విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన గోవాలోని కోల్‌వాలే సెంట్రల్ జైలుకు చెందిన నలుగురు అధికారులను సస్పెండ్ చేశారు. జైలు ఖైదీలు రావణుని దిష్టిబొమ్మను దహనం చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఈ నేపధ్యంలో అసిస్టెంట్ సూపరింటెండెంట్ చంద్రకాంత్ హరిజన్, జైలర్లు మహేష్ ఫడ్తే, అనిల్ గాంకర్, అసిస్టెంట్ జైలర్ రామ్‌నాథ్ గౌడ్‌లను సస్పెండ్ చేస్తూ, జైలు ఇన్‌స్పెక్టర్ జనరల్ ఓంవీర్ సింగ్ ఉత్తర్వులు జారీ చేశారు.
దసరా సందర్భంగా ఖైదీలు టపాకులు కాల్చి, రావణుని బొమ్మను దహనం చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో, ఇందుకు బాధ్యులైన అధికారులపై చర్యలు తీసుకున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ముందస్తు అనుమతి తీసుకోకుండానే ఖైదీలు దిష్టిబొమ్మను ఎలా దహనం చేశారనే దానిపై జైలు అధికారులు సమాధానం చెప్పాల్సి ఉంటుందని వారి సస్పెన్షన్ ఉత్తర్వుల్లో పేర్కొన్నట్లు ఓ అధికారి తెలిపారు.
జైలు ఆవరణలో మొబైల్ ఫోన్లు తీసుకెళ్లేందుకు ఎలా అనుమతి ఇచ్చారనే దానిపై కూడా విచారణ జరగనుంది. ఈ ఘటన జైలు భద్రతపై అనుమానాలను లేవదీస్తుందని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఈ సంఘటనకు జైలు అధికారులను ప్రాథమికంగా బాధ్యులుగా పరిగణించారని, అందుకే వారిని సస్పెండ్ చేశారని ఒక పోలీసుల అధికారి తెలిపారు.
ఇది కూడా చదవండి: భారత్‌లో ఇరాన్ జంట కష్టాలు.. ఆదుకున్న ఎస్‌పీ నేత!
Comments
Please login to add a commentAdd a comment