వేధింపుల కేసులో భారతీయ అమెరికన్‌ జంటకు 20 ఏళ్ల జైలు? | Indian American Couple Jailed in USA | Sakshi
Sakshi News home page

Indian American couple jailed: వేధింపుల కేసులో భారతీయ అమెరికన్‌ జంటకు 20 ఏళ్ల జైలు?

Published Sat, Jan 27 2024 12:38 PM | Last Updated on Sat, Jan 27 2024 12:47 PM

Indian American Couple Jailed in USA - Sakshi

అమెరికాలోని వర్జీనియా ఫెడరల్ జ్యూరీ రెండు వారాల విచారణ అనంతరం ఒక భారతీయ అమెరికన్‌ జంటను దోషులుగా నిర్థారించింది. ఈ దంపతులు తమ బంధువును వేధించారని స్పష్టమైన నేపధ్యంలో జ్యూరీ వారిని దోషులుగా తేల్చిచెప్పింది.  

ఆ భారతీయ అమెరికన్‌ జంట తమ గ్యాస్ స్టేషన్, కన్వీనియన్స్ స్టోర్‌లో తమ బంధువును కార్మికునిగా నియమించుకునేందుకు బలవంతంగా ప్రయత్నించిందని ఫెడరల్‌ జ్యూరీ నిర్ధారించింది. ఈ కేసులో హర్మన్‌ప్రీత్ సింగ్(30), కుల్బీర్ కౌర్‌(43)లు దోషులుగా తేలడంతో వారికి 2024, మే 8న శిక్ష ఖరారు చేయనున్నారు. 

హర్మన్‌ప్రీత్ సింగ్, కుల్బీర్ కౌర్‌ దంపతులు తమ బంధువు చేత ఆహారాన్ని వండించడం, క్యాషియర్‌గా పని చేయించడం, స్టోర్ రికార్డులను శుభ్రపరచడం, నిర్వహించడం తదితర పనులు బలవంతంగా చేయించారు. ఇటువంటి కేసులలో గరిష్టంగా 20 సంవత్సరాల జైలు శిక్ష విధించేందుకు అవకాశం ఉంది. అలాగే 2,50,000 అమెరికన్‌ డాలర్ల వరకు జరిమానా విధించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

జస్టిస్ డిపార్ట్‌మెంట్, పౌర హక్కుల విభాగానికి చెందిన అసిస్టెంట్ అటార్నీ జనరల్ క్రిస్టెన్ క్లార్క్ మాట్లాడుతూ ఈ దంపతులు.. యునైటెడ్ స్టేట్స్‌లో పాఠశాలకు వెళ్లాలనే బాధితుని ఆశను అణగార్చారని, శారీరక, మానసిక వేధింపులకు గురి చేశారని అన్నారు. బాధితుని ఇమ్మిగ్రేషన్ పత్రాలను దాచేయడం, తీవ్రమైన హాని కలిగించే ఇతర బెదిరింపులకు గురిచేయడం, కనీస వేతనం కూడా చెల్లించకపోవడం, అధికంగా పనిచేయించడం లాంటి దుశ్చర్యలకు పాల్పడ్డారని అసిస్టెంట్ అటార్నీ జనరల్ పేర్కొన్నారు. 

యూఎస్‌ ఈస్టర్న్ డిస్ట్రిక్ట్ ఆఫ్ వర్జీనియా అటార్నీ జెస్సికా డి'అబెర్  మాట్లాడుతూ ఈ కేసులో నిందితులు తప్పుడు హామీలతో బాధితుని ఇక్కడకు తీసుకువచ్చి, మానసిక, శారీరక వేధింపులకు గురిచేశారన్నారు. మానవ అక్రమ రవాణా అనేది సమాజంలో అత్యంత జుగుప్సాకరమైన నేరమని, అయితే ఈ కేసులో బాధితునికి న్యాయం జరిగేలా హామీ ఇచ్చినందుకు  ప్రాసిక్యూటర్లకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నానన్నారు.

ఫెడరల్ ప్రాసిక్యూటర్లు తమ వాదనలో.. 2018లో నిందితులు.. ఆ సమయంలో మైనర్‌గా ఉన్న బాధితుని స్కూల్‌లో చేర్పిస్తామంటూ తప్పుడు వాగ్దానాలతో యునైటెడ్ స్టేట్స్‌కు తీసుకువెళ్లారని పేర్కొన్నారు. బాధితుతుడు అమెరికా వచ్చాక అతని ఇమ్మిగ్రేషన్ పత్రాలను తీసుకొని, తమ పనులలో నియమించుకున్నారు. బాధితుని దుకాణం  పర్యవేక్షణలో నియమించారు. కొద్దిపాటి ఆహారాన్ని మాత్రమే అందించారు. బాధితుడు కోరినప్పటికీ వైద్య సంరక్షణ, విద్యను అందించడానికి నిరాకరించారు. బాధితునిపై నిరంతర నిఘా ఉంచారు.

భారతదేశానికి వెళ్లిపోతాననే బాధితుని అభ్యర్థనను సింగ్ దంపతులు తిరస్కరించారు. వీసా గడువు దాటినా బాధితుని పనులలో కొనసాగేలా నిర్బంధించారు. బాధితుడు తన ఇమ్మిగ్రేషన్ పత్రాలను తిరిగి అడిగినపుడు సింగ్.. బాధితుని జుట్టు పట్టుకుని లాగి, చెంపమీద కొట్టి,  కాలితో తన్నాడు. బాధితుడు తనకు ఒక రోజు సెలవు కావాలని అడిగితే రివాల్వర్‌తో బెదిరించినట్లు ఆధారాలు లభ్యమయ్యాయి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement