ఇన్నాళ్లకు న్యాయం, ధర్మం గెలిచింది | Perni Nani fire on Chandrababu | Sakshi
Sakshi News home page

ఇన్నాళ్లకు న్యాయం, ధర్మం గెలిచింది

Published Tue, Sep 12 2023 5:52 AM | Last Updated on Tue, Sep 12 2023 7:34 AM

Perni Nani fire on Chandrababu - Sakshi

సాక్షి, అమరావతి :ప్రభుత్వ ఖజానా నుంచి రూ.371 కోట్లు దోచేసిన స్కిల్‌ డెవలప్‌మెంట్‌ స్కాం కుంభకోణంలో ప్రధాన నిందితుడైన చంద్రబాబుకు ఏసీబీ కోర్టు రిమాండ్‌ విధించి, జైలుకు పంపడంతో ఇన్నాళ్లకు న్యాయం గెలిచింది, ధర్మం గెలిచిందని రాష్ట్ర ప్రజలు సంతోషం వ్యక్తంచేస్తున్న­ట్లు మాజీమంత్రి, మచిలీపట్నం ఎమ్మెల్యే పేర్ని నాని చెప్పారు.

చంద్రబాబు సిగ్గుపడకుండా.. వేళ్లూ­పు­కుంటూ జైలుకు వెళ్లారంటూ ఎద్దేవా చేశారు. తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. 45 ఏళ్లుగా ఎన్నో స్కాములు చేస్తూ.. స్టేల మీద నెట్టుకొస్తూ.. ప్రతి వ్యవస్థలోనూ, తాను ఏర్పాటు­చేసుకున్న స్లీపర్‌ సెల్స్‌ ద్వారా బయటపడుతూ, సమాజానికి మాత్రం చంద్రస్వామిజీ నీతులు చెబుతూ వచ్చారంటూ విమర్శించారు. 2014–19 మధ్యలో జరిగిన అన్ని కుంభకోణాలపై విచారణ జరుపుతామని స్పష్టంచేశారు. పేర్ని నాని ఇంకా ఏమన్నారంటే..

  • అరెస్టు నుంచి జైలుకు పంపే వరకు ఆయన్ను ప్రభుత్వం కక్ష సాధింపుగా కాకుండా  మర్యాదగా చూసుకుంది. ఇన్ని వందల, వేల కోట్లు కొట్టేసిన వారిని ఎవరైనా ఇంత మర్యాదగా చూస్తారా?  
  • బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి దగ్గర నుంచి, దత్తపుత్రుడు పవన్‌కళ్యాణ్, సీపీఐ నాయకులు, ఎల్లో మీడియా బాబును వేధిస్తున్నారని అనడం హేయం.
  • చంద్రబాబు సీఐడీ విచారణకు అసలు సహకరించలేదు. ఏమో, తెలియదు, గుర్తులేదు.. ఈ మూడే కదా బాబు చెప్పింది.
  • కోర్టులోకి చంద్రబాబు కుటుంబ సభ్యులంతా వస్తుంటే పోలీసులు అనుమతించారా? లేదా? జైల్లో ఆయనకు సకల సౌకర్యాలు ఇవ్వమని ప్రభుత్వం తరఫున, సీఐడీ తరఫున న్యాయ­వాదులు అభ్యంతరంలేదని చెప్పారా? లేదా?
  • చంద్రబాబును ఇంత మర్యాదగా చూస్తే.. వేధించారని మాట్లాడతారా? కోర్టు రిమాండ్‌ విధిస్తే.. సిగ్గులేకుండా రెండువేళ్లూ ఊపుతూ జైలుకెళ్లాడు. 
  • ఇక కేంద్ర ప్రభుత్వం ఇంటర్నెట్‌ కోసం రూ.5 వేల కోట్లు ఇస్తుందని తెలిసి, చంద్రబాబు, ఆయన కొడుకు ఫైబర్‌నెట్‌ స్కాం చేశారు. అమరావతిలో పేదలకు ఇళ్లు కట్టిస్తామంటూ కాంట్రాక్టుల పేరుతో రూ.119 కోట్లు లూటీ చేసినా ఏమీ పట్టించుకోకూడదా?  
  • అవినీతిపై రాజీలేని పోరాటమంటే.. రోడ్ల మీద పడి పొర్లాడటమా పవన్‌?
  • వారాహి యాత్రలో గోదావరి జిల్లాల్లో కనీసం 50 మందిని చంపేయడానికి రెండువేలమంది ­కి­రాయి రౌడీలను వైఎస్సార్‌సీపీ నేతలు పంపార­ని పవన్‌ చెప్పడం హేయం. సైకలాజికల్‌ డిజా­ర్డర్‌తో ఉన్న పవన్‌ను సైక్రియా­టిస్టు ఇండ్ల రామ­సు­బ్బారెడ్డికి చూపించాలి. పవన్‌ చెప్పే నిఘా వ­ర్గా­లు కేంద్రానివి కాదు.. చంద్రబాబువి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement