dahanam
-
జైలులో రావణ దహనం.. నలుగురు అధికారులు సస్పెండ్!
విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన గోవాలోని కోల్వాలే సెంట్రల్ జైలుకు చెందిన నలుగురు అధికారులను సస్పెండ్ చేశారు. జైలు ఖైదీలు రావణుని దిష్టిబొమ్మను దహనం చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఈ నేపధ్యంలో అసిస్టెంట్ సూపరింటెండెంట్ చంద్రకాంత్ హరిజన్, జైలర్లు మహేష్ ఫడ్తే, అనిల్ గాంకర్, అసిస్టెంట్ జైలర్ రామ్‌నాథ్ గౌడ్లను సస్పెండ్ చేస్తూ, జైలు ఇన్స్పెక్టర్ జనరల్ ఓంవీర్ సింగ్ ఉత్తర్వులు జారీ చేశారు. దసరా సందర్భంగా ఖైదీలు టపాకులు కాల్చి, రావణుని బొమ్మను దహనం చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో, ఇందుకు బాధ్యులైన అధికారులపై చర్యలు తీసుకున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ముందస్తు అనుమతి తీసుకోకుండానే ఖైదీలు దిష్టిబొమ్మను ఎలా దహనం చేశారనే దానిపై జైలు అధికారులు సమాధానం చెప్పాల్సి ఉంటుందని వారి సస్పెన్షన్ ఉత్తర్వుల్లో పేర్కొన్నట్లు ఓ అధికారి తెలిపారు. జైలు ఆవరణలో మొబైల్ ఫోన్లు తీసుకెళ్లేందుకు ఎలా అనుమతి ఇచ్చారనే దానిపై కూడా విచారణ జరగనుంది. ఈ ఘటన జైలు భద్రతపై అనుమానాలను లేవదీస్తుందని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఈ సంఘటనకు జైలు అధికారులను ప్రాథమికంగా బాధ్యులుగా పరిగణించారని, అందుకే వారిని సస్పెండ్ చేశారని ఒక పోలీసుల అధికారి తెలిపారు. ఇది కూడా చదవండి: భారత్‌లో ఇరాన్ జంట కష్టాలు.. ఆదుకున్న ఎస్పీ నేత! -
‘దహనం’మూవీ రివ్యూ
టైటిల్: దహనం నటీనటులు: ఆదిత్య ఓమ్, ఎఫ్ఎమ్ బాబాయ్, శాంతి చంద్ర తదితరులు నిర్మాణ సంస్థ: ఓపెన్ ఫీల్డ్ మీడియా నిర్మాత,సంగీతం : డాక్టర్ పెతకంశెట్టి సతీష్ కుమార్ దర్శకత్వం: ఆడారి మూర్తి సాయి విడుదల తేది: మార్చి 31, 2023 కథేంటంటే.. ఈ సినిమా కథంతా 1984 ప్రాంతంలో జరుగుతుంది. విశాఖపట్నంలోని వాడరేవుల పల్లి గ్రామానికి చెందిన పూజారి భరద్వాజ శాస్త్రి(ఆదిత్య ఓమ్)కి శివ నామస్మరణ తప్ప మరొకటి తెలియదు. ఆ గ్రామంలోని శివాలయంలో పూజలు చేస్తూ భార్య, కూతురితో కలిసి ఉంటాడు. ఆ గుడి కిందే ఓ గుడిసెలో కాటికాపరి బైరాగి(ఎఫ్ఎం బాబాయ్) ఉంటాడు. తక్కువ జాతికి చెందిన అతను ఒక్కసారి అయినా ఆ గుడిలోని శివలింగాన్ని తాకాలనే కోరికతో ఉంటాడు. అయితే ఆ శివాలయం తో పాటు చుట్టుపక్కల ఉన్న స్థలంపై భూస్వామి భూపతి కన్నపడుతుంది. తమ పూర్వికులు ఉచితంగా కట్టించిన ఆ గుడిని వదిలి వెళ్లాలని పూజారి శాస్త్రీని బెదిరిస్తాడు. కానీ శాస్త్రీ కోర్టును ఆశ్రయిస్తాడు. మరి చివరకు గుడి ఎవరికి దక్కింది? శివ లింగాన్ని తాకాలనే బైరాగి కోరిక నెరవేరిందా? ఆయన చేసిన త్యాగమేంటి? కట్టుబాట్లు, కుల వివక్ష కారణంగా బైరాగి, శాస్త్రీ జీవితాల్లో ఎలాంటి మార్పులు సంభవించాయి? అనేదే ‘దహనం’ కథ. ఎలా ఉందంటే.. సినిమాలో ఒక సీన్లో శాస్త్రీ శివుడికి పూజ చేస్తూ పాలు లింగంపై పోస్తుంటాడు.. అదే సమయంలో అతని మనవడు తినడానికి తిండిలేక ఆకలితో ఏడుస్తుంటాడు. వెంటనే ఓ పిల్లాడు వెళ్లి లింగంపై పడి కిందపోతున్న పాలను చేతుల్లో పట్టి పిల్లాడికి తాగిస్తాడు. ఈ ఒక్క సీన్ చాలు ‘దహనం’ ఓ మంచి సందేశాత్మక చిత్రమని చెప్పడానికి. కులం, కట్టుబాట్లపేరుతో జరిగే అరచకాలను ఈ చిత్రంలో చూపించారు. కులాల పేరుతో మనుషులను వేరు వేరుగా చూడొద్దనే సందేశాన్ని ఇచ్చారు. అయితే కులవివక్ష, వర్ణ వివక్షపై గతంలో చాలా సినిమాలు వచ్చాయి. దహనం కూడా ఆ తరహా చిత్రమే. కానీ శివాలయంతో ముడిపెట్టి కథనాన్ని నడిపించడం ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంది. కట్టుబాట్లు, కులం కారణంగా శాస్త్రీ పస్తులుంటే.. బైరాగి కొడుకును దూరం చేసుకొవడం..ఇలా రెండు వర్గాలు పడే బాధలను చూపించారు. ఆకలికి అంటరానితనం ఉంటుందా? అలాంటి డైగాల్స్ ఆలోచింపచేస్తాయి. అయితే కథ నెమ్మదిగా, ఊహకందేలా సాగడం మైనస్. క్లైమాక్స్ మాత్రం కాస్త ఆసక్తికంగా ఉంటుంది. ఈ చిత్రం కమర్షియల్‌గా ఏ మేరకు ఆడుతుందో తెలియదు కానీ.. ప్రేక్షకులకు మాత్రం మంచి సందేశాన్ని అందిస్తుంది. ఎవరెలా చేశారంటే.. ఇన్నాళ్లు లవర్ బాయ్‌గా కనిపించిన ఆదిత్య ఓమ్.. ఈచిత్రంలో విభిన్నమైన పాత్ర పోషించాడు. కాస్త వయసు మీద పడ్డ భరద్వాజ శాస్త్రి పాత్రలో ఆదిత్య ఒదిగిపోయాడు. ఆయన వాచకం, కట్టూబొట్టూ, నడవడికి అన్నీ కూడా చక్కగా కుదిరాయి. ఆదిత్య ఓమ్‌లోని మరో యాంగిల్‌ని ఈ చిత్రంలో చూడొచ్చు. ఆదిత్య తర్వాత బాగా పండిన పాత్ర ఎఫ్ఎం బాబాయ్‌ది. కాటికాపరి బైరాగి పాత్రలో ఆయన ఒదిగిపోయాడు. తాగుబోతుగా ఆయన నటన.. చెప్పు డైలాగ్ ప్రతిదీ ఆకట్టుకుంటుంది. భూపతి పాత్రకు శాంతి చంద్ర న్యాయం చేశాడు. మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర నటించారు. సతీష్ కుమార్ సంగీతం బాగుంది. పాటలు సందర్భానుసారం వస్తాయి. సినిమాటోగ్రఫీ పర్వాలేదు. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్టుగా ఉన్నాయి. -
ఎన్నో అవార్డులు అందుకున్న దహనం పోస్టర్ రిలీజ్!
ఎన్నో అవార్డులు అందుకున్న ఫీచర్ ఫిల్మ్ ‘దహనం’కు సంబంధించిన పోస్టర్ రిలీజైంది. ఈ పోస్టర్లో ఆదిత్య ఓం ఓల్డ్ గెటప్‌లో ఇది వరకు ఎన్నడూ కనిపించని విధంగా ఉన్నారు. పురాతన ఆలయాన్ని పరిరక్షించే రక్షకుడిగా కనిపిస్తున్నారు. అదారిమూర్తి సాయి తెరకెక్కించిన ఈ చిత్రం ఇది వరకే ఎన్నో జాతీయ వేదికల మీద పలు అవార్డులు అందుకుంది. రెండు బెస్ట్ యాక్టర్ అవార్డులు కూడా వచ్చాయి. నిర్మాతగానే కాకుండా సంగీత దర్శకుడిగానూ డా.పి సతీష్ కుమార్‌కు మంచి ప్రశంసలు వచ్చాయి. శాంతి చంద్ర, ఎఫ్ఎం బాబాయ్ ఇతర ముఖ్య పాత్రల్లో నటించారు. ఈ చిత్రం ఎంతో ఆర్టిస్టిక్‌గా ఉన్నా కూడా అంతర్లీనంగా కులాలు, మతాల మీద ప్రశ్నించినట్టుగా ఉంటుంది. అదే అన్ని వర్గాల ప్రేక్షకులను ఆలోచించేలా చేస్తుంది. చదవండి: రౌడీ హీరోకు ఉంగరం తొడిగి ఏడ్చేసిన మహిళా అభిమాని, వీడియో వైరల్ చూపులు కలవకుండానే పెళ్లి చేసుకున్న చిరంజీవి -
మరో క్రైమ్ థ్రిల్లర్ ‘దహనం’తో వస్తున్న వర్మ
సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ యాక్షన్ థ్రిల్లర్ చిత్రాలకు కేరాఫ్ అడ్రస్ అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. హిట్, ప్లాప్‌తో సంబంధం లేకుండా నిజ జీవితంలో జరిగిన సంఘటనలను వర్మ తెరకెక్కిస్తుంటాడు. తాజాగా ఆయన పూర్తి యాక్షన్ కథాంశంతో తిరిగి వస్తున్నాడు. దహనం పేరుతో తన స్వంత నిర్మాణ సంస్ధలో క్రైమ్ థ్రిల్లర్ సిరీస్‌ను తీసుకురాబోతున్నాడు. ఈ సిరీస్‌కు ఇందుకు సంబంధించిన ట్రైలర్‌ను ప్రముఖ ఓటీటీ వేదిక ఎంఎక్స్ ప్లేయర్లో తాజాగా విడుదల చేశాడు వర్మ. ఈ వెబ్‌సిరీస్‌కు అగస్త్య మంజు దర్శకత్వం వహించారు. ఇది ఏడు ఎపిసోడ్లుగా ప్రసారం కానుంది. దీనిలో ఇషా కొప్పికర్, అభిషేక్, నైనా గంగూలీ, అశ్వత్ కాంత్ శర్మ, అభిలాష్ చౌదరి, పార్వతి అరుణ్, సయాజీ షిండే మరియు ప్రదీప్ రావత్‌లు కీలక పాత్రల్లో నటించారు. అన్ని ఎపిసోడ్లనూ ఎంఎక్స్ ప్లేయర్లో ఈనెల 14 నుంచి ప్రసారం చేయనున్నారు. ప్రతీకారమే...కథాసారం.. ఈ వెబ్‌సిరీస్ కథను అసాంతం ప్రతీకారం, రక్తపాతం, హింస నేపథ్యంతో తీర్చిదిద్దారు. తన తండ్రి మరణానికి ప్రతీకారం తీర్చుకోవాలని తపిస్తున్న ఓ కొడుకు కథ ఇది. . ఓ కమ్యూనిస్ట్ నేత రాములును ఏ విధంగా హత్య చేశారు.అది గ్రామంలో ఏ విధంగా సంచలనంగా మారింది చెబుతారు. శ్రీరాములు పెద్ద కొడుకు హరి, ఓ విప్లవకారుడు (నక్సలైట్). అడవిలో ఉండి గొరిల్లా తరహా పోరాటాన్ని భుస్వాములతో చేస్తుంటాడు. తన తండ్రి మరణ వార్త విని ఆవేశంతో రగిలిపోతాడు. అక్కడి నుంచి ఆ గ్రామంలోని బలవంతులైన గుండాలకు, అతనికి జరిగే పోరాటమే ఈ కధ. దీనికి తోడు నక్సలైట్ల ఆధిపత్యం గ్రామంలో పెరగడంతో ఈ ప్రాంతంలో భయాందోళనలూ పెరుగుతాయి. కోడుకు తండ్రి హత్యకు ప్రతీకారం ఎలా తీర్చుకున్నాడనేదే కధాంశం. తెలుగులో రూపొందించిన ఈ సిరీస్‌ను హిందీ, తమిళ భాషలలో డబ్బింగ్ చేయనున్నారు. -
ఆ యువతి ఎవరు..!
చెన్నూరు: కడప నగర శివారులో ఓ యువతిని ఐదు రోజుల క్రితం దారుణంగా హత్య చేసి, దహనం చేశారు. ఇప్పటి వరకు ఆమె ఆచూకీని పోలీసులు గుర్తించలేకపోయారు. దీంతో ఈ కేసు మిస్టరీగా మారింది. హంతకులకు సంబంధించిన ఎలాంటి ఆనవాళ్లు లభించక పోవడంతో పోలీసులకు సవాల్‌గా మారింది. పలు విధాలుగా దర్యాప్తు చేస్తున్నా ఫలితం కనిపించడం లేదు. హంతకులు పక్కా పథకం ప్రకారం, పకడ్బందీగా ఈ హత్య చేశారు. బుధవారం హత్య జరగ్గా, గురువారం వెలుగులోకి వచ్చింది. క్లూస్‌టీం, డాగ్‌స్క్వాడ్‌లు ఆనవాళ్ల కోసం పరిశీలన చేసినా ప్రయోజనం లేకపోయింది. హత్య కాబడ్డ యువతి ఎవ్వరూ ? చెన్నూరు పోలీస్‌స్టేషన్ పరిధిలోని అగ్రిగోల్డ్ వెంచర్లో ఆ యువతి దారుణ హత్యకు గురైంది. జిల్లాలోని పోలీస్స్టేషన్లన్నింటికీ హతురాలి వయస్సు (సుమారు 21) ఆధారంగా సమాచారం అందించారు. హంతకులు ఆమె తలపై రాడ్డుతో బలంగా కొట్టి చంపి ఓ వాహనంలో సంఘటనా స్థలానికి తెచ్చి పెట్రోల్ పోసి నిప్పంటించారు. జిల్లాతోపాటు పక్క జిల్లాల్లో నెల రోజులుగా కనిపించని యువతులెవరైనా ఉన్నారా అనే సమాచారాన్ని పోలీసులు సేకరిస్తున్నారు. హంతుకులెవ్వరో ? హంతకులు కరుడు కట్టిన నేరస్తులే అయి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. నగరానికి చెందిన వారై ఉండవచ్చని అనుమానిస్తున్నారు. హత్యా స్థలాన్ని పరిశీలిస్తే మద్యం సేవించి, నింపాదిగా కాల్చి, ఎలాంటి ఆనవాళ్లు దొరక్కుండా జాగ్రత్తలు తీసుకొన్నారంటే సామాన్యులతో అయ్యే పని కాదంటున్నారు. పెట్రోల్ పోసి అంటించారు కాబట్టి.. సమీపంలోని టోల్ ప్లాజా, వాహనాల తనిఖీల కోసం ఏర్పాటు చేసిన పోలీస్ చెక్‌పోస్ట్ వద్ద ఉన్న వారికి మంటల వెలుతురు, పొగైనా కనిపించే అవకాశం ఉండవచ్చు. పెట్రోల్ బంకుల వద్ద బాటిళ్లలో పెట్రోలు ఎవరు పోయించుకున్నారనే వివరాలిచ్చేందుకు జాప్యం జరుగుతోంది. అన్ని కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేస్తేనే మిస్టరీని ఛేదించవచ్చు. ఈ విషయంపై చెన్నూరు ఎస్ఐ వినోద్‌కుమార్‌ను వివరణ అడగగా.. ఈ కేసుపై ప్రత్యేక దష్టి పెట్టామని, త్వరలోనే హంతకులను పట్టుకుంటామని చెప్పారు.