సాక్షి, శ్రీకాకుళం జిల్లా: చంద్రబాబు కేసులను ఇన్‌కమ్‌టాక్స్, ఈడీ వంటి కేంద్ర సంస్థలే మొదట దర్యాప్తు చేసిన విషయాన్ని మరోసారి స్పష్టం చేశారు రెవెన్యూశాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు. జర్మనీలో ఉన్న సీమెన్స్ సంస్థతో పేమెంట్ జరిగినట్లు నాటి ప్రభుత్వం చెబుతుందని, మరి దానిపై దర్యాప్తు సంస్థలు ప్రశ్నిస్తే అలాంటి ఏమీ లేదని సదరు కంపెనీ తెలిపిందన్నారు.
దేశంలోని కొన్ని కంపెనీలు పెట్టి, డబ్బులు పంపడానికి మాత్రమే సెల్ కంపెనీలను ఉపయోగిస్తున్నారన్నారు. దర్యాప్తులో స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్ డబ్బులు ఇద్దరు వ్యక్తుల వద్దకే వెళ్లినట్లు తేలిందని, అందులో ఒకరు చంద్రబాబు పీఏ, ఇంకొకరు లోకేష్ పీఏ అని అన్నారు.
ఎలాంటి సిస్టమ్ కూడా పాటించలేదని, మాజీ ముఖ్యమంత్రి, గౌరమైన వ్యక్తి అంటూ వదిలేయమంటే ఎలా అని, అలా వదిలేసి హక్కు ప్రభుత్వానికి లేదన్నారు. ఇందిరాగాంధీ, లాలూ ప్రసాద్, జయలలిత, పీవీ నరసింహారావు లాంటి వారే కోర్టు కేసులు ఎదుర్కొన్నారని, చంద్రబాబు దోషి అవునా.. కాదా అన్నది కోర్టు తెలుస్తుందని, చంద్రబాబు తన నిర్దోషిత్వాన్ని కోర్టులోనే నిరూపించుకోవాలని మంత్రి ధర్మాన పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment