
శ్రీకాకుళం రూరల్: చంద్రబాబును కోర్టే జైలుకు పంపిందని, కేంద్ర ఏజెన్సీలే ఆయనను దోషిగా తేల్చాయని రాష్ట్ర రెవెన్యూ, రిజిస్ట్రేషన్లు, స్టాంప్స్ శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు చెప్పారు. ఆయన ఆదివారం శ్రీకాకుళం మండలం బైరి గ్రామంలో సచివాలయ ప్రారంబోత్సవంలో పాల్గొని ప్రసంగించారు. స్కిల్‌స్కామ్‌లో సూత్రధారి, పాత్రధారి చంద్రబాబేనని, ఈ కేసు 2021లో నమోదైందని చెప్పారు.
రాష్ట్ర ప్రభుత్వానికి, జర్మనీ కంపెనీకు ఒప్పందమంటూ ఫేక్ అగ్రిమెంట్‌లతో అడ్డంగా దొరికిపోయి అడ్డగోలు వాదనలు చేయడం బాబు కోటరీకి తగదని హితవుపలికారు. సాంకేతిక విద్య పేరుతో రూ.371 కోట్ల ప్రజాధనాన్ని 6 షెల్ కంపెనీల్లో పెట్టుబడుల పేరిట దోచేసిన వారిని జైల్లో పెట్టకుండా ఉత్తమ పురుషుడంటూ పొగడాలా.. అంటూ ధర్మాన ప్రశ్నించారు. ఈడీ తనిఖీల్లో ఈ దోపిడీ వ్యవహారం బట్టబయలైందని తెలిపారు. నరసన్నపేట ఎమ్మెల్యే ధర్మాన కృష్ణదాస్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment