాటు మరో 18 మంది ఆగస్టు 25లోగా లొంగిపోవాలని గతంలో జడ్జి ఆదేశించారు. అయితే ట్రంప్‌తో పాటు మరో 18 మంది కూడా సరెండర్ కావడానికి సిద్ధమైనట్లు సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment