లక్నో: ఉత్తరప్రదేశ్‌లోని లక్నో జిల్లా జైలులో ఖైదీల ఆరోగ్యానికి సంబంధించి సంచలన విషయం బయటపడింది. ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా జైలులోని 63 మంది ఖైదీలకు హెచ్‌ఐవీ(ఎయిడ్స్) ఉన్నట్లు తేలింది. గత ఏడాది డిసెంబర్ నెలలో నిర్వహించిన పరీక్షల్లో 36 మందికి హెచ్‌ఐవీ సోకినట్లు తేలగా తాజా పరీక్షల్లో ఈ సంఖ్య 63కు చేరింది.
వైరస్ ఇంత పెద్ద ఎత్తున వ్యాప్తి చెందడానికి గల స్పష్టమైన కారణాలు మాత్రం తెలియాల్సి ఉంది. హెచ్‌ఐవీ సోకిన ఖైదీల్లో చాలా మందికి డ్రగ్స్ తీసుకునే అలవాటు ఉండటంతో ఒకరు వాడిన ఇంజెక్షన్‌లతో మరొకరు డ్రగ్స్ ఎక్కించుకునే సమయంలో వైరస్ ఒకరి నుంచి మరొకరికి సోకినట్లు ప్రాథమికంగా తెలుస్తోంది. అయితే వీరిందరికీ ముందే హెచ్‌ఐవీ ఉందని, జైలులోకి వచ్చిన తర్వాత ఎవరికీ వైరస్ సోకలేదని మరో వాదన వినిపిస్తోంది.
హెచ్‌ఐవీ సోకినట్లు తేలిన వారందరికీ లక్నోలోని ఒక ఆస్పత్రిలో చికిత్సనందిస్తున్నట్లు జైలు అధికారులు తెలిపారు. ఒక్కసారిగా భారీ సంఖ్యలో హెచ్‌ఐవీ కేసులు బయటపడిన నేపథ్యంలో జైలులో వైరస్ మరింత వ్యాప్తి చెందకుండా చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు.
ఇదీచదవండి.. రిసార్ట్ పాలిటిక్స్.. తొలిసారి ఎక్కడ..ఎప్పుడంటే
Comments
Please login to add a commentAdd a comment